దేవుడు చేసిన విందులు

గ్రంథకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు



దాని. 2:37; మత్త. 7:21,23; ప్రక. 1:12,17. దాని. 3:15.

క్రీస్తుప్రభుని సంస్కారవిందుకు ఆహ్వానించబడినవారలారా! ఈ విందుద్వారా అసలైన అనుభవ విందుకు ప్రభువు మిమ్ములను ఆయత్తపరచునుగాక! ఆమేన్.


“ప్రభువా! నాకు సహాయము చేయుము” అని ప్రార్ధించగా దాని జవాబు ప్రభువు నాకు గాలిలో వ్రాసారు. ఆ తరువాత రాజమండ్రిలో నాకు ప్రభువు ఏ డ్రస్సుతో వచ్చి సంస్కారము ఇచ్చారో, అదే డ్రస్సుతో వచ్చి సంస్కారము ఇచ్చారు. ఆశ్చర్యమేమంటే చప్పున వచ్చి, చప్పున ఇచ్చి, చప్పున వెళ్ళిపోయారు. బల్లలేదు. అదే ఆశ్చర్యము. ప్రభు భోజనము పుచ్చుకొనేటప్పుడు బల్ల ఏర్పాటు ఉండాలి. ఈ రోజు ధ్యానాంశము ఆ క్రొత్త అంశమే.


దేవుడిచ్చు విందులు:-

"మా దినాహారము నేడు మాకు దయచేయుము” అనే ప్రార్ధన ఈ సందర్భములో జ్ఞాపకము తెచ్చుకొనవలెను. ఇవన్నియు మన ఆహార పదార్ధములే. ఇపుడు మనము తేనె, ఆహారము, అన్నము, కూర, చారు, ఉల్లి, కారము, చింతపండు ఇవన్ని సృష్టిలోనుండి వచ్చినవి. అగ్గిపుల్లలు, మనము త్రాగే గ్లాసు ఎక్కడనుండి వచ్చినది? మనము భోజనముచేసే, పళ్లెము ఎక్కడిది? సృష్టిలోనుంచి వచ్చినది. పొయ్యిలో నిప్పుపుల్లలు వేసిపెట్టండి, మండుతుందేమో! అది ఊదకపోతే మండదు. గాలి ఎక్కడది? సృష్టిలో లేనిది ఏదియు మనము అనుభవించకుండా ఉండుటలేదు. ఇవన్నియు మనము విడివిడిగా తెలునుకుంటే అదే స్తుతి. అలాగు మనము తెలుసుకొనుట మన తండ్రికి చాలా సంతోషము. మనము విందుకు వెళ్లునపుడు ఈ కూర ఎక్కడది? ఈ లడ్డులు ఎక్కడవి? ఈ కేక్ ఎక్కడిది? అని తెలుసుకొని వారికి థ్యాంక్స్ చెప్పుతాము. ఇక్కడి విందులోనే ఇన్ని రకముల వస్తువులుంటే ప్రభుభోజనములో ఎన్ని ఉండాలి? అయితే, అన్నము ఎందుకు చెప్పండి? నీళ్ళు ఎందుకు? కూర ఎందుకు? అన్నిటివల్ల అన్ని పనులుంటాయి. దేవుడు ఎంత దయకలిగినవాడు! ఈ పాపికి ఇంత దయ చూపించినాడు. అన్యులైన ఇతరులు ఏమి చేస్తున్నారు? దేవుని ప్రేమను విస్మరిస్తున్నారు.


ఖురాన్లో ఉన్నది ఏమనగా, “నేను తప్ప వేరొక దేవుడు లేడనియు, ఒక పురుగునైన నేను తప్ప మరి ఎవరు సృజింపలేదు అనియు, నేను నీకు తెలియకుండ ఎన్నో ఉపకారములు చేసినాను కాని నరుడా ఆ సంగతి నీకు తెలియదు అనియు, నేను నిన్ను కోరునది ఒక్కటే, అది ఏమనగా కృతజ్ఞతతో నన్ను స్తుతించాలని దేవుడు చెప్పుచున్నాడని” మహమ్మదీయ మత గ్రంథములో ఉన్నది. మరియు నిద్రకంటే ప్రార్ధన మేలు. మహ్మదు అనే భక్తుడు 7గం॥లు ప్రార్థనలో ఉండేవాడు, అలాగే మహమ్మదీయులు దినమునకు 5సార్లు మసీదుకు వెళ్ళెదరు. ఆయన చెప్పినది దినమునకు మూడవవంతు ప్రార్ధనలో ఉండవలెను. మరియు ఓ దేవా! ఈ వేళ నాకు ఈ భోజనము అనుగ్రహించినందుకు నీకు స్తోత్రము. నీవు అనుగ్రహించినావు అనే తలంవు నాలో ఉన్నది కనుక నాకు ఆకలి తీరినది గనుక నీకు వందనములు” అని వారు అంటారు. జర్మనీ క్రైస్తవులు ఎపుడు భోజనానంతరము స్తుతిచేస్తారు మనకు అట్టి అలవాటులేదు. కొంతమంది చెప్పునదేమనగా మేము ప్రార్ధన చేసినపుడే స్తుతిచేస్తాము అని అంటారు. అదికూడా మంచిదే. తేగలు తినేటప్పుడు ప్రార్ధన చేస్తారా? స్తోత్రము అంటాము. అదే ప్రార్థన. దేవా! వీరిచేత నాకు ఈ పండు ఇప్పించినావు గనుక నీకు స్తోత్రములు. ఇచ్చినవారికి వందనములు చెప్పిరి. ముందు దేవునికి, తర్వాత తెచ్చిన మనిషికి వందనములు చెప్పిరి. ముందు దేవునికి స్తోత్రములు తర్వాత మనిషికి వందనములు. వర్షము వస్తోంది అని దేవునికి స్తోత్రములు చేస్తారా? దేవుడు మనకు వర్షము విందు ఇచ్చేటపుడు, మరి దేనిని స్తుతించవద్దు దేవునినే స్తుతించాలి (యిర్మియా 14:22).


తినుటకు ముందు ప్రార్థించక స్తుతించాలి. ఈ రెండు కలిగియుంటే అదే అసలైన క్రైస్తవ బ్రతుకు. ఒక మిషనెరీ దగ్గరకు సున్నపు గుల్లలు తీసికొని వస్తే ఖరీదు అడిగి దొరగారు తీసుకున్నారు. అపుడు లెక్క ఇచ్చేటప్పుడు ఆ మూడు తంబలకు సరిపోయే డబ్బులేదు. ఆ వర్తకుని చేతులలో లెక్కకు తక్కువైన గుల్లలు కొలిచి అతనికి తిరిగి ఇచ్చివేసినాడు. అపుడు ఆ వర్తకుడు ఎంత ఆశ్చర్యపడినాడో! అతని ముఖములో కృతజ్ఞత ఆశ్చర్యము కలిగినది. ఎవరు ఏది ఇచ్చినను, దేవునిని స్తుతించవలెను. ఉప్పు తక్కువైతే స్తోత్రము అని అనవలెను. ప్రతిదాని విషయములోను ప్రభువును స్తుతించుట చాలామంచిది. సృష్టి యావత్తు దేవునివలన సృజింపబడినది గనుక స్తుతించాలి. రెండవది ఆ నృష్టిలోనిది తీసికొని మనము వాడుకొనుటనుబట్టి దేవుని స్తుతించాలి.


మొదటి విందు:- కలరా వచ్చినవారికి ఆకులుతీసికొని రసాన్ని పిండి ఇవ్వాలి. త్రాసుపాము కరిస్తే వెంటనే మురకుండాకు పసరు నోటిలో, ముక్కులో, కంటిలో, చెవులలో ఆ కరచిన గాయములో ఆ పసరు పిండితే తక్షణమే విషము విరిగి పోతుంది. ఈ ఔషధములు సృష్టిలో ఉన్న వస్తువులనుండి మనము ఏర్పాటు చేసికొంటున్నాము. ఈ సృష్టిలోనివి అన్నియు రెండుగా ఉన్నాయి. మందులు, వస్త్రములు ఎక్కడవి? ఈ సృష్టిలో మనదేదిలేదు. మహమ్మదీయులు చెప్పినట్లుగా స్తుతిచెయ్యాలి. కొంతమంది అంటారు: ప్రార్ధనక్కరలేదు, స్తుతే కావాలంటారు. అయ్యగారు ప్రార్ధన, స్తుతి రెండు కావాలని అంటారు. ఒకరొచ్చారు ప్రార్ధన చేయుటకు సమయమేలేదు గనుక స్తుతి చెయ్యాలి. ఒక మనిషి జబ్బుగా ఉంటాడు ఏమి చెయ్యాలి? ప్రార్ధన చేసినను వెంటనే స్తుతి చేయాలి. స్తుతి మానితే ప్రార్ధన ఫలితము లేదు. మందువేసిన, ప్రార్ధన చేసిన, ఒకవ్యక్తి చనిపోతాడు. అప్పుడు ఆ మనిషి ఏమి చెయ్యాలి? స్తుతి చెయ్యాలని మత్తయిలో ఉన్నది. ఎందుకంటే ఆలాగు అతనిని దేవుడు తీసికొని వెళ్ళకపోతే కొంతకాలము ఆయుష్కాలమిస్తే, ఏదో పాపములోపడి నాశనము అవుతాడు. ఇపుడే చనిపోతే హేడెస్సుకు పోతాడు, రక్షింపబడతాడు. అయితే ఈ కార్యము దేవుడు చేసినాడా? మనిషి చేసాడా? దేవుడు ఇచ్చినట్లే గనుక ఆయనకు వందనములు చెప్పాలి.


రెండవ విందు:- ఇది ప్రభు భోజనము అనగా గుడిలో పాదిరిగారు ఇచ్చేది. అది క్రైస్తవ విశ్వాసులకు మాత్రమిచ్చేది. అదియొక విందు. అది ఎందుకు విందైనది? చెప్పండి. ఆత్మ బలము కొరకు, శరీరబలము కొరకు ఇవి రెండు ఉపకారములు. ప్రభువు శరీర రక్తములు ఉభయ జీవితములకు మేలైయుండును గనుక గుడిలో ఇచ్చే భోజనము పాప పరిహారము కొరకు. మనము ఇంటికి వెళ్లిన తర్వాత పాపక్రియలు లేక పాప ఆలోచనలు జ్ఞప్తికి వచ్చును అదే నైజపాపము. ఇది పోవుటకొరకే దర్శనములలో ప్రభువే స్వయముగా ఇస్తున్నారు. అట్టి అనుభవమునకై ప్రభువు మనలను సిద్ధపరచునుగాక! ఆమేన్.



4.12.959వ సం.లో దేవదాసు అయ్యగారు శుక్రవారం ఉదయం, గుంటూరు క్రీస్తు సంఘములో చేసిన ప్రసంగము.