గ్రంథకర్త: ఫాదర్ యం. దేవదాసు

ఆత్మ కుమ్మరింపు కూటములలోని మొదటిదినము - శుక్రవారము
ఆత్మ కుమ్మరింపు వరుసలు



సలహా:- ఎవరూ కదలవద్దు, మెదలవద్దు. ముగింపువరకు ఈ స్థలము విడువవద్దు, శబ్ధము వదలవద్దు. పరలోకమునుండి వచ్చిన శబ్ధము తప్ప నరలోకము నుండి వచ్చిన శబ్ధము లోపలవద్దు, వెలుపలవద్దు.


1వ ప్రార్ధన:- అనాది దేవుడవైన తండ్రీ! నీకు వందనములు. అనంత దేవుడవైన తండ్రీ! నీకు నమస్కారములు. తండ్రివిగాను, కుమారుడవుగాను, పరిశుద్ధాత్ముడవుగాను, త్రియేక దేవుడవుగాను మాకు బయలుపడిన తండ్రీ! నీకు అనేక స్తోత్రములు. ఆకాశమును సృష్టించుటద్వారా బైలుపడిన తండ్రీ! స్తోత్రములు. భూమిని కలుగజేసినందువలన దానిద్వారా బైలుపడిన తండ్రీ! స్తోత్రములు. నీ వాక్యమును వ్రాసి దానివలన బైలుపడిన తండ్రీ! ముఖ్యముగా బెత్లేహేములోనుండి మానవ జన్మములో బైలుపడిన తండ్రీ! స్తోత్రములు. అటుతర్వాత పెంతెకొస్తు సమయమందున నీ సంఘముమీద పరిశుద్ధాత్ముడవుగా కుమ్మరింపై బైలుపడిన తండ్రీ! నీకనేక సంస్తుతులు.


నీవు పరిశుద్దుడవు. అయితే మేము అపరిశుద్దులము. అయినప్పటికిని నీవు మమ్మును ఆరాధించుటకును, సేవించుటకును ఏర్పర్చుకొన్నందులకై నీకు అనేక ప్రణుతులు. మేము అయోగ్యులము, శిక్షకు మాత్రమే పాత్రులము. నీ వాక్యగ్రంథము చదువుటకు మేము తగము. అది బంగారు వాక్యముగల పవిత్ర గ్రంథము. మేము మంటివారము. మేము దానిని ముట్టుకొనకూడదు. కాని నీవు మాకు ఇచ్చినందువలన మా ఇంటిలో బల్లమీద పెట్టుచున్నాము. మాపెట్టెలలో పెట్టుకొంటున్నాము. చేతులలో ఉంచుకొనుచూ, మంచములమీద పెట్టుచూ, ఏలాగుపడితే అలాగు వాడుకొనుచున్నాము. చదువుకొనుచున్నాము. ఇంత గొప్ప ధన్యత దయచేసినందుకు నమస్కారములు.


ఓ దేవా! ఓ రక్షకా! ఓ సృష్టికర్తా! ఈవేళ మేము ఆత్మకుమ్మరింపు పాఠము చదువుకొని దాని గురించి కొన్ని మాటలు మాట్లాడుకొని, గొప్ప మేలు పొందవలెనని వచ్చియున్నాము. మేము రాగల కృప మాకు కలిగించినందుకు అనేక నమస్కారములు. మా శరీరమును పవిత్రపరచుము. మా శరీరమందున్న సమస్తమును నీ నామఘనత నిమిత్తము శుద్ధీకరించుము. మా జ్ఞానమును వెలిగించుము. మోషేకు గొప్ప విధేయత కలదని వ్రాయించినావు. అట్టి విదేయత మా మనస్సాక్షికికూడ దయచేసి అంగీకరించుము. గతకాలము యొక్కయు, నేటికాలము యొక్కయు మా జీవితకాలమును దీవించుము. ఇకముందుకు మేము జీవింపవలసిన జీవితమునుకూడా దీవించుము. ఈ దినమందు దేవదూతల మధ్యను, పరలోకమందున్న వాస్తవ్యుల మధ్యను, భూలోకమందున్న విశ్వాసుల మధ్యను సంతోషము కలిగించుము. వారుకూడా మాతో ఏకీభవించే గొప్పతనము దయచేయుము. ఇప్పుడే కూటములో ఉన్న ఒక్కొక్కరిని వారివారి అక్కరకొలది దీవించుము. ఆమేన్.


బాల్యమునుండి మీకు పెంతెకొస్తు కథ, ఆత్మ కుమ్మరింపు కథ, బాగా తెలిసినను ఏమియు తెలియనట్లు చెబుతాను. నేను చెప్పునప్పుడు అది మాకు తెలిసినదే అని అతిశయింపక సంతోషించండి. మీలో ఎవరికైనా

ఉన్నయెడల మీరు ఇక్కడ ఉన్నను లేనివారితో సమానము. ఈ మూడు లేకుండా మనోనిదానముతో ఉండండి.
మొదటి వరుస :

ఈ నాలుగును నేర్చుకొన్న ఈ వరుసలో మీరు ఉన్నారా?
రెండవ వరుస :

మొదటి వరుసలో కుమ్మరింపు అన్నాము. అది ఒక ప్రత్యేకమైన సమయము. పరిశుద్ధాత్మను కోరుము....అనుపాట. ఒక బిందె ఉన్నది. దానినిండా నీళ్ళున్నవి. ఆ బిందెడు నీళ్ళలోనుండి చెంబుడు నీళ్ళు తీసి ఒకరి శిరస్సుమీద పోసినాము. వారు ఇంకొక చెంబుడు తీసి, పోయుమనగా, మఠొక చెంబుడు పోసి ఇంకనూ చూస్తున్నందున బిందెడూ దిమ్మరించాము. అదే కుమ్మరింపు. ఆదాము మొదలుకొని పెంతెకొస్తు దినమువరకు ఎన్ని సం॥లు ఉన్నవో, వాటికి అనగా అన్ని సం॥లకు ఒక గీత గీస్తున్నాను. ఆ గీతమీద పరిశుద్ధాత్మ లేడా? ఉన్నారు.

ఆదాము మొదలు పెంతెకొస్తు వరకు

ఆ కాల భక్తులు వాటిని కలిగియున్నారు. అప్పటివారు ఆత్మను కలిగియున్నట్టుగాకాక ఇక ముందుకు ఆత్మఆత్మ కుమ్మరింపే కలిగించుకొనే ఒక సంఘము బయలుదేరనై ఉన్నదని యోవేలుద్వారా దేవుడు ప్రవచింప చేసినందున (యోవేలు 2:28,29), పాతనిబంధన భక్తులు ఆ కుమ్మరింపుకొరకు కనిపెట్టిరి. చెంబుతో నీళ్ళు పోసినట్లుగా కాదుగానీ, బిందెతో దిమ్మరించినట్లు కుమ్మరింపు. యోవేలులో కుమారులను, కుమార్తెలను, వృద్ధులను అని ఉన్నది. అనగా కుటుంబాన్ని విడువలేదు. వయస్సుమళ్ళినవారిని, వయస్సుగలవారిని ఎవరినీ విడిచిపెట్టలేదు. ముసలివారు అనగా “నాకు ఇంకేమి ఇస్తారు, నా కాలమంతా అయిపోయినదని” అనుమానించకుండా ఉండుటకు వారికికూడా ఇస్తానని ఆదరణ చెప్పెను.

ఇప్పుడు, ఈ పని భూమిమీద జరుగుచున్నది. దీనిని తర్వాత ఆలోచించెదము. పెంతెకొస్తునాడు అందరికి కుమ్మరింపు రాలేదు. యూదులకే వచ్చినది. అన్యులు మిగిలిపోయిరి. వీరికి తర్వాత జరుగును. యూదులనుచూచి అన్యులును అడుగుతారు. గనుక ప్రభువు వారికిని దయచేస్తారు.


1. ఆదాము మొదలుకొని పెంతెకొస్తు వరకు. అపో.కార్య. 2:1-4. మధ్యకాలములో చెంబుతో నీళ్ళు పోసినట్లు ఎందరికి ఎంతవరకు కావలెనో అంత వరకు ఇచ్చిరి కాని పెంతెకొస్తునాడు కుమ్మరింపు ఇచ్చిరి. ఆలాగే కోరినవారందరికి రాకడ కాలం వరకు కుమ్మరిస్తారు. రేపో, మాపో ప్రభువు వచ్చి కోరిన వారందరికి కుమ్మరిస్తారు. రెండవ రాకడలో సంఘమే వెళ్ళిపోవును. మిగిలిన వారికి ఏడు సం॥లు శ్రమ. ఇప్పుడు ఉన్నవారుకూడ “ప్రభువా

అందరికినీ ఎక్కడపడితే అక్కడ ఇస్తావు” అని అడిగితే అయ్యా! ఇప్పుడు శ్రమకాలములో ఉన్నామని ఆశతో అడిగినట్లయితే, ప్రభువు తన ఆత్మను ఇవ్వగా ఘౌల్లుమని ఏడ్చెదరు. ప్రధమ పుత్రుడు చనిపోతే ఏలాగు ఏడ్చెదరో అలాగు ఏడ్చెదరు. ఎవరి హృదయములు చెకుముకి రాయివలె ఉందునో, దేవుడు ఆత్మనివ్వగా వారి హృదయములు మెత్తబడును. అంత్యదినము అని అనక, అంత్యదినములలో అని చెప్పిరి. అవే ఈ నాలుగు కాలాలు, వాటి కుమ్మరింపులు.


దేవుడు అన్ని కాలములలోనూ తన ఆత్మను ఇచ్చెను. భక్తులకేకాదు. కఠినమైన పాపులకుకూడా ఇస్తారు. ప్రపంచ చరిత్ర నాలుగు కాలాలుగా ఉన్నది. గనుక నాలుగు చరిత్రలుగా అన్ని వయస్సులలో ఉన్నవారికి ఆయన తన ఆత్మను ఇస్తారు. కుమారులని పిల్లలను, వారు చిన్నవారుగా ఉన్నప్పుడు అంటూ ఉంటాము గనుక నీ చిన్నపిల్లలకు ఆత్మను ఇస్తాననే మర్మము యోవేలు 2:28లో ఉన్నది. అక్కరలేని వారిచేతకూడ కావాలని అనిపించి ఇస్తారు. ఇది దేవుని వాక్యములో చాలా వివరముగా ఉన్నది గనుక వాక్యాన్ని లోకువ కట్టకుండా, నీ చిత్తమంటే ఆత్మను ఇస్తారు.

ఎందుకనగా వాక్యమును తెలిసికొని, వాక్య విరోధముగా ప్రార్ధనచేస్తే, సొదొమావలె నాశనము కావలసినదే గాని ఆయన ప్రేమ అట్లు కానీయలేదు. దేవుడు కాపాడారు. అయితే,

ఈ రెండునూ బైబిలులోనుండి లాగిన కథలే. గనుక ప్రభువును ఎవరూ విడువవద్దు. ఎందుకనగా ఆయన మనలను విడిచిపెట్టలేదు. "అయ్యగారు చిన్నతనములో తెలుగు కాంపోజిషన్ లో చివర యేసునామము" అని వ్రాసేవారట.

ఆత్మను పొందిన సౌలు తప్పిపోలేదా? యూదా, అననీయ, సప్పీరాలు తప్పిపోలేదా? ఇంగర్ సాల్ తప్పిపోలేదా? అట్టి గొప్పగొప్పవారే తప్పిపోగా మేము ఎంతమాత్రపువారము? మేమునూ తప్పిపోవచ్చేమో కదా! అని అనుకోవద్దు. వారిని హేడెస్సులోపెట్టి, ఆఖరు ఛాన్సు ఇచ్చి, ఆయన రక్షిస్తాడు. అక్కడకూడా మారకపోతే ఏంచేస్తాం? ప్రియులారా! ఆత్మ కుమ్మరింపు కొరకు ప్రార్ధన చేయండి. ఛార్లెస్ బ్రాడ్లీ ఈయన ఒక బిషప్. ఈయన అందరి దగ్గరకు వెళ్ళి కుమ్మరింపు నిజమని వాదించినాడు. ఎవరూ ఆయనను ఓడ గొట్టలేకపోయిరి. గనుక అందరూ ఆత్మను పొందండి.


2వ భాగము:- ప్రభువు ఊదుట వేరు, కుమ్మరింపు వేరు. కుమ్మరింపు సమయమందు ఆయనే వారిమీద వ్రాలినారు. ఊదుట అనగా 120మందిని, వారి జీవితకాలమును జీవముతో నింపుట కొరకు ఊదెను. వ్రాలుట అనగా సేవ నిమిత్తమై కుమ్మరింపుగా దిగివచ్చుట. వారి జీవితకాలమును ఊపిరితో నింపునట్లు కుమ్మరింపుతో సేవకొరకు వారిని నింపెను. ఇంటిలో భక్తిగా ఉండుటకు ఊదెను. కుమ్మరింపు బయటవారికి సువార్త ప్రకటించుట కొరకు. వాక్యము నమ్మినా సరే నమ్మకపోయినా సరే చెప్పుటకు కుమ్మరింపు. ఇంటింటికి వెళ్ళి రక్షణ పొందండని చెప్పండి. చేతకాని వారుకూడా వెళ్ళి చెప్పండి. 15 నిమిషాలలో చెప్పండి. ఏమని అనగా దేవుడు మన కొరకు ఏమి చేసెనో, అది చెప్పండి. మన రక్షణార్థమై చనిపోయెనని చెప్పండి. ఆకాశము, భూమి దేవదూతలను కలుగజేసి, ఆయనయే మనిషై వచ్చి, యేసుక్రీస్తు అనుపేరు పెట్టుకొని బోధించెను. శ్రమపడి రక్తము కార్చి, ప్రాణము పెట్టి సమాధి చేయబడి, లేచి పరలోకానికి వెళ్ళి రేపో మాపో వచ్చి ఆయనకిష్టమైన వారిని తీసికొని వెళ్ళును అని చెప్పండి. ఇష్టమైతే నమ్మండి లేకపోతే ఊరుకొనండి అని చెప్పండి. మీకు

ఇందుకు పాదుర్లు అంటున్నారు: "మా పాదిరి పని వదిలించుకొనవలసినదేనా" అని అంటున్నారు. దానికి జవాబు: “నీ పనిని స్థిరపరచుటకు ప్రభువు ఇచ్చుచున్నారు”.


5. ఆయన నీ ఎదుట చేయి చాపుతాడు. అనగా ఆకాశము, భూమి, దేవదూతలు, గ్రంథము, కుమారుని, ఆత్మను ఇచ్చి నీవు నాకు ఏమి ఇస్తున్నావు అంటున్నాడు. “నీకు ఏమి ఇవ్వగలము” అని ఇప్పటికి ఆత్మను పొందినవారు ఉన్నారు. గనుక పొందనివారికి వస్తాది. మోకరించి ప్రార్థించండి. కదిలింపు వస్తుంది. కదిలింపే రుజువు. తర్వాత కుమ్మరింపు వచ్చును. క్రొత్తగా దర్శనవరము కొంతమందికి వచ్చింది.


అట్టి అనుభవములతో ప్రభువు నేడు మిమ్మును అలంకరించునుగాక! ఆమేన్.



28.8.1958 సం॥లో దేవదాసు అయ్యగారు బేతేలు గృహములో చేసిన ప్రసంగము.