గ్రంథకర్త: ఫాదర్ యం. దేవదాసు

ఆత్మ కుమ్మరింపు కూటములలోని నాల్గవ దినము - సోమవారము
పరిశుద్ధాత్మ వశము కొరకైన ప్రార్ధన



ప్రకటన 1:9-11.

ప్రార్ధన:- ఆత్మ తండ్రీ! పరిశుద్ధాత్ముడవైన తండ్రీ! నిర్మలాత్ముడవైన తండ్రీ! దైవాత్మయైన తండ్రీ! పరమాత్ముడవని పిలిపించుకొన్న తండ్రీ! జీవాత్మ అని పిలిపించుకున్న తండ్రీ! ఆత్మవని పిలిపించుకొన్న తండ్రీ! త్రిత్వములో మూడవ వ్యక్తి అని పిలిపించుకున్న తండ్రీ! నీ పేరే పరిశుద్ధాత్మ నీవు పరిశుద్దుడవు. మేము పాపులము. మేము నీ పేరు తలంచకూడదు. తలంచుటకైనను తగనివారమైన మేము, నీ పేరు మా నోటితో ఉచ్చరించుటకు తగము. ఉచ్చరించకూడదు. అయినను మా ఇష్టము వచ్చినన్ని పర్యాయములు నీ నామమును ఎత్తుటకు, స్మరించుటకు సంవూర్థ స్వాతంత్ర్యము ఇచ్చినావు. స్వాతంత్ర్రమిచ్చే ఆత్మకు స్వాతంత్ర మిచ్చే దేవుడవు. నీ పేరు ఎన్ని పర్యాయములు తలంచుకుంటే చెప్పుకుంటే అన్ని పర్యాయములు ధన్యులమే.


నీ పేరులన్నింటి దగ్గర నిలువబడి, ధ్యానించినయెడల మేము క్రమముగా పరిశుద్ధులము కాగలము. పరిశుద్దాత్మవైన తండ్రీ! పెంతెకొస్తు దినమందు కుమ్మరించబడిన తండ్రీ! యోహానుతో నేనైతే నీళ్లతో బాప్తిస్మము ఇచ్చుచున్నానుగాని నీవైతే అగ్నితోను, పరిశుద్దాత్మతోను ఇస్తావని చెప్పించిన తండ్రీ! అడిగిన వారికి కొలతలేకుండా ఇస్తావని ఎవరినిగూర్చి వ్రాయబడినదో, ఆ పరిశుద్ధాత్మవైన తండ్రీ! పరిశుద్ధాత్మ పొందువరకు, శక్తిపొందువరకు యెరూషలేములో కనిపెట్టుడని చెప్పిన తండ్రీ! నీకు, వందనములు. నీయొక్క పేరువద్ద నిలువబడి ధ్యానించిను నీ ఊట అంతా, నీ జీవమంతా, నీశక్తి అంతా, నీ ప్రేమ అంతా మాకు బయలుపడును. ఈలాగు చేస్తే, లంకలో యోహాను ఆత్మవశమై పోయినాడు అని ఎవరినిగూర్చి వ్రాయబడెనో, ఆ పరిశుద్దాత్మవైన తండ్రీ! స్తోతములు. మేము సంపూర్ణ స్థితి పొందలేకపోవుచున్నాము. మేమే నీవశమైపోతే మాకు ఏమి కావలెను? యోహాను, చావుకు సిద్ధమైనవాడు, ముసలివాడు అయితేనేమి? ఎంత వ్రాత వ్రాసినాడు! అతడు నీ వశము, నీవు ఆయన వశమైయున్నందున భూలోకములో నుండి పరలోకమునకు వెళ్ళినాడు. ఎంత ధన్యత, ఎంత ధన్యత, ఎంత ధన్యత! ప్రవక్తలకు తండ్రివైన ఆత్మ తండ్రీ! శిష్యులకు తండ్రివైన ఆత్మ తండ్రీ! మా ప్రభువు నేరస్తుడుగా ఉన్నటువంటి కాలములో ఉన్న తండ్రీ ఏకాంత కాలములో తండ్రివిగా ఉన్న ఆత్మతండ్రీ! నీకు అనేక వందనములు. దావీదు చేత కీర్తనలు కట్టించిన తండ్రీ! సొలోమోనుచేత ప్రసంగి వ్రాయించిన తండ్రీ! మోషేచేత ధర్మశాస్త్రము వ్రాయించిన తండ్రీ! దావీదు, సొలొమోను, మోషేలకు తండ్రివైన పరిశుద్ధాత్మవైన తండ్రీ! నిన్ను కోరుకొన్నవారికి పరిశుద్ధాత్మవైన తండ్రీ! నీకు వందనములు. అతడు ఆత్మవశుడైపోయినాడని దీనినిబట్టి గ్రహించు చున్నాము. ఒంటరిగా ఉన్నాడని, ముసలివాడైనాడని, శక్తిలేనివాడు అయినాడని నీవు వచ్చావు. నీవు రాగానే నీవశమైపోయాడు. ఆత్మ కూటములలో ఉండువారిని నీవశము చేసికొంటే పడగలరా! పడలేరు. ఖైదులో ఉన్ననేమి, ఎఫెను వట్టణమును విడిచి ఒంటరిగా ఉన్ననేమి అని మరణము సమీపించిన ఆయనను, నీవు సమీపించి ఎంత గొప్ప స్థితికి రప్పించినావు. వృద్దాప్యము గొప్ప స్థితి కాదు, ముసలితనము గొప్పది కాదు, గాని గాలిలోవచ్చి అద్భుతకరమైన స్థితికిమార్చిన తండ్రీ! వందనములు. పురాతన కాలమందు నీకు ఒక రైటరు దొరికినాడు. ఆయనను పొదలోనుండి తీసి, కొండమీద కూర్చుండబెట్టి రైటరుగా పెట్టినావు గనుక వందనములు. నేను తగను, నత్తివాడను అంటే అతనిని నీ వశము చేసికొన్నావు, గనుక ఐగువ్తునకు పంపినావు. గొప్ప పనులు చేయించినావు. తాను తన వశమై ఉండగా ఏమో చేయలేకపోయెను. నీ వశము చేసికొని ఐదు కాండములు వ్రాయించినావు. యోహాను ఒక గ్రంథమే వ్రాసెను. అతడు రైటరుకాదు. గాని నీవు వీరిని నీ వశము చేసికొని రైటరుగా చేసికొన్నావు.


ఆ కాలమందు మోషేచేత ఐదుకాండములు వ్రాయించినది నీవే ఈయనచేత ప్రకటన వ్రాయించినవాడవు నీవే ఇది తలంచుకుంటే భయముగా ఉన్నది. సంతోషమునకు సంతోషముగా ఉన్నది. గాలి ఎక్కడకు వెళ్ళుచున్నదో ఎవరికి తెలుసు? అట్లే నీ వశము చేసికొన్నవారు ఎక్కడెక్కడకు వెళ్ళునో, ఏమేమి చేయునో ఎవరికి తెలుసు? దయగల ప్రభువా ఆదిలో మొట్టమొదట మోషే మొదలుకొని యోహాను వరకు, ఈ మధ్యకాలములో వ్రాత మూలముగా గొప్ప పని చేయించినావు గనుక వందనములు. వ్రాత మూలముగానే కాదు. ఇతర పనులవల్ల, కర్టెలు పర్వతముమీద నడుము కట్టించి, రథముకంటే ముందుగా పరుగెత్తించినావు. ఆహాబు రథముకంటే ఇతను ముందుగా వెళ్ళినాడు. ఆత్మబలము వలన ఆలాగు జరిగించినావు మా కాలములో ఒక గంటలో రాజమండ్రి వెళ్ళితే ఏలాగు వచ్చినావు అని అడుగుదురు.


ఎవరైనా ఒకరు ఏలీయావలె మోషేవలె యోహానువలె నీ వశము అయితే ఆలాగే చేస్తావు. భక్తులకు ట్రైనులు, విమానములు ఎందుకు? యెహెజ్కేలు విమానముకంటే ఎత్తుగా వెళ్ళెను. ఆత్మ ఎత్తుకొని వెళ్ళెనని ఉన్నది. అటువంటి వారు ఇప్పుడు ఉంటే ఇప్పుడు ఒక గంటకు ఇంగ్లాండు వెళ్ళీ బోధించి, ఇంకొక గంటకు అమెరికా వెళ్ళి బోధచేయగలరు. ఈ పని మా కాలములో చేస్తావు. మోషే తరుపున, ఏలీయా తరువున, యోహాను తరువున నీకు అనేక వందనములు. సమరయ బోధకుడైన ఫిలిప్పును కందాకే మంత్రివద్దకు నడిపించుకొని వెళ్ళినావు. అక్కడనుండి ఆజోతుకు తీనుకు వెళ్ళినావు. ఎట్లు వెళ్ళెను? "పరుగెత్తి రధమును కలిసికో" అనగా వెళ్ళాడు. నీ భక్తుడు గనుక ఎంత ధన్యత! నేనూ ఆ కాలమందు ఉంటే ఎంత బాగుండును? అని అనేక భక్తులు అనుకొంటున్నారు. అయ్యో! ఎక్కడైనా ఉందా. చదువులేనిదే సంభాషణ నేర్చుకొననిదే అఆలు నేర్చుకొననిదే, పరభాష మాట్లాడుట ఎట్లు? పేతురు పరభాష మాట్లాడి అనేకమందిని త్రిప్పివేసినాడు. కొందరు ఎంతకాలము నేర్చుకొన్ననూ భాషరాదు. పేతురు అప్పుడే నేర్చుకొని అప్పుడే బోధించినాడు. పేతురు ముందుగా నోటీసు లేకుండానే ప్రార్ధన లేకుండానే పరభాషతో మాట్లాడినాడు, బోధించినాడు. సంఘకాలము యొక్క మహిమకాలము ఎంత గొప్పకాలము! అప్పుడు మేము ఉంటేనా! అని చదివే వారికి అనిపించును. ఉపదేశాలన్నీ పేతురుకు, పౌలుకు, యోహానుకు, యాకోబుకు అందించినావు. అద్భుతకరమైన మాటలు పౌలుచే వ్రాయించినావు. పౌలు గేటుదగ్గర దొరికినాడు. పరమదుర్మార్గుడు. సంఘమును చెల్లాచెదురు చేయించినాడు.


గేటు దాటనిచ్చినావా? మోషే దగ్గర ధర్మశాస్త్రము నేర్చుకొన్నాడా! రోమా హెబ్రీ పత్రికలెంత గొప్పవి! హెబ్రీ పత్రిక ఎంత అద్భుతకరమైన పత్రికో ఎంత గొప్ప పత్రిక! "యేసుప్రభువు నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు, నిజమైన మనుష్యుడు” అని వ్రాసెను. పేతురు యోహానులు యేసుప్రభువు యొక్క ముఖమైన చూచారు గాని ఈ పౌలు ఎక్కడ ఉన్నాడు. అట్టి వానిని తీసికొనివచ్చి ఎంత గొప్ప వ్యాఖ్యానము వ్రాయించినావు! 1కొరి. 13వ అధ్యాయమును ఎవరు వ్రాయగలరు? మన ప్రభువైన యేసునేర్పిన ప్రార్ధన ఎవరును ఏ ప్రకారమైననూ వ్రాయలేరో అట్లే ప్రేమను గురించిన అధ్యాయమును, హెబ్రీ పత్రికను ఎవరు వ్రాయగలరు? ఆత్మవశమైన నీ భక్తులచేత వాటిని వ్రాయించినావు. ప్రభువా! ఈయనకు భక్తుడు ఒక పేరు పెట్టినాడు. ఆ పేరు ఏమిటి? నగలు చేసేవాడు, కుర్చీలు చేసేవాడు, ఇంకొక పనివాడు, ఇల్లు గోడలు కట్టేవాడు, ఇంకొక పనివాడు అనగా నీవే ఆ ఇంకొక పనివాడవు, ఆలాగే పనిచేయించేవాడవు నీవే, మంటిమీద ఉన్నవాడు మంచి కుర్చీ చేస్తున్నాడు. పొదలో ఉన్న మోషేను తీసుకొని వచ్చి ఎంత గొప్ప పని చేయించినావు! మష్టులోని బంగారమును మేలిమి బంగారుగా చేసి, స్త్రీలు అలంకరించుకొనే నగలుగా చేసినట్లు, పౌలును తీసికొని వచ్చి గొప్ప పనివానిగా చేసినావు.


యెషయా మొదలైన గొప్ప భక్తులు ఉన్నారు. వారిచే పనిచేయించినావు. లోకములో ఎక్కడెక్కడ భక్తులు ఉన్నారో వారికి ఒక్కొక్క పనిపెట్టి చేయించుకొనుము. నీకు వందనములు చెల్లించుచున్నాము. ఒకరిని ప్రవక్తగా, ఒకరిని కంసాలిగా, ఒకరిని వడ్రంగిగా తయారుచేసిన తండ్రీ! వందనములు. నీ పని తలంచుకుంటే ఎంత ఆశ్చర్యము! మా మాటలు కాదు. ఈ గదిలో ఉన్నవారితో ఎవరెవరు నీ వశము కావలెనని ఉన్నారో, వారిని నీ వశము చేసికొనుము. ఒకరు వ్యాధి వశములో ఉన్నారు, ఒకరికి ఆత్మ నడిపింవులేదు, ఒకరు ఎంత భక్తిగా నడుచుకొన్నను ఆత్మ లేదు. అయితే మాత్రము అది నీకు ఎంతపని? చేయాలంటే అందరిని నీ వశము చేయగలవు. మోషేను, హబక్కూకును, ఆమోసును, పేతురును మార్చినావు. పసులకాపరి అయితే మాత్రము పనిలో నమ్మకముగా ఉండి, చెట్టుక్రింద పండ్లు ఏరుకొనుచున్న ఆమోసును ప్రవక్తగా మార్చినావు. పేతురును అనగా నిన్ను ఎరుగనన్న వానిని, సంఘ స్థాపకునిగా మార్చినావు. సంఘమును చెదరగొట్టిన పౌలును సంఘమును ప్రోగుచేయువానిగా మార్చినావు. సంఘ కట్టడలను వ్రాయించి, బిషప్పులనుగా ఏర్పరచినావు.


ఆదాము మొదలు మోషే వరకు పితామహులందరిని బలపరచి సంతోషపరచినావు. బహిరంగములోనికి రాకపోయినా అంతరంగములో గొప్ప పని చేసినావు, స్తోత్రములు. 20వందల ఏండ్లలో అనేకమందిని చేతకాని వారిని పండితులుగా మార్చినావు. 20003పై చిలుకు భాషలలో నీ గ్రంథమును తర్జుమా చేయించినావు, అచ్చు కల్పించినావు. అది నీ చేతిపని, చేసే పనివాని పని, అచ్చుపని. అలాగే దేవాలయము పని, అదికూడ నీ చేతిపనే చేసే వాని పనికూడాను. అలాగే ఆసువత్రులు, కాలేజీలు అది నీ చేతిపని, చేసే వారిపని. అచ్చువేయుట మాత్రమే చేతిపనివారి పనికాదు, మిగిలిన పనులన్నీకూడ వాటిని చేయించుచున్న నీ చేతిపనులై యున్నవి. క్రిస్మస్ సమయములో, మట్టలాదివార సమయములలో, నిర్దారణ సమయములో, పెండ్లి సమయములో, కాగితములు తెచ్చి చిత్ర, విచిత్ర పనులు చేయుట; ఇవన్నీ చేతిపనులు చేనేవారి పని. ఈ పని నీవు సంఘములో చేయిస్తున్నావు. నీ భక్తులు చనిపోయిన పిదప వారి పేర్లు మాపివేయవలెనని ప్రయత్నించుట, సైతాను పని. అయితే వారిని మట్టిచేయించి, పునాదులలో నుండి వారి సమాధులు కట్టించి వారి పేరు వ్రాయిస్తున్నావు. జనరల్ భూత్ త్రాగుబోతులందరిని మార్చివేసాడు. ఆయన సమాధి దగ్గర వారందరిచేత చందా వేయించినావు. అక్కడకు వచ్చేవారందరు చందా వేస్తారు. ఆయనే రక్షణ సైన్యమును స్థాపించెను. ఇదంతా నీ చేతిపని. నీవు చాటున ఉండి ఎంతో పని చేయిస్తున్నావు. ఏమి చెవృగలము! మేము బలహీనులము, అజ్ఞానులము. అయిననూ, నీవు మమ్మును బలవంతులనుగా చేసి, నీ పని చేయించగలవు. నీ పనివారిని జపాను, అమెరికా, చైనా దేశములలోనికే కాక మనుష్యులను తినే అడవిలోనికిని పంపలేదా! వారి దేశములలో వారు ఉంటే సుఖముగా తిని ఉండలేరా? మనిషి తలంచుకుంటే గుండె గుబేలుమంటుంది. పరిశుద్ధాత్మ తండ్రీ! మీ పని ఎంత పని! ఎంత పని! ఎంత పని! అని రొమ్ముకొట్టుకొందురు. ఆయన పని తెలియక మనిషి ఊరుకొంటున్నాడు. ప్రభువా! ఒక ఆనకట్టను చూచి, “వ్రభువా! ఇది మనుష్యులు కట్టినదా! దేవతలు కట్టినదా ఆఫ్రికాలో పిరమిడ్స్ ఎవరు కట్టినవి! మనుష్యులే వాటి పైకి ఎక్కలేకపోయిరి” అని అడిగితే అందులోని నీ చరిత్రను వెల్లడి చేయగలవు. ఎందుకనగా అవి నీ మహిమను వివరించుచున్నవి.


చికాగోలోని ఒక భవంతిని మనిషి తల పైకెత్తి చూస్తే తల తిరిగిపోతుంది. ఇంకా ఫోటోలు, రేడియోలు ఇదంతా ఎవరి పని? పనివారి పని. ఆ పనివాడు ఎవరు? నీవే. బట్ట చినిగితే సూదికావాలి! ఆ సూది ఎవరు చేయాలి? నీవే ఆ సూదికి రంధ్రము చేయాలి అందులో దారం పెట్టాలి. ఇది ఎవరి పని? అద్ధమును ఎవరు చేసారు? వాడుకొనుట మాత్రము మాకు తెలును.

వాటి సంపూర్ణత వెయ్యేండ్లలో చూస్తాము. ఇప్పుడు నీవు సంఘములో ప్రవేశించి, పెండ్లికుమార్తెను తయారుచేస్తూ ఉన్నావు. స్నానము చేయించి బట్టలు నగలు ధరింపచేయించుచున్నావు. అట్లు సిద్దపరచి, రేపు తీసికొని వెళ్ళుదువు. ఈ నీ పనిని ఎవరు వివరింపగలరు? నీకు అనేక వందనములు. ప్రకటనలో పెండ్లికుమార్తె నగలు ధరించి, వస్త్రము ధరించి, సిద్దపడుచున్నది. అది పరిశుద్దాత్మ పని. ఏ కళంకము లేకుండా ఆత్మ, శరీరమును శుద్ధిచేసి, ఆటంకము లేకుండా చేసి తుర్రున తీసికొని పోవును. ప్రకటన 19:7,8. వార్తా పత్రికలలో ఎక్కడెక్కడ ఏ పని జరుగుచున్నదో వ్రాయబడి ఉంది. అది లౌకికులకు అర్ధముకాదు. ప్రభువు బిడ్డలే అది ఆత్మ పని అని తెలునుకొనగలరు.


పరిశుద్ధాత్మ వ్రాయించిన వ్రాతలు నిజమని లోకములో జరుగుచున్న ఆయా పనులు, భూకంపములు మొదలైన వాటివల్ల తెలుస్తుంది. పరిశుద్ధాత్మ తండ్రి. అన్యులకు తండ్రి, మనకు తండ్రి. ఆయనే ఆ అన్యులలో ప్రవేశించి, వారికి అవసరమైన సంగతులు చెప్పించుచున్నాడు. సముద్రములో ఒక చేప దొరికింది. దానిమీద బంగారు అక్షరములలో “ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను” అని వ్రాయబడి ఉంది. ప్రభువు వచ్చి తీసికొని వెళ్ళేటప్పుడు ముందుగా మన రంగు బట్టలు పరిశుద్ధాత్మ తండ్రి తెల్లగా మార్చి తీసికొని వెళ్ళును. మన సామానులుకూడా పరిశుద్ధాత్మ తండ్రి తన వశములోనికి తీసుకొనును. ఆత్మ వశీకరణమైతే ఇట్లు జరుగును. మన పిల్లలను ఆయనకు సమర్పించుకొంటే ప్రభువు తన ఆత్మవశము చేసికొని, తానే తన రూపమునకు తయారుచేసికొనును.


ఓ పరిశుద్ధాత్ముడవైన తండ్రీ నన్న నీ వశము చేసికొనుము. హాగరు తన కుమారునికి వడగాల్పు తగిలి, త్రాగుటకు నీరులేక దాహమునకు ఏడ్చుచుండగా ఎక్కడా నీళ్ళు లేక బిడ్డను దూరముగా విడిచి, "నీవక్కడ చావు. నేను ఇక్కడ చస్తాను" అని చూస్తూ ఉండెను. అంతలో దేవదూత వచ్చి నెర తీసి, నీళ్ళు చూపించెను. అది పరిశుద్ధాత్మ పనిగదా! ఓ దయగల మహా ఓపికగల ప్రభువా! మాతోకూడా వస్తున్న ప్రభువా! మాకు కఠినమైనట్టి, అర్ధము కానట్టి సంగతులను చూపించే పరిశుద్ధాత్మడవైన తండ్రీ! సహాయకుడవైన తండ్రీ పరిశుద్ధాత్ముడవై నడిపించే తండ్రీ! నీకు వందనములు. ఆమేన్. దీవెన: అట్టి పరిశుద్ధాత్మ వశములో ఈలాగు మీరు స్థిరముగా ఉందురుగాక! ఆమేన్.



20.5.1955వ సం॥లో దేవదాసు అయ్యగారు కాకానిలో చేసిన ప్రసంగము.