గ్రంథకర్త: ఫాదర్ యం. దేవదాసు

ఆత్మ కుమ్మరింపు కూటములలోని ఐదవ దినము - మంగళవారము
పరిశుద్ధాత్మ శక్తి



అపో.కార్య. 1:6-11.

“అయినను పరిశుద్ధాత్మ మీమీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు...” అపో.కార్య. 2వ అధ్యాయము.
“వారిమీద అగ్ని నాలుకలుగా విభాగింపబడెను”. అపో. 1:5లో “కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురని” వ్రాయబడెను.
షరా:-

ధ్యాన ప్రార్ధన:- పరిశుద్ధాత్మవైన ఓ తండ్రీ! మేము నిన్న నీ పనిని గూర్చి ఆలోచించితిమి. మరలా ఆలోచించు కొద్ది పాటి సమయము కలిగినది. మరియొక మారు నిన్ను ప్రార్థించుచున్నాము. అపోస్తలుల మీదకు వచ్చినట్లు, మా మీదికిని రమ్మని వేడుకొంటున్నాము. నీవు పైనుండి వచ్చినావు అందుచేత మా మీదికి పరిశుద్ధాత్మ దిగివచ్చునని యేసుప్రభువు సెలవిచ్చెను. నీ శిష్యుల మీదకు వచ్చిన నీకు వందనములు. నీవు వచ్చిన తర్వాత శక్తి కలిగినదని నీ వాక్యములో చూస్తున్నాము. అది వరకే 12మంది శిష్యులు, 70మంది శిష్యులు గ్రామాలలో బోధ నిమిత్తమై వెళ్ళి, ప్రసంగించి అద్భుతములు చేసినారు. అది దీనికి సంబంధించినది కాదు. నీవు వారిమీదకి ఆత్మను పంపినప్పుడు, శక్తికి మించిన శక్తి ఇచ్చినావు. అది భూదిగంతముల వరకు వెళ్ళే శక్తి. అందుకనే వారు అంతవరకు వెళ్ళగలిగిరి. కాబట్టి మా తండ్రీ! అట్టి శక్తి మాకును కలుగునట్లు మా మీదికి రమ్మని వేడుకొంటున్నాము. అప్పుడు

ఈ నాలుగు పనులు నీవు వ్రాయించిన వాక్యము వల్ల తెలుసుకొని నమస్కరించు చున్నాము. పరిశుద్ధాత్ముడవైన ఓ తండ్రీ! నీవు నీ శిష్యులమీద వ్రాలినప్పుడు, వారికి గొప్ప శక్తి వచ్చినది. అలాగే నీవు మాలోపలికి వచ్చినప్పుడు నీతోకూడా నీ శక్తివస్తే మరొక పనికొరకు సిద్ధము కాగలము. వారైతే ఆ శక్తితో సాక్ష్యమిచ్చిరి. యేసుప్రభువును గూర్చిన సాక్ష్యము అనగా

ఆలాగు చెప్పే శక్తి వారికి అవసరము గాన అట్టి శక్తి ఇచ్చినావు. మా పనికూడా సాక్ష్యమిచ్చుటే గనుక మాకును అట్టి శక్తి అవనరమే. గాని మరొక పని ఇచ్చినావు అదియు మాకు అవసరమే. మరియు నీవు మాలోనికి రావడము అవసరమే.


ఓ తండ్రీ! నీ శిష్యులు మేడగదిలో ఉన్నప్పుడు నీవు వారిలో ప్రవేశించబట్టి, వారు శక్తిపొంది సాక్ష్యము చెప్పుటకై వెళ్ళిరి. అయితే మేము ప్రభుయేసుయొక్క రెండవ రాకడకు సిద్ధము కావాలి గాన ఆ పనికి నీ ప్రవేశము, శక్తి అవసరము. మేము భూదిగంతముల వరకు వెళ్ళవలసిన పనిలేదు. రాకకు సిద్ధపడే పని ఉన్నది. ఆ పనికి నీ శక్తి అవసరము. వారికి సాక్ష్యము చెప్పేపని, మాకు సిద్ధపడే పని. మా ప్రభువా! ఈ పని చాలా కష్టము. శక్తిపొందిన పిదప "మేము రాకడకు సిద్ధము కాగలమా? అనే ప్రశ్నవచ్చి, పురుగువలె మెదులును. అప్పుడు సిద్ధపడుటలో తగ్గిపోదుము". మరొక పర్యాయము “సిద్ధమైన పిమ్మట, రాకడవరకు ఉందునా?” అని సందేహింపచేసే పురుగు తొలిచి, ఏమి తోచకుండా చేయును. మాకు నీ శక్తి ఉంటే ఆ పురుగులను జయించగలము. గనుక ఆలాగు సిద్ధపడే శక్తి అవసరము. ఏదో పాపశోధన రాగా, జయించలేమను తలంపు తోస్తే, అది మరింత భయంకరమైన పురుగు. నీ ఆత్మవల్ల వచ్చుశక్తి పొందనియెడల ఈ మూడు పురుగులకు జంకవలెను. కాబట్టి నీ శక్తివల్ల జయము పొందగల శక్తి ఇమ్ము.


“అయ్యో! నేను మనిషిని. కొన్ని శోధనలు జయిస్తాను. మనిషిని గనుక కొన్ని శోధనలే జయిస్తాను. ఎప్పుడూ అన్నీ శోధనలైతే ఎట్లు జయిస్తాను? అనేది ఒక పురుగు, దోషము. శక్తిలేదని అనుకుంటే అది సరికాదు. నీవల్ల శక్తిపొందినాము గాన అట్లు అనుకుంటే, అది దేవదూషణ. గాన నీవల్ల శక్తిపొందుటకు అనుగ్రహించుము. ఏలీయా వద్దకు దేవదూతను ఎందుకు పంపినావు? రొట్టె తిని, బలము పొంది, ప్రయాణమునకు సిద్ధమగుటకేగదా! ఆలాగు భోజనము చేసి ఏలీయా 40 దినములు ప్రయాణము చేసెను. అలాగే నీ శిష్యులు 40 దినములు కాదు, వాటికి మించిన ప్రయాణము చేస్తూ సాక్ష్యమిచ్చిరి. ఏలీయా బదరీ వృక్షమునుండి సీనాయి కొండకు ప్రయాణము చేసెను. నీ శిష్యులు శక్తిపొంది భూదిగంతములవరకు అనేకరెట్లు దూరము ప్రయాణము చేసిరి. అట్టి శక్తి నీవిచ్చినావు. అట్లే మాకును శక్తి ఇచ్చినయెడల రాకడకు సిద్ధపడుచూ, సువార్త సేవ చేయగలము. ఏలీయా, హోరేబు పర్వత దారిని వెళ్ళుతూ ఎవరితోను మాట్లాడలేదు. నీ శిష్యులు యెరూషలేమునుండి సమరయ వరకు సాక్ష్యమిచ్చుచూ, మాట్లాడుచూ వెళ్ళిరి. వారు ఊరికినే ప్రయాణము చేయలేదు. అలాగే సేవలో మేము ఊరుకోక, మాకు ఎదురయ్యేవారికి మా ప్రభువు వార్త చెప్పే శక్తి దయచేయుము. వారు "వాగ్దానము చేసిన ప్రభువు వచ్చినారనియు, ఆయనను మేము చూచినాము" అనియు చెప్పిరి. అయితే యేసుప్రభువు మొదటిసారి కాదు, “ఇప్పుడు ఆయన రెండవసారి మేఘాసీనుడై త్వరగా వస్తాడని” మేము చెప్పవలెను. శిష్యులు మొదటి రాకడగురించి, మేము రెండవ రాకడనుగూర్చి చెప్పాలి. రాకడనుగూర్చి చెప్పుటకు మేము సిద్ధపడుటకు నీ శక్తి మాకు అవసరము. తీరా చెప్పితే, వారు ప్రశ్నలు వేసినపుడు చెప్పలేకపోతే, 'తెలియదు' అంటే ఏమి బాగుండును! నీ శిష్యులు సాక్ష్యమిచ్చినట్లు మేమును యేసుప్రభువు అనుభవము పొంది ఆయన దర్శనము చూచి, ఆయన మాటలు విని, ఆయన స్వరూవమును చూచుచున్నాము. "ఆయన త్వరగా వచ్చుచున్నాడని" చెప్పితే నీ శక్తి ఉన్నట్లే. లేని యెడల సాక్ష్యముకొరకు సిద్ధపడుట అవసరము. లేనియెడల యేసుప్రభువునుగూర్చి చెప్పుట అనే అనుభవము పోతుంది. మాకు

అందులో

కాబట్టి నీ శక్తి దయచేయుము. బదరీ వృక్షమునుండి హోరేబుకు 40 దినముల ప్రయాణము గాని ఆ ప్రయాణంలో ఏలీయా ఎవరితోను మాట్లాడలేదు. అయితే శిష్యులు కంటితో చూచుచూ, నేల ఉన్నంతవరకు సాక్ష్యము చెప్పిరి. నేల ఉన్నంతవరకు సాక్ష్యమిచ్చుటకు వెళ్ళవలెనంటే శక్తి అవసరము. మాకు ఇంకా ఎక్కువ శక్తి ఎందుకు అవసరము అంటే దర్శనములో మహిమ క్రీస్తును చూస్తున్నాము. అయిననూ అన్నీ సందేహములే గనుక ఎక్కువ శక్తి అవసరము.

ఈ మూడును మాకు అవసరమే. జ్ఞానానికి ఆత్మశక్తి కావాలి. అదే "తెలివిని గలిగించు, నన్ను దివ్వెగా వెలిగించు" అను వచనము. అనగా తెలివి, శక్తి ప్రతివారికి చెప్పే శక్తికావాలి. ఈ శక్తిని మనము మూడు విధాలుగా వాడినాము. మనము శిష్యులవలె సాక్ష్యమును చెప్పాలి గనుక సాక్ష్యశక్తి కావాలి.


టెలిస్కోపువల్ల దూరంగా ఉండే వస్తువు పెద్దదిగాను, దగ్గరగాను కనిపించును. శానిటోరియంనకు మిర్తిపాడు 6 మైళ్ళదూరము. టెలిస్కోపువల్ల కిటికీకి దగ్గరగా ఉన్నట్లు కనిపించును. అలాగే విశ్వాస నేత్రముద్వారా, క్రీస్తు రాక దగ్గరగానే మాకు కనిపించుచున్నదని నచ్చచెప్పాలి. శిష్యులకు - "ప్రభువును చూచినామని" చెప్పుట బలము. మనము విశ్వాసబలము, దర్శనబలము ద్వారా చూస్తున్నాము. ఈలాగు చెప్పుమని పరిశుద్ధాత్మ మనలో ఉండి, తన స్వరమువల్ల రాకడ మిక్కిలి సమీపమని చెప్పుచున్నారు. మనలో

శిష్యులు అందరూ కొండపై కూడుకున్నారు. పాతనిబంధన కాలములో నెబుకద్నెజరు ఇశ్రాయేలీయులను చెరపట్టి తీసికొని వెళ్ళినాడు. ఇశ్రాయేలీయుల రాజ్యము పోయింది. గనుక మనకు రాజ్యము ఎప్పుడు వచ్చును? అని ఆయన శిష్యులలో కొందరు యేసుప్రభువును అడిగిరి. అపో.కార్య. 1:7. వాటిని తెలిసికొనుట మీ పనికాదు. అయినను మీరు శక్తి పొందినప్పుడు మీకు తెలియును.

అనగా త్వరలో చెప్పుదును అని అర్ధము. ఈ యుగము పరిశుద్ధాత్మ యుగము, గాన పరిశుద్ధాత్మ సంఘమునకు తెలుపును. రాకడ ఘడియ తండ్రికి తెలియును. అయినను మీకు తెలియదు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీకు తెలియును. మీరు భూదిగంతములవరకు వెళ్ళి సాక్ష్యమివ్వండి. అందరూ ఈ మాట నమ్మలేదు (మొదటి సువార్త), అలాగే రాకడ సువార్తను అందరూ నమ్మరు.
ఉదా: ప్రభువు కనబడితే కన్ను చెదిరినదని ఒకరు అన్నారు. రాకడలో మనము వెళితే, ఏ గాలో వచ్చి వారిని ఎత్తుకొని పోయిందని కొందరనుకుంటారు గాని ప్రభువు రాకడలో వారు వెళ్ళిపోయారు అని నమ్మరు. యేసుప్రభువు నిన్ను రక్షిస్తాడు అది సువార్త. యేసుప్రభువు నన్ను రక్షించినాడు అది సాక్ష్య సువార్త. ఈలాగు మనము సాక్ష్యమివ్వాలి. ఆఖరు సువార్త రాకడ సువార్త, అది ఇపుడు చెప్పవలెను. బైబిలులో ఏ కధ నీకు ఇష్టము? ఇష్టమైన కధ చెప్పినప్పుడు నీవు చూచినావా? అది మా వేదములలోను ఉన్నది అని అన్నప్పుడు శక్తిలేనిదే తిరిగి వారికి చెప్పలేముగాని పరిశుద్ధాత్మ శక్తిగల వారమైనప్పుడు చెప్పగలము. రాకడను గూర్చి ఏ మాట వ్రాయబడినదో దానిగూర్చి అపో.కార్య. 1:7వ వచనములో ఉన్నది. ఆ కాలము ఉన్నది, రాకడ అనేది ఉన్నది. అపో.కార్య. 1:8లో ఆత్మ కుమ్మరింపు కాలమున్నది. వీటిలో రెండవరాకడకు సంబంధించిన కాలమున్నది. రెండవరాకడ కాలములో అనగా త్వరగా, కొద్ది దినములలో రాకడ వచ్చును అని అర్ధము. ఇది పరిశుద్ధాత్మ చరిత్రలో ఉన్నది. కొద్ది దినములలో అనగా "త్వరగా" అని అర్ధము.
“ప్రభువైన యేసూ రమ్మను ప్రార్ధన నేర్పుమో ప్రభువా!...” నేనిక సిద్ధంబుగా లేను” అనువచనము. ॥త్వరగా॥


మొదటి ఆత్మ = యెహోవా దేవుడు; రెండవ ఆత్మ = యెహోవాయొక్క నామము, యేసుక్రీస్తు; మూడవ ఆత్మ = పరిశుద్ధాత్మ మనచేత ఆరాధన చేయించుచున్నారు. ఆత్మ లేనిదే జీవము ఉండదు. సీనాయి పర్వతములో త్రిత్వము ఉన్నారు. ఆది 1:1లో దేవుడని మొదట ఉన్నది. వెలుగు కలుగును గాక అనే వాక్యములోని పేరు యేసుక్రీస్తుదై యున్నది. యోహాను 1లో ఆదియందువాక్యము ఉండెను అని ఉన్నది. ఆ వాక్యము యొక్క క్రియ జరుగుచున్నట్లు చేయుట పరిశుద్ధాత్మ పని. యేసుప్రభువుకు 11మంది శిష్యులు ఉన్నారు. వారు ప్రభువు వెళ్ళుట చూచిరి. వారిలో ఎవరు మిగిలిపోయిరి? యూదా ఇస్కరియోతు. అలాగే సంఘము వెళ్ళిపోగా ఇస్కరియోతు యూదా వలె అనేకులు మిగిలిపోదురు.
ప్రశ్న:- ఎవరికి పరిశుద్ధాత్మ శక్తి దొరుకుననగా కూడుకొన్నవారికి. అపో.కార్య. 1:6. అలాగే ఎవరైతే పూనుకొని వస్తారో, వారికి పరిశుద్ధాత్మ శక్తి. వారికే పరిశుద్ధాత్మ శక్తి ఇచ్చును. "నాయందు విశ్వాసముంచువారు నాకంటె గొప్పకార్యములు చేస్తారు" అని ప్రభువు చెప్పెనుగదా! అది ఏదంటే; యేసుప్రభువు భూదిగంతముల వరకు వెళ్ళలేదు గాని శిష్యులు భూదిగంతముల వరకు వెళ్ళి సాక్ష్యమిచ్చిరి. మనకును అట్టి గొప్పస్థితి రావలెనంటే 10దినములు కూడుకొని ప్రార్ధించినయెడల భూదిగంతముల వరకు వెళ్ళగలము. ప్రభువు చేసినవి ఇంకా అనేక సంగతులు ఉన్నవి అని యోహాను 21:25లో యోహాను వ్రాసెను. ఆయన యూదయ, సమరయ పాలస్తీనా ప్రాంతములలో మాత్రమే తిరిగెను. అప్పటివరకు యోహాను 20వ అధ్యాయము వ్రాసి కలము పెట్టివేసి, ఆ తర్వాత 21వ అధ్యా॥ వ్రాసెను. ఇక వ్రాయశక్తిలేక 21:25వ వచనము వ్రాసి, పత్మాసులంకలో మరలా కలము ఎత్తెను. ఈలోగా పత్రికలు వ్రాసెను.


ప్రార్థన:- పరిశుద్ధాత్ముడవైన ఓ తండ్రీ! నిన్నుగూర్చి విన్న మహిమ సంగతులు బైబిలులో వ్రాయబడినట్లు మా మనస్సులో, జ్ఞానములో వ్రాయుమని వేడుకొంటున్నాము. నీవు అగ్ని బాప్తిస్మమిచ్చినందున నీ శిష్యులు బోధించిరి. ఆలాగే మాకును ఇమ్ము స్తెఫనుతో పండితులు వాదించినప్పుడు, వారు జవాబు ఇవ్వలేక స్తెఫనును రాళ్ళతో కొట్టిచంపిరి. ఆ స్తెఫను పండితుల జ్ఞానమునకు మించిన జ్ఞానముతో చెప్పెను. అట్లే లోకములోని గొప్పగొప్ప పండితుల ప్రశ్నలను ఎదుర్కొనగలిగిన నీ ఆత్మ జ్ఞానశక్తి, మాకును అవసరము గనుక అనుగ్రహింపుము. మా కొరకు నీ కుమారుని ఇచ్చిన తండ్రీ! నీ కుమారుని నామమున వందించుచున్నాను. ఆమేన్.


ఆశీర్వాదము : మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రియైన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మయొక్క సహాయము మనకు నిత్యము తోడైయుండునుగాక! ఆమేన్.



21.5.1955వ సం॥లో దేవదాసు అయ్యగారు చేసిన ప్రసంగము.