గ్రంథకర్త: ఫాదర్ యం. దేవదాసు

ఆత్మ కుమ్మరింపు కూటములలోని ఏడవ దినము-గురువారము
స్వర్గీయ భాష



1కొరింధి. 14:1-33.

షరా:- మొదటిపని వినదగినది:

ఎవరు చెప్పినా సరే పూర్తిగా వినవలెను.
రెండవపని పరీక్షించదగినది:

ఈ మూడు సూత్రములు అంగీకరించువారు ధన్యులు.


ప్రార్ధన:- మా తండ్రీ! మాలో నీ ఆత్మను ఉంచిన తండ్రీ! నీకు స్తోత్రములు. మేము నీ వారము గనుక నీదగ్గరనుండి వచ్చినవారము గనుక నీ మాటలు మాకు అర్ధమగునట్లు నీ పరలోకపు భాషను మాకు నేర్పించి, నీ ఆత్మ సంగతులను బోధపరచి, మా అనుభవములో నిత్యము ప్రత్యక్షపరచుచుండుమని పరిశుద్ధాత్మ తండ్రి నామమున వందించుచున్నాము. ఆమేన్.


పరిశుద్ధాత్మ ప్రసంగమునకు ముందు వివరింపవలసినవి:

(1) దైవలక్షణములు: దేవునిలోని లక్షణములు మనకును రావలయును. అనగా దైవలక్షణములైన ప్రేమ, న్యాయము, జీవము, శక్తి, విశ్వాస్యత, మొ॥నవి మనలో ఉండవలెను.


(2) ప్రవచనము:- అనగా రాబోవునవి ముందుగానే చెప్పుట మరియు బైబిలులోని సంగతులు బోధించుట. ఈ రెండు చేయువారు ప్రవక్తలు. ప్రకటనలోని సంగతులు జరుగుచున్నవి. ప్రవక్తలు ఎప్పుడును స్వంత సంగతులు చెప్పరు. ఈ ప్రవక్తలు దైవాత్మ బలముచేత పత్రికలువ్రాసి చనిపోతే, అదే కాలములో (లేక) మరికొంత కాలమునకు దైవాత్మబలముతో ఇంకొక భక్తుడు వాటి వివరము చెప్పితే వారును ప్రవక్తలే. (3) భాష:- ఇదియొక వరము. దేనికదేగాని ఈ మూడింటిని కలుపరాదు. విశ్వాసము వల్ల రక్షణ కలుగును. భాషవస్తేనేగాని రక్షణ లేదా? కాదు. విశ్వాసమువల్ల రక్షణ కలుగును.
విశ్వానము:-

వరప్రదుండు అనగా వరములను ఇచ్చువాడు అనగా పరిశుద్ధాత్మ. భాషలు రెండు రకములు అనగా రెండు తరగతులు.

అలాగే వ్రవచనములు రెండు రకములు.

విశ్వాసమనగా

పెంతెకొస్తు దినమందు వారు అన్యభాషలు మాట్టాడిరి. ఇది భూలోక భాషలవలె మాట్లాడే వరము. ఇవి మనిషిచే నేర్పించుకొనవచ్చును. అందుకు, పుస్తకములు, పంతుళ్ళు, ప్రజలు ఉన్నారు. ఇది కష్టమైన విషయముకాదు, గాని పెంతెకొస్తప్పుడు ఆది సంఘమును ఆయన స్థాపించుచున్నారు గాన వారికి అవసరమైనందున భూలోక భాషలిచ్చిరి. గనుక మనమును పెంతెకొస్తును తలంచి మరాటీవారిని జూచి స్తుతిస్తే మరాటీ భాషవచ్చును. 1కొరింథి. 13వ అధ్యాయములో

అని వ్రాయబడినది. బైబిలులో 14 వరములున్నవి. గాని ఈ వరమంతా స్పష్టముగా ఏ వరమునూ వివరింపబడలేదు.
1 2 3
దేవుడు ఉండే ఆత్మలోకము దేవదూతలుండే ఆత్మలోకము దయ్యములు ఉండే ఆత్మలోకము

మూడును అత్మ లోకములే. ఆలాగే మనుష్యుడు 3 భాగమలు.

దీనిపని అంతగా తెలియదు. దేవుడు మాట్లాడితే దేవదూతలకు తెలియును, దయ్యములకు తెలియును, మనిషి ఆత్మకు తెలియును. గాని దేవుడు మాట్లాడితే మనిషికిని, మనిషి ప్రాణమునకునూ తెలియదు. మనిషిలోనుండే ఆత్మ దేవునితో మాట్లాడును. దేవుడు మనిషి ఆత్మతో మాట్లాడును గాని మనిషి ప్రాణమునకు అది తెలియదు. ఆత్మ చెప్పితే తెలియును. ఈ క్రింది పట్టికలో పై వివరమును చక్కగా గ్రహించగలము. ఒక దొరగారున్నారు. ఇంగ్లీషు ఆయన మాతృభాష గనుక చక్కగా వచ్చును. ఆ దొరగారి ఆఫీసులో ఒక రైటరున్నాడు. ఆయన ఇంగ్లీషు నేర్చుకొన్నాడు గనుక, కొంతవరకు ఫరవాలేదు. అయితే ఆ దొరగారి పనివాడు, చదువులేనందున ఇంగ్లీషు ఏమో అర్ధం చేసికోలేడు, మాట్లాడలేడు. దేవునితో మాట్లాడుటలో, ఈ తారతమ్యములే శరీర ప్రాణాత్మలకుండును. దొరగారు ఆత్మకు సాదృశ్యమైతే, పనివాడు శరీరమునకు సాదృశ్యముగా ఉన్నాడు.


ఆత్మ ప్రాణము శరీరము
దొరగారు
ఇంగ్లీషువారు
స్వభాష
రైటరు
ఇంగ్లీషు వచ్చును
నేర్చుకొన్నాడు గనుక
వ్యూన్
ఇంగ్లీషు రాదు
నేర్చుకోలేదు గనుక
స్వభాష కాదు గనుక

దేవునికి భాషవచ్చును గనుక దేవదూతలతో మాట్లాడును. దూతలు నరుని ఆత్మతో మాట్లాడుదురు. అయితే, నరుని ఆత్మ ప్రాణముతో చెప్పితే తెలియదు.

సాదృశ్యము:- దొరగారు తన పనివానికి "విజ్ డమ్" అనేమాట నేర్పించి, దాని అర్ధము జ్ఞానము అనిచెప్పెను. రెండుకలిపి "విజ్ డమ్" మరియు జ్ఞానము అని చెప్పెను. ఆలాగే ఆత్మకు భాషవచ్చును, అర్ధము తెలుసును. గనుక రెండునూ అడిగి నేర్చుకొనవలెను (1కొరి. 14:13). మనుష్యుడు గ్రహింపడుగాని భాష వచ్చినవాడు దేవునితో మాట్లాడుచున్నాడు.

పరిశుద్ధాత్మ మనిషియొక్క ఆత్మకు వరమిస్తాడు. ప్రాణము ఎప్పుడు దేవుని స్తుతించును? 1) ఉపకారము పొందినపుడు, మనిషి దేవుని స్తుతించును. ఎంతసేపు స్తుతించును? స్తుతించి, స్తుతించి, స్తుతించి ఆగిపోవును. ఇంకా స్తుతించాలని ప్రాణానికి ఆశ యుండును. అయితే, ప్రాణము తెలుగులో చేసిన స్తుతి ఆగినది. ఈ స్తుతి దేవునికి గాన, అది ఆత్మలోకమునకు వెళ్ళవలయును గనుక ప్రాణముయొక్క స్తుతి ఆగగానే ఆత్మ అందుకొని స్తుతిచేయగా, ఆత్మలోకమునకు ఆ స్తుతి వెళ్ళును గనుక అత్మ సహాయముతో స్తుతించగా భాష వచ్చును. అది ప్రాణమునకు మించిన స్తుతి.


ఆలాగు ఆత్మ అందుకొని స్తుతి చేయగానే భాషవచ్చును. ప్రాణమునకు ఇంకా స్తుతించాలని ఆశయున్నప్పుడే, ఆత్మ ఆ స్తుతిని అందుకొనును. ఆత్మ యొక్క స్తుతిని, ప్రాణము సహించలేకపోయినప్పుడు, శరీరమునకు బాధ కలుగును. అప్పుడు బోధకుడువచ్చి చేతులుంచి నిమ్మళింపజేయును. ప్రాణముచేసిన స్తుతిని ఆత్మ అందుకొనగానే, ఆత్మ పరలోకమునకు వెళ్ళును.


ఆత్మ స్తుతించగా స్తుతికిమించిన స్తుతి వచ్చును. ప్రాణము చేయగా, దేవునికి ఎక్కువ సంతోషము కలుగును. ప్రార్ధనయు, స్తుతియు దేవునికి ఇష్టముగాన ఆయన సంతోషించును. మనకు ఎక్కువైన సంతోషము కలిగించుటకై, దేవుడు మన ఆత్మకు భాషావరమిచ్చి స్తుతి చేయించును. పరలోకభాష మాట్లాడేవారిని చూస్తే దయ్యము వణకును. కారణమేమనగా, ఇదివరకు మేము మాట్లాడిన ఆ భాషను మేము (దయ్యములు) పాపమువల్ల పోగొట్టుకొన్నాము. మేము మాట్లాడే ఆ భాషను దేవుడు, పాపమానవులను రక్షించి, వారికిచ్చినాడని అనగా ఈ భాషావరము దేవుడు వారికిచ్చినాడని, పరిశుద్దదూతలయొక్క భాష వారికి ఇచ్చినాడనే అసూయచేత దయ్యములు సహించలేకపోవును. దేవదూతలు వాటితో మాట్లాడితే సహించగలవు గాని పాపమానవులు మాట్లాడితే మొదటే సహించలేవు, గాన పారిపోవును.


ఫిలిప్పీ. 4:4లో

ఇది ఆత్మకు చెప్పబడిన మాట, అనగా రెట్టింపు సంతోషము కలుగుట కొరకు.

సంతోషమునుబట్టి, విశ్వాసమునుబట్టి స్తుతిచేయండి. ఒకరు భాష మాట్లాడితే ఇంకొకరు అర్ధము చెప్పుదురు. ఇది సుళువా! ఇంత గొప్ప వరము బైబిలులో ఉండగా, కొందరు ద్వేషించి లేదంటారు, కాదంటారు. ఎంత విచారము! భాషకు అర్ధము చెప్పకపోతే ప్రవక్తలు ఎట్లు భాష మాట్లాడేవారు? అర్ధము చెబితే గొప్ప ప్రవక్త అవుతారు. దయ్యముకూడా భాష మాట్లాడును. దానిని సుళువుగా గ్రహించగలము. విశ్వాసులు భాషలు మాట్లాడుచు, అర్ధము చెప్పుచూ ఉండగా అవిశ్వాసులు వింటే, అవి వారికి సూచనగా యుండును.

ఉదా:- స్వస్థిశాలలు అవిశ్వానులైన వారికి సూచనగా ఉంటున్నవి. అనగా వారు మార్పు చెందుటకు సాధనములైయున్నవి.


ఉదా:- రైలుబండిలో కూర్చుండి స్తుతిచేస్తూ, భాషలు మాట్లాడితే, అక్కడే ఏ అవిశ్వాసో, ఏ నాస్థికుడో యున్నాడన్నమాట. అందుకే విశ్వాసి భాష మాట్లాడినది. భాషలేకపోతే ఆ సమయములో ఆ వ్యక్తికి రక్షణలేదని కూడా చెప్పవచ్చును. బైబిలులో దేవదూతల భాష ఉంటే, రక్షణ పొందిన విశ్వాసి దానిని నమ్మకపోతే రక్షణపోతుంది.


ప్రశ్న:- ప్రాణముతో స్తుతి, ఆత్మతోస్తుతి చేయకపోతే పెండ్లికుమార్తె వరుసలేదా?


జవాబు:- శ్రమలోను, కష్టములోను, ఇబ్బందిలోను, కరువులోను, ఆత్మతో స్తుతించువారే పెండ్లికుమార్తె సంఘములో ఉన్నారు. పాపమున్నా శోధనున్నా మొండికేసి స్తుతించువారే జయశీలురు.


షరా:- భాషనుగురించి ఇంకొక సంగతి ఎప్పుడు చెప్పుదునంటే, మీరందరు భాషలు మాట్లాడునప్పుడే వాటినిగూర్చి వివరించుదును. అయితే ఈ ఆత్మీయ వరములు పొందిన పిదప మనుష్యులలోనికి రెండు గర్వములు వచ్చును.

గనుక మన అనుభవము పెరుగుకొలది మన తగ్గింపుకూడ పెరుగుచుండవలెను. బైబిలులో ఉన్న ప్రతిఅంశము మన జ్ఞానానికి సరిపోతే తప్పక అనుసరించవలసినదే.


అట్లు అనుసరించి, గొప్ప ఆత్మీయానుభవమును పొందు ధన్యత ప్రభువు మీకెల్లరకు దయచేయునుగాక. ఆమేన్.



16.5.1949వ సం॥లో దేవదాసు అయ్యగారు చేసిన ప్రసంగము.