గ్రంథకర్త: ఫాదర్ యం. దేవదాసు

ఆత్మ కుమ్మరింపు కూటములలోని తొమ్మిదవ దినము-శనివారము
ఆత్మ కుమ్మరింపు జరుగు విధానము



అపో.కార్య. 2:1-18.

కీర్తన: "మనసానందము బొందుటకన్నను...... తీరైయుండును".


ప్రార్ధన:- ఓ తండ్రీ! లోకమునిండా పాపము. అందుచేత మనసానందము. ఎలాగు కలుగును? అన్నీ కష్టాలే. మనసానందము ఎలాగు రావలెను? లోకమంతా దుష్టులే, లోకమునిండా దురాత్మలే. గనుక మనసానందము ఎలాగు రావలెను? అయినప్పటికిని "ఎల్లప్పుడు ప్రభువునందు ఆనందించుడి" అని చెప్పినావు. గనుక ఎక్కడ చూచినా కలహాలే, చిక్కులే, అవస్థలే. ప్రతిరోజు మరణాలే, ఇబ్బందులే. ఈలాగు ప్రతిరోజు జరుగుచుంటే ఎలాగు మనసానందముగా ఉండగలము? ఆయా ప్రదేశములనుండి వచ్చిన ఈ బిడ్డలు మనసానందము కొరకు వచ్చారు. "లోకములోని పాపముజోలి, దుష్టులజోలి దయ్యాలజోలి, కష్టాల జోలి మాకెందుకు? లోకములో పాపముంటే ఉన్నది. వ్యాధులు, దయ్యాలు, చెడ్డ బుద్ధులు అవి మాకెందుకు? వాటిని మేము లెక్కచేయము" అని ఇక్కడున్నవారు మనసానందము పొందే కృప దయచేయుము. పెంతెకొస్తు పండుగనాడు 120మంది పొందిన మనసానందము ఎవరు చెప్పగలరు? వారెవరు ఇక్కడకు వచ్చి, చెప్పలేదు. వారి భాషలు విన్నవారు త్రాగుబోతులు అంటే వారు లెక్కచేస్తారా? లెక్కచేయలేదు. అలాగే మేము ప్రతిరోజు వింటున్న పాపమును లెక్క చేయక, నీయందు (ఆ కూటమునకు హాజరైన ఈ 30మంది) ఎల్లప్పుడు ఆనందించే కృప దయచేయుము ఆమేన్.


ఒక ఉపమానము వినండి. ఒక మిషను స్కూలు ఉన్నది. ఆ స్కూలులోని పిల్లలను మొదటిగా హాలులో సమకూర్చి కీర్తనపాడి, ప్రార్ధనచేస్తారు. తరువాత ఎవరి తరగతిలోనికి వారు వెళతారు. ఆ హాలులోనున్న 100మంది విద్యార్థులలో ముగ్గురి కథ చెప్పుతాను. ఒక క్రైస్తవ విద్యార్థి కలడు. రెండవవాడుకూడా క్రైస్తవ విద్యార్ధే. మూడవవాడు - క్రైస్తవుడు కాని విద్యార్ధి. ఈ ఒక్కడు హైందవ విద్యార్థి. వారికి హెడ్ మాస్టరు ఒక కథ చెప్పినారు. ఈ ముగ్గురు తెలివైనవారు. ఆ కథ ఏమిటంటే మనకందరికి తెలిసిన కథే.

పెంతెకొస్తు దినమందు ఆత్మను కుమ్మరించారను కథ, అందరికి చెప్పెను. ఆ వందమందిలో ఈ ముగ్గురు బాగా విన్నారు. బడిలో ఏమి నేర్చుకొన్నారు! అని అడిగితే కథ అంతా చెప్పారు. హెడ్ మాస్టర్ గారు చెప్పారు గనుక ఈ ముగ్గురు చెప్పారు. ఈ ముగ్గురు జ్ఞాపకముంచుకొని చెప్పారు. హెడ్ మాస్టరుగారు పరిశుద్ధాత్మపొంది చెప్పారు. కథ ఒక్కటే. హెడ్ మాస్టర్ గారు, పేతురు, ముగ్గురు విద్యార్థులు చెప్పిన కథలు ఒక్కటే.

పేతురు 120మందిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ అక్కడున్న వారిమీదికి, ఆయనకు వచ్చినది. ఆ ప్రేరణనుబట్టి అందరికి బోధించెను.


ఆ ప్రజలు అందరు యూదులే. పండుగకు వచ్చిన యూదులే. యెరూషలేము యూదులే కాదు, యూదయ యూదులేకాదు, అన్ని దేశములనుండి వచ్చిన యూదులు, అన్యులు ఉన్నారు. పండుగ గనుక అన్ని దేశములనుండి వచ్చిన యూదులు, భక్తిపరులు ఈ కథ విన్నారు. వింటే ఏమి జరిగినదంటే, ఇందులో క్రొత్త సంగతి ఏమిలేదు. “ఆయన వస్తాడని, పుట్టినాడని, బోధించినాడని, ఆ యూదులే ఆయనను చంపారని, అయితే, ఆయన తిరిగిలేచాడని, పరలోకమునకు వెళ్ళెనని” చెప్పెను. అది వారికి తెలిసినదే. అదే పేతురు చెప్పినాడు. క్రొత్తది కాదుగాని పరిశుద్ధాత్మ చెప్పినాడు గనుక వారికి క్రొత్తదైనది, అందువలన వారు మారినారు. ఆ ముగ్గురు పిల్లలు చెప్పారుగాని మారలేదు. ఇది ఆ కథే. వారు చెప్పినది ఆ కథే. తేడాలేదుగాని పేతురు పరిశుద్ధాత్మతో నిండుకొని చెప్పినాడు గనుక ఆ చరిత్ర

ముగ్గురు చెప్పినందువల్ల ఎవరూ కలవరపడలేదు. ఆ ప్రసంగములో ఒక్కమాటవల్ల వారు కలవరపడ్డారు.


“యేసుప్రభువును మీరే చంపారు” అనేమాట కలవరపరచినది. దేవుడు పంపిన యేసుప్రభువును మీరే చంపారు. అనగా పండుగేగాని కలవరపడ్డారు. అప్పుడు ఈ మాట వినగానే మేమేమి చేయవలెను? మేము చంపకపోయిన మా సంబంధికులు ఆయనను చంపివేసారు. అనగా అల్లరిఅయిపోయినది. అంతకుముందు మేడగదిలో, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అల్లరి అయినది. పరిశుద్ధాత్మ గాలి విసరినప్పుడు, గాలి శబ్ధమైనది. ఆ శబ్ధము ఆత్మ వచ్చినందువల్ల కలిగినది. 120మంది కలవరపడలేదు గాని ఊళ్ళోవారు, ఎదుటనున్నవారు, పొరుగూరునుండి వచ్చినవారు కలవరపడ్డారు. లోపలనున్నవారు బాగానే ఉన్నారు. రెండవసారి పేతురు బోధించినప్పుడు “ఇదేమి, ఇదేమి” అని కలవరపడ్డారు.

వారు నానా దేశములనుండి వచ్చారు. ఉదా: అరవ దేశములో ఉండే ఒక భక్తురాలు, బట్లర్ గారి ఇంట్లో చిరకాలముంటే ఆ దొరగారి భాష అలవాటైపోతాది. భార్య, బిడ్డలు అందరు తెలుగే గనుక అలవాటైపోయినది. ఉదా:- రాజమండ్రినుండి ఒక అరవ అబ్బాయి దొరగారి ఇంట్లోకి వచ్చాడు. నెమ్మదిగా అతనికి తెలుగు అలవాటైపోయినది. అలాగే ఆ భాషలోనే వారు సువార్త చెప్పిరి. వారు ఎప్పుడు నేర్చుకున్నారు? అని విన్నవారు ఆశ్చర్యపడ్డారు. ఆ పండుగలోనికి ఎవరెవరు వచ్చారు.

వారంతా అప్పుడు యెరూషలేమునుండి వచ్చినవారే (అ.కార్య. 2:9). ఆ వచ్చినవారికి

నేర్పు వలన చెప్పిన కథవేరు. అది జ్ఞానవాక్కు అయితే, పేతురుది ఆత్మవాక్కు గనుక ప్రియులారా! మీరందరు ఆత్మనుబట్టి చెప్పండి. పేతురుకు సంతోషమే. మీకును సంతోషమే. విన్నవారికి సంతోషమే. అప్పుడు గొప్ప మార్పుకలుగును. ఈ మార్పు అందరు పొందు నిమిత్తము అందరు ఆత్మను పొందండి అట్టి కృప అందరికి కలుగునుగాక! ఆమేన్.


మరియమ్మ చివరి కథ:- క్రైస్తవ సంఘములో మొట్టమొదటి కూటము యెరూషలేములోని భక్తురాలైన మరియమ్మ ఇంటిలో జరిగినది.


1. ఆ మరియమ్మ ఇంటిలో కూడుకొన్న 120మందితోపాటు యేసుతల్లియైన మరియమ్మ ఉన్నది. ఆమెను గురించి ఆ తర్వాత బైబిలులో ఎక్కడా వ్రాయలేదు. అదే ఆఖరి సంగతి. ఆ సంగతి ఏమంటే "ఆమె, ఆ ప్రార్ధన కూటములో ఉన్నది". అది గొప్ప సంగతేగదా! అది

అప్పటికి ఆమె వయసు గతించిపోయెనా? లేదు. అయితే బైబిలులో మరియమ్మ చరిత్ర ఆఖరి కూటములో జరిగిన సంగతితో ముగింపు. అలాగే మా జీవితాన్ని ప్రార్థనాకూటముతో ముగింపులో జరుపుకొనుచున్నారా? ఆమె ఒంటరిగా లేదు. పదిమందితో కలసినది. కాదు. 120మందితోకూడ ఉన్నది. ఆ సంఘము 850 మిషనులలో ఒక మిషనుకాదు, ఒక్క సంఘము, ఎంత ధన్యత! ఆమె ఆ మొదటి సంఘములోని మెంబరు. ఇప్పుడు సంఘము ఇన్ని శాఖలైపోయినది, 850 మిషనులు. ఇది చాలా విచారకరమైన సంగతి.


పెంతెకొస్తు పండుగరోజున

అందరు ఒకచోట కూడుకున్నారు కాబట్టి ఒక సంఘము. ఆ సంఘమే 16వందల సం॥ల వరకు పెరిగి, ఇప్పటికి నాలుగు వందల ఏండ్లకి 850 మిషనులుగా చీలిపోయినది. ఎందుకనగా ఐక్యతలేక. అందరు ఒకచోట కూడుకొనక, ఒక పనికే కూడుకొనక ఎవరిపనిలో వారు, ఎవరి పద్ధతిలో వారు ఉన్నారు. అయితే, ఆది సంఘ కూటములో ప్రభువు శిష్యులున్నారు, స్త్రీలు ఉన్నారు, ఇంకా ఇతరులున్నారు. మనుష్యులు 120మందిగాని మనసులు 120 లేవు, ఒకటే. వారు ఫిలిప్పీ 4:2లో ఉన్నట్లు, క్రీస్తునందు ఏకమనస్సు గలవారైరి. వారు 120మంది లెక్క అయితే ఒక్కటే సంఘము. ఒక్కటే మనస్సు, ఒక్కటే ప్రేమ. సంఘమంటే పురుషులు, స్త్రీలు ఉండవలెను. స్త్రీల కూటము వేరు, పురుషుల కూటము వేరు. అయితే పురుషులు, స్త్రీలు కలసిన కూటము. అపో. కార్య. 1వ అధ్యాయములో చూస్తున్నాము. అదే మొదటి సంఘము! అది ఏ సంఘము? స్త్రీల సంఘము మరియు పురుషుల సంఘము. అట్టి సంఘమే అక్కడ కూడుకొన్న సంఘము. అట్టి సంఘము ఇంకను రాలేదు. ఆ సంఘము రాకడప్పుడు వస్తుంది. ఎందుచేత? ఇప్పుడు భేదములు వచ్చినవి. నేటి సంఘములో ఒకరు ఒకటి చెప్పితే, ఇంకొకరు ఇంకొక రీతిగా చెప్పుచున్నారు. నాలుగువందల సం॥ల నుండి ఇలాగు జరుగుచూనేయున్నది. తర్కము జరుగుచున్నది. ఆ ఏకమనస్సు పోయి ఇప్పటికి 850పైగా మిషనులు అయినవి. ఏమి బాగున్నది నేటి క్రైస్తవ సంఘము? అది పడిపోవుట చాలా విచారకరమైనది. అప్పటి పెంతెకొస్తు సంఘము చాలా సంతోషకరమైనది. అందులో ఒకరినిచూచి బాగున్నారా? అనగా బాగున్నాను అనును. క్రీస్తు మత సంఘము బాగున్నదా? లేదు. ఇప్పుడేమి చేయగలము? 850మిషనులను ఏలాగు కలుపగలము? ఈ 20వందల ఏండ్లనుండి అందుకొరకు ఎవరూ గట్టి ప్రార్ధన చేయలేదు. వట్టిట్టి ప్రార్ధన చేస్తున్నారు. ఒకరు చేస్తే చాలదు, అపుడు అందరు చేయబట్టే ఆత్మ కుమ్మరింపు వచ్చినది. అందరు కలవకపోవుట బట్టే నేడు విడిపోయారు, ఇంకా విడిపోతూనే ఉన్నారు. ప్రార్ధన చేసికొందామంటే రారు. మరేమి చేయాలి? అనేక వందలమంది భక్తులున్నారు. వారే ఈ మిషనులన్నిటిని కలపటానికి ప్రయత్నము చేస్తున్నారు, కానీ కలుపలేకపోవుచున్నారు కారణము, వారిలో వారికి నేడు ఐక్యత లేదు.


"యేసుప్రభువా! మేము మీటింగు పెట్టుకుంటున్నాము. నిన్ను ఒక ప్రశ్న అడగాలని ఉన్నది అది ఏమనగా మాకందరకు సమాధానము దయచేయుము" అని ప్రార్ధించవలెను! "మా మిషనుకంటే ఆ మిషనునే ఎక్కువచేయి" అనే ప్రార్ధన చేయగల్లుచున్నారా? అట్లు చేస్తున్నారా? అన్ని మిషనులవారు ఏమి చేయవలెనంటే, అన్ని మిషనులను ఒక్కటిగా చేయుము అని ప్రభువును అడుగవలెను. మీరు ప్రతి రోజు ఈ ప్రార్థన చేస్తారా? ఈవేళ ఈ ప్రార్ధన చేస్తారా? 'యేసుప్రభువా! మా మధ్యకు రా! అన్ని మిషనులను కలుపుము' అని ప్రార్ధించాలి. అలాగే ఇంటివద్ద అడగండి. అడిగిన తరువాత జవాబువస్తే ఒక కార్డు వ్రాస్తారా? మీరు అలాగు చేస్తే జవాబు వస్తే, మాకు కార్డువ్రాస్తే, నేను పత్రికలు వేయించి అందరికి పంపుతాను. 850 మిషనులుండగా ఆ చీలికలు చాలనట్లు బైబిలు మిషను వచ్చినది. అది మాత్రము ఏమి బాగుంది! మీరు అన్ని మిషనులలోనికి వెళ్ళితే బాగుండును. మరలా క్రొత్త మిషను ఎందుకు? మీరు వెళ్ళితే ఇతర మిషనుల వారు చేర్చుకుంటారా?తక్కిన మిషనులవారు వారిలో వారికి కీచులాట వచ్చినందువలన వేరైపోయిరి.


బైబిలుమిషనును దేవుడుచెప్పితే స్థాపించాను. మధ్యాహ్నము ఎండవేళ నా గదిలో పరుండియుండగా గాలిలో బైబిలుమిషను అని ప్రభువు వ్రాసారు, నేనే చూచాను. దగ్గర ఎవరైనా ఉన్నా వారికి కనబడదు, 30మంది ఉన్నా కనబడదు. నన్ను స్థాపించమన్నారు. లూధరన్ మిషనువారికి, నాకు ఎప్పుడు కీచులాట రాలేదు. తూర్పుగోదావరిజిల్లాలో సువార్త పనికి తిరిగాను. నేను పాదిరిని కాదు. నాకు బైబిలుమిషనును స్థాపించమనిచెప్పారు. వ్రాసి చూపించారు. రగులుకొనే పొయ్యిలో ఇంకొక పుల్లవేస్తే ఇంకా కాలిపోతుంది, అలాగే ఇప్పుడు కాలిపోతుంది. 17సం॥లనుండి ఇంకా కాలిపోతుంది. 850 మిషనులను పిలిచి ఒకటి చేయాలని బైబిలుమిషనుయొక్క ఉద్దేశ్యము. ఇది నెరవేరుతుందా? ప్రార్ధనచేస్తే నెరవేరుతుంది. అందుకొరకు బోధించవద్దా! చెప్పనిదే ఎలాగు తెలుసుకుంటారు? ఏలాగు మారతారు? ఇప్పటికే ఆలస్యమైనది గనుక అందరికి చెప్పవలెను. వెళ్ళగలమా? బర్మా, చైనా, పాలస్తీనా, జర్మనీ, డెన్మార్క్, నార్వే, అమెరికా, ఆస్టేలియా వెళ్ళితే అందరితో మాట్లాడి చెప్పగలము. ఇప్పుడు వెళ్ళగలమా? అట్టి కార్యము కొరకు ఎంత శక్తి కావలెను? ఇప్పుడే ఆ పరిశుద్ధాత్మ శక్తి ఉంటే వెళ్ళగలము?


యేసుప్రభువు శిష్యులతో ఒకమాట చెప్పినారు. మీరు భూమియొక్క దిక్కుయొక్క అంతమువరకు వెళ్ళండి. వారు ఆత్మను పొందినారు గనుక వెళ్ళారు. అలాగే ఇప్పుడుకూడా పొందితే వెళ్ళగలరు. మనకంత ఆత్మబలములేదు. అందువలన మనము వెళ్ళడానికి ఆత్మ పని చాలదు. గనుక దేశదేశాలకు పత్రికలద్వారా ఈ సంగతి అచ్చువేసి పంపవలెనంటే, మన ముందున్న చీరాలకు ఎన్ని పత్రికలు కావలెను? నాలుగువేలమంది చీరాలవారున్నారు. చీరాలవారు నెలనెలకు నాలుగు వేల పత్రికలు అచ్చువేసి పంపగలరా? భూదిగంతములవరకు వెళ్ళలేరు గనుక ఈ పత్రిక పని చేసి అది అందిస్తే బాగుండును. మీరే అచ్చువేసి పంచిపెట్టండి. మన్నవ ప్రకాశం లేచాడు గనుక నా మాటకు మన్నన చేస్తారన్నమాటే. చీరాల, పేరాల అంతా ప్రకటిస్తే వారిని రక్షించినవారగుదురు. అలాగుననే విశాఖపట్నం, కర్నూలు, నెల్లూరు పేపర్లు పంపితే వారుకూడా తెలిసికొంటారు.


గనుక "దేవా! నాకు కనబడుము. అందరికి కనబడుము! దేవా నాతో మాట్లాడుము, అందరితో మాట్లాడుము" ఈ ప్రార్ధనచేసి (గంటనేవు కనిపెట్టవలెను) కనిపెట్టి, కరపత్రములు పంచినయెడల పట్టణము అంతా మారును. ఒరియాలో, హిందీలో, ఇంగ్లీషులో అయ్యగారు ఈ పత్రికలు అచ్చువేస్తున్నారు. కాశీ, జెబల్ పూర్ , ఢిల్లీ, అయ్యగారు ఈ పేపర్లు పంపుచున్నారు.


ప్రార్ధన:- దయగల తండ్రీ! ఎవరైతే ఇప్పుడు నడుము కట్టుకొని, చీరాలంతా పేపర్లు పంచిపెట్టుదామని అనుకుంటున్నారో వారికి పేపర్లు అచ్చువేయించి, పంచిపెట్టి, చెప్పేశక్తి ఇస్తావు. ప్రభువా! వారికి ఈ దీవెనను అనుగ్రహించుము. చీరాల కాపురస్తులకు దీవెన దయచేయుము. ఉదయము ఇచ్చిన వర్తమానము, ఇప్పటి వర్తమానము మా హృదయములో అచ్చువేసికొనునట్లు పిల్లలను, బంధువులను అందరిని దీవించుము ఆమేన్.


అందరు ఆత్మనుపొందుట: -


యోవేలు 2:28-29. ఇక్కడ ఆయన దృష్టి రాబోయేకాలమందు అనగా ఆయన రాక కాలమందు మనుష్యుల అందరి పక్షముగా యోవేలుద్వారా ఇచ్చిన వాగ్ధానముమీద ఉన్నది. ఇప్పుడు అది నెరవేరును.

తండ్రి కొరకు కనిపెట్టండి. అక్కడున్న ఆ మాట (యోవేలు 2:28), పేతురు మాటలలో మరింత వివరముగా ఉన్నది. "అంత్యదినముల యందు మనుష్యులందరి మీది" (అపో.కార్య. 2:17) అని పేతురు పలికెను. అది పూర్తిగా నెరవేరలేదు. ఇకముందుకు అనేకమందికి ఆత్మకుమ్మరింపు కలుగును. ఈ వాగ్ధానము మీకు అనగా, అక్కడున్నవారికి, వారికి జన్మించే పిల్లలకు, వారి సంతతివారికి; ఆ తరువాత ఇక్కడున్న వారికి అనగా దూరస్థులందరికి అని అర్ధము. యోవేలులో అది లేదు, పేతురు కాలములో ఉన్నది. ఇప్పటికి రెండు వేల సం॥లు అయినది. ఆ రోజు పేతురు దూరస్థులందరికిని అని పలుకుటద్వారా గీచినగీత నేటి(2024వ) సం॥వరకును వచ్చియున్నది. ఈ గీతలో ఎంతమందో పరిశుద్ధాత్మను కలిగియున్నారు. మనకాలములోనుండి ఆయన ఇంకా పెద్దగీత గీచి ఉన్నారు. అనగా ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. అప్పటివరకు అందరూ ఆత్మను పొంది ఈ గీతవరుసలోనికి వస్తూనేయుందురు. ఆ తరువాత ఏడేండ్ల శ్రమకాలము. అప్పుడుకూడ ఆత్మ కుమ్మరింపు జరుగును.

మనకు చాలా దగ్గర. ఆ వాగ్ధానమే యోవేలు ప్రకటించిన వాగ్ధానము. అది తండ్రి పంపిన వాగ్ధానము. ఆ వాగ్ధానమునకే పేతురు ఇప్పుడు ఈ వాగ్ధానము అని చెప్పాడు. అది ఎంత దూరము సాగియున్నదో! ఎవరైతే తప్పించుకుంటారో వారికికాదు ఆ వాగ్ధానము. ఎవరైతే కావాలని కోరుకొంటారో వారికే ఆ వాగ్ధానము. అపో. 2:39 పిలువబడిన వారికి అనగా ప్రభువైన మన దేవుడు, మనము పిలిచినవారిని పిలుస్తున్నాడు. అమెరికాలో ఒక జనము ఉన్నది. అక్కడ కొంతమందిని దేవుడు పిలుస్తున్నారు. యూరఫ్ లో, ఆసియాలో, ఆఫ్రికాలో కొంతమందిని పిలుస్తాడు. అన్ని దేశములలోనుండి అన్ని జనాంగములలో నున్న కొందరిని పిలుస్తాడు. అందరికిని ఇవ్వరు అనగా అందరికి ఆత్మ కుమ్మరింపు లేదు. అయ్యో! చీరాల జనాభాలెక్క అంతేనా (6వేలు)! రాయకుదురు జనాభా అంతేనా (3వేలు)! ఒక్కొక్క జనాభాలోనుండి, ఒక్కొక్క దేశములోనుండి, ఒక్కొక్క భాషలోనుండి కొందరికి కుమ్మరింపు ఇస్తారు. పిలువబడినవారంటే ఏర్పర్చబడినవారు.

  1. అరవము ఒక జనాంగము
  2. మళయాళము ఒక జనాంగము
  3. బంగ్లా (బెంగాలి) ఒక జనాంగము
  4. హిందీ ఒక జనాంగము
  5. తెలుగు ఒక జనాంగము
  6. ప్రతి జనాంగములోనుండి పిలిచెను. గనుక అందరిని పిలిచినట్లే.

అన్ని జనాంగములలోనుండి ప్రతినిధులు వస్తారు. ఆయన అందరిని పిలుస్తారు. అయితే, వారిలో ఏర్పర్చబడిన వారు కొందరే. పిలుపునకు వచ్చినవారెవరో వారే పిలువబడినవారు. మొదట అందరిని పిలిచారు. అందరు ఒప్పుకొనలేదు. కొందరే ఒప్పుకొనినారు. వారే పిలువబడినవారు. వారే ఆయన 12మంది శిష్యులు.


మనందరిలో ఒక్కటే ప్రశ్న ఉన్నది. "నేను నోరు నెత్తి బాదుకొన్నా ఆత్మ రావడములేదు" రాకపోవడానికి కారణము ఏదోయొక కళంకము ఉన్నది. శిష్యులు, యేసుప్రభువుతో మూడున్నర సం॥లు ట్రైనింగులో ఉన్నప్పటికిని, 10 దినములు ఉపవాసము ఉన్నారు. కళంకముంటే అత్మకుమ్మరింపు రాదు. ఆత్మ నడిపిస్తాడు. ప్రతి క్రైస్తవునిలో పరిశుద్ధాత్మ ఉన్నారు. అది కుమ్మరింపు కాదు. ఎవరైనా కుమ్మరింపు కావలిసివస్తే ప్రభువా! నాలోనున్న తప్పు చూపించుమంటే కుమ్మరింపు వస్తాది. దీనినిబట్టి అందరికి ఆ వాగ్ధానము ఇవ్వబడినది. "నాకుకూడ కుమ్మరింపు వస్తే బాగుండును" అని అంటే అదే పిలుపు. శిష్యులు ఉపవాసము చేసినారు, కనిపెట్టినారు. అలాగే మనము చేస్తే పరిశుద్ధాత్మ కుమ్మరింపు వచ్చును. "అందరికి అని ఉన్నది కాబట్టి నాకు కుమ్మరింపు వస్తుంది" అని అనవలెను.


ఉదా: ట్రైనింగ్ అయినది. ఎంత బోధించినా కొందరు పిల్లలు పాస్ అవ్వరు. అప్పుడు "నా తోటివారు పాస్ అయినారు గనుక నేనును తప్పక పాస్ అవుదును" అని తలంచవలెనేగాని నిరుత్సాహపడకూడదు. ప్రయత్నము మానకూడదు.


మనిషిలో ఏ పాపమైనా ఉంటే, కుమ్మరింపురాదు. ఈ క్రింది విధముగా ఆలోచన చేయువారికి ఆత్మకుమ్మరింపు కలుగదు.

ఆత్మను ఆర్పకుడి (1థెస్స. 5:19). గనుక ఆ పైన చెప్పబడిన ఏడు అంశములు ఇపుడు మీరు మరచిపొండి. ఆయననుగూర్చి సాక్ష్యమివ్వటానికి అపోస్తలుల కాలములో పరిశుద్ధాత్మ అవసరము. "మేము యేసుప్రభువును చూచితిమి. ఆయన చరిత్ర అంతా మాకు తెలుసు. మేము ఆయనతోకూడ ఉన్నాము. ఆయనతో బసచేసాము" అని సాక్ష్యమిచ్చుటకు కుమ్మరింపు కావల్సివచ్చినది. వారు యేసుప్రభువు చరిత్రను చూచారు, మనము విన్నాము. "వారివలె చూచాము" అని చెప్పటానికి, “సాక్ష్యమివ్వటానికి” కుమ్మరింపు కావలెను. ఎందుచేతనంటే

అయితే, ఆత్మ కుమ్మరింపుగలవారు నేను చూచాను అని రూఢీగాచెప్పుదురు (అపో. కార్య. 2:32). గనుక ప్రభువు సంగతులు రూఢిగా తెలియవలెను, నిశ్చయము తెలియవలెను. కుమ్మరింపు లేకపోతే రూఢీ తెలియదు. నిశ్చయము తెలియదు. ఇంటికి వెళ్ళి ప్రార్ధనచేయండి. కుమ్మరింపు వచ్చును. అపోస్తలులకు ఎలాగు నిశ్చయము తెలిసినది? కనిపెట్టి నిరీక్షిస్తే తెలిసినది. అది అందరికి తెలియదు. కనిపెట్టి నిరీక్షించేవారికే తెలుస్తుంది. అనిశ్చయతలేని వారును పిలువబడిన వారే కాని వారు ఏర్పాటులోలేరు, అందుకు తెలియదు.


ఉదా:- అన్నము తిన్నావా? అంటే తిన్నవారికే తెలుసు. ఆత్మశక్తినిబట్టి బోధించడము ఉండును. “మీరు బాప్టిస్టులా? మీరు పాపిస్టువాళ్ళు.” ఈలాగు ఒకరినొకరు దూషించుకొనుటనుబట్టి భేదములు వచ్చినవి. రాకడకు ఆ భేదముండదు. పరిశుద్ధాత్మ వస్తే ఆ భేదములు తీసివేయగలము. గనుక ఎంత పొందితే అంతమట్టుకు సంతుష్టిపొందవలెను. దేవుడు తన పరిశుద్ధాత్మను కొలతలేకుండా ఇస్తారు. “ఇంత ఇస్తాను, అంత ఇస్తాను” అనిలేదు. అది వాడుకుంటే ఇంక ఇవ్వరేమో అనే భయములేదు. ఆయన ఇచ్చే కుమ్మరింపుకు అంతములేదు. ఒక మొండి మహాత్మునికి ఉదయము మొదలుకొని సాయంత్రము 6గం॥ల వరకు ఉపవాస ప్రార్ధన చేయవలసి వచ్చెను. అయినను, అతను పట్టువిడువక కనిపెట్టినందున కుమ్మరింపు కలిగెను.


ఆలాగు కనిపెట్టు పట్టులోనుండి కుమ్మరింపు పొందు ధన్యత పెండ్లి కుమారుడు నేడు మీకు దయచేయునుగాక! ఆమేన్.



29.5.1955వ సం॥లో దేవదాసు అయ్యగారు చేసిన ప్రసంగము.
30.5.1955వ సం॥లో దేవదాసు అయ్యగారు చేసిన ప్రసంగము.