(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
ప్రకటన 21:8
- 1. పిరికివారు:- క్రీస్తునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు, భక్తిగా యుండుటకు భయపడుట, గొప్పవారికి భయపడి బీదవాని పక్షముగా సాక్ష్యమిచ్చుటకు భయపడుట, గొప్పవారికి భయపడి న్యాయసాక్ష్యమివ్వకుండుట, మరియు శోధన వస్తే జయించుటకు భయపడుట.
- 2. అవిశ్వాసులు:- వీరి చర్యలు అపనమ్మకమైనవి. ఏమియు లేవని పరలోకముమీద, బైబిలుమీద, దేవునిమీద, తుదకు నరకముమీద వారియందు వారికే నమ్మకముంచరు.
- 3. అసహ్యులు:- విగ్రహారాధనయొద్ద జరిగే అసహ్యకరమైన సంగతులు. ఉదా:- ఊరిలో విగ్రహారాధన యొద్ద అన్నము వండి, ఎన్నిరోజులు పండుగో అన్ని రోజులు ఆ మొదట వండిన అన్నములోనే పోసి తిందురు. దేవుని ప్రసాదమని, పాపాచారములు మొదలైనవి చేయుదురు.
- 4. నరహంతకులు:- ఎక్కువ తినుట, గతిలేక (శక్తిలేక) గంజిత్రాగుట, జబ్బువస్తే మందులు వేసికొనక చనిపోవుట, ఇతరులను చంపుట, తన్నుతాను చంపుకొనుట, కోపము, పగసాధించుట, మొదలైనవి. నరహత్యకు సమానము.
- 5. వ్యభిచారము:- భార్యభర్తల కలహములు, కొట్టుకొనుట, తిట్టకొనుట మొదలైనవి.
- 6. మాంత్రికులు:- మంత్రాలు చెప్పించుకొనుట, ఇది మోషేకాలములో ఎక్కువ జరిగెను. ఇప్పుడున్నవిగాని ఎక్కువగా పారవు, కొన్ని మాత్రము అవి ప్రభువు నామమున నశించినవి. భయపడకుము. ప్రార్థనే ఖడ్గము అవి ఎగిరిపోవును.
- 7. విగ్రహారాధన:- దేవునికంటె ఎక్కువగా తన్నుతాను ప్రేమించుకొనుట, తనవారిని ప్రేమించుకొనుట, పాలేరు యజమానినే ఎక్కువగా ఎప్పుడు మొక్కుట మొదలైనవి.
- 8. అబద్ధికులు:- పిల్లవాడు బెదిరించుట అబద్దములు చెప్పుట, కోర్టులలో అబద్ధములాడుట, కష్టాలనుబట్టి ఎరుగకపోయి మతములోనికి వచ్చారనుట, దేవునియెడల బొంకుట.
బూసోడు వచ్చాడనుట:- ఈ మాట ఎందుకు వాడుదుమనగా పూర్వము భీకరుడైన దొరగారు "బూసిదొరని" యుండెను. బూసిదొరగారు వస్తున్నారన్న మాటవినగానే పిల్లలు దాగువారు గొడవలు చేయువారు ఆపుదురు. అది ఇప్పటికి అలవాటుగానే వాడుచున్నాము. అది మారిపోయి ఇప్పుడు బూసివాడు అని పిల్లలకు చెప్పుచున్నారు. అలాగే కల్లు త్రాగడానికి వస్తుండగా ప్రభువు వర్తమానము త్వరలో వస్తున్నది. పై పాపాలలో ఒకటైన ఉన్న
- (1) మారుమనస్సు లేనట్టే
- (2) రక్షణ లేనట్టే,
- (3) మోక్షము లేనట్టే
- (4) పెండ్లికుమార్తె వరుసలేనట్టే, ప్రార్ధనయొక్క ఫలితము పొందలేము.
-
1) దట్టి = సత్యము = చెల్లుబడి:- గవర్నమెంటువారి దట్టికట్టు కుంటె గొప్ప అధికారము సూచించును. నేను క్రీస్తు
పక్షముగా
యున్నాను.
యేసుప్రభువు సైన్యాధిపతియైయున్నాడు. దట్టి
- (1) నడుమునకు బలముగానుండుటకు
- (2) జారిపోకుండుటకు
- (3) అలంకారమునకు
- (4) తిన్నగా నిలువబడుటకు
- (5) అధికారమునకు ధరింతురు. మనము సాతానుతో పోరాడవలెను గనుక దట్టి ధరించవలెను ముందుకు సాగవలెను.
- 2) మైమరవు = నీతి:- శరీరమంతటిని కప్పు వస్త్రము గనుక మైమరవు. లోపల శరీరమునకు హాని రాకుండ కాపుదలగాయున్నదే మైమరువు.
-
3) నీతి అనగా నేమి?:- ఏమిలేదో అది ధరించుకొనుట క్రీస్తుచూపులోను, క్రియలోను, వినికిడిలోను, మాటలోను, పాపములేకుండా
ఉన్నాడు.
ఇదే ఒక నీతి స్వభావము. ఆయన లోకములో సంచరించినప్పుడు ఆయన బ్రతుకంతటిలో జయము పొందినాడు (ఇదే ఒక నీతి బ్రతుకు).
ఆయన పాపములేనివాడుగా నుండెను. ఆయన పరిశుద్ధత ఆయన బ్రతుకులో మనకొరకు చూపించెను. గనుక ఇది ఒక నీతి. ఇది మనము సంపాదించిన నీతిగాదు, ఆయన మనకొరకు అనుగ్రహించిన నీతి. విశ్వాసమువల్ల మనదైనట్లు మనము ఆ నీతిని ధరించుకొనవలెను. పాదిరిగారు ఒక స్త్రీతో మాట్లాడి, పాపిని అని ఆమె అనునట్లు ప్రయత్నించుట. దొరగారు తన కుమారుని బట్టి బట్లరుకు పని ఇచ్చుట. -
4) సిద్ధమనస్సు = జోడు:- సిద్ధపడేజోడు నేను సిద్ధముగా యున్నాను. క్రీస్తు పిశాచితో జయించుట - అంటే అదే సిద్ధపడుట.
దేనివలన
మనము
సిద్ధము కాగలము?
సువార్తను బట్టి క్రీస్తు నా కొరకు నీతిని సంపాదించినాడు అనే సంతృప్తి, సమాధానము, మనకు కలిగినప్పుడు, మనము సిద్ధపడగలము (Soldier) శత్రువులు కాల్చబోవుచుండగా యుండుడి, నేను (Dress) వేసికొని వస్తానని చెప్పి (Dress) తో వచ్చి సిద్ధపడుట అప్పుడు శత్రువులు కాల్చివేసిరి. సిద్ధపడి చనిపోయినాననే సంతోషము గలదు - 5) డాలు = విశ్వాసము:- బాణము తగులకుండ దీనివలన దుష్టుని అగ్ని బాణములు ఆపుదురు. అగ్నిబాణములు = బాంబులు, ప్రతిశోధన, అగ్నిబాణమువంటిదే. దిగులు, దుడుకు, ఉడుకు, పిశాచియొక్క పనులలో ఒకపని భయపెట్టుట, ప్రభువు నన్ను తప్పిస్తాడు కాపాడుతాడనే నమ్మిక విశ్వాసము.
- 6) శిరస్త్రాణము = రక్షణ:- తలకు దెబ్బతగులకుండ యుద్ధ సిపాయిలను జాగ్రత్తగా యుండుడని హెచ్చరించుదురు. రక్షణ అనగానేమి?:- చేతిమీద పుండు ఉన్నది. అదిపోయినదని నమ్మిన తరువాత పోవును. ఆ జరిగిన వృత్తాంతమే రక్షణ. విశ్వాసము వేరు, వృత్తాంతము వేరు. రక్షణ పొందిన తరువాత పైవన్ని వాటంతటవే వచ్చును. ఒకరు పటాలములోనికి వెళ్ళుటకు పేరు వ్రాసికొన్నప్పుడు తక్కిన వస్తువులు అవి వాటంతటవే వచ్చును.
- 7) ఖడ్గము = వాక్యము:- పైవన్ని పోగొట్టుకొనకుండ ఖడ్గము. దేవుని మాటలు మనకు కనబడవు, వినబడవు. దేవుని వాక్యమును పరిశుద్ధాత్మ తండ్రి విశ్వాసులకిచ్చును.
బైబిలు:- బైబిలు సొసైటీ ఇచ్చునది. బైబిలుకాదు, పై వన్ని దూరమునుండి వచ్చువాటికి కాపుదల, శోధన దగ్గరకు వచ్చినప్పుడు కాపుదల ఖడ్గము, సైతాను క్రీస్తుని శోధించుటకు వచ్చినప్పుడు ఆయన వాక్యమనె ఖడ్గమును వాడెను.