(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

ప్రార్ధనాంశములు



ప్రార్థనాలాపన:- రోమా. 8:26 మీరు అడిగేవి అవసరమో కాదో ముందుగానే ఆలోచింపవవలెను. మరియు ఒకానొకప్పుడు ఎంత ప్రయత్నించినను ప్రార్ధనరాదు, అయినను ప్రయత్నము మానరాదు.


తన స్వకీయ కుమారుని అనుగ్రహించుటకు వెనుకదీయక మనందరికొరకు ఆయనను అప్పగించినవాడు, ఆయనతోపాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? రోమా. 8:32. కాగా నా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున, క్రీస్తుయేసునందు మహిమలో మా ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీ. 4:19; దా.కీర్త. 132లో దావీదు ఇట్లు పట్టుదల కనబరచుచున్నాడు. ఒక స్థలము చూచేవరకు, నివాస స్థలము చూచేవరకు

ప్రార్ధన చేయగోరువారలారా! అది కావలెను. ఇది కావలెనని ఆశించే వారలారా! అదిపోలేదు, ఇది పోలేదని మూలిగే వారలారా! దేవుడు ఇంకా నా ప్రార్ధన విన్నాడు కాదని, మొక్కేవారలారా! ఇంకెన్నాళ్ళు ప్రార్థించను అని చతికిలపడే వారలారా! ప్రార్థనను గూర్చిన విషయములన్నీ తెలిసికొనకుండ ప్రార్థనారంభించే వారలారా! మీరెందుకు దావీదువలె పట్టుదల కలిగి దేవుని ప్రార్థింపరు. పట్టుగలిగి ప్రార్ధింపవలెనని నీవు ప్రార్ధనలో యుంటే పట్టుకుదురును. అప్పుడేమి చేయవలెను. ఆ పట్టునిమిత్తము ప్రార్థించవలెను. పట్టులేని యెడల నీవు కోరుకొనేది నీకు అక్కరలేదన్నమాటయే, నీకు పట్టులేకపోతే దొరకనప్పుడు దేవుడు నా ప్రార్ధన వినలేదని ఎందుకందువు? మరియు లోకములో ఏ పని విషయములోనైన పట్టుదల లేకపోతే నెరవేరునా? నెరవేరదుగదా! గనుక మనోనిదానము కలిగి యుండుము. అప్పుడు పట్టుదల గలిగియుండుటకు మార్గమేర్పడును. ఏ సంగతిని గూర్చి ప్రార్ధన చేయుదుమో ఆ సంగతినిగూర్చి ప్రార్ధన సమయమంతటి యందును ఆలోచించవలయును. దానియందే దృష్టి కేంద్రీకరించవలయును.