(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
అనుదినానుసరణి
- 1) నీవు తలంచునది చేసినది దేవుని కంటికి మరుగై యుండనేరదని గ్రహించుము.
- 2) సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనిమ్ము.
- 3) ప్రతిపనికి ఒకకాలము నిర్ణయించు కొనుము.
- 4) ప్రతి పనియు దానికనుకూలకాలమందే చేయుము.
- 5) క్రమము తప్పక పనిచేయుము.
- 6) ఈ దినమున చేయవలసిన పని రేపటి వరకు మిగిల్చిపెట్టవద్దు.
- 7) ప్రతి విషయమును దీర్ఘముగా ఆలోచించిచేయుము.
- 8) ప్రతి వస్తువును దాని స్థలమందే ఉంచుము.
- 9) ప్రతిదియు క్రమమైన రీతిలోనే ఉపయోగించుము.
- 10) నీదికాని వస్తువు తృణమైనను అంటుకొనకుము.
- 11) విశ్రాంతి దినమును పరిశుద్ధపరచుటకై నిర్ధారణచేసికొమ్ము.
- 12) నిత్యము కృషిచేయువాడవైయుండుము.
- 13) కొండెగానిని ఎన్నడును నీ చెంతకు చేరనివ్వకుము.
- 14) కొండెములు చెప్పు వాడవుగా ఉండకుము,
- 15) సోమరివాని తల సైతాను నివాస గృహము.
- 16) సోమరీ! చీమలయొద్దకు వెళ్ళి బుద్ది తెచ్చుకొనుము.
- 17) వంచగాని చెంత చేరకుము,
- 18) సత్యము చెప్పవలసి వచ్చినప్పుడు ఎన్నడును జడియకుము.
- 19) ఆడినమాట తప్పేవాడవై యుండకుము.
- 20) పరిశుద్ధత అనగా లోపల శుచిగా యుండుటయే.
- 21) మంచి అదృష్టివంతునికి పాటుపడుటయే స్వంతజనం.
- 22) మంచి పుస్తకములే మన మంచి స్నేహితులు.
- 23) మంచి తలంపులు ఘనులైన స్నేహితులవంటివి.
- 24) మంచి మాటను ఎవరు చెప్పినను అనుసరింపుము,
- 25) ఒకనికొకరు ఉపకారులను, కరుణాహృదయులునైయుండుడి.
- 26) కోపమును రేపు వట్టిమాటలు వచింపకుము.
- 28) మాట్లాడుట వెండివంటిది, మాట్లాడకుండుట బంగారమువంటిది.
- 29) అందరితో మాట్లాడుము కొందరినే స్నేహించుము.
- 30) అందరితో మర్యాదగా ప్రవర్తించుము.
- 31) పగను సాధించుటకు ప్రయత్నించకుము.
- 32) ఇతరులు నీకేమి చేయవలెనని కోరుదువో అదేవారికి చేయుము.
- 33) ఇతరుల నేరములెన్నడును ఎన్నకుము.
- 34) పొరుగు మంచి ఎప్పుడును బయలుపరచుచుండుము.
- 35) నీ చెడుగునెప్పుడును తర్కించుచుండుము.
- 36) తప్పుచేసి లేదని బొంకుట పాపము కూర్చుకొనుటే.
- 37) నీ స్వంత కష్టములయందు ఓర్చుకలిగి యుండుము.
- 38) ఇతరులు కలిగించు వాటియందు సహనము కలిగియుండుము.
- 39) నీకు కలిగిన తొందరలు ఇతరులమీద పెట్టకుము.
- 40) నీకవసరములేని వస్తువు చౌకగా వచ్చినను కొనకుము.
- 41) నీవల్ల ప్రత్యుత్తరము కోరువారికి వెంటనే జవాబిమ్ము.
- 42) పవిత్ర బ్రతుకును మించిన గొప్ప ప్రసంగమింకొకటి లేదు.
- 43) వెలగల వస్త్రముకాదు గాని నీతివస్త్రము ధరించుకొనుము.
- 44) నమ్మకమైన మనుష్యుడే దేవుని పరిశుద్ధ సృష్టి.
- 45) నమ్మకమైన పనివాడు తన యజమానునికి స్నేహితుడు.
- 46) ప్రాణస్నేహితుడైన వాడు ఒక్కడున్నను చాలు.
- 47) గర్వము చలికంటె భరించరానిది.
- 48) వదురుబోతు అవమానమును పొందకపోడు.
- 49) వచ్చిన వాటికంటె వచ్చునని అనుకొను కష్టములే గొప్పవి.
- 50) విచారము, ఆతురత, అప్పులు ఆరోగ్యమునకు శత్రువులు.
- 51) బ్రతుకుటకు తినుముగాని తినుటకు బ్రతకవద్దు.
- 52) తప్పుచేయని వారు ఎవరును లేరు, జ్ఞాని చేసినతప్పు మరలచేయడు.
- 53) ఆదాయము కంటె అధికముగా ఖర్చుచేయువాడు దరిద్రుడే.
- 54) ఇతరులకు నీ దుఃఖము దాచి సంతోషమునే బయలుపరచుము.
- 55) కత్తి మెడను వంచగలదు గాని హృదయమును వంచలేదు.
- 56) హృదయమును వంచ గలిగినది హృదయమే.
- 57) నీ సంపాదనలో పదియవవంతు దేవునిదని మరువకుము.
- 58) అభ్యుదయము దైవకాలమని మరువవద్దు.
- 59) దేవునియొద్దనుండి గొప్ప సంగతులను కనిపెట్టుము.
- 60) దేవునికొరకు గొప్ప సంగతులను చేయుటకు ప్రయత్నించుము.
- 61) జ్ఞానార్జితానుభవము కంటె విశ్వాసార్జితానుభవము గొప్పది.
- 62) నీవు పెండ్లికుమార్తె వరుసలోనున్నావా?
- 63) నీవు వధువువైయున్నావా?
- 64) నీవు వధువు సంఘములో నున్నావా?
శ్లోకం
శ్రీసభా వధూవరయానమః
శ్రీ ద్వితియాగ మనథామః
శ్రీ తేజోమయ గమన నామః
ఉపవాస అన్వయ వాక్యములు
1సమూ. 31:13;
2దిన. 20:3;
ఎజ్రా. 8:21-23;
నెహెమ్యా. 8:1;
ఎస్తేరు 4:16;
యెషయా 53:3-5;
యిర్మి
36:9;
దాని. 9:3;
యోవేలు 1:14; 2:13-15;
యోనా 3:5;
జెఖర్యా 7:5; 8:29;
మత్త. 4:2
అపో॥కార్య. 13:3; 27:9.
షరా:- ఉదర, శరీర, శిరో, పాద, వస్త్ర, స్థాన, మనో శుద్దులు కలిగియుండవలెను.