ఉపవాస ప్రార్ధన దీక్ష
Index
(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
విశ్వాస ప్రార్థనయొక్క లక్షణములు
-
(1) విశ్వాస ప్రార్థన - మనుష్యునికి శాశ్వత జీవఫల మిచ్చును కీర్తన 1:2,3,
-
(2) విశ్వాస ప్రార్ధన - మనుష్యుని ఫలింపజేయును.
కీర్తన 2:8,
-
(3) విశ్వాస ప్రార్థన - మనుష్యుని పరమపురికి చేర్చు నావవంటిది. ఆది. 6:9,10
-
(4) విశ్వాస ప్రార్ధన - మనుష్యునికి
పాలుతేనెలకంటె అధికబలమిచ్చును. దాని. 1:8-21,
-
(5) విశ్వాస ప్రార్థన - మనుష్యుని క్రీస్తుకు నిజ స్నేహితునిగా జేయును ఆది. 18:23-33,
-
(6) విశ్వాస ప్రార్థన - స్తెఫనువలె దీనత్వము గలవానిగా చేయును. కార్య. 7:57-60,
-
(7) విశ్వాస ప్రార్ధన - తప్పక ప్రతి
జవాబునిచ్చును (పౌలు) కార్య. 18:9,10,
-
(8) విశ్వాస ప్రార్థన - ప్రపంచమందున్న శక్తులన్నిటికంటె మిక్కిలి బలమైనది. కార్య. 9:40,41
-
(9) విశ్వాస ప్రార్ధన - లోకాధికారులకు భయమును, ఆశ్చర్యమును కలిగించును. కార్య. 5:19,20,
-
(10) విశ్వాస ప్రార్థన - మనుష్యునికి
దుఃఖములో సంతోషము కలిగించును. కార్య. 16:23,25,
-
(11) విశ్వాస ప్రార్ధన - ఇహలోకాధికారుల పొరబాటులను దిద్దుటకు ధైర్యమునిచ్చును.
1రాజులు 21:17-24
-
(12) విశ్వాస ప్రార్ధన - జనాంగముల నెదిరించుటకు శక్తినిచ్చును 1రాజులు 18:36-39,
-
(13) విశ్వాస ప్రార్థనయే శరీర
సంబంధమైన ఆహారము నిచ్చుటకుకూడా శక్తిగలది. 1రాజులు 17:15,16,
-
(14) విశ్వానప్రార్థనయే మనుష్యునికి నిజ పశ్చాత్తాపమును
మారుమనస్సును కలుగజేయును. లూకా. 22:60-62,
-
(15) విశ్వాస ప్రార్థన - ప్రపంచ శ్రమలను ఎడబాపుటకు అమోఘమైన సాధనమైనది. ఆది. 39:1-6,
-
(16) విశ్వాస ప్రార్ధన - మనుష్యుని భక్తులయొద్దకు నడిపించును. ఆది. 20:1-8,
-
(17) విశ్వాస ప్రార్ధన - ప్రజల దయ, అధికారుల దయ,
దేవుని దయ సంపాదించుకొనుటకు ముఖ్యసాధనమైయున్నది. దాని. 2:46-49,
-
(18) విశ్వాస ప్రార్ధన - సత్ యుద్ధముచేయు
యుద్దోపకరణమైయున్నది.
దాని. 3:16-18,
-
(19) విశ్వాస ప్రార్ధనలు చేయుచోట్ల సైతాను ప్రచారములుకూడా చేయు చున్నాడు. ఆది. 39:7-20,
-
(20) విశ్వాస ప్రార్ధన సలుపని హృదయము
పెద్దపులులుండెడి గుహయును, మిడి నాగులుండెడి పుట్టయునై యున్నది.
-
(21) విశ్వాన ప్రార్థన మనుష్యుని పరలోకమునకు
చేర్చెడు
నిచ్చెన. ప్రక. 4:1-13,
-
(22) విశ్వాస ప్రార్ధనయే నరహత్య మొదలగు పాపము నుండి పరిశుద్ధతకై మరలు వారికి పునాదియైయున్నది. దాని.
3:28,29,
-
(23) అనుభవమైనచో మన ప్రభువు నేర్పించిన ప్రార్ధనయే పరిశుద్దులుండు పరమపురికి ప్రవేశ పెట్టు రాజమార్గము. మత్త.
6:10-15.