(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
క్రైస్తవేతరులు పరిశుద్ధ గ్రంథములోనుండి మొదట చదువవలసినవి
ఆదికాండము 1-3, 6-9, 37-50 అధ్యాయములు;
నిర్గమకాండము 1-20 అధ్యాయములు;
లేవికాండము 26 అధా॥; సంఖ్యాకాండము 22-24 అధ్యా
యెహోషువ 1-4అధ్యా॥;
న్యాయాధిపతులు 13-16అధ్యా॥;
రూతు 1-4అధ్యా;
1సమూ. 1-6,9, 10, 16-18అధ్యా॥;
2సమూ. 22అధ్యా॥;
1రాజు. 2,3, 5-10, 17 అధ్యా॥;
2రాజు. 1-8, 13, 19,20 అధ్యా॥;
ఎజ్రా. 5 అధ్యా॥;
నెహెమ్యా 1,2 అధ్యా॥;
ఎస్తేరు 1-10; వరకు;
యోబు 1,2,42 అధ్యా॥;
కీర్తనలు 1,8,19,22,23,24,95,96,103, 119,121, 136, 150అధ్యా॥;
సామెతలు 1-12,13, 14, 29, 30, 31 అధ్యా;
ప్రసంగి 1-12 వరకు;
యెష. 1,2, 6,32,38,53, 55,66 అధ్యా॥;
యిర్మి 1,3 అధ్యా॥;
యెహె. 1,2, 35-39 అధ్యా॥;
దాని. 1-12;
యోవేలు 1,2 అధ్యా॥;
యోనా 1-4అధ్యా;
మీకా 7 అధ్యా॥;
హబక్కూకు 3;
హగ్గయి 1,2 అధ్యా॥;
జెకర్యా 14 అధ్యా॥;
మలాకీ 1-4 అధ్యా॥.
మత్తయి, మార్కు లూకా, యోహాను, అపోస్తలుల కార్యములు
రోమా. 8-12 అధ్యా;
1కొరింథి. 13-15 అధ్యా॥;
2కొరింధి. 8,9,10,12 అధ్యా॥;
గలతీ. 5,6 అధ్యా॥;
ఎఫెసీ 1-6;
ఫిలిప్పీ 4 అధ్యా॥;
1థెస్స. 1-6 అధ్యా॥;
2థెస్స. 1,2అధ్యా॥
1తిమోతి 4 అధ్యా॥;
2తిమో. 2 అధ్యా॥;
తీతు ౩ అధ్యా॥;
హెబ్రీ. 11,12,13 అధ్యా॥;
యాకోబు 1-5 అధ్యా॥;
1పేతురు 4వ అధ్యా॥;
2పేతురు 3వ అధ్యా;
1యోహాను 1- 5 అధ్యా॥;
యూదా 1వ అధ్యా॥;
ప్రకటన 1-22 అధ్యా! వరకు.
- 1) ఓ క్షమాపణ కర్తవైన తండ్రీ! నేను అన్నిటికంటెను, అందరికంటెను, ఎక్కువగా నిన్నే ప్రేమించి, నా మొదటి ప్రేమ నీకిచ్చునట్లు నా స్వభావమును మార్చుము. ప్రభువా! నేను లోకములో నున్న వస్తువులకైనను, జీవరాసులకైనను, మానవుల కైనను, సైతానుకైనను భయపడక నేను ఎల్లప్పుడు నీకు భయపడే కృప దయచేయుము.
- 2) ఓ ప్రభువా! నేను నీ నామమును వృధాచేయకుండా కాపాడి నీ నామమును గౌరవించి, మహిమపర్చు బ్రతుకు నాకనుగ్రహించుము. ప్రభువా! నేను బైబిలు చదువుటయందును, ప్రార్ధించుటయందును, కీర్తనలు పాడుటయందును, గౌరవ బుద్ధితోను, భక్తితోను చేయగల కృప నాకనుగ్రహించుము.
- 3) ఓ ప్రభువా! ఆరాధన దినమును గౌరవించవలసినదని నీవు సెలవిచ్చినావు. ఆ దినముననే అనేకులు విందులు చేసికొనుచు లేనిపోని గొడవలు మాట్లాడుచున్నారు. ఊళ్ళు వెళ్ళుచున్నారు. బట్టలు కుట్టుచున్నారు. ఇల్లు అలుకుచున్నారు. నామకార్ధముగా ప్రార్థించుచున్నారు. పాటలు పాడుచున్నారు. ఆదివారమంటే తక్కిన రోజులుగానే భావించుచున్నారు. ఎంతోమంది పాదుర్లు తమ ఇచ్చ నెరవేర్చుకొనే ప్రసంగాలు చేయుచున్నారు. ప్రభువా! అట్టివారిని క్షమించుము. కృప దయచేయుము వారికి వర్తమానము దయచేయుము.
- 4) ఓ ప్రభువా! తల్లిదండ్రులను, తన్నేవారు, దూషించేవారు, గౌరవించనివారు, సంపాదన ఎత్తుకొనిపోవువారు కలరు. అలాగే రాజులను, కలెక్టరులను పంచాయితీవారిని ఎదిరించి బహుఠీవిగా నడుతురు. అంతా వ్యతిరేకము. చాలామంది పంతుళ్ళను, మిషనరీ వారిని, రైల్వేవారిని, రైతులను ఎదిరింతురు. వారినందరిని క్షమించుము. దేవుని తరువాత గొప్ప తల్లిదండ్రులు, తరువాత అధికారులు అని గ్రహించునట్లు చేయుచు, నిన్నుబట్టి వినయ విధేయతలు ప్రేమ గౌరవము చూపించి, నేను దీర్ఘాయుష్మంతుడుగ వర్దిల్లునట్లు చేయుము.
- 5) ఓ ప్రభువా! కొందరు పగవుండి భార్యమీద అనుమానపడి ఆమె తల నరుకుట, స్వంత బంధువులలో విరోధముండి చంపుట, కోప నరహంతకులు, అసూయ, నరహంతకులు, స్వహత్య చేసికొనేవారు, జబ్బులు సహించలేక, భర్తపోరుపడలేక, అప్పులవారి బాధపడలేక నూతిలోనో, నదిలోనో పడి నరవాత్య చేసికొనుచున్నారు. ప్రభువా! నేను నా దుర్గుణములద్వారా నిన్నైనను నీ స్వరూపమందు సృష్టించిన మానవునినైనను మనస్సు నొప్పించి, ఆయాసపర్చక, నీకును, లోకమునకును, ఇష్టముగా బ్రతికే బ్రతుకు నాకనుగ్రహించుము. నా శరీరము నీకు ఆలయము గనుక నేను దానిని శుద్దీకరించు విషయములోను పోషించు విషయములోను తగిన జాగ్రత్త తీసుకొనే జ్ఞాపకశక్తి దయచేయుము.
- 6) నీ దృష్టిలో ఎంతమంది యౌవనులు తమ జీవిత చరిత్రను పాడు చేసుకొంటున్నారు. ఇది గొప్ప పాపము, నీచమైన పాపము, ఘోరపాపము. ఎంతోమంది వ్యాధులు తెచ్చుకొని చనిపోవుచున్నారు. వివాహములు గల కుటుంబములు నాశనమగు చున్నవి. తల్లిదండ్రుల వ్యాధులు పిల్లలకు అంటుకొనుచున్నవి. ఇట్టి వారందరికి నీ కృప దయచేయుము. ఓ ప్రభువా! నేను నీవు జతపర్చిన భార్యభర్తలకు మధ్యగావెళ్ళి వారి ఐక్యతను విదదీయకుండను, నీ చిత్తప్రకారము నూతనముగా జతవరచబడే వారిని విడదీయకుండను నన్ను జాగ్రత్తగా కాపాడుము.
- 7) ఓ దయగల తండ్రీ! నీవు నా ప్రార్ధనలు వినుచున్నావు అందుకు స్తోత్రములు. దొంగలు అనేకులు ప్రయాణికులను బాధపెట్టుచున్నారు. స్త్రీల నగలు దోచుకుంటున్నారు. చేలలోపంట దొంగిలించుచున్నారు. తోటలలో ఫలములు దొంగిలించుచున్నారు. అందరు నిద్రపోవు చుండగా కన్నములు వేయుచున్నారు. సంతలలో బజారులలో తక్కువ ఖరీదుగల వాటిని ఎక్కువ లాభమునకు అమ్ముచున్నారు. అట్టివారి నిమిత్తము, వర్తకులందరి నిమిత్తము ప్రార్ధించుచున్నాను. ఓ తండ్రీ! నేను నాదికాని ఇతరులదగు దేనినైనను టక్కరితనము వల్లనైనను, కుయుక్తివల్లనైనను దొంగిలించకుండ నీవు నాకిచ్చిన సమస్తమును, సమయమును జాగ్రత్తగా వాడుకొనగల నేర్పు నాకు అనుగ్రహించుము.
- 8) ఓ ప్రభువా! పరువు నష్టముతెచ్చేవారు, ఒకరి మంచి పేరు చెడగొట్టేవారు, రహస్య సంగతులు బయటికి తెచ్చువారు, ఒకరిమీద లేనిపోని చెడ్డనేరములు గొప్పవారు బుజువు పరచిన మాట్లాడక యూరకుండుటయు, నా ఇరుగు పొరుగువారిమీద అబద్ధసాక్ష్యము పలుకకుండ, నా నోటిని భద్రపరచుము. ఓ ప్రభువా! నేను సత్యముగా బ్రతుకుచు సత్యము కొరకే పోరాడుచు చివరకు సత్యముకొరకు హతసాక్షులైన వారి జీవితము నాకు దయచేయుము.
- 9) దురాశ దుఃఖమునకు చేటు. పొరుగువానిదేమియు ఆశింపకూడదు. మాకున్న దానితోనే తృప్తిపొందవలయును. కొందరు ఏదిచూస్తే అది అడుగుదురు. మనస్సులోనైన ఆశించుదురు. ఇట్టి వాటికి నన్ను దూరపరచుము. నీవు నాకు అనుగ్రహించి పవిత్రమైన మనస్ఫాక్షిని నా అపవిత్ర ప్రవర్తనద్వారా అపవిత్రపరచి నీవు ఏర్పరచిన ఉద్దేశ్యమునకు వ్యతిరిక్తముగా నడచుచుండగా, నీవు క్షమించి శుద్ధిచేసి క్రమపరచి నీకు లోబడి గౌరవపరచు స్థితి నా మనస్సాక్షికి దయచేయుము. ఓ తండ్రీ! నేను ప్రార్ధించవలసిన విషయములు అనేకములున్నవి. పసిపిల్లలు, తమ తల్లులు, బయటకు వెళ్ళితే పొలములోనికి వెళ్ళితే వారు మంచము మీదనుండి, ఊయలలోనుండి పడే అపాయములకు లోనగుదురు. కొందరు మరణించుదురు. పసిపిల్లలను యౌవనులను వృద్ధులను కాపాడుము. వారు చెడ్డ అలవాటులలో పడకుండా విద్యాబుద్దులను నేర్చుకొనునట్లు నీ కృప దయచేయుము. కూలీలను కాపాడుము. మిల్లులలో పనిచేయువారిని, బొగ్గుగనులలో పనిచేయువారిని, యుద్ధములో పనిచేయువారిని, మేడలు, గోపురములు, సత్రములు కట్టేవారిని, బిక్షకులను, కుమ్మరిపని చేయువారిని అడవిలో పనిచేయువారిని, పుస్తకములు వ్రాయువారిని, అచ్చు ఆఫీసులో పనిచేయువారిని, వైద్యశాలలో పనిచేయువారిని, ఖార్కాణాలలో పనిచేయువారిని దీవించుము. దేశమునేలేవారు, ధర్మపాలనచేసే కృప దయచేయుము. వర్షము వలన తడియువారు, భూకంపముల వలన మరణించువారు, అడవి జంతువుల వలన చచ్చేవారు, అట్టి హానినుండి వారిని తప్పించుము. మనుష్యులందరికి సువార్త ప్రకటింపజేయుము. సువార్త అన్ని భాషలలోను అందరికి వ్యాపింపజేయుమని యేసు ప్రభువుద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్.
- 1) నిన్ను నీవు ఆనుకొనకుము,
- 2) బంధువులను ఆనుకొనకుము,
- 3) నీ స్నేహితులను ఆనుకొనకుము,
- 4) నీ ఇరుగు పొరుగువారిని ఆనుకొనకుము,
- 5) నీపేట వారిని ఆనుకొనకుము,
- 6) నీ ఊరువారిని ఆనుకొనకుము,
- 7) నీ అధికారులను ఆనుకొనకుము, రాజ్యాధికారులు (సంఘాధికారులు),
- 8) నీ స్వంత మిషనును ఆనుకొనకుము (గ్రూపుమీద),
- 9) నీ మతమును ఆనుకొనకుము,
- 10) చందాలమీద ఆనుకొనకుము,
- 11) ప్రజాభిమానముమీద ఆనుకొనకుము
- 12) వృత్తిమీద ఆనుకొనకుము,
- 13) శరీరబలముమీద ఆనుకొనకుము
- 14) జ్ఞానముమీద ఆనుకొనకుము.
షరా:- సహోదరుడా! ఈ 14 విషయములమీద ఆనుకొనకుండుటకు దేవుని నమ్ముటకు కావలసిన విశ్వాస బలమును అనుగ్రహించి, శరీరాత్మల విషయములో తదితరులకంటే శ్రేష్టమైన వాడవుగా జీవించుచు దేవుని మహిమ చూడగలుగుటకు ఆయన తన కృప నీ కనుగ్రహించునుగాక! నీతోను పరిశుద్ధాత్మతోను ఏక దేవుడుగా పాలించుచున్న నీ కుమారుని పరిముఖముగా మా ప్రార్ధనలు ఆలకించుము. మా ప్రార్ధనలన్నియు నెరవేరే నిమిత్తమై నీ ప్రియకుమారుడును, మా ప్రాణరక్షకుడును, మిక్కిలి త్వరలో రానైయున్న వరునిద్వారా ఆలకించుము.
ప్రార్ధన:-- 1) యేసుక్రీస్తు ప్రభువా! నీ సంగతులు నాకు బోధపరచుము,
- 2) నా పాపములు క్షమించుము,
- ౩) పాపములో పదకుండాచేయుము,
- 4) నా వ్యాధి మాన్పుము
- 5) కష్టములు తొలగించుము,
- 6) అన్నవస్త్రాదులకు ఇబ్బందిలేకుండ చేయుము,
- 7) అన్నిటిలో నాకు తోడై యుండుము,
- 8) నన్ను నా వారిని దీవించుము,
- 9) పిశాచి కార్యములను లయము చేయుము,
- 10) అందరికి నీ రక్షణమార్గము బయలుపర్చుము,
- 11) నీ పనులు వృద్ధిచేయుము,
- 12) నీ రెండవరాకడకు నన్ను సిద్ధపర్చుము,
- 13) నన్ను మోక్షములోనికి చేర్చుము, ఓ ప్రభువా! నీకనేక నమస్కారములు ఆమేన్.