(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

"మీరీలాగు ప్రార్ధన చేయండి" - మత్త. 6:9

దినమునకు 7 పర్యాయములు స్తుతులు



దైవలక్షణముల స్తుతి



షరా:- నాకు శరీరమును అనుగ్రహించిన దేవా! నీకు స్తుతులు. ఈ శరీరము పాప శరీరమైనందున దీనిని పరిశుద్ధ శరీరముగ మార్చుచున్నావు. తుదకు నాకు మహిమ శరీరము ఇచ్చి నీయొద్దకు తీసికొని వెళ్ళుదువు గనుక నీకు మహిమ, ఘనత కీర్తి ఆర్భాటము, సంకీర్తనము కలుగునుగాక! దేవా! నీ దివ్యలక్షణములు దేవదూతలకు, మనుష్యులకు ఇచ్చినావు గనుక నీకు ఆర్భాటము కలుగునుగాక! మరియు సృష్టిలోని వస్తువులు పరీక్షించిన నీ సుగుణములు అందులోనున్నవి గనుక నీకు మంగళస్తోత్రములు ఆమేన్.