(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
సువిశేషథోరణి
- 1. సువిశేషము:- అనగా శుభవార్త. దేవుడు మనుష్యుల విషయమై మంచి కార్యములు చేయువాడు అను వార్తలు శుభవార్తలు. దేవుడు అవతార పురుషుడైన క్రీస్తురాక పూర్వము భక్తులయొద్దకు యేదో ఒక రీతిగా వచ్చుచుండిన రాకడలు ఎన్నోకలవు. నరునికొరకు దేవుడు చేయుకార్యము నరుడు అంగీకరింపనప్పుడు ఆయన రానట్లే. అంగీకరించినప్పుడు ఆయన వచ్చినట్లు.
- 2. దేవుడు యేసుక్రీస్తుగా నరుడైవచ్చిన రాకడ బహిరంగమైన రాకడ. ఇదే మొదటిరాకడ. అదివరకు వచ్చిన రాకడలు మర్మముగా వచ్చిన రాకడలు క్రీస్తుప్రభువు భూమిమీద ఉన్నప్పుడు నరులు దేవుని స్పష్టముగా చూడగలిగిరి. “నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు” అని క్రీస్తు పలికిన మాట చూడగా దేవుడు వచ్చినాడనియు, ఆయనను నరులు చూచినారనియు తెలియుచున్నది యోహాను 14:9.
- 3. “ఇద్దరు ముగ్గురు నా నామమున యెక్కడ కూడియుందురో అక్కడ నేను వారిమధ్య ఉందునని చెప్పిన మాట చూడగా, నరులు ఎన్నిమార్లు కూడు కొందురో అన్నిమార్లు ఆయన వచ్చునని స్పష్టమగుచున్నది మత్తయి 18:20.
- 4. ఆయన మేఘాసీనుడైవచ్చి భక్తులను ప్రాణముతోనే ఆకర్షించుకొని వెళ్ళును ఇదే రెండవరాకడ. ఈ రాకడకు సూచనలు మెండుగా జరుగుచున్నందున సమీపము గనుక సిద్ధపడుదుము.
దీనిలో దేవుని వాక్యమున్నది గనుక పాడుకానీయకండి. నరుడు స్వతంత్రుడు గనుక యెవరి మతము వారు ప్రకటింతురు. బేధాభిప్రాయము ఉన్నప్పుడు కలహింపరాదు. ఏ మతములోనున్న ఏ మనుష్యునైనను ద్వేషింపరాదు. మన భూనివాసులను మనము ద్వేషించుట మనలను ద్వేషించుటయగును గదా! తగునా!