(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
స్వస్థిశాల
వారు నమ్ముచున్నాము ప్రభువా! అని ఆయనతో చెప్పిరి. అప్పుడాయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరువబడెను మత్తయి 9:29.
గుంటూరు సమీపమందలి కాకానివద్డ నున్న శ్రీ రావుసాహెబ్
జె. రాజారావుగారి తోటలో స్వస్థిశాల యొకటి గలదు. అక్కడకు ప్రతి సోమవారము బైబిలుమిషను పాదుర్లు నలుగురు వచ్చి, సమావేశమైన
రోగులకు
బోధింతురు. క్రీస్తు ప్రభువు రోగులకు బీదలకు, భూతపీడితులకు, బిడ్డలు లేనివారికి, చిక్కులలో నున్నవారికి, రక్షణమార్గము
తెలియనివారికి, పశ్వాదులకు మేలు చేయుచున్నాడు. క్రైస్తవులలోను యితరులలోను కొందరికి ప్రత్యక్షమై మాట్లాడుచున్నారు. ఈ అద్భుత
క్రియలు చూచుటకు అప్పుడప్పుడు కొంతమంది వచ్చుచున్నారు. అవస్థలు కలిగి స్వస్థిశాలకు వచ్చుచున్నవారు ప్రస్తుతము వారమునకు
15,000 పెక్కుమంది. బోధించుట బోధకులపని, నమ్ముట ప్రజలపని, బాగుచేయుట క్రీస్తు ప్రభువు పని.
యేసుక్రీస్తు ప్రభువు దేవుడును,
మనుష్యుడును గనుక అన్ని విధముల సహాయము చేయగలడు. తుదకు మోక్షమునకు చేర్చగలడు. ఆయనను ఆశ్రయించి ప్రార్థించండి ఏదోయొక
పాపమున్నందువల్లనో, నమ్మిక తక్కువైనందువల్లనో యితర పూజలు మానకయున్నందువలననో కొందరు బాగుపడుటలేదు. ఔషదములు నిషేధములుకావు
ప్రార్థించి వేసికొనవచ్చును. యేసుక్రీస్తు వారి శక్తియందు విశ్వాసముంచిన మందులులేకుండా బాగుకాగలరని మా అనుభవము. బాగైనయెడల
సంతోషమే. యీ శాలపని నేను స్వయముగా 6-6-1955 తేదీన జూచితిని.