(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
రక్షణ మహా సంకల్పన
దేవుడు మానవులకు ఏవిసిద్ధపరచునో, యిప్పుడేవి సిద్ధపరచుచున్నాడో యిక ముందునకేవి సిద్ధపరచనైయున్నాడో యీ మూడు విషయములు రక్షణ మహాసంకల్పనలో ఇమిడియున్నవి. వీటికి బైబిలుమిషను ఆధారము కొన్నింటిని పొందుపర్చడమైనది.
- 1. దేవలోకము:- ఇది మన ఊహకందనంతపైగా నున్నది. పరిశుద్ధ లక్షణములు గల దేవునికి సింహాసనమిక్కడ గలదు. ఆయన సర్వవ్యాప్తియై పరిపాలించుచున్నాడు ఆయనే మన తండ్రియునై యున్నాడు. యెషయా 6.
- 2. దేవదూతల లోకము:- వీరున్ను దేవునివలె పరిశుద్ధులును, మానవాకారములు గలిగి పక్షులవలె రెక్కలు గలిగినవారు, మన స్నేహితులు, కావలి బంటులు దేవుని సన్నిధిలో నున్నవారు యోబు 38:7.
- 3. మోక్షలోకము:- ఈ భూమిమీద భక్తిగా జీవించి రక్షింపబడినవారు; యీ స్థలమునకు వచ్చి, శాశ్వతానందభరితులుగా దేవుని ముఖమును జూచుచుందురు. భక్తిలో అంతస్తులున్నట్లు యిక్కడకూడ అంతస్తులుండును (1కొరింథి 15:23).
- 4. వాయుమండలలోకము:- దేవుని నెదిరించిన దేవదూత సాతానుగామారి, తన సహదూతలతో ఇక్కడకు వచ్చివేయవలసి వచ్చెను అతనికే సైతానని పేరు (ఎఫెసీ 6:12).
- 5. నరలోకము:- (ఆది 1:1) దేవుడు ఆదియందు పవిత్రములైన ఆకాశమును, భూమిని వాటిలోని సమస్తమును పరిశుద్ధులగు ఆదిదంపతులను కలుగజేసెను, గాని వారు సాతాను మాయమాటలు విని పాపములో పడిపోయిరి. అప్పుడు దేవుడు వారిని రక్షకుని పంపెదనను వాగ్ధానమిచ్చెను. దేవుడు కనబడనందున కొందరు ఉపకార సృష్టిని పూజించిరి. కొద్దిమందియున్న దేవునే పూజించిరి. జనములు పెరుగగా పాపమును పెరిగెను. వాగ్ధాన పురుషుడు జన్మించుటకు దేవుడు యూదుల జనాంగము నేర్పుర్చుకొని వారికే మొదట సమస్త ధర్మములను బోధించెను. నాలుగువేల యేండ్లు గడచిపోగా దేవుడే నరుడుగా కన్యయొక్క గర్భమందు జన్మించి, లోకైక రక్షకుడను అర్ధమిచ్చు యేసుక్రీస్తు అను దేవలోక నామముతో ప్రత్యక్షమాయెను, ఆయన మన నిమిత్తమై చేయవలసిన సమస్త కార్యములు ముప్పది మూడున్నర సంవత్సరములలో ముగించి, సర్వలోక పాపపరిహారార్థమై యజ్ఞమై మరణమును జయించి ఆరోహణమాయెను, ఆయన మిక్కిలి త్వరలో వచ్చి సంఘమును ప్రాణముతో తీసికొనివెళ్ళిన వెంటనే, శేషించిన వారిని యేడేండ్లు సైతానుయొక్క ప్రతినిధియగు అంతెక్రీస్తు అను బిరుదుగల విరోధి బాధించును. అప్పుడు నూటనలుబది నాలువేలమంది యూదులును, కోటానుకోట్ల యితరులును దేవుని తట్టు తిరుగుదురు. పిమ్మట మోక్ష లోకములోనుండి క్రీస్తు వచ్చి పాలెస్తీనాలోని హర్మగెద్దోను అను స్థలమందు యుద్ధముచేసి, విరోధిని అతని సహకారులను నరకములో పడవేసి, సాతానును వెయ్యేండ్లు పాతాళపు చెరలో బంధించును. అప్పుడు క్రీస్తును తన భక్తులును యీలోకమునకే వచ్చి శాంతిపరిపాలన చేయుదురు. పిదప సాతానును, దయ్యములును దుష్టులును నుండరు గనుక విషపు పురుగులును, అపవిత్రత స్థలములును, వ్యాధులును, తరుచు మరణములును, యెట్టి విధములైన బాధలును ఉండవుగాని పాపనైజముగలవారుందురు. వారికే పరలోక వాస్తవ్యులు బోధ చేయుదురు. భక్తులకును, భక్తిహీనులకును వెయ్యేండ్ల పాలనలో మహాసౌఖ్యము గలిగియుండును. పరిపాలనలో బోధ విన్నవారు ఏమి తీర్మానించుకొనిరో దానిని చెప్పించుటకు క్రీస్తు సింహాసనము వేసికొని తీర్పు విధించును. పిమ్మట సాతానుకు విడుదలకాగా అతడుగ్రుడై దేవునితో పోట్లాడి, ఓడిపోయి నరకములో పడద్రోయబడును. నమ్మనివారుకూడ త్రోయబడుదురు. ఎవ్వరైనను నరకములోనికి వెళ్ళుటకు కారణము వారి వారి పావమేగాని దోవుడు కాడు. నరక కాలము కడవరి తీర్పు కాలము, ఇది రాకముందు నరుల మార్పుకొరకు యెన్నోమార్లు గడువు లియ్యబడును. తుదకు మన భూలోకము మోక్షలోకమువంటిదగును. తిట్టుట ద్వేషించుట, పగ వహించుట, దోచుకొనుట, అబద్ధములాడుట, కొట్టుట, చంపుట యీ మొదలగు పాపములు చేయు వానికి పాపములే భూలోక నరకములు, పాపమువలన కలుగు వ్యాధులు, యిబ్బందులు, చిక్కులు, నానావిధములైన కష్టములు, మరణములు యీ మొదలగునవి కూడ భూలోక నరకములే. ఈ మూడు విధములైన నరకములను తప్పించువాడు యేసుక్రీస్తుప్రభువే అని మా స్వానుభవ విశ్వాసము. ఈ మా ఉపకార వ్యాసమునుబట్టి మీకును స్వానుభవ విశ్వాసము కలుగునుగాక!
-
6. పాతాళ లోకము:-
- (1) హేడెస్ :- 1సమూ. 2:6. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులోనుండి రప్పించుచుండు వాడాయనే 1పేతురు 4:6 మృతులు శరీర విషయములో మానవరీత్యా తీర్పు పొందునట్లును ఆత్మ విషయములో దేవునిబట్టి జీవించునట్లును వారికికూడ సువార్త ప్రకటింపబడెను. దా.కీర్త. 139:8 నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడ ఉన్నావు. లోకములో మారినవారిక్కడ కడవరితీర్పు వరకుందురు; మారుటకిది మంచి స్థలము.
- (2) చెర:- ప్రక 20:2 అతడు ఆది సర్పమును అనగా అపవాదియు, సాతానును అను ఆ ఘటసర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వానిని బంధించి పాతాళములో పడవేసెను ఇది సైతాను బందించబడిన చెర.
-
(3) నరకము:- ప్రక. 20:11-15 మరియు ధవళమైన మహా సింహాసనమును, దానియందు ఆసీనుడైయున్న యొకనిని చూచితిని.
భూమ్యాకాళములు
ఆయన
సముఖమునుండి పారిపోయెను. వాటికి నిలువచోటు కనబడకపోయెను. మరియు గొప్పవారైమి కొద్దివారేమి మృతులైన వారందరు ఆ సింహాసనము
యెదుట
నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ
గ్రంథముములయందు
వ్రాయబడియున్న వాటినిబట్టి తమక్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలోనున్న మృతులను అప్పగించెను.
మరణమును
మృతుల
లోకమును వాటి వశముననున్న మృతుల నప్పగించెను. వారిలో ప్రతివాడు తనక్రియల చొప్పున తీర్పుపొందెను. మరణమును మృతుల
లోకమునకు
అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని యెడల వాడు
అగ్నిగుండములో పడవేయబడెను.
క్రీస్తు విరోధి, అతని యనుచరులు, పిశాచములు సైతాను, నమ్మనివారు తుదకు వెళ్ళవలసిన స్థలము.