(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
బైబిలు విషయములు
రక్షణ పద్యములు
(1).
ఏదిపాపమొ యది యొత్తిచూపించుచు
గద్దించి నేర్పించు
గ్రంథమేది
పాపాత్ములకు మోక్షపధ స్పష్టముంగా
కనపర్చి నడ్పించు గ్రంథమేది
వెయ్యిభాషల నచ్చువేయింపబడినవార్త
గా ప్రచారముచేయు గ్రంథమేది
దేవుండు నొక్కడే దేవావతారుని
కథయు నొకటే యను గ్రంథమేది
క్రైస్తవతమతమేదైవ సం । కల్పనంబు
యేసుక్రీస్తె మానవులకు । నిహపరాల
యందు సర్వమైయున్నాడు । అనుచు దెల్పు
గ్రంథరాజంబు బైబిలు । గ్రంథమొకటె
(2).
అచ్చుపుట్టినయప్డె అచ్చుబడిన తొలి
గ్రంథమై వెడలిన గ్రంథమేది
వేదాంతపండితుల్ విసుగకుండను యక్ష
రములు లెక్కించిన గ్రంథమేది
వయసు చాలనియట్టి వ్యాఖ్యాన పుస్తకాల్
కల్పించుకొన్నట్టి గ్రంథమేది
అన్నిపదాలకు అన్వయపదాలు
వ్రాయబడినయట్టి గ్రంథమేది
అన్ని గొప్పతనాలకు । అమరలగలది
అన్ని ప్రార్ధనములకు । ఔననునది అన్ని
ఖండనలకు నిలిచి । ఆగగలది
బైబిలొక్కటే గాక ఏ । వ్రాతగలదు