(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
దైవసన్నిధి - సమాజము
దా.కీర్తన 16:11 “నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు”.
అన్ని దేశముల క్షేమార్ధమైన సర్వాంశములు ఆలోచించుటకై కొన్ని యేండ్ల క్రిందట సర్వదేశ ప్రతినిధులు స్విడ్జర్ లాండ్ దేశములో నొక సమాజముగా కూడుకొనిరి దానిపేరు “లీగాఫ్ నేషన్స్”. అలాగే యిప్పుడు అన్నిమతముల ప్రతినిధులు యెక్కడనో నొకచోట దైవసన్నిధి సమాజముగా కూడుకొనుట భూగోళమంతటికి శ్రేయోస్కరమైన యుపకారమైయుండును. వారి పని యిట్లుండుట మంచిది.
- 1. అన్ని దేశముల కష్టములను, అక్కరలును ఒక పుస్తకములో వ్రాసి దైవప్రార్ధన చేయవలెను.
- 2. అన్ని మతములవారును తమతమ సిద్ధాంతములను, మిగుల క్లుప్తముగా వ్రాసి దైవప్రార్ధన చేయవలెను (వాదములు పనికిరావు).
- 3. ఆ ప్రార్ధన యీవిధముగా నుండవచ్చును, దేవా! మా మా సిద్ధాంతముల ప్రశ్నలకు స్పష్టమైన జవాబులు వినిపించుము.
షరా:- దేవుడు వినిపించినవి వ్రాసి కాలక్రమేణా అన్ని దేశముల వారికి పత్రికల మూలముగా తెలియపరుపవలెను. ఈ పనికి ఎవరు పూనుకొందురో!