(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

ముగింపు



చదువరులారా!

ఇదంతయు చదువుకొని మీరేమి తీర్మానము చేసికొనగలరో మీలోని జ్ఞానశక్తిని, మనస్సాక్షిని సద్వినియోగ పరచుకొన్నయెడల మీ తీర్మానము నిష్మళంకమైనదిగా నుండును. ఈ చిన్న పుస్తకములో నున్న సంగతి పూర్తిగా తెలిసికొనుటకై బైబిలు చదవండి మీరెప్పుడెప్పుడు బైబిలు చదువుదురో అప్పుడు క్రీస్తుప్రభువు మీ చెంతనేయుండును, మిమ్మును దీవించును.

అర్ధముకాని సంగతుల విషయమై ఆంధోళన పడవద్దు. అర్ధమగు నంగతులను చూచి ఆనందించండి, అనుసరించగలవి అనుసరించండి. మీరు ఆనందించునప్పుడెల్ల దేవుని స్తుతించండి. మీలో ఉన్న ప్రతి మంచిని చూచి దేవుడానందించును. ఉభయులకును ఆనందమే.

దైవసహవాసము గలవారెంత ధన్యులు! తండ్రి సన్నిధియందుండుట పిల్లలకెంత సంతోషము! జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడిచేతిలో నిత్యము సుఖములు కలవు అని ఒక భక్తుడు చెప్పుచున్నాడు దా.కీర్తనలు 16:11.


షరా:- ఈ పత్రిక శాంతముగాను సాంతముగాను చదివి దైవ ప్రార్ధన చేయువారికి నిత్యానందాశీస్సు కలుగును గాక!