(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
సూక్ష్మ ప్రార్థన
- 1. దేవా! నాకు కనబడుము
- 2. అందరికిని కనబడుము
- 3. దేవా! నాతో మాటలాడుము
- 4. అందరితోను మాటలాడుము.
- 1) దినమునకొకసారియైనను యీ ప్రార్థన చేసి చూడండి మీకు యెంతమేలు కలుగునునో తెలిసికొనగలరు.
- 2) ఈ ప్రార్ధన ఒక కార్డుమీదగాని, ఒక కాగితము మీదగాని వ్రాసియైనను అచ్చువేయించి యైనను మీకు వీలున్నప్పుడు యెవరికైనను పంపిచూడండి.
- 3) ఎవరికైనను నేర్పిచూడండి. ఈ పనులు చేయునప్పుడెల్ల మీకు దీవెన కలుగునని నమ్మండి. ఒక మంచి పనికి మేలు కలుగకుండునా? మీరు యెన్ని పర్యాయములు యీ పనులు చేసినయెడల యెవరు వద్దనగలరు?
- (1) మీకిష్టమైన యెడల చివర మీ పేరును మీ పైవిలాసమును వేయండి.
- (2) తారీఖుకూడ వేయండి.
షరా:- దేవా! అని పిలుచుట కిష్టములేనివారు కొత్త విషయములు బయలుపడునని నిశ్శబ్దముగా ధ్యానములో ఉండుట మంచిది. ఒకరొక పనిచేయనైయున్నప్పుడు బాగుగా ఆలోచించి, ఆలోచించి ఆ పని మొదలుబెట్టుదురుగదా! ఈ ఆలోచన ధ్యానకార్యము వంటిది. మరలు, మందులు, ఉపాయములు ధ్యానమువల్ల కలిగినవే గదా! మన దేశ బుషులకు ధ్యానాభ్యాసము కలదు.
షరా:- నరులు స్వతంత్రులు యెవరి తలంపు వారు చెప్పుకొనవచ్చును బేధమున్నప్పుడు కలహింపరాదు.