(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
క్రైస్తవమత విషయములు
1.
అన్న వస్త్రాదులు ఆశ్రయ స్థానాలు
ఏర్పాటు చేసిన దే మతంబు
మనుజులన్ రక్షించు మనుజులన్ మార్చుట
కేర్పాటుచేసిన దే మతంబు
దేశ దేశాలలో దేవ వాక్యము చాట
నేర్పాటు చేసిన దే మతంబు
విద్య నాగరికత వివిధ వృత్తులు నేర్ప
నేర్పాటుచేసిన దే మతంబు
అంటుమా ప్రయత్నించెవై । ద్యంబు చేయు
శాలలను బెట్టె బైబిలు । సర్వభాష
లకును మార్చి క్రైస్తవమత । మొకటె యట్టి
మంచి పనిచేయునది దైవ । మతముగాదె
2.
కులభేద మెంచక కులము లన్నిటిలోని
మనుజులన్ దరిజేర్చు మతమదేది
పరమతస్తుల బిల్చు పరమ మతంబిదె
మళ్ళుడంచును జెప్పుమతమదేది
క్రైస్తవేతర మత గ్రంధముల్ ప్రచురించి
మతపరీక్షకు చెట్టు మతమదేది
క్రైస్తవులకు లోట్లు కలిగినన్
క్రీస్తుని మహిమ వెల్లడి చేయ మతమదేది
ఆదివార మారాధన । ఆచరించు
వ్రతము గల్గిన వాక్యము విను । మతమదేది
అన్ని దేషలకై వచ్చి । యున్న మతము
మహిని చుట్టిన క్రైస్తవ । మతముగాదె.
3.
ధన ధాన్యములవల్ల దారిద్యము గతించు
గాని మోక్షము మీకు గలుగబోదు
విద్యవల్లను తెల్వియుద్యోగము లభించు
గాని మోక్షము మీకు గలుగబోదు
గొప్ప కులమువల్ల గొప్పతనము వచ్చు
గాని మోక్షము మీకు గలుగబోదు
మంచి క్రియవల్ల మంచి పేరు గలుగు
గాని మోక్షము మీకు గలుగబోదు
మనకు మోక్షంబు నిడుటకే । మహికివచ్చి
యేసుక్రీస్తయిన దేవుండు । చేసినట్టి
పనులు నమ్మిన మోక్షము । మనకు దొరుకు
సుళువుగా మోక్షముంజేరు । సూత్రమిదియే
క్రైస్తవదేశముల యత్నముల వలననే గదా! లోకమునకిపుడు ఉపకార కార్యములు కలుగుచున్నవి. రైలుబండులు, బస్సులు, సైకిళ్లు, విమానములు, స్టీమర్లు, టెలిగ్రాములు, వైర్ లెస్ , టెలిఫోన్ , బ్రాడ్ కాస్టు, ఫోటోగ్రాఫ్ , సినిమా, ఏక్స్ రే అనగా శరీర లోపలస్థితి చూపునది. మ్యాజిక్ లాంతరు: దూరమున నున్న వారిని కనబర్చునట్టి టెలివిజన్, గడియారములు, ఎలక్ట్రిసిటి, గ్యాసులైట్స్ , అద్దములు వివధములగు యంత్రములు, రూపాయల కాగితములు మొదలైన నానావిధ పరికరములు మరణా యంత్రములు యెంతగానో ప్రబలెను.
1952లో సెప్టెంబర్ నెల ఇండియన్ క్రిస్టియన్ పత్రికలో ప్రచురించిన ప్రపంచ జనసంఖ్యలోని ముఖ్య మతస్థుల జనసంఖ్య:-
- 1) యూదులు:- ఒక కోటి ఇరువది లక్షలు
- 2) హిందువులు:- ఇరువదియైదు కోట్ల అరువది లక్షలు.
- 3) బౌద్దులు:- పదిహేను కోట్లు
- 4) క్రైస్తవులు:- డెబ్బది నాలుగుకోట్ల యిరువది లక్షలు
- 5) మహమ్మదీయులు: - ముప్పది ఒక కోటి అరువదిలక్షలు.
దీనినిబట్టి యు, బైబిలు 1135 భాషలలో అచ్చువేయించుటను బట్టియు, యితర పరోపకార కార్యములను బట్టియు చూడగా క్రైస్తవులు తమ మతవ్యాప్తి నిమిత్తమై బహు ప్రయాస పడుచున్నట్టు కనబడుచున్నది ఇది శ్లాఘనీయము.