(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

2. సన్నిధి సహవాస పాఠము



నిర్గమ. 33:14 మార్కు 9:2-7 1యోహాను. 1:7.

“సన్నిధియందె అన్నియు పరి-ష్కారమగును తెలిసికొనుము = సన్నిధిలో నీవున్నయెడల - సన్నిధి నీలో ఉండును నుమ్మీ” ॥ఏకాంత॥


ప్రార్ధన: త్రియేకుడవైన తండ్రీ! సకల సంపదలకు నిలయమైన నీ సన్నిధి సహవాస భాగ్యము అందుకొనుటకు ఈ దిన వర్తమాన పాఠము నీ బిడ్డలమైన మాకు వినిపించుము, నేర్పించుమని ఈ మా ప్రార్ధన నీ కుమారుని పరిముఖముచూచి ఆలకించుమని వేడుకొనుచున్నాము తండ్రీ! ఆమేన్.

ఆ సన్నిధికూటము ఎందుకనగా భూలోక విశ్వానులతోను, పరలోక విశ్వానులతోను, పరిశుద్దులతోను, దేవదూతలతోను సహవాసము కలిగి ఉండేటందుకు మనకు......

ఈ 4 ఉండవలయును. ప్రకటన 2:1-7; 3:3. పునరుక్తి కూటములో పై 4 వరుసలమీద ఆధారపడి మీటింగు జరుపవలెను. ఇదే పునరుక్తి కూటము.


(ఎ) సన్నిధి షరతులు:-

షరా:- సన్నిధి కూటము నిర్లక్ష్యము చేసినందువల్ల ఇన్ని మిషనులు ఏర్పడినవి. బేధాభిప్రాయములు, వాగ్వివాదములు లేచినవి.


షరా:- అనగా పైన చెప్పబడిన 1టిని, 5ను క్రమముగా చేసిన యెడల శ్రమలను పాపములను, సైతానును జయింపగలము.


(బి) సన్నిధి కూటము జరుపు విధము:-

  1. మనో నిదానము కుదరకపోయినను సరే సన్నిధి మానకూడదు.
  2. ఇష్టము లేక పోయినను సరే సన్నిధి మానకూడదు.
  3. సమయము లేకపోయినను సరే సన్నిధి మానకూడదు.
  4. సరియైన స్థలము కుదరక పోయినను సరే సన్నిధి మానకూడదు.
  5. పాపస్థితి యున్నను సరే సన్నిధి మానకూడదు.
  6. జబ్బుగా ఉన్నను సరే సన్నిధి మానకూడదు.
  7. ఇబ్బందిగా యున్నను సరే సన్నిధి మానకూడదు.
  8. అవమానముల పాలగుచున్నను సరే సన్నిధి మానకూడదు.
  9. భయముతో నిండుకొన్నను సరే సన్నిధి మానకూడదు.
  10. మతి చాంచల్యము ఉన్నను సరే సన్నిధి మానకూడదు.
  11. ఏదియు సమకూడకపోయినను సరే సన్నిధి మానకూడదు.
  12. ఒంటరిగానైనను సరే, దేవుడు జవాబు ఇచ్చినా సరే, ఇవ్వకపోయినా సరే, సన్నిధి మానకూడదు.
  13. దేవుడు నిన్ను గద్దించినా సరే, కూటము జరిపి తీరవలెను.

షరా:- సన్నిధిలోనికి వెళ్లిన తరువాత ఈ పైనున్న లోపములు వాటంతట అవే బైటికి వెళ్ళిపోవును, సరిపోవును.

ఉదా:- చీకటిలో దీపము ఎందుకు? అనేవారుండరు. దీపము వెలిగించి చీకటి గదిలో పెట్టి చూడు ఏమి జరుగునో! ఎలుకలు ఒక ప్రక్కనుండి పారిపోవును ఒక దరినుండి జెర్రిలు పారిపోవును, ఇంకేమి ఉండునో అవన్నియు పారిపోవును. పారిపొండి అని నీవు చెప్పితివా? నేను చెప్పితినా? ఆ వెలుగునకు అవే పారిపోవును. అలాగే సన్నిధి కూటములలోనికి వెళ్ళితే ఉండలేనివి, ఉండకూడనివి పారిపోవును.


(సి) సన్నిధి కూటముయొక్క దర్శన వ్యక్తులు:-

  1. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు వచ్చెదరు.
  2. దేవదూతలు వచ్చెదరు
  3. పరలోక పరిశుద్ధులు వచ్చెదరు
  4. భూలోక పరిశుద్ధులు వచ్చెదరు.
  5. భూలోక అవిశ్వాసులు వచ్చెదరు.
  6. దయ్యము, సాతాను వచ్చును.
  7. పరలోకము చూడవచ్చును.
  8. భూలోకము చూడవచ్చును.
  9. పాతాళ లోకము చూడవచ్చును.
  10. గతించిపోయినవి చూడవచ్చును.
  11. ఇప్పుడు జరుగుచున్నవి చూడవచ్చును.
  12. ఇకముందుకు జరుగనైయున్నవి చూడవచ్చును.

షరా:- ఇట్టి ధన్యతలు మనుష్యులు పోగొట్టుకొను చున్నారు. ఏ మతస్థులైననుసరే, ఈ ధ్యానకూటము చేయవచ్చును. ప్రతి కూటములో ఎవరు మట్టుకువారు వారు కనిపెట్టండి.


(డి) ప్రార్ధనాకాల స్థానాదులు:-

మీకు చాలా బాధ కలిగినప్పుడు ఏలాగు ప్రార్ధిస్తారో ఆలాగున జాలి హృదయముతో ప్రభువు నా ప్రార్ధన కొట్టివేయడు, తప్పక నెరవేర్చును అని పట్టు ప్రార్ధన చేయవలెను. మనుష్యులమీద, వస్తువులమీద, జీవసాధనముమీద ఆనుకొంటే లాభములేదు. కేవలము దేవునిమీదనే ఆనుకొనవలయును. మేము పోలీసువారికి (క్రైస్తవ సంఘమును, బైబిలు మిషనును, మిషను పనులకు ఆటంకము కలిగించువారిని గురించి) తెలియజేయము తెలియజేస్తే మరింత శ్రమ వస్తుంది, గనుక మేము శ్రమలైనా ఓర్చుకొంటామని మన విశ్వానులు అంటున్నారు. పరిశుద్ధాత్మకు ఆదరణకర్త అని పేరుయున్నది, గనుక ఆ దైవాత్మయే వారిని ఆదరించవలెను. ఆ శ్రమలలోనికి మీరు వెళ్లితే అగ్నిలోనికి వెళ్లినట్లే కొంతమంది చంపబడితే చంపబడవచ్చునుకూడా అని వారు అన్నారుకదా మిమ్ములను ఏమి చేయుదుమో ఇప్పుడు చెప్పము అనుటలో అదే అర్ధము. అదే ప్రభువా! వారి దుష్ట ప్రయత్నములను ఆపుచేయుము అనే ప్రార్ధన ఎప్పుడో ఆపుచేయుటకాదు ఇప్పుడే ఆపుచేయుమని ప్రార్ధన చేయండి.


మీరు చేసే ప్రార్థనకు జవాబు మీకే తెలియునట్లును ఆ శ్రమలను ఆపుచేయుము, మాపుచేయుమని ప్రార్థించండి. ఇప్పుడు ఈ ప్రార్ధన చేయగా మంచి తలంపులుగాని, దర్శనముగాని వస్తే చెప్పండి ఇప్పటికీ శ్రమలతో ఉన్న వారిని తెలిసికొని ప్రార్థిస్తే ఇంకా ప్రేరేపణ కలుగగలదు.


(ఎఫ్) సన్నిధి కూటము రూల్స్ :-


కాలక్రమేణ మోషేగారు వేసినటువంటి గుడారము కావలెను, ఆలాగున గుడారము (సన్నిధి గది) ఏర్పరచుకొని సన్నిధి సహవాసము క్రమముగా జరిగించవలెను. ఆలాగున క్రమముగా జరిగించనియెడల హాని రావచ్చును, గనుక సన్నిధి కూటమునకు అందరిని రానీయకూడదు. ఆ కూటమునకు మెంబర్లును, ప్రభువే తీసికొని రావలెను గాని మనము బలవంతముగా తీసికొని వచ్చుటకు ప్రయత్నము చేయకూడదు. సన్నిధి కూటమునకు తాత్మాలిక మనుష్యులను రానీయకూడదు, ఎవరిని పిలువకూడదు. ప్రార్ధన మెట్ల ప్రకారము మనలను మనము నలుగగొట్టవలెను. సన్నిధి కూటమునకు ఆలస్యముగా రాకూడదు. రోజునకు ఒక ప్రశ్నవేసి ఆమేన్ అనిచెప్పి సన్నిధిలో మౌనముగా ఉండవలెను. సన్నిధిలో ఇద్దరే ఉంటే వారి జత ప్రభువుకూడ వచ్చి మోకరించును. ముగ్గురు ఉంటే నాల్గవ వానిగా వచ్చి ఆయన మోకరించును. ఆయన ఇక్కడ మోకరించినగాని, ప్రభువు పరమందు ఉన్న తన తండ్రియొద్దనే ఉండును. అనునిత్యము దైవసన్నిధిని చేయువారు.

ఇల్లు వాకిలి సామానులు-యెల్ల శుద్ధిగ నుండవలెను = ఉల్లాసముతో దేవుని సన్నిధి-నూరక యుండవలెను విసుగక ఏకాంత॥

ప్రార్ధన:- దయానిధివైన మా పరలోకపు తండ్రి! మాకును అట్టి సన్నిధి సహవాస భాగ్యము అనుగ్రహించుము ఆమేన్.