(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

10. సన్నిధి వన్నె చక్రము



సన్నిధి చార్టు ముగింపు

sannidhi vanne

ఇక్కడకు వచ్చువారు బేతేలు గృహము వరండా ఎక్కకముందే మాట్లాడుట మారతారు, తరువాత మౌనముగా నుంటారు ఎలాగంటే ఇంగ్లీషు గుడిలోని వారివలె మౌనముగా ఉందురు.


A, B, C విటమిన్స్ వృద్ధి అగుటకు ఆయా విధములైన పదార్థములు భుజించుటవల్ల వాటిపని కనబడును. ఒకే పదార్థములో అన్ని విటమిన్స్ వృద్ది పొందే పదార్థము లేకపోవచ్చును. ఆలాగే వాక్య పఠన ఒక విటమిన్ , ప్రార్ధన ఒక విటమిన్ , కానుక, పరిచర్య, సేవ, స్తుతి, ఇవన్నీ ఒక్కొక్క విటమిన్ పనిచేయును. అన్ని విటమిన్స్ ను వృద్ధిచేసే ఒకే పదార్ధములేదు. అయితే కనిపెట్టుట, సన్నిధి సంపద, దైవసన్నిధి అనే పేర్లుగల ఈ పదార్ధములో అన్ని విటిన్స్ గలవు. సన్నిధి సంపదలో 13 విటమిన్స్ ను ఎత్తి చూపించిరి. మనకు తెలియనివి అర్దము కానివి, మన జ్ఞానమునకు అందనివి, వివరించుటకు వీలుకాని విటమిన్స్ అన్నిటని వృద్ధిపొందించునది ఈ దైవసన్నిధి.
మనో విచారములో 99వ
“ఎన్ని ప్రార్ధనలు చేసిన నా - యెదుట ఊరకె కనిపెట్టనిచో = ఎన్నడును సత్యము సంతుష్టి - ఎరుగవు, కనిపెట్టుము”.


షరా:- నియమిత టైమునకు దైవసన్నిధిలోనికి వెళ్లుట పాప పతనమునకు ముందు దేవునితో ఆదాము, హవ్వలు చేసిన వాసము వంటిది. అనగా క్రమము గలిగిన పరిశుద్ధ మహిమ వాసము.


షరా:- నియమిత కాలము మీరి దైవసన్నిధిలోనికి వెళ్ళుట ఆదాము, హవ్వలు పాపపతనము తర్వాత దేవునితో వారికిగల సహవాసము వంటిది.

షరా:- 1. నీవు పై వాక్యములన్ని జ్ఞాపకము చేసికొనుచు మహాధైెర్యముతో సన్నిధి గదిలోనికి ఒక కఠినాత్ముని గురించి ప్రార్థించేటందుకు వెళ్లేటప్పుడు బైలుదేరే స్థలమునకును, సన్నిధిగది స్టలమునకును మధ్యను అనేక ప్రశ్నలు మిడతల దండువలె రయముగా కమ్మును. ఆ ప్రశ్నలేమనగా

అటువంటి అతడు ఇంకేమి మారును? ఇంకేమి మారగలడు? మరియొక సంగతి; మరియొక సంగతినిగూర్చి ప్రార్ధన పెట్టుకొని మరుసటి దినమందు వారియొద్దకు వెళ్లి సన్నిధి చార్టు చదివి, వినిపించి అయ్యా! మీ కొరకు మేము నిన్న ప్రార్థించినాము అని చెప్పి ఇదంతయు చదివి వినిపించితే లేక దీని ప్రతి చేతులోపెట్టి ఈవేళ మీరు మిమ్మును గురించి ప్రార్థించుకొనండి అని చెప్పితే మీరు నాకు ప్రార్ధించమని చెప్పేవారు? ఇంకేమి ప్రార్ధన చేస్తారు? ఇట్టి ప్రశ్నలు మనలోనికి రాగా సన్నిధికి వెళ్లడము ఆగిపోవును. వెళ్లినా ప్రార్ధన వీలైనా ఆగిపోవును గనుక మెళకువగా ఉండుడి.


చార్టుయొక్క సారాంశము:- దేవుడు నీ ప్రార్ధన ఆలకిస్తాడు అనేది.


షరా:- సన్నిధి గదిలోనుండి బైటికి వచ్చేటప్పుడు 1సమూ. 1:17 జ్ఞాపకము తెచ్చకొనండి. అదేదనగా

షరా:- జవాబులు లేని నెరవేర్పులుకూడా బైబిలులో ఉన్నవి.

ఈ పై ఉదాహరణల్లో - జవాబులేని నెరవేర్పులు గుర్తించగలము.