(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
సన్నిధి పండుగ పాట
పల్లవి:
సన్నిధి పండుగకు - స్తోత్ర ఆహ్వానంబులు
అన్ని కార్యములకు - ఆత్మ తండ్రి చిత్తము
హల్లెలూయ - హల్లెలూయ ఆనంద సన్నిధి
ఎల్లవారికి కలిగియున్న మహా ఆనందము॥
1. మూడు వత్సరములు - సన్నిధిలో నిల్చెను
అలుముకొన్న ఆపదల్ - ఆత్మతండ్రి ఆపెను
హల్లెలూయ - హల్లెలూయ ॥సన్నిధి॥
2. నిప్పువంటి సన్నిధి - తుప్పులురాల్పు సన్నిధి
తప్పులున్న దిద్దుచు - మెప్పునిచ్చు సన్నిధి
హల్లెలూయ - హల్లెలూయ ॥సన్నిధి॥
3. గురువులైన దేవదాసు - దారిచూపె సన్నిధి
ఘోరశ్రమలైనను - భారమనిపించదు
హల్లెలూయ - హల్లెలూయ ॥సన్నిధి॥
4. పరలోక భక్తులు - నరలోక భక్తులు
అరమరలేకను - ఆనందించె సన్నిధి
హల్లెలూయ - హల్లెలూయ ॥సన్నిధి॥