(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

4. విద్యలేని విధ్య - దైవ ధ్యాన విధ్య



రాజు. 18:42-44; యోహా. 1:43-50; 1థెస్స. 4 :15-17.

ప్రభువా! మాకు ధ్యానశక్తిని, ధ్యానాశక్తిని దయచేయుము. ఆమేన్.


“నన్ను నమ్మి విద్య నేర్చుకొన్న యెడల పండితులే = అన్నిటిలో నీ అపజయము జయ - మగును జయమును జయమగును ॥ మనో ॥


6-1-50 రాత్రి ఝామున ఏమి చేయకుండనుండగ తండ్రి, కుమార, పరిశుద్దాత్మవైపు చూస్తూ ఉండగా ఒక దూత వచ్చి పరమండలమునుండి “హల్లెలూయా,” “హల్లెలూయా” “హల్లెలూయా” అనెను. ఇది ఒక క్రొత్త పద్ధతి.


ఇదియొక విధమైన

కనిపెట్టుట అనగా ఏదోయొకదాని కొరకు కనిపెట్టుట ఉదా: క్రిస్మస్ దినమున పిల్లలు బహుమతుల కొరకు కనిపెట్టుట. అదికాక వేరొకటి. మనస్సులో స్తుతి ఉన్నప్పుడు పెదవులతో గాకుండ, ధ్యానములో ఉన్నప్పుడు

ఉదా: - పెరుగులో కవ్వముపెట్టి వెన్న వచ్చు వరకు చిలికినట్లు చేయవలెను. దానికొక పేరు అది వట్టి “స్తోత్రము” దానియందు మరేవిధమైన అంశముండదు తండ్రి అంశమే స్తోత్రము. గట్టి స్తోత్రమనగా దేవుని దగ్గరనుండి బహుమానము వచ్చువరకు చేయుట. వట్టి స్తోత్రముకాదు కాని మనము అన్నిటికి మించినది ప్రభువుకు మహిమ తెచ్చునట్లు స్తుతి చేయవలెను.


ప్రార్ధనా సమాజములో:-

స్తుతి ఎక్కడిది? లోపలినుండి హృదయమునుండి వచ్చినది గాని నిన్నరాత్రి వచ్చిన స్తుతి (అయ్యగారికి) పరమండలమునుండి అనగా పైనుండి వచ్చినది. నా స్తుతికి మారుస్తుతి వచ్చెను పరలోకమునుండి వచ్చెను. “దేవస్తోత్రగానముల్ పై దివ్య స్థలములో - దేవమారు గానముల్..” అదే ఇప్పుడు వచ్చినది.


“మారుగానమెప్పుడు” ఉండును? క్రిస్మస్ నాడు (దేవదూతలు) వారికెందుకు స్తుతి? మనకొరకు రక్షకుడుగదా! అయితే ఒక పాపి మారు మనస్సు పొందిన పరలోకములో సంతోషము. అదే క్రిస్మసు దినమున దూతల మారుస్తుతి మనము భూలోకములో “హల్లెలూయా” అనగా పరలోకములో కూడా మారుస్తుతి జరుగును. పాత నిబంధనలోనివారు చాలా ధ్యానము చేసిరి. మోషే దివారాత్రులు చేసెను. సుందర్ సింగ్ గారుకూడా (40 దినములు ఉపవాసము) అట్లే చేసెను, కానికొంత కాలమునకు శరీరమునకు శక్తి తగ్గెను. ఇప్పుడు ఆయన ఆత్మకు కోపమువచ్చినా, తన నివాసము (శరీరము) కృశించగా నేనెట్లునుందునని ఆయన ఆత్మ పరదైసునకు పోయెను. అక్కడ అనేక రకములైన (దర్శనములు) చూచెను. అనేక భాషలుగల మనుష్యులను చూచెను. సాధు సుందర్ సింగు దేశ సువార్త ప్రచారములో ఒక కుష్టరోగిని చూచెను, ఆ కుష్టరోగి ఆసుపత్రిలో బ్రతికి ఉన్నాడా? చనిపోయినాడో? లేడో! సుందరునికి తెలియదు కాని సుందరుడు అతనిని అక్కడ పరదైసులో కనుగొని, ఆసుపత్రిలోకంటే సరిగానున్నట్లు కనుగొనెను. ప్రస్తుత కాలమందు ఉన్న మనము దైవధ్యానమందు ఉండిన ఇప్పుడు మనముకూడా (40 దినములు) ఆ కష్టములేకుండా దైవ దర్శనము పొందవచ్చును. మోషే ఏలియాలు వరపుత్రులు గనుక 40 దినములు ఉండిరి. అయితే క్రీస్తు ప్రభువు మానవ అవతారమైపోయెను గనుక అంత కష్టము అక్కరలేదు. ఈ కాలములో ఉన్న మనము కొంచెము ధ్యానములో ఉన్న చాలును, కనుక ప్రభువు కనబడును, మాట్లాడును. దేవునియందు విశ్వసించు మానవునికి భూలోకములో మిక్కిలి భాగ్యవంతమైన సమయము ధ్యానకూటము.


దేవా! పాత నిబంధనలో నీ బిడ్డలకు ధ్యానవిద్య నేర్పినావు. అన్ని స్థలములలో కొండలలో, గుహలలో అన్నిచోట్ల నేర్పినావు సంఘములో కూడా కొందరికి నేర్పినావు. అందరు నేర్చుకొనలేదు, అందరు గాన విద్య నేర్చుకొనలేదు. అలాగే ధ్యానవిద్య లేదు అందరు ప్రార్థించగలరు, గాని ధ్యానించలేరు గాని కొందరికి ధ్యానవిద్య నేర్పించినావు. మా కాలములో Andrew Murray కు నేర్పించినావని తన పుస్తకములలో కలదు. ఈ ధ్యాన విద్యను సంఘము అంతా ఒప్పుకొనుటలేదు, కాని కొందరు ఒప్పుకొని నేర్చుకొని అనుభవించుచున్నారు. ఎవరైనా తీరుబడిగా నీ సన్నిధిలో కూర్చుంటే నీవే నేర్పించెదవు. కానీ ఎవరికి తీరుబడిలేదు కాని కొందరికి ధ్యాన విద్యపై సందేహాలు, అనుమానాలు, కష్టాలు, చిక్కులు గలవు.


బాలయోగి ధ్యానములో ఉన్నాడు. అతడు హిందువుడు అయినను మనకు (క్రైస్తవులకు) పాఠము నేర్పుచున్నాడు. కవులు వారికి నేర్పవలసినది వారే మాకు నేర్పుచున్నారు. బైబిలులోని ఈ విధ్యను క్రైస్తవులంతా నేర్చుకొనవలయును. లోకమంతా చాటించవలెను కాని, ఎవరు చేస్తారు? నీవు ఇప్పుడే భూలోకమునకు (రెండవ రాకడలో) వస్తే పరలోకమునకు ఎవరు రాగలరు? నీవు కొంచెము ఆలస్యము చేస్తే ఈ పని జరుగును. అప్పుడు వారుకూడ అక్కడకు వస్తారు.


బైబిలులో ఎక్కువగా మోషే సన్నిదధిలో ఉండి ధర్మశాస్తమంతా Dictation చేసెను. కుర్రవాడు పంతులుగారిని అడిగినట్టు మోషేగారు దేవునిని అడిగి వ్రాసికొనెను. దేవుడు తన్నుతాను తగ్గించుకొని చెప్పెను. దేవుడు పరలోకమునుండి సీనాయి కొండపైకి, అక్కడనుండి గుడారమునకు రాగా అక్కడ ఉన్న దేవుని సన్నిధికి మోషే వెళ్ళి నేర్చుకొనెను. ఆ సమయములో ఇతరులు ఎవరు వెళ్ళినా భస్మమైపోవుదురు. అంతమట్టుకు దేవుడు దిగివచ్చెను. అది చాలక క్రొత్త నిబంధన కాలములో (యేసుక్రీస్తు ప్రభువుగా) పశువుల తొట్టిలోనికి దిగివచ్చెను. అప్పుడు అందరమును చూడవచ్చును, ప్రక్కను కూర్చొనవచ్చును, అన్నీ చెప్పుకొనవచ్చును. ప్రవక్తయైన ఏలియాగారి ధ్యానకాలమున ధ్యాన విద్య ప్రయోగము ఒక్కసారేకాదు 7సార్లు జరుపగా అరచేయంతా మేఘము కనబడెను, గాన విధ్య రానంతసేపే ఏడుపు. ధ్యానవిద్య వచ్చిన తరువాత ఏడ్పు అయినా బాగుండును, ఉపయోగము ఉండును. ఆలాగే అలవాటు అయిన తరువాత పర్వాలేదు గాన ధ్యాన విద్య - విధ్యలేని విధ్య.


నతానియేలు ధ్యానము:-


“నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పెను”.


"ఈ నతానియేలుగారు ప్రభువు శిష్యుడా? 12మందిలో అతనిపేరు లేదు. అపో॥కార్య. 1:13. బర్ = కుమారుడు, తొలోమయి = తండ్రిపేరు. అనగా తోలొమయి కుమారుడు - ఇతనే నతనయేలు. ప్రభువు వలన ఎన్నిక చేయబడినవారుకాక ఆయనను వెంబడించిన శిష్యులలో ఇతడు గలడు, గనుక మర్మముగా వ్రాసెను. అందరకు తెలుసునుగదా అని లూకా తన సువార్తలో "బర్తలోమయి" అని వ్రాసెను. యోహాను వివరముగా ఉండుటకు నతానియేలు అని సంగతి వ్రాసెను.


48వ వచనమే ధ్యానము. నతానియేలు అంజూరపు చెట్టు క్రింద ధ్యానము చేయుచుండెను. ఫిలిప్పు - నజరేతువాడైన యోసేపు కుమారుడైన యేసే మెస్సియా అని నతానియేలుతో చెప్పెను. దానినిబట్టి వారు మెస్సియా కొరకు ధ్యానము చేసిరని చెప్పవచ్చును. మోషే మొదలగు ప్రవక్తలు చెప్పిరి. ఆయనే ఈయన అని, నతానియేలు మెస్సియ్యానుగూర్చి ఫిలిప్పుద్వారా వినెను. మన సంఘములోకూడా రెండవ రాకడ ధ్యాన సమయమప్పుడు అప్పటివారికి ప్రవక్తలు లేరు, ప్రవచించేవారు లేరు గనుక మెస్సియా వచ్చి తీరవలెను అని ధ్యానించెను, రాకడ గుర్తులు అన్ని అయిపోయెను గనుక వచ్చే వేళ అయిందని అనుకొనుచుండిరి.


మత్తయి. 25. ఈ అధ్యాయములో 5గురు బుద్ధికల కన్యకలు గలరు. వీరి ధ్యానములో పెండ్లికుమారుడు (ప్రభువు) ఉన్నారు. సమయము వచ్చినప్పుడు ఎదురుచూచిన వీరే ఆ విందుకు ఆయనతో వెళ్ళిపోయారు. అలాగే ప్రభువుతో ఉన్న 12మంది శిష్యులు + నతానియేలు మొదలైనవారు వీరు పెండ్లి విందుకు పోయిరి. ఆ మొదటి అద్భుతముచూచి ఓహో! ఇంకా ఎక్కువ "చేయునని వచ్చిరి. ప్రభువు నతానియేలుతో (యోహాను 1:50) అనిన మాట 50వ వచనములో ఇంకా చూస్తావన్నది నెరవేరునని సంతోషించిరి. తన సువార్త సంచార కాలములో ఈ నతానియేలు ఇండియాకు వచ్చి అక్కడ నుండి చైనాకు వెళ్ళినని చరిత్ర పేర్కొనుచున్నది. 48వ వచనములో ఉన్నప్పుడు నతానియేలు అలా ఎందుకు ఉన్నాడు? అవి పండుకోసే (యోహాను 1:48) కాలము. మేము మెస్సియ్యాను చూచితిమి అని శిష్యులు నతానియేలుతో చెప్పిరి, గనుక ఆ మెస్సియ్యానుగూర్చి నతానియేలుగారు ధ్యానములో ఉన్నాడని తెలిసికొనగలము. ఎందుచేత? దేవుడు ఆలాటివి మర్మముగా వ్రాయించెను. ఎందుకనగా దైవ మర్మములను 1. మన జ్ఞానమునుబట్టి తెలిసికొనవలెను. నతానియేలు ధ్యానమునకు జవాబు వచ్చెను. క్రియ జరిగెను, అది వృత్తాంత జవాబు. ఈ కాలములో ఉన్న మనకు ఆయన వచ్చును అనేది ప్రవచన జవాబు. వృత్తాంత జవాబు మనకు రాదు. ఎందుకనగా ప్రభువు ఇంకా రాలేదు. సమీప ప్రవచనము నెరవేరును అనే జవాబు మాత్రమే మనకు వచ్చును. ఈ విధమైన జవాబు 3 రకాలు. అవి

ఈ కథ గలిలయకు వెళ్ళు దారిలో జరిగెను యూదయలో వారు బైలుదేరి గలిలయకు వెళ్ళుచుండగా అక్కడ ఒక అంజూరపు చెట్టు గలదు. అక్కడ ధ్యానము, వారు కానా చేరునప్పటికి (యోహా. 2:1) మూడవ దినమాయెను. రాబిన్ సన్ అనే దొరగారు తనయొక్క పరిశోధనకై బైలుదేరి అంజూరపు చెట్టును చూచి అక్కడనుండి బైలుదేరి కానా చేరెను. సరిగ్గా మూడు దినములలో చేరెను. గనుక సువార్తికుల వ్రాతలు నిజమని తన వ్రాతలలో వ్రాసెను.


క్రీస్తుప్రభువు యూదయనుండి గలిలయకు పోవుచుండగా మధ్యలో నజరేతులో తన ఇంటికి వెళ్ళెను గాని తాళము వేసి ఉండెను. ఎందుకనగా తల్లి మరియ పెండ్లికి కానా వెళ్లెను, గనుక ఆయనకూడా కానాకు వెళ్ళిపోయెను. మరియమ్మ చెల్లి కూతురు పెండ్లి గనుక పెత్తనము మరియమ్మదేగదా! గనుక (యోహాను 2:3)

పొయ్యిదగ్గరకాదు, “చెట్టుక్రింద ఉన్నప్పుడు” అని ఉన్నది. గనుక ధ్యానములో ఉన్నప్పుడే అలాగు ప్రభువు చూచును మనము చూతుము. నతానియేలు ధ్యానములో ఉన్నప్పుడు

ఆలాగు మనమును చేస్తే మనకు ఆ అనుభవము కలుగును.


నతానియేలు ధ్యానములో ఉన్నప్పుడే ప్రభువు వచ్చెను. ఆలాగే ప్రభువు ఇంకా ఒక గంటకు వచ్చుననగా ఎవరికి తెలియకుండా రాకడ విశ్వాసులు తెలియని రీతిగా కూడుకొన్నప్పుడు ప్రభువు వస్తే వెళ్ళిపోదుము.


ఉదా:- జలప్రళయము వచ్చునని ప్రభువు నోవహుతో చెప్పెను. ఆ జలప్రళయము వచ్చుటకు ఇంకా రెండు దినములుండగా నోవహు కుటుంబము 8మంది ఓడ లోపలికి వెళ్ళిరి. వారితోపాటు జంతువులు, పక్షులు వచ్చెను. వాటికి ఎవరు చెప్పారు? అవి దేవుని సృష్టి గనుక ఆయనకు లోబడి వాటంతట అవే వచ్చెను. అలాగే విశ్వాసులకు రాకడ వచ్చేటప్పుడు జరుగును. దీనినే ఇంగిత జ్ఞానము అంటారు Natural Intellect.
ఉదా:- వర్షము వచ్చునప్పుడు తురాగాలు (తూనీగలు) గాలిలో ఎగురును. అదే Natural Intellect. రేపు అదే జరుగును. ఇక్కడ భూమిమీద అందరూ కలసి ఉండగా పిల్లలు, బంధువులు అని అనరు (వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి అని,) కాని రాకడలో ఎత్తబడి పైకి వెళ్ళిన తరువాత రాకడలో ఎత్తబడక శ్రమలకు విడిచిపెట్టబడిన తమ కుటుంబస్తులు కావాలి అని అందురు. ప్రభువు వీరి విజ్ఞప్తి మేరకు (ప్రకటన 19:11-16) వ్రాయబడిన కాలములోని వారు ఎవరైనా రక్షించు ప్రభువా! అని అన్నవారిని ప్రభువు తెల్లగుర్రము మీద వచ్చి వారిని రక్షించును.


ప్రార్ధన:- పరిశుద్దాత్మవైన తండ్రీ! నన్ను ప్రభువుయొక్క రాకడకు సిద్ధపర్చుము ఆమేన్.