(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
6. సన్నిధి పట్టుదల
అది. 32:24-28; యోహా. 6:37; రోమా. 8:32.
ప్రార్ధన:- సన్నిధి పట్టుగల సన్నిధి పండుగ వాస్తవ్యులారా! సన్నిధిని గురించి అనేక పర్యాయములు విన్నవారలారా మీకు సన్నిధి భాగ్యము కలుగునుగాక ఆమేన్!
ఇప్పుడు ఎవరి మనస్సులో వారు తమ తప్పిదముల గురించి దేవుని అడుగుకొనండి. (ఈ సన్నిధి పండుగకు ప్రభువు అయ్యగారికి చెప్పినట్లే - క్రొత్త కోటు - షర్టు-పంచె, కండువా - సెంటు దండ ఇచ్చిరి). సన్నిధి పండుగ అనగా “దైవసన్నిధి” పండుగ అని అర్ధము. సన్నిధిని గురించి బైబిలులో అనేక స్థలములలో నున్నది. ఏ అంశము తీసికొన్ననూ ఆ అంశమును గురించి బైబిలులో సంపూర్తిగా దొరుకును. ఈ సమయమునకు అయ్యగారు శరీర బలహీనతలో ఉన్ననూ, రెండు ప్రసంగములు చేయగలనని అనుకున్నారు గాని, ప్రభువు 4 ప్రసంగములు చేయమన్నారు.
ముమ్మరముగ బోధించిన బలవం - తమ్ముగ ప్రజలను తేగలవు = ముమ్మరముగ మేల్ చేసిన బలవంతమ్ముగ ప్రజలను తేగలవు ॥మనోవిచారము॥
- 1. ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి వచ్చిన తర్వాత ప్రయాణములో నా సన్నిధి మీతోకూడ వచ్చును నా సన్నిధి మీతో ఉండును, మీలో ఉండును. అట్లే నీ ప్రియజనులు ఎక్కడికి ప్రయాణమై వెళ్ళుదురో నా సన్నిధి వారితో వచ్చును. దేవునియొక్క సన్నిధి తన ప్రజలతో కలసి ప్రయాణము చేయును అని వాక్యములో గలదు. ఈ వాక్యముయొక్క అనుభవము చాలామందికి ఉండును. నిర్గమ. 3:14 నేను కొన్ని సంవత్సరముల క్రితము ఒక పట్టణము నుండి రాజమండ్రి వచ్చుచుండగా ఈ వాక్యము ప్రభువు చెప్పిరి. వాక్యార్ధము చెప్పిరి. అదేమనగా నేను నీ కూడా వచ్చుచున్నాను. నా సన్నిధి అంటే సన్నిధి. నేనే (ఆయనే మనతో కూడా ఉన్నాడు) గనుక మన ప్రయాణము ధైర్యముగా చేయవలెను.
- 2. దేవుని సేవలో చేయవలసిన ప్రయాణములకు గొప్ప ఆదరణ వాక్యము. 1రాజులు 17:1 వచనము అక్కడున్న ఏలియా ప్రవక్త అన్నాడు నేను ఎవరియొక్క సన్నిధిలో ఉన్నానో ఆ దేవునితోడు, అది దేవునియొక్క సన్నిధి. ఏలియా దేవుని సన్నిధిలో నిలువబడియున్నాడు అనగా ఏలియా దేవుని సన్నిధిలోనికి వచ్చాడు. వాక్యములో దేవుని సన్నిధి మనుష్యునితో వెళ్ళినది. ఏలియా విషయములో అదికాదు. మనిషి దేవుని సన్నిధిలోనికి వచ్చినాడు. సన్నిధి కూటములు ఉన్నవి. ఏలియావలె 7గురు సన్నిధిలోనికి వచ్చినారు. సన్నిధిలో ఉన్నారు. సన్నిధిలో నిలువబడి స్థిరముగా ఉన్నారు. ఏలియావలె ఈ భాగ్యము మనకు మన మిషను వారికి కలిగినది. కాని అది అందరకు కలుగవలెను. ఇది రెండవది.
- 3. యేసుప్రభువు చెప్పినారు మత్తయి. 18:20లో “ఏమంటే “ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉన్నాను”. అంటే సన్నిధిలోకి రాకముందే ఉన్నాను. సన్నిధి కూటస్తులు వస్తారు, గనుక వారు రాకముందే నేను ఉన్నాను. ఇది క్రొత్త విషయము. మొదట దానిలో సన్నిధికూడ వెళ్ళడము, రెండవ దానిలో మనిషి సన్నిధిలోకి వెళ్ళడము, మూడవ దానిలో మనిషి రాకముందే ఆయనే ఉండదము. ఈ మూడింటికి తేడాలు మీరు మీ జీవితములో అనుభవించాలి.
-
4. యోహాను 6:37లో యేసుప్రభువు చెప్పినారు అదేమంటే “నాయొద్దకు వచ్చువానిని నేను ఎంతమాత్రము బైటికి త్రోసివేయను.” గనుక
లోకములో
ఎంతమంది ఆయనయొద్దకు వస్తారో అంతమందిని అందరిని (క్రీస్తుప్రభువు) చేర్చుకుంటారు. అందుచే ఇదివరకు నేను పత్రికలో
వ్రాసాను.
లోకములో ఎన్ని కుటుంబములున్నవో అన్ని కుటుంబములు సన్నిధి పెట్టుకొనండి అని వ్రాసినాను. కాబట్టి లోకములో అందరు ఏ
మతస్థులైనా,
ఏ విశ్వాసులైననూ, బలహీనులై చెడిపోయిన సరే వారైనను, ఇష్టములేని వారైనను సరే, వస్తే త్రోసివేయను. ఏ మాటవలన నాయొద్దకు
వచ్చేవానిని అందరికి కలిపి ఉమ్మడిగా చెప్పక ఒక్కొక్కరు వచ్చినా బైటికి త్రోసివేయను. ఇంతా కష్టపడి ఆ ఒక్క మనిషి నా
దగ్గరకు
వస్తే ఏలాగు త్రోసివేయగలను. ఇక్కడ ఉన్నవారిలో కొంతమంది ఉండవచ్చును. సన్నిధియందు మాకు నమ్మకములేదు అనే వారుండవచ్చును.
వారికి
వచ్చిన దర్శనములు కొన్ని నెరవేరుటలేదు. గనుక మాకు నచ్చలేదు అనుట సబబుగానే ఉన్నది. దాన్యపు గింజలో తప్పక తాలు గింజలు
ఉంటాయి,
అంతమాత్రమున గట్టిగింజలు ఇంటికి తీసికొని పోకుండ ఉందుమా? ఉండముకదా! ఆలాగే 7గురికి ఒక దర్శనము నెరవేరినందున
తక్కినవారికి
నెరవేరవు అని ఎందుకు అర్ధము తీసికొనవలెను. ప్రవచనము వెంటనే నెరవేరదు.
దేవుని ప్రవచనము నెరవేరుటకు కొంతకాలము పట్టును. ఉదా:- ఈ జాతి మొక్కమంచి రుచిగల ఫలములనిచ్చు పెద్దవృక్ష జాతిమొక్క అని ఒకరు ఒకరికి చెప్పిరి. దానికి అతడు కాయలు కాస్తే మంచి కాయలు కాయునని, ఆ...ఆసామి చెబితే అతడు ఆ జాతి మొక్కను తీసికొనివెళ్ళి తమ ప్రాంతములో పాతిపెట్టగా వెంటనే ఆ మంచి జాతిపండ్లు కాయలు కాయలేదు, ఎందుకనగా ఇంకా ఆ మొక్క ఎదగలేదు కొమ్మలు వేయలేదు. పువ్వులు, పిందెలు, కాయలు ఏర్పడలేదు. అది ఆ మొక్క ఎదగాలి, కొమ్మలు, ఆకులు వేయాలి. చెట్టెన తరువాత పువ్వులు పూయాలి, పిందెలు వేయాలి, కాయలు ఏర్పడాలి, అప్పుడు పండ్లుగా మారుటకు కొంతకాలము పడుతుంది. అలాగే తప్పుడు దర్శనములు అనేదికూడ నెరవేరును, గాని ఆలస్యమైనందున నిరాశ. ఒకే నంగతి 7 గురికి 7 రకములుగా వచ్చును, గాని నెరవేరదు. వెంటనే నెరవేరదు గనుక నిరాశవడి, వెంటనే ఇక సన్నిధికి వెళ్ళకూడదు అని అనుకొనకూడదు. అంతేకాకుండా మీరు వెళ్ళకండి, మీరు వెళ్ళకండి అని వెళ్ళేవారిని ఆపుచేయకూడదు. బైబిలులో ఉన్న ప్రవచనములుకూడా కొన్ని వెంటనే నెరవేరలేదు. కొన్ని వెంటనే నెరవేరినవి గాని నెరవేరడము తవ్పకుండా ఉండును. సన్నిధిలో ఉన్న వారికి వచ్చేవి నెరవేరకపోతే బైటకు వెళ్ళిపోయే వారికి ఏలాగున నెరవేరును. అది అసాధ్యము. ఇది ముఖ్యంగా ఆత్మ సంబంధమైన విషయమునకు సంబంధించిన ప్రసంగము. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. ఆయన నుండి వేరై మనము ఏమో చేయలేము. యోహాను 15:5 “నాకు వేరుగా మీరేమి చేయలేరు.”
నా సన్నిధి = నేను అనగా నా సన్నిధి. అనగా నేను ఇందాక చెప్పినట్లు “నా యొద్దకు వచ్చువానిని నేను ఎన్నడును త్రోసివేయను” అన్నాడు. బైటకు అనగా దేవునియొక్క సన్నిధిలేని చోటు. గనుక మీరు సన్నిధి విడిచి, సన్నిధిలేని చోటుకు వెళ్ళిన మీకేమి ప్రయోజనము, బైటకు త్రోసివేయబడుదురు అదే ప్రయోజనము. గనుక దేవుని సన్నిధికి వేరుగా వెళ్ళవద్దు. సన్నిధిలోనికి రండి. సన్నిధిలో ఎవరుంటారంటే ఎనమండుగురు ఉందురు. అంటే 7 మనుష్యులును, 8వ ఆయన క్రీస్తు ప్రభువును ఉండును. 8వ ఆయన "క్రీస్తు" అనే దేవనరుడు మొత్తము అందరూ నరులే ఉందురు. అది అయ్యగారి లెక్క గాని ఆదివారమునాడు మధ్యాహ్నము సన్నిధి కూటములో 70మంది, 80మంది వస్తారు. 7గురేకాదు. ప్రతిరోజు 8మంది 1గంట వరకు సన్నిధికి ఆ 7 గురు కాక ఇంకా ఇంకా కొంతమంది వస్తారు. వారిలో మీరుకూడ ఉండండి. అంతేకాని సన్నిధికి వేరైయుండవద్దు, ఉంటే ఎప్పటికైనా అపాయమే. సన్నిధికి వస్తే ఎప్పటికైనా మేలే. వాగ్ధానము ఆలాగున ఉన్నది. సమయము, వీలు లేకపోతే మీకు సౌక్యముగా (అనారోగ్యము ఉంటే) లేకపోతే, రాకపోవచ్చును గాని మనస్సులో సన్నిధి ఉండవలెను. మనస్సులో ఎవరంతట వారే సన్నిధి చేయవలెను. - 5. నిర్గమ 3లో యెహోవా పొదలో మోషేతో చెప్పినాడు. “ఉన్నవాడు” అనుపేరు చెప్పినాడు. ఉన్నవాడు ఉన్నవాడే Absent కాడు. గనుక సన్నిధి పెట్టుకొనవలెనంటే ఎక్కడబడితే అక్కడే ఉన్నాడు. ప్రస్తుతము సంఘాలలోనికి సన్నిధి వచ్చినది. సన్నిధిలో ప్రభువు క్రొత్త సంగతులు చెప్పుచున్నారు. 40 ఏండ్ల నుండి సన్నిధి పెట్టుకోమన్న లెక్కచేయక 56 సం॥ల నుండి పెట్టి సాగించుచున్నారు. వారు యేసుప్రభువు చెప్పిన సంస్కార ప్రసంగాలు, రాకడ ప్రసంగాలు, ఇతర ప్రసంగారు వ్రాసిన పుస్తకాలువేసిరి, అవి లెక్కకు ౩0కంటే ఎక్కువ ఉన్నవి. కాబట్టి మీరు స్థాపిస్తే మీకు ఆ 30 ప్రసంగాలు అయినా వస్తాయి. గనుక మీకు రోజు అదే పని. పెంతెకొస్తు అయిపోయినది గనుక ఒకమాట, సన్నిధి సంగతి మీకు బోధపడిన పడకపోయిన ఇష్టమున్న లేకపోయిన, నచ్చినా నచ్చకపోయినా ఇంటిలో పెట్టుకొనండి. అది సన్నిధి అని తెలుసుకొంటారు. పెట్టనిదే రానిదే ఏలాగు తెలుసుకుంటారు. ఈ ఉపన్యాసభాగ్యము మీకందరకు కలుగునుగాక. ఆమేన్.
(ప్రభువు అయ్యగారికి ఒకటి చెప్పిరి. ఏమనగా ఇక్కడుండేవారు సన్నిధిలో చెప్పబడేవి వారి ఊహలు, దేవుడు చెప్పేవి అని తెలుసుకొనవలెను. అట్లు ఉంటే మీరందరు కలిసి ఆ 7గురిని నిలువబెట్టి మీ ఇష్టం వచ్చిన ప్రశ్నవేయండి చెప్పివేయుదురు.)