(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

5. దైవసన్నిధి భాగ్యము



నిర్గ. 19:7-25; 33:11 యెష. 42:1; యోహా. 8:12; ఫిలి. 2:1,2.

ప్రార్ధన:- నిత్యుడవైన ఓ తండ్రీ! సృష్టికర్తా మానవులందరికి కనబడి మాట్లాడుటకు చూచుచున్న ఓ తండ్రీ! నేటి దిన వర్తమానము ద్వారా నీవే మాకు కనబడి, మాతో మాటలాడుమని క్రీస్తుయేసు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రీ! ఆమేన్. దేవుడు మనిషితో మాట్లాడేవాడైయున్నాడు. దేవుడు స్వయముగా మాట్లాడుటకు సందులేదు.

అలాగే నేటి ఆధునిక కాలమున దేవుడు యంత్రములద్వారా మాట్లాడుచున్నాడు. (మైకు, రేడియో, టి.వి. మొ॥వి) ఈ యంత్రములు ద్వారా అనేకమందితో మాట్లాడుచుండగా నా యంత్రములు (సృష్టిలోని సమస్తమూ) వీటి ద్వారా మాట్లాడకూడదా? వీటన్నింటినిద్వారా మీరు వినుచున్నారు కాని నా స్వరము విన్నారా?


మనిషి దేవునిని లెక్కచేయుటలేదని నా ఆజ్ఞలు వ్రాస్తాను. అవి వ్రాసి ఇచ్చెయ్ అని చెప్పుచున్నారు. బైబిలు ఇచ్చాను బైబిలు చదువుకుంటే పై నాలుగు కలవు. అన్ని ఇచ్చినను మనిషి లెక్కచేయుటలేదు. బైబిలు రాకముందు దేవుని కృపను గ్రహించలేక అన్ని నష్టములు కలిగెను. అజాగ్రత్తవల్ల రెంటికి నష్టమే. పాపము చేసినందున మనస్సాక్షి సరిగా చెప్పుటలేదు. పాపము లేకపోతే సూర్యునిచూచి ఎంత మంచి వెలుగు దేవుడిచ్చెను అనునుగాని, ఇప్పుడు దేవుడు ఇంత ఎండ ఇచ్చెను. పాపము వల్ల మనిషి హృదయమువల్ల అంతా చెడుగు గనుక దేవుడు ఆనాటి తన ఎన్నిక జనాంగమైన ఇశ్రాయేలీయులను బాగుచేయుటకై మోషే పుట్టువరకు ఊరుకొని, ఆయనకు ఐగుప్తు - శత్రుదేశములోని సకల విద్యనేర్పి అక్కడనుండి పారిపోయిన వానికి కనబడి, ఆ సీనాయి కొండపై మోషే నీతో చెప్పినది 70మందికి చెప్పు వారు అందరితో చెప్పుదురు అని దేవుడు మోషేతో చెప్పగా మోషే 70 మందికి, ఆతరువాత 6 లక్షల మందికి, ఆ తరువాత పుట్టిన వారందరికి వ్రాతలద్వారా తెలియజేసెను.


మనస్సాక్షి తప్పని చెప్పితే బైబిలు చూడవలెను. ఇది వ్రాయబడినది గనుక తప్పు ఉండదు. జ్ఞానులు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అన్నారు. జ్ఞానులు పండితులద్వారా తెలిసికొనిరి. వారు బైబిలుద్వారా తెలిసికొనిరి. అలాగే బైబిలులో సందేహములు ఉన్నవారే బైబిలును పరీక్షించవలెను. వారికి బైబిలులో ఉన్నది నచ్చకపోతే ఈ 5 సాధనములు నమ్మనివారిని ఏమి చేయగలము. అయితే దేవుడు ఇంకొక ఉపాయము చేసెను. ఆయన లోకమునకు అన్నీ ఇచ్చెను. అప్పుడుకూడా నరుడు దేవుని మరచెను. దేవుని నమ్మని మానవుని మనస్సు ఇలాగ అనును. ఆకాశమువైపు చూచి, భూమివైపుచూచి వర్షము, మొక్కలు మొలిసినవి. వీటన్నింటిని ఆలోచించుటకు ఈ మనస్సుకు ఏమి పని? దేవుని నమ్మని ఈ మనస్సు ఈరోజు దేవుడు ఉన్నాడు, రేపు లేడు అనును. జ్ఞానము అంతే, బైబిలు అంతే, బోధకులు అంతే, నేను ఏది వినను, నా సుఖమే నా దేవుడు అనును. అయితే దేవుడు సుఖముద్వారా మాట్లాడుచున్నాడు.


ఇంకొక ఉపాయము మంచి ఎండలో కాళ్ళుకాలితే పరమాత్మా! రక్షించు అని పిలుస్తాడు అప్పుడైనా దేవుని మాట వింటాడా? మరియొకటి ఏదనగా వర్షములో తడిసి పడిశము పట్టినప్పుడు, శ్రమలద్వారా దేవుడు మాట్లాడును. సుఖములు, విద్య, బట్టలు, గాలి, నీరు, పండ్లు, తిండి, నిద్రవల్ల, అన్నిటివల్ల సుఖము. అప్పుడైన దేవుని మాటలు నచ్చలేదు గనుక శ్రమలను పంపును. శ్రమలుపకారం..... శ్రమలేహారం.... మనకు శ్రమ ఉంటేగాని దైవభక్తిరాదు. కొంతమంది సుఖములోకూడ దేవా! అందురు. లోకములోని అనేక సాధనముల ద్వారా దేవుడు లోకమంతటితో మాట్లాడుచున్నాడు. ఇంకా నరుడు వినుటలేదు. దేవుడు మానవుని తన తట్టు త్రిప్పుటకు ఇంకొక ఉపాయము కనిపెట్టెను. బైబిలు ప్రకారము మతమునంపి యూదుల చేతిలో ఉంచెను. పాపము లోకములోనికి వచ్చిన తరువాత జనులు విస్తరించిరి. ఇన్ని జనాంగములలో యూదులైనవారు కాస్త మెరుగుగా దేవుని దృష్టికి అగుపించగా, అందుచేత దైవచిత్తము జరుపుటకు దేవుడు యూదులను పెంచెను. 400 సం॥లు ఐగుప్తు బానిసత్వము, 40 సం॥లు అరణ్య యాత్ర తరువాత పాలస్తీనాలో వారిని ఏర్పరచెను. యూదుల మతము ద్వారా దేవుడు వారితో మాట్లాడెను. యూదులకు బైబిలు ఉన్నది. ఇతరులకు అదిలేదు. ఇతరులు బైబిలు తీసికొనుటకు సిద్ధముగా లేరు. మిగతావారికి మీరు చెప్పండని దేవుడు, సృష్టి విషయాలన్నీ యూదులకు నేర్పి, మీరు వారికి చెప్పండి అన్నది ఇదే. అయితే యూదులు దేవునిని సిలువవేసిరి. భక్తులు చేసినదే గొప్ప పాపము. అందుకు యేసుక్రీస్తు ప్రభువు 12 మంది శిష్యులను ఏర్పరచుకొని రెండు నిబంధనలు ఇచ్చెను, అవి

ఇవి ఆది సంఘమునకు క్రీస్తుప్రభువు ఇచ్చెను. గనుక దేవుడు అన్య మతముద్వారా బోధచేసెను. వీరు నన్ను విడిచి సృష్టిని పూజించుచున్నారు, అని యూదులద్వారాకూడా మాట్లాడెను. మీరే చెప్పండి అని బోధచేసెను.


అన్యమతము - యూదులమతము - క్రైస్తవ మతము ఇప్పుడు అన్ని మతములద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. హెబ్రీ. 1:1 దేవుడు తన సొంత కుమారుని ఈలోకమునకు పంపెను. దేవుడు మానవుని కలుగజేసినది మొదలుకొని ఇప్పటివరకు ఏదో విధముగా మానవులతో మాట్లాడుచునే యున్నాడు.


రక్షణాపేక్షగల విశ్వాసులారా! నిర్గమ. 19:7-25 ఈ కథలో సీనాయి పర్వతము ఉన్నది, దానిపై ఒక శిఖరము ఉన్నది. దీని చుట్టూ ఇశ్రాయేలీయులు ఉన్నారు వీరు ఈ కొండదగ్గరకు రాకూడదు, ఏదియు రాకూడదు, మరియు మోషే మాత్రము పరలోకమునుండి వచ్చుచున్న దేవుని ఎదుర్కొనుటకు వెళ్ళవలెను. ఆ కొండపై యెహోవా అగ్నిలో దిగెను. ఆయన ప్రసన్నత భూమిపైకి దిగివచ్చు సమయమునకు ముందు పొగ, ఉరుములు, మెరుపులు, బూరధ్వని, భూకంపము కలిగెను, ఇవి చూడగానే ఇశ్రాయేలీయులు గజగజ వణికిరి, గాని మోషే మాత్రము శిఖరము మీద ఉండెను. దూరముగానున్న ఇశ్రాయేలీయులకు భయముగాని, దేవుని సన్నిధిలో ఉన్న మోషేకు మాత్రము భయములేదు.


దేవుని సన్నిధియొక్క గుర్తులు:-

మోషేకు పూర్వము భక్తులు, వారి కుటుంబములున్నవి. అయితే మోషే కాలములో సంఘమున్నది గనుక తండ్రి తన సంఘముతో మాట్లాడవలెను. సంఘముచూస్తే దేవుని మాట వినుటకు సిద్ధముగాలేదు ఇందువలన సంఘము తరుపున మోషేతో మాట్లాడెను. పాత నిబంధన సంఘమునకు, రాబోవు సంఘమునకు అవసరమైన ఆజ్ఞలు మోషేతో మాట్లాడవలెను. ఈయన భూమిమీద ఉన్నంత కాలము దేవుని సన్నిధికి వెళ్ళుటకు అనగా 40 సం॥లు రాజుగారి ఇంటిలో నలిగిపోయి సిద్ధపడెను, గనుక ఇపుడు దేవునితో కొండ ఎక్కి మాట్లాడుటకు తగినవాడాయెను. అపో॥కార్య॥ 7:23. 40 సం॥లు రాజనగరమందు రాజుల కుటుంబములో బ్రతికెను. అపో॥ 7:30. 40 సం॥లు, మిద్యాను దేశములో భక్తి, జ్ఞానముతో దేవుడు సిద్ధము చేసెను. అపో॥ 7:36 40సం॥లు ఐగుప్తులోను, సముద్రములోను మహాద్భుత క్రియలు చేసెను.


వింత కథ:-

అట్లే విశ్వాసులైనవారు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు వారు దైవ సన్నిధిని అనుభవించుదురు. ఆ దైవసన్నిధియొక్క మహిమ, ఇతరులు గ్రహించలేరు. మోషే భక్తి - పొద మొదలు సీనాయి వరకు చూస్తే శిఖరమెక్కెను. మోషే మొదట అనుభవము అగ్ని పొద అనుభవము. నెబుకద్నెజరు కాలములో అగ్ని గుండములోనున్నవారు క్షేమముగా నుండిరి, కాని వారిని పడవేసినవారు చనిపోయిరి. ఇచ్చట లోకాగ్నిలో వారు ముగ్గురు నశించలేదు. దీనికి మోషేయొక్క కొండ శిఖరాగ్ని సూచనగా ఉన్నది. అగ్నిలో ఉన్న మోషే దేవునితో మాట్లాడెను గాని ఇశ్రాయేలీయులు దగ్గరకు వస్తే చనిపోవుదురు అనెను. ఇది చిత్రముగా నున్నది. ఇచ్చట మోషే సిద్ధపడ్డాడు. శిఖరము ఎక్క గలిగినంతగా సిద్ధపడెను గాని ఇశ్రాయేలీయులు అక్కడనుండుటకే సిద్ధపడిరి.


ఇట్లే రెండు గుంపులువారు సిద్ధపడిరి (మత్త. 25:1-10) గాని ఒక గుంపువారు మాత్రమే ప్రవేశించిరి. తక్కినవారు ప్రవేశింప లేదు. అట్లే విశ్వాసులును సిద్ధపడుటలో తరగతులుగానున్నారు. మోషే కొండమీద దేవుని సన్నిధిలో నున్నంతకాలము తన కన్నులతో తండ్రిని చూచెను. చెవులతో తండ్రి మాట వినెను. ఇదే సన్నిధి భాగ్యము. ఆలాగున దైవసన్నిధిలో ఉండి ప్రభువుయొక్క ముఖము చూచుచు, ఆయన మాట వినుచు ఆయన సన్నిధి భాగ్యము అనుభవించగల స్థితి ప్రభువు మనకు అనుగ్రహించునుగాక! ఆమేన్.