(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
7. త్రిత్వ సన్నిధి
అది. 1:26; మత్త. 3:13-17; 1యోహాను 5:5-7.
ప్రార్ధన:- తండ్రి, కుమార, పరిశుద్దాత్మగా బైలుపడిన త్రియేకదేవా! సర్వకాలములయందు ఏకరీతిగాయుండు ప్రభువా! మర్మమైన నీ మహత్యము నిమిత్తము నీకు ప్రణుతులు, నేటి వర్తమానము ద్వారా, నీ త్రిత్వ ఏక కార్యములను బయలు పరచుమని క్రీస్తుప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రీ! ఆమేన్.
కీర్తన:- దైవాత్మ రమ్ము.
ఈ రోజులలో బైబిలులోని ఒక గొప్ప విషయమును గురించి అనేకులకు సందేహమున్నది. అదేమంటే తండ్రి, కుమారుడు, పరిశుద్దాత్మ ఈ ముగ్గురు ఎట్లు ఒక్కరైయుండగలరు, అలాగే ముగ్గురు ఒక్కరైయుండగలరు? అనే ప్రశ్న వస్తుంది. ఈ ప్రశ్న మనకు మర్మము. డాక్టర్ . మార్టిన్ లూథరుగారి ప్రియ స్నేహితులు ఫిలిప్పు మిలాంగ్టన్ గారు గొప్ప వేదాంతి. లూథరుగారు దిద్దుబాటు చేయువారు. అయితే మిలాంగ్టన్ బైబిలు బాగా తెలిసిన వేదాంతి. బైబిలు నేర్చుకొనేటందుకు అన్ని దేశములునుండి ఆయన దగ్గరకు వచ్చేవారు. అయితే ఆయన సహితము ఒక్క మాట అన్నారు. త్రిత్వ విషయము నాకు బోధపడలేదు నేనిప్పుడు చనిపోవుచున్నాను. దాన్నిగూర్చి అక్కడకు వెళ్లిన తర్వాత ఏలాగు ఒక్కరు ముగ్గురు అయినారో, ముగ్గురు ఒక్కరో అక్కడ తెలుసుకుంటాను. గనుక ఆయనకే త్రిత్వమర్మము తెలియనప్పుడు మనకు ఏలాగు తెలియును. తెల్లటి అన్నము తింటున్నాము, రంగులేని నీరు త్రాగుచున్నాము. ఆ రెంటివల్ల ఎర్రని రక్తము ఏలాగు వస్తుందో ఎవరికి తెలుసు? దేవుని విషయములలో ఇది ఒక్కటేకాదు, లక్ష మర్మములున్నవిగాని ఈ ఒక్క మర్మమే పట్టుకుంటారు.
వాదము కొరకు మనకు ఏది తెలియనప్పుడు నేను చెప్పేది ఏమంటే తండ్రి, కుమార, పరిశుద్దాత్మ ఈ ముగ్గురిలో ఒకరిపేరు మాత్రమే బైబిలులో ఎక్కడ ఉన్నదో అక్కడ ఆ తక్కిన ఇద్దరు ఉన్నారు అని గ్రహించుకొనవలెను. రెండవ ఆయన పేరు ఎక్కడ ఉన్నదో తక్కిన ఇద్దరుకూడ అక్కడ ఉన్నారు గ్రహించవలెను. అట్లే మూడవ ఆయన పేరు ఎక్కడ ఉన్నదో అక్కడే తక్కిన ఇద్దరు ఉన్నారు. “నాయొద్దకు వచ్చిన వానిని నేను ఏ మాత్రము త్రోసివేయనన్నారు” ఆయన 2వ ఆయన, అయినప్పటికిని అచ్చటనే తక్కిన ఇద్దరు ఉన్నారు. గనుక మనము క్రీస్తుయొక్క సన్నిధిలో ఉన్నామంటే ఆ ఒక్కరి సన్నిధిలోనేకాక తక్కిన ఇద్దరి సన్నిధిలోనూ ఉన్నాము అన్నమాట, ఈ ముగ్గురు కలిగి ఉన్నదే త్రిత్వము.
గుంటూరు సన్నిధి కూటమునకు తరచుగా ప్రభువు వచ్చి కనబడి మాట్లాడుచున్నారు. అవ్పుడు వారు ఈ విషయములను అయ్యగారికి చెప్పుచున్నారు. దైవప్రత్యక్షత వచ్చిన ఆ సమయములోనే తక్కిన ఇద్దరుకూడా అక్కడ ఉన్నారు గాని వీరికి కనబడలేదు. అప్పటికి బహిరంగ ప్రత్యక్షతగలవారు ప్రభువు ఒక్కరే ఉదయము నేను చెప్పినట్టు నా సన్నిధి మీతోకూడ వచ్చును అని తండ్రియైన దేవుడు ("యెహోవా") చెప్పినారుగాని అది ఆయన ఒక్కరి సన్నిధేకాదు, ముగ్గురి సన్నిధై యున్నది కాని అప్పుడు వారికి బైలుపడలేదు అది ఇప్పుడు మనకు బైలుపడినది. క్రొత్త నిబంధనలో బైలుపడినది. అయితే అక్కడ ముగ్గరు ఒక్కరైయున్నారు. ఆ ముగ్గురి సన్నిధిని సీనాయి కొండమీద దేవుడు రాతిపలకలమీద వ్రాసాడని ఉన్నది. అయితే యేసుప్రభువు అప్పుడు అక్కడ ఉన్నాడా? అనే ప్రశ్న అయ్యగారి సన్నిధి కూటములో వచ్చింది. అప్పుడు క్రీస్తు ప్రభువు జవాబిచ్చారు. అప్పుడు నేనుకూడా ఉన్నానని చెప్పారు. అప్పుడు మనకు సంతోషము, ఆశ్చర్యము కలిగింది. అది బైబిలులో కలదా? అది క్రొత్త నిబంధనలో బైలుపడినది. పాత నిబంధనలో దేవుని కలిగిన పేర్లలో
- ఎ) యెహోవా దేవుడు నా సన్నిధి,
- భి) ఉన్నాను,
- సి) ఉండువాడను, అనేవాడను,
తండ్రీ! ఇవన్నియు కాకుండా ముగ్గురు కలసి ఉన్నట్టు జ్ఞాపకముంచుకొనండి. దేవునికిగల ఈ 5పేర్లును పాత నిబంధనలో దొరికినవి, గనుక ముగ్గురు కలసి ఉన్నప్పుడు జరిగిన కథ క్రొత్త నిబంధనలోనికి వచ్చినప్పుడు అక్కడ ముగ్గురు వేర్వేరుగా కనబడినట్లు వ్రాయబడినది.
ఆది. 1:1లో దేవుడు అనేమాట ఉన్నది. యెహోవా అనిలేదు. తక్కిన పేర్లు లేవు ఎందుకనగా అప్పటికి ఇంకా దేవుడు ముగ్గురుగా బైలుపడలేదు. అందుచేతనే దేవుడు ఆకాశమును, భూమిని కలుగజేసినాడు అని ఉన్నది. మనకు ఆలాగున ఉండకూడదు. తండ్రి, కుమార, పరిశుద్దాత్మ వీరు కలసి ఆకాశమును, భూమిని కలుగజేసినారు అని వ్రాయబడి ఉంటే మనకు సంతుష్టి. ఎందుకంటే మన చేతిలో క్రొత్త నిబంధన ఉన్నది. ఆదికాండము 1వ అధ్యాయములో దేవుని పేరు ఉన్నప్పుడు అక్కడ దేవుని సన్నిధి ఉన్నది. ఆ సన్నిధి సృష్టిని కలుగజేసెను. అక్కడనుండి బేత్లెహేము వరకు 4వేల ఏండ్ల వరకు ఆ ముగ్గురు ఏకముగానే ఒక్కరుగానే వచ్చినట్టు కనబడుచున్నది. అక్కడనుండి ముగ్గురుగా కనబడుచున్నారు. మరియు యెహోవా అనుమాట పాత నిబంధనలోనే ఉన్నది. ఆ పేరే దేవుని సన్నిధి. ఆ తరువాత నిర్గమ 33:14లో "దేవుని సన్నిధి" ఉన్నది. అక్కడను ముగ్గురు ఉన్నారు. పొదలో మోషేతో నాపేరు "ఉన్నవాడను, అనువాడను" అని చెప్పినారు. అలాగు చెప్పినప్పుడు ముగ్గురు ఉన్నారు. 5వది ఆశ్చర్యము. పాత నిబంధనలో తండ్రి అనేపేరు ఎక్కడా లేదు. గనుక దేవునికి తండ్రి అనే బిరుదు ఉన్నది. ఎందుకంటే దేవుడు సృష్టికర్తయై ఉన్నాడు గనుక 1దిన. 29: 10లో దావీదు ప్రార్ధన చేసెను. ఆ ప్రార్ధనలో దేవునిని తండ్రీ అని అన్నాడు. ఆ మాటనే క్రొత్త నిబంధన మాటగాని ఆయనకు ఇక్కడకి ఎలాగు దొరికింది? ఎలాగు బైలుపడింది. ఎలాగు అందినది? ఆయన ఒక్కడే తండ్రి అని అన్నట్టున్నది. పాత నిబంధనలో ఎవరు అన్నట్టులేదు.
ఇప్పుడు క్రొత్త నిబంధనలోనికి వస్తాము. పై 5 సందర్భాలలోదేవుని సన్నిధి ఉన్నది. సన్నిధి కూటము లేకపోవచ్చును. గాని సన్నిధి ఉన్నది. అది ఇప్పుడు మనము కూటము క్రింద పెట్టుకొనుచున్నాము. 1రాజు. 17:1వ వచనములో ఏలియా "నేను ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నాను" అని చెప్పెను. గనుక ఆయన ఒక్కడే ఆయన సన్నిధిలో ఉన్నాడు. సీనాయి కొండమీద మోషే ఒక్కడే ఉన్నాడు. 1దినవృత్తాంతములో దావీదు ఒక్కడే ఉన్నాడు. సీనాయి పర్వతముపై పొద దగ్గర మోషే ఒక్కడే ఉన్నాడు. వారు ఆ సన్నిధి భాగ్యమును చెడగొట్టుకొనలేదు. మనము ఇక్కడ పది మందిమి చేరాము గనుక ఒక్కొకప్పుడు ఒకప్పుడు దేవునిపై ఉన్న మన ఏకాగ్రతను చెడగొట్టుకొను చున్నాము, ఒక్కొకప్పుడు నిలువబెట్టుకొనుచున్నాము. 10 తలలు చేర్చుచున్నాము (ఏకాత్మ, ఏకసాధన) లేనివారము గనుక ఎక్కువగా చెడిపోవుచున్నాము. గాన జాగ్రత్తగా ఉన్న యెడల మన సన్నిధి చెడదు.
కొత్త నిబంధనలో తండ్రి, కుమార, పరిశుద్దాత్మ మొట్టమొదట ఎక్కడ బైలుపడ్డారంటే ప్రభుని బాప్తిస్మ సమయములో తండ్రి పైన ఉన్నారు, కుమారుడు నీళ్లలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ పావురమువలె దిగినది. అక్కడ ముగ్గురును ఉన్నారా లేదా? అక్కడ ముగ్గురైయున్న ఆయన సన్నిధి ఉన్నది. అయితే పాత నిబంధనలో ఆ ముగ్గురు ఒక్కరైయున్న ఆయన సన్నిధి ఉన్నది. తరువాత ఇంకొకటి కలదు. అదేమంటే తండ్రి పైనుండి, (పెంతెకొస్తునాడు) కుమారుడు పైనుండి ఆత్మను పంపినారు. అది ముగ్గురు వేరుగానున్న దైవసన్నిధి. “మీరు వెళ్లి తండ్రియొక్కయు, కుమారునియొక్కయు, పరిశుద్దాత్మ యొక్కయు నామమున బాప్తిస్మము ఇవ్వమని ప్రభువు చెప్పెను” మత్త. 28:19. అక్కడ ముగ్గురును వేర్వేరుగానున్న దైవసన్నిధి. గనుక బాప్తిస్మము సమయములో ముగ్గురు ఉంటారు. పౌలు క్రొత్త నిబంధన పత్రికలలో ఏమి వ్రాసాడంటే తండ్రియొక్క ప్రేమ, కుమారునియొక్క కృప, పరిశుద్ధాత్మయొక్క సహవాసము మీకు తోడైయుండునుగాక 2కొరింథి. 13:14. అనెను. ఇక్కడ ముగ్గురు వేరువేరుగా కనబడుచున్నారు. గనుక మనము ముగ్గురిలో ఎవరిపేరు ఎత్తినా ముగ్గురియొక్క సన్నిధి మనయొద్ద ఉన్నది.
త్రిత్వ దేవుడు దేవా అయియున్నాడు. అదేమనగా ఆదికాండము 1:1లో ఉన్నది. ఆయన 22వ దా॥కీర్తనలో దేవా..దేవా అన్నాడు. అదైన తరువాత మనము ఎప్పుడు ప్రార్ధన చేసిన అక్కడ త్రిత్వ సన్నిధి ఉన్నది. ఎవరిపేరు ఎత్తినా సరే చిక్కులేదు. మనమీలోకములో జీవించినంతకాలము ఇశ్రాయేలీయులతోకూడా దేవుని సన్నిధి వెళ్ళినట్లు మనతోకూడ మన జీవితము అంతమువరకు మనతో ఉండును. కాని ఈలోకములో దైవసన్నిధి అనుభవించేవారు దైవసన్నిధి కూటములు జరుపుకునేవారు వారి నిరీక్షణ ఏమి? దైవసన్నిధి మనతోకూడ పరలోకము వస్తుందని వారికూడ సన్నిధి వెళ్లినట్లు మనతోకూడ పరలోకమునకు రాకపోతే ఇక్కడి సన్నిధి కూటములవల్ల మనకేమి ప్రయోజనము. ఈ సంగతి క్రొత్త నిబంధన దాటిన తరువాత 2వేల నంవత్సరములకు బైబిలుమిషనుకు తండ్రి బైలుపర్చినారు.
- 1. పాతనిబంధన
- 2. క్రొత్త నిబంధన
- 3. సంఘకాలము
- 4. సన్నిధి.
మొదటిసారి ఉన్న దైవ సన్నిధి సంఘకాలముయొక్క చివరి కాలములో బైబిలు మిషనుద్వారా సన్నిధికూటాలు బైలుపడినవి. అదివరకు సన్నిధి మూడు సమయములలోనే బైలుపడినది గాని ఇంకను బైలుపడును. పాత నిబంధన, క్రొత్త నిబంధన సంఘకాలములో బైలుపడినదే సంఘకాలముయొక్క చివరి కాలములో ఇక సంఘముండదు. బైబిలు మిషను వచ్చినది గనుక సంఘముండదు, ఇది ఆఖరు కాలము. అనేక పర్యాయములు ప్రభువు చెప్పుచున్నారు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, త్వరగా సిద్ధపడండి నేనువస్తే ఎక్కువసేపు ఉండను. ఒక రెప్పపాటు కాలమే ఉంటాను. ఆ రెప్పపాటులో మీరు తయారుకాలేరు గనుకనే సిద్ధపడండని ఇప్పుడు చెప్పుచున్నాను. ఈ సంగతి నేను ఇదివరకు నా పత్రికలలో చాలా పర్యాయములు వ్రాసినాను గాని ఎవరు లెక్కచేయుటలేదు. ప్రభువు మా కూటములలో చాలా కాలము క్రిందట ఒక మాట చెప్పినారు. అది నమ్మటానికి వీలులేదుగాని మేము నమ్ముచున్నాము. ఏమన్నారంటే బిడ్డలారా! నేను చెప్పుమాటలన్ని మీరు చెప్పిన తోడనే మీ నోట్స్ లలో వ్రాసికొని మళ్లీ ఏమి చెప్పుతానని నావంక చూస్తున్నారుగాని మోషే ఆలాగు చేయలేదు. మాటిమాటికి ప్రభువా మళ్లీ చెప్పు వ్రాసికోలేదు, వ్రాయలేకపోవుచున్నాను, మళ్లీ చెప్పు...మళ్లీచెప్పు అని మాటిమాటికి గుడారములో అడిగినాడు. రాతిమీద ఎవరు త్వరగా వ్రాయలేరు అది మోషే కథ. గుడారములో మోషేకు నేను డిక్టేట్ చెప్పి వ్రాయించినాను. ఒక మనిషితో ఇంకొక మనిషి ఏ ప్రకారముగా మాట్లాడునో అట్లే దేవుడు మోషేతో మాట్లాడినాడు, దావీదుతో మాట్లాడినాడు, ప్రవక్తలందరితో మాట్లాడినాడు. అర్హత కలిగిన ప్రవక్తలతోనేగాక, అర్హతలేని అనగా చిన్న చిన్న ప్రవక్తలతో కూడా మాట్లాడినాడు. ఇప్పుడు అలాగే మాట్లాడుచున్నాడు. అదే మనకు వచ్చినది. సన్నిధిలో మాట్లాడుచున్నాడు గనుక చెడగొట్టుకొనవద్దు. ఇప్పుడు అయ్యగారితో మాట్లాడుచున్నాడు. అలాగే పల్లెటూరిలో ఎక్కడా ఒక గుడిసెలో అర్హతలేనివారితో ప్రభువు మాట్లాడుచున్నారు. వారు అయ్యగారికి ఒక ఉత్తరము వ్రాయుచున్నారు. అయ్యగారు ఆశ్చర్యపడుచున్నారు. ఈ సంగతి ఇదివరకే తెలుసునుగాని మనము మామూలు ప్రార్ధన చేసినా అనగా మనకు అత్యధిక అర్హతలు లేకపోయినా మనము ప్రార్థన చేస్తే వినడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. మనము ఏదైనా సైతాను చిక్కులలో, శోధనలలో పడిపోయినా దేవదూతలు వెళ్లిపోవచ్చు, పరిశుద్దాత్మ వెళ్లిపోవచ్చు, సన్నిధి మాత్రము వెళ్లిపోదు. మనిషిని ఆయన కలుగజేసినాడు గనుక ఈ సంగతి బైబిలులో నాకు దొరకలేదుగాని ప్రభువు స్వయముగా మా కూటములో చెప్పినారు. హెబ్రీ భాషలో నిన్ను ఎడబాయను, నశించిన దానికి వెదకి రక్షించుటకు వచ్చాను అన్నాక దేవుడు, దేవుని సన్నిధి ఎడబాయదు అని తెలియును. మనిషి ఎడబాయగలడు. అంటే దేవుని కంటే మనిషి చాలా గడుసువాడు. అటువంటి ఈ శక్తిగల మనిషికి ఎవడు చెప్పుతాడు? ఎంత చెప్పినా వినడు! అపనమ్మిక, అజ్ఞానము ఎంత చెప్పినా తప్పు అర్ధము చేసికొనును. (అపనమ్మిక, అజ్ఞానము) అను ఈ రెండు కష్టపడి (2 లక్షణాలు) సైతాను తరుపున మనిషిలో ఉండి పనిచేయును.
దేవుడు సర్వవ్యాపి గనుక అన్ని స్థలములలో ఉన్నాడు. మాకు దేవుడు మరియొక క్రొత్త సంగతి కొన్ని ఏండ్ల క్రిందట
బైలుపర్చినాడు.
ఉన్నది ఉన్నట్టు చెప్పివేస్తున్నాను. సంఘముకూడా ఉన్నది. ఈ సన్నిధి కూటాలు ఆ సన్నిధి దగ్గరకు వెళ్లును ఇక్కడ ఉండవు.
ప్రభువు
ఏమి చెప్పారంటే - తండ్రి సృష్టికర్త గనుక ప్రతి మొక్క ప్రతి జీవి దగ్గర తండ్రి ఉండును, లేని ఎడల అవి భస్మమై పోవును ఈ
విషయము
మీరు నమ్ముచున్నారా? ఉదా:- ఒక చెట్టు దగ్గరకు ఒక కుర్రవానిని తీసికొనిపోయి అబ్బాయి ఈ చెట్టులో దేవుడు ఉన్నాడంటే
నమ్మడు.
దేవుడు జీవమై యున్నాడు గనుక ఆ చెట్టులో జీవమున్నది, గనుక ఆయన
ఉన్నాడు అని స్పష్టముగా చెప్పనక్కరలేదు, గనుక దేవుని సన్నిధి నా దగ్గర ఉన్నది. అని అనుకుంటే దేవునికి భయపడ నక్కరలేదు.
నాకు
(అయ్యగారికి) నీళ్లు త్రాగేటప్పుడు భుజించేటప్పుడు, నిద్రించేటప్పుడు, మెళకువ వచ్చినప్పుడు దేవుని తలంచుకొనుట నా
వాడుక
గనుక
ఈ వాడుక మీకు ఉండవచ్చును; ఉంటుంది. ఆ తలంపు ఎప్పుడున్నదో అపుడే సన్నిధికూడా ఉన్నది.
పాట: యేసూ నీతలపే...ఎంతోహాయి.
ఆ
తలంపు
ఎప్పుడున్నదో సన్నిధి అక్కడే ఉన్నది. మన నిరీక్షణ ఏమి?
సన్నిధిలో ఏ కళంకము లేకుండా ఉంటే పరిశుద్ద దూతలు, పరిశుద్దులు
ఉంటారు
గనుక ఆ భాగ్యము మీకు కావలెనంటే ప్రతి ఇంటిలో సన్నిధి కూటము పెట్టుకొనండి. మీ పొరుగువారికి వారి చెవులలోకూడా ఊదండి. 100
సంవత్సరముల క్రిందట కట్టిన వాట “ఉన్నపాటున వచ్చుచున్నాను” చౌదరి పురుషోత్తముగారు పాట కట్టినప్పుడు అందరికి తెలుసు. ఈ
కీర్తనలో సన్నిధి మాట కలదు. 100 సంవత్సరముల క్రితము కట్టిన కీర్తన. పురుషోత్తము చౌదరి గారికి సన్నిధి కథ తెలిసినది.
అందరకు
తెలుసునుగాని ఎవరు లెక్కచేయుటలేదు. ఈ నోట్సు చాటించండి. ఇతరుల చెవిలో వేయండి. ఈ భాగ్యము అందరకు కలుగునుగాక! ఆమేన్.