(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

1. సన్నిధి కూటస్థులకు అయ్యగారు తన సన్నిధిలో చేసిన ప్రార్ధన



త్రియేక దేవుడవైన ఓ తండ్రీ! మేము నీ సన్నిధిలోనికి వచ్చియున్నాము. ఇప్పుడు ప్రార్ధనలో నీతో ఏకీభవించి మేము నీ మార్గములలో నడువలేనందున అయోగ్యులము. చెత్తకంటే, బందకంటే, బాడికంటే అయోగ్యులము తక్కువవారము.


ఎందుకంటే మేము నీ మాటల ప్రకారము నడువలేనివారము. అన్ని విషయములలో అపవిత్రులమే. శరీర విషయములో, ఆత్మీయ విషయములోను, వ్యాధిగ్రస్తులమైనను నీవు మమ్మును ఏర్పర్చుకొన్నావు అది నీ ప్రేమ. భూలోకములో అనేకమంది గొప్ప వారుండగా బైబిలు మిషనులో మమ్మును తగనివారిని ఏర్పర్చుకొన్నావు. భూలోక జ్ఞానులను, ఐశ్వర్యవంతులలో జ్ఞానులను ఏర్పర్చుకోలేదు. గొప్ప పని చేయుటకు మమ్మునేర్పర్చుకొన్నావు మేము నీ చిత్తము నెరవేర్చనందున నీ కోపము రేపిన వారము. తండ్రీ నీవు శక్తిగలవాడవు గనుక మాకు శ్రమలను, శత్రువులను, కష్టాలు రానిన్తున్నావని పైకి అనకపోయినను లోపల అనుకుంటున్నాము అదే మా పాపము, అదే మా నేరము.


మేము అజ్ఞానులము, కాని నీ దృష్టిలో మేము జ్ఞానులమని నీవు అనుకొంటున్నావని మేము అనుకుంటున్నాము. శ్రమలవలన శ్రమలు కలుగగా విసిగి, కష్టము కలిగియుంటున్నాము. దేవుడు ఎందుకు జబ్బులను, దయ్యములను, పిశాచములను రానివ్వాలని అనుకొంటున్నాము. మాలో ప్రతి వారి మీద చెయ్యివేసి ప్రార్ధన వాక్కు వచ్చునట్లు శక్తితో నింపుము. మా ప్రార్ధనలో రెండు చిన్న అంశములు అగుపించుచున్నవి.


ఇంకా ఈ కన్వెన్షన్ కు ఎంతమంది రావాలో వారిని రప్పించుము. మేము కూటమునకు దేవాలయములో కూడుకోవలసినది కాని పేతురుయొక్క విడుదల కొరకు దేవాలయములో కాక ఇంటిలోనే కూడుకొన్నారు. ఆ విధంగానే మేము దేవాలయములోగాక సామానులు ఉన్న గదిలో కూడుకొనుట తప్పే. బలహీనులము గనుక ఈలాగు చేసినాము. తండ్రీ! నీ ఇష్ట ప్రకారము చేయనందుకు నీకు అయిష్టులము. నీవు ఇచ్చిన ఏ చిన్న పనియైనను కొన్ని వారములు చేసేవారము. అన్నీ ఇలాగే తండ్రీ! నీ వాక్యములో ఒకలాగ ఉన్న మా క్రియలలో ఒకలాగ ఉన్నను నీవు సహిస్తూ, అయోగ్యులమైన మమ్మును ఏర్పర్చుకొన్నావు. మేము కొద్దిగా సేవ చేస్తునాము సంపూర్తిగా చేయలేకపోతున్నాము అయినను క్షమించుము. సంతోషించలేక, ఏమిటి? ఏమిటి? ఏమిటి? అని విచారిస్తున్నాము. మాలోని ఆజ్ఞాతిక్రమము క్షమించుము.


మేము నిన్నును నీ కృపను లోకువచేసినవారము. మేము పాపులము అయోగ్యులమని మా యెడల నీవు చూపు కృప నిమిత్తమై నీకు స్తోత్రములు. మేము లోకులకంటే తక్కువ నీ కృపను దిక్కరించేవారమని ఒప్పుకొంటున్నాము. పరమ భక్తులకు కృపలేదు. మేమెందుకు ఆలోచించి విచారపడుచూ నిరీక్షించలేక పోయినందున పాపులము. మాకెందుకు జబ్బులు? అనారోగ్యము కలిగియుండాలి? అనవసరమైన పనులు చేయాలి? ఇవి మాకెందుకు? యుక్తకాలములో మీటింగుకు రాలేక పోవుటయే పాపము. మాకు వచ్చిన దర్శనాలు కొన్ని చెప్పలేక పోవుచున్నాము అందునుబట్టి పాపులము. అన్నిటిలోను నేరస్థులమే. ప్రతి నిమిషము కృతజ్ఞత చూపలేకపోవుచున్నాము. అందరిలో నీవు మమ్మును ఏర్పర్చుకొన్నందుకు ఎంతగా ధైర్యముతో సంతోషముతో సాగవలసియున్నాము. మాకు విచారము, అవిశ్వానము ఎందుకు? ప్రభువా! మమ్మును క్షమించుమనుట హేళనగా యున్నది. కాని తప్పుచేయకుండా ఉంచుమని అడగకుండా ఉండకూడదు. అది అవిశ్వాసము కాదు. నీవు సన్నిధి ఏర్పర్చిన తరువాత ఏర్పాటు గంట మానివేస్తే ఇంకొక గంటలో సన్నిధి దాటించుట మా తప్పు. 10 గంటలకంటే 10 గంటలకేగాని 10:30 గంటలకు ఎందుకు కూడుకోవాలి!


సమయమునుబట్టి మేము నేరస్థులమే. సమయమును బట్టి అవిశ్వాసులము. అజ్ఞానమునుబట్టి నేరస్థులమే. ఎక్కడా నేరస్తులమే. అది తీసివేసికొనలేకపోవుటనుబట్టి నేరుస్తులము. కూటములలోను, బైటకూడా నేరస్థులమే. కూటస్తులు నేరము చేస్తుంటే నాకెందుకు అని అనుకొనకూడదు. మమ్మును క్షమించుమని సిగ్గులేకుండా అడుగవలసి వస్తుంది. ఎన్ని అల్లరులు జరిగినా ధ్యానము చేయవలెను. మీరు మాకు 10 గంటలకు సన్నిధి జరుపుమని చెప్పినారు కాని సమయమునకు సిద్ధపడలేక పోవుచున్నారని నెమ్మదిగా సాధువుగా గద్దించినారు. నేను మీరు - “అన్ని సమయములకు సిద్ధపడలేక పోవుచున్నారని” ప్రభువు అయ్యగారితో అన్నారు. సన్నిధి కూటస్తులు ఆలస్యము చేయుట సన్నిధి లక్షణము కాదు ఇది మాకు బాగా తెలుసు. మావన్నీ లోపాలే అయినను సహించుచున్నావు. ఇప్పుడు మాకు అనుగ్రహించిన సమయమునకు స్తోత్రము. సన్నిధి గురించి మాకు కొంత తెలుసు. కొంత తెలియదు నీవు మాకు తీర్పు చేయుటకు రేపు న్యాయ పీఠముమీద కూర్చుంటే ఆకాశము, భూమి, పరలోకము, దేవదూతలు, స్వంత మనస్సాక్షి పరిశుద్ధులు, మామీద భూతాలు సాక్ష్యము పలుకుతారు. సన్నిధి కూటస్తులైతే మాత్రము నేరస్తులమైనందున, అయినను నీవు చెప్పిన కూటస్తులమైన మేము ఆ మహిమ స్థితికి రాలేదు. నేరస్థులమైన మమ్మును మెచ్చుకొని కొన్ని కొన్ని విషయములలో మమ్మును పొగడుచున్నందులకు కంటనీరు పెట్టుకొనుచున్నాము.

తండ్రీ! లోకములో యౌవనస్తులు యౌవ్వన ప్రాయములో జరిపినట్లు టైము ప్రకారము ఇప్పుడుకూడా జరుపునట్లు మేము చేయలేకపోవుచున్నాము. మాకున్న ఆలస్యములకు ఉదా:- స్కూలు జరుపునప్పుడు 5 నిమిషములు ఆలస్యమైనందున లేటు మార్కు వేయవలెనుగదా! పేపరు మిల్లులో పనిచేయువారికి కూలికి వస్తారు 5 నిమిషములు ఆలస్యమైతే కూలి ఇవ్వరు. మాదీ అంతే! తండ్రీ! మేము ఎందునుబట్టి చూచినను నేరస్తులమే. గనుక మమ్మును క్షమించుము. దయగల ప్రభువా! రేపు మీటింగు 9 గంటలకు ఆరంభించవలసి యుండి 5ని॥లు ఆలస్యమైతే అది అక్రమ కూటమగును. ఈ దినమే ఈలాగు చేస్తే రేపు ఏలాగు? ఎవరు ఆలస్యము చేసినా సన్నిధి కూటస్తులు ఆలస్యము చేయకూడదు. మేము సరియైన సమయానికి కూడుకొనునట్లు ఆశీర్వదించుము. దయగల ప్రభువా! రేపు ఎవరు రావలెనో వారిని రప్పించుము. వారికి వాక్యము వచ్చేటట్లు చేసి ప్రేరేపించుము. ఎవ్వరు రాకూడదో వారిని రాకుండా ఆపుచేయుము. రాకూడనివారు సైతాను ప్రతినిధులు. రాకూడని వారికి కీడు తొలగించుము. రాకూడనివారు వస్తే రావచ్చును గాని వారికి మాకు సంబంధము లేకుండా చేయుము. వారిని వారి నోళ్లను బంధించుము. సైతాను వాని దూతలు పిలిచినా పిలువకపోయినా వాటివల్ల కీడు కలుగుకుండా చేయుము.

ఈ మా ప్రార్ధన త్వరగా రానైయున్న నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రీ! ఆమేన్.