క్రమకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు

10. సమర్పణ

న్యాయాధి. 11:29.



ప్రార్ధన:- ఈ దిన కార్యక్రమమంతటిని దీవించుము. నీవు దేవుడవు. మేము మనుష్యులము. నీ సంగతులను మేము గ్రహించలేము. అయినను నీవు తెలియజేయుచున్నందుకు స్తోత్రములు. వర్తమానమును నిన్న ఇచ్చినావు. స్తోత్రములు. ఈ వేళ ఇవ్వనైయున్నావు స్తోత్రములు. మేము నీ చిత్తమునకు బంధింపబడే వర్తమానమిమ్ము. మీరు నోవహును ఓడ కట్టమన్నారు అతడేమియు ప్రశ్నవేయకుండగా గొప్ప అద్భుతము జరిగింది. ఎందుకంటే ప్రశ్నలు వేయకుండ నీవు చెప్పినట్టు చేసినాడు. గనుక అది జరిగింది. ఎంత గొప్ప విధేయత. భక్తి అనగా అదే. మాకుకూడా అట్టిది దయచేయుము.


గోఫెరు కర్రతో అతడు కట్టిన నావ నీ కుమారునితో కట్టిన సంఘమునకు ముంగుర్తు. అట్టి విధేయత స్థితి మాకు దయచేయుము. నీవు చెప్పినట్లు కర్రతో కట్టాడు. గొప్ప పేరు వచ్చింది. కర్రతో కట్టిన నావకు, భక్తులతో నీవు కట్టిన సంఘ ఓడకు ముంగుర్తు అనేపేరు వచ్చింది. మనుష్యులు తప్పు చేస్తే మాత్రము అంత శిక్షా ప్రభువా! అనే మొదలైన ప్రశ్నలేమి వేయక నీవు ఆజ్ఞాపించినట్లు చేసాడు గనుక నీయందు విశ్వాసముంచిన మనుష్యులతో కట్టబడిన సంఘము, ఓడకు ముంగుర్తు అనేపేరు వచ్చింది. ఆ కర్ర ఓడ ఏ మాత్రము. ఒక్క ఆర్మీ ఆ దేశములోనిది మాత్రమే గనుక అది అంత గొప్పదికాదు. నీవు కట్టే ఓడ భూలోకమంతటికి సంబంధించిన సంఘమనే ఓడకు ముంగుర్తు అయ్యేటంత ఘనత వచ్చినది. ఎందుకంటే ఆయన తన్నుతాను నీ ఆజ్ఞకు ఆపాదించుకొన్నాడు. మేమును అట్లే మా చిత్తమును నీ చిత్తమునకు బంధించే సమర్పణ మాకు దయచేయుము.


కర్రతో కట్టబడక సజీవులైన మనుష్యులతో కట్టబడిన నావకు ముంగుర్తుగా చెప్పినట్లు కర్రతో కట్టాడు. గొప్ప పేరు వచ్చింది. కర్రతో కట్టిన నావకు, భక్తులతో నీవు కట్టిన సంఘ ఓడకు "ముంగుర్తు అనేపేరు" గానుండే గొప్ప స్థితియే దాని స్థితి. ఓడ కాలాల ప్రకారము కట్టుట, ఎన్నడు జరుగని ప్రవాహమును సహించి ఓడ కట్టెను. అది నీవు చెప్పినట్లు చేయుటలో ఉన్నది. మేముకూడ నీవుచెప్పిన దానికి ఎదురు చెప్పకుండా లోబడే కృప దయచేయుము. నోవహు ప్రత్యక్షత గొప్పది. ఎందుచేత? అతని హృదయ పరిశుద్ధత అంత గొప్పది. ఒక మనిషి మనిషితో చెప్పినట్లు చెప్పినావు. నీ ఆజ్ఞ ప్రకారము అతడు చేసినాడు. గనుక నీ చిత్త ప్రకారం సమర్పణ కావాలి.


నీ చిత్తము చూచి చిత్తము ప్రభువా! అనే సమర్పణ మాకిమ్ము. మేమైతే ఎన్నో ప్రశ్నలు వేసియుందుము. నోవహు ఓడ ఎంత గొప్పదంటే సంఘ ఓడకు పోలికగా ఉండేటంత గొప్పది. ఎవరు నీ చిత్తమునకు ఎదురు చెప్పరో, ప్రశ్న వేయరో వారికి నీ మర్మము బైలుపర్చుదువు. తన చిత్తమును బంధించి, చిత్తము ప్రభువా! అని నీ చిత్తమునకు ఒప్పచెప్పుకున్నాడు.


మాస్టరు పిల్లలకు చెప్పినట్లు నీవు నోవహుకు డిక్టేటు చేయగా లేక డ్రాయింగు వేయమనగా వెంటనే చేసెను. పిల్లలైతే ఇంకొకసారి చెప్పమందురు. నోవహు అట్లు అడుగలేదు. ఈ మధ్య ఆ ఓడ నేటికాల ప్రజలకు బైలుపడినది. ముంచే వానవచ్చి నోవహు ఓడను తేల్చే. ఓడ అయింది. ఎందుచేతనంటే నీవు చెప్పినట్లు చేసినాడు. నీ ఆజ్ఞ దుర్జనులను ముంచును. సజ్జనులను తేల్చును. నీవు అతనిని(నోవహు) కట్టినావు. గనుక అతడు ఓడ కట్టినాడు. నీవు చెప్పినట్లు చేస్తే గొప్ప అద్భుతములు ఈ వేళకూడా జరుగును. అతడు నీవు చెప్పగా నీ చిత్తము ప్రభువా! అనగానే ఎంతో అద్భుతము జరిగెను. మేముకూడా నీవు చెప్పినట్లు చేసే కృప దయచేయుము.


ఉపాధ్యాయుడు పిల్లవానిని కూర్చోబెట్టి డ్రాయింగు ఇక్కడనుండి ఇక్కడకు ఇది ఇక్కడ ఇది, అని ఎట్లు చెప్పునో అట్లే నీవు ముఖాముఖిగా నీవు చేయించినావు. ఎందుచేతనంటే నీవు చెప్పినట్లు చేస్తాడు. ఆదికాండములో ఒక చిన్న వాక్యమున్నది. దేవుడు చెప్పినట్లు నోవహు చేసెను. గనుక (Certificate) ఇచ్చినావు. అట్టి సర్టిఫికెట్ మాకు కూడా ఇమ్ము. వెర్రిబాగులవానివలె ప్రశ్నలు వేయకుండా చెప్పినట్లు చేసాడు. మా గదిలో నోవహువలె ఎవరికి ప్రత్యక్షత కావలెనో అట్టివారికి ఈ పాఠమే గొప్పది. నోవహు వంటి విధేయత మాకుకూడా దయచేయుము. తెలుసుకొనుటకైనా ప్రశ్నలు వేయలేదు. ఎంత గొప్ప విధేయత. అబ్రాహామైన వేశారు. 50మంది ఉంటే నాశనము చేస్తావా? ఆ జనుడే దైవజనుడు. ఎంత ఘనుడు! నోవహు మాతో ఎవరికైనా నీవేమైనా చెప్పితే ఎన్నో ప్రశ్నలు వేయుదుము. నీవు చెప్పినట్లు నోవహు చేశాడు. కనుక తన కుటుంబాన్ని సృష్టినికూడా రక్షించాడు. అట్టి కృప మాకును దయచేయుము. కర్ర నావ గొప్పదా? వెర్రివాడైన నోవహు గొప్పవాడా? అని ప్రశ్నవేస్తే సమర్పణ. మన దేశములోనున్న చితిసారకపు కర్రతో సమానమని తెలుగు బైబిలులో చితిసారకపు కర్ర అనేయున్నది. మన ఆలోచన వేరు. దైవాజ్ఞవేరు. ప్రభువే అన్ని రకములుగా మనకు ప్రత్యక్షపరచగలరు.


ప్రత్యక్షతలు:-

దేవుడు చెప్పినదానికి ఇంకేమియు ప్రశ్నలుండరాదు. ఉంటే అవి ఒక్క దేవుడు చెప్పిన వాటన్నిటికి వ్యతిరేకమైనవన్ని సాతాను చేయును. ప్రభువు చేసిన దానికి వ్యతిరేకముగా దయ్యము చెప్పితే తండ్రినడుగవచ్చును.