సమర్పణ ప్రార్ధనలు స్తుతులు
Index
ప్రకటన గ్రంథములోని స్తుతులు
-
1. ప్రకటన 1:6. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపములనుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు
కలుగునుగాక! ఆమేన్.
-
2. ప్రకటన 1:18. భయపడకుము, నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతినిగాని ఇదిగో యుగ యుగములు
సజీవుడనైయున్నాను.
మరియు మరణముయొక్కయు పాతాళ లోకముయొక్కయు తాళపు చెవులునా స్వాధీనములో ఉన్నవి.
-
3. ప్రకటన 4:8,9. (4 జీవులు చేసిన స్తుతి) భూత వర్తమాన భవిష్యత్కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు
పరిశుద్దుడు,
పరిశుద్దుడు, పరిశుద్దుడు అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. ఆ సింహాసనమునందు ఆసీనుడైయుండి యుగయుగములు
జీవించుచున్న
వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతా స్తుతులును కలుగునుగాక!
-
4. ప్రకటన 4:10-11. (24గురు పెద్దలు చేసిన స్తుతి) సింహాసనమునందు ఆసీనుడై యుండువాని ఎదుట సాగిలపడి యుగ యుగములు
జీవించుచున్నవానికి నమస్కారము చేయుచు - ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమునుబట్టి
అవియుండెను.
దానిని బట్టియే సృష్టింపబడెను. గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట
వేసిరి.
-
5. ప్రకటన 5:9,10. (4 జీవులు 24గురు పెద్దలు చేసిన స్తుతి) నీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు
యోగ్యుడవు. నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి
జనములోను,
దేవుని కొరకు మనుష్యులనుకొని, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను, యాజకులనుగాను చేసితివి. గనుక వారు భూలోకమందు
ఏలుదురని
కొత్తపాట పాడుదురు.
-
6. ప్రకటన 5:12. (దేవదూతల స్తుతి) వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు,
మహిమయు,
స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి.
-
7. ప్రకటన 5:13-14. (సమస్త సృష్టియు చేసిన స్తుతి) సింహాసనాసీనుడైయున్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు,
మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని. ఆ నాలుగు జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి
నమస్కారము చేసిరి.
-
8. ప్రకటన 6:9-10. (హతసాక్షులు చేసిన స్తుతి) వారు నాథా! సత్యస్వరూపీ, పరిశుద్దుడా, యెందాక తీర్పు తీర్చకయు, మా రక్తము
నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి.
-
9. ప్రకటన 7:10. (రక్షింపబడిన 144వేల మంది చేసిన స్తుతి) సింహాసనము ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన
మా
దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహా శబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి.
-
10. ప్రకటన 7:11-12. (దేవదూతల స్తుతి)
వారు
సింహాసనము ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగయుగములవరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు
శక్తియు
బలమును కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి ఆమేన్.
-
11. ప్రకటన 10:6. (పరలోకమునుండి దిగివచ్చిన బలిష్టుడైన దూత చెప్పినది) పరలోకమును అందులో ఉన్నవాటిని, భూమిని అందులో
ఉన్నవాటిని, సముద్రమును అందులో ఉన్నవాటిని, సృష్టించి, యుగయుగములు జీవించుచున్న వానితోడు ఒట్టుపెట్టుకొని ఇక
ఆలస్యముండదుగాని
దేవుడు తన దాసులగు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను.
-
12. ప్రకటన 11:15. (పరలోకమునుండి దిగివచ్చిన శబ్ధము) ఈ లోకరాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమునాయెను.
ఆయన
యుగయుగముల వరకు ఏలుననెను.
-
13. ప్రకటన 11:17-18. (24గురు పెద్దలు చేసిన స్తుతి) వర్తమాన, భూతకాలములలో ఉండు దేవుడవైన ప్రభువా! సర్వాధికారీ, నీవు
నీ
మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు. గనుక మేము నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాము. జనములు కోపగించినందున నీకు
కోపము
వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులగు ప్రవక్తలకును పరిశుద్ధులకును, నీ నామమునకు భయపడువారికిని, తగిన ఫలము
నిచ్చుటకును గొప్పవారేమి, కొద్దివారేమి భూమిని నశింపజేయువారిని నశింపజేయుటకును సమయము వచ్చియున్నదని చెప్పిరి.
-
14. ప్రకటన 12:9. (పరలోకమునుండి వచ్చిన శబ్ధము) కాగా సర్వలోకమును మోసపుచ్చుచు, అపవాదియనియు, సాతాననియు పేరుగల
ఆదిసర్పమైన ఆ
మహాఘటసర్పము
పడద్రోయబడెను. అది భూమిమీద పడద్రోయబడెను. దాని దూతలు దానితోకూడ పడద్రోయబడిరి.
-
15. ప్రకటన 12:10-12. (పరలోకమందు) రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరులమీద నేరము మోపువాడైన అపవాది
పడద్రోయబడియున్నాడు.
గనుక ఇప్పుడు రక్షణయు, శక్తియు, రాజ్యమును మన దేవునివాయెను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను. వారు గొర్రెపిల్ల
రక్తమును
బట్టియు, తామిచ్చిన సాక్ష్యమునుబట్టియు వానిని జయించియున్నారు. గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించినవారుకారు.
అందుచేత
పరలోకమా పరలోక నివాసులారా! ఉత్సహించుడి; భూమీ, సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహు
క్రోథము
గలవాడై మీయొద్దకు దిగి వచ్చియున్నాడని చెప్పెను.
-
16. ప్రకటన 14:7. (దేవదూత చెప్పినది) మీరు దేవునికి భయపడి ఆయనను మహిమ పరచుడి. ఆయన తీర్పుతీర్చు గడియవచ్చెను. గనుక
ఆకాశమును,
భూమిని, సముద్రమును, జలధారలను కలుగజేసిన వానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను.
-
17. ప్రకటన 14:8. (వేరొకదూత చెప్పినది) మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహా
బబులోను
కూలిపోయెను కూలిపోయెను అని చెప్పెను.
-
18. ప్రకటన 15:3-4. (క్రూరమృగమునకు లోబడనివారు చేసిన స్తుతి) ప్రభువా, దేవా,
సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములును, సత్యములునైయున్నవి.
ప్రభువా,
నీవు
మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్ష పరచబడినవి గనుక
జనములందరు వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసెదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు
పాడుచున్నారు.
-
19. ప్రకటన 16:5-7. (జలముల దేవదూత చెప్పినది) వర్తమాన భూత కాలములలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును, ప్రవక్తల
రక్తమును
వారు కార్చినందుకు తీర్పుతీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి, దీనికి వారు పాత్రులే. నీవు ఈలాగు తీర్పు తీర్చితివి
గనుక
నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని. అందుకు - అవును ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ తీర్పులు సత్యములును
న్యాయములునై యున్నవని బలిపీఠము చెప్పుట వింటిని.
-
20. ప్రకటన 16:15-16. (ప్రభువు చెప్పినది) ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున
జనులు తన
దిసమొలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు.
-
21. ప్రకటన 17:14. (దూత చెప్పినది) వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురుగాని, గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును, రాజులకు
రాజునై యున్నందునను, తనతోకూడ ఉండినవారు పిలువబడినవారై, ఏర్పరచబడిన వారై నమ్మకమైనవారై యున్నందునను, ఆయన ఆ రాజులను
జయించును.
-
22. ప్రకటన 18:20. (దూతలు చెప్పినది) పరలోకమా పరిశుద్ధులారా, అపోస్తలులారా, ప్రవక్తలారా దానిగూర్చి ఆనందించుడి.
"ఏలయనగా
దానిచేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చి యున్నాడు".
-
23. ప్రకటన 19:1-7. (పరలోకములోని జయశబ్ధము) ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. ఆయన
తీర్పులు
సత్యములును న్యాయములునైయున్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి, తన దాసుల
రక్తమును
బట్టి దానికి ప్రతిదండన చేసెను. మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అనిరి. ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి
లేచుచున్నది. అప్పుడు ఆ 24గురు పెద్దలును నాలుగు జీవులును సాగిలపడి ఆమేన్.
ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు
సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారలారా, కొద్దివారేమి, గొప్పవారేమి
మీరందరు ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న యొక స్వరము సింహాసనమునొద్దనుండి వచ్చెను. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును
విస్తారమైన జలముల శబ్ధమును బలమైన ఉరుముల శబ్ధమును పోలినయొక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు.
ఆయనను
స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొనియున్నది. గనుక మనము సంతోషపడి
ఉత్సహించి ఆయనను మహిమ పరచెదమని చెప్పగా వింటిని.