క్రమకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు
5. ప్రత్యేకమైన ప్రార్ధన
(మత్తయి 6:6)
మనకు తెలిసిన వాక్యములు సందర్భానుసారముగా చదువుకొనిన యొడల, క్రొత్త వెలుగు దానిలోనుండి బయటకు వచ్చును.
- 1. త్రియేక దేవుడవైన తండ్రీ! విపత్తు కాలములో మేము నీకు ఒక మనవి చేయుటకై సంతోషముతో వచ్చియున్నాము. విచారము, భయము, స్వేచ్చలేనితనము ఉండవలసిన సమయమిదే. అయినను మీ వాక్య వాగ్ధానమునుబట్టి సంతోషము, థైర్యము, స్వేచ్చ, సేవలో తీవ్రత కలిగియుండవలసిన సమయముకూడ అదే. మొదటి శతాబ్దములో ఈ సంఘమును వ్రేళ్ళతోపాటు నాశనము చేయవలెనని ఉద్దేశించిన, సర్వభూగోళ చక్రవర్తులైన రోమా దేశీయులు ఏమియు చేయలేకపోయిరి. అందుచేత నీ సంఘము ఒక నదివలె ఇరువది శతాబ్ధముల వరకు, మా యొద్దకు ప్రవహించుచు వచ్చినది. ఇది నీ ప్రభావము గనుక నీకు స్తోత్రములు.
- 2. నేడు మా కాలములో, మా దేశములో, నీ సంఘముయొక్క మేళ్ళు అనేక విధములుగా అనుభవించుచున్న అనేకులు, నీ సంఘమును వృద్ధికాకుండ చేయవలెననియు; క్రైస్తవులు, హిందూ దేశ మతములోనికి మరలా రావలెననియు; దేశీయమతము యుండగా పరదేశమతము ఎందుకని వాదించుచున్నారు. మరియు బైబిలులో "కాని సంగతులు" అనేకములున్నవని ద్వేషభావముతో పలుకుచున్నారు. పత్రికలు వేయుచున్నారు. గ్రంధములు ప్రచురించుచున్నారు. గనుక దేవా! వారి ఆలోచనలను బంధించుము. వారి మాటలను, ఉపన్యాసములను బంధించుము. వారి పత్రికాదులను బంధించుము. వారి ఇతర ప్రయత్నములను బంధించుము. అనగా హానిచేయు ప్రయత్నములను బంధించుము. కాని ముందుగా మేము, మా ప్రార్ధన గదిలో వాటిని బంధింపగల చురుకుతనము దయచేయుము. భయమును, అపనమ్మకమును మాలోనుండి తీసివేయుము. అప్పుడు మేము బంధింపగలము.
- 3. ఇశ్రాయేలీయులయొక్క శత్రువులను చెలరేగనిచ్చినట్లుగా, మా శత్రువులను చెలరేగనిచ్చుట అనగా వారు చెలరేగుచుండగా, నీవు ఊరకుండుట ఎందుకనగా మా చేత ప్రార్ధనలు చేయించుటకే; మా చేత ఎక్కువ సేవ బహు తీవ్రముగా కొనసాగించుటకే. అందుకే నీవు మౌనముగా నున్నావు గనుక నీకు వందనములు.
- 4. వారు ఏయే ప్రయత్నములు చేయుచున్నారో, ఆయా ప్రయత్నములకు మించిపోవు ప్రయత్నములు, మేము సదుద్దేశ్యముతో చేయులాగున, మాకు శాంత మనస్సును, జ్ఞానోదయమును అనుగ్రహింపుము.
-
5. మరియు వారు వారి దేవతలను ప్రార్ధించుచుండగా మేము నిన్ను ప్రార్ధించుచున్నాము. వారు (దుర్భోధన) ప్రచారము చేయుచుండగా,
మేముకూడ సద్భోధ ప్రచారము చేయునట్లు, మా నోళ్ళకు, మోకాళ్ళకు సత్తువ దయచేయుము. వారు బాహాటమైన సభలలో గంభీరమగు
దూషణోపన్యాసములు
చేయుచుండగా మేము - "నిన్ను అడుగు ప్రతివానికి సమాధానము చెప్పుము" అను వాక్య ప్రకారము, వారికి న్యాయమైన రీతిని
నచ్చచెప్పగల
ఉపన్యాసములు చేయుటకు, మా గుండెకు సత్తువ మా జ్ఞానమునకు శక్తి సమాధానము చెప్పగల వాక్యములను మా జ్ఞప్తికి అందించుము.
ఎందుకనిన
"మీరు కాదు, వారికి ఏమి జవాబు చెప్పవలెనో, అది ఆత్మయే మీకు అందించును" అని వ్రాయించినావుగదా! (మత్తయి 10:19,20). గనుక
మాకు
నీ ఆత్మ సహాయము చూపించుము.
దర్శనవరముగలవారికి ప్రత్యక్షమగుము. వారి పత్రికలకు, పుస్తకములకు తగిన జవాబు వ్రాయుటకై మా హస్తములకు చాకచక్యము, వాటిని అచ్చువేయించుటకు కావలసిన ధనరాశిని సమకూర్చుము. వారు కుట్రాలోచన చేయుచుండగా మేము మంచి ఆలోచనలు చేయుటకై మంచి ఆలోచనను మాలో పుట్టించుము. - 6. మా ప్రభువా! నీవు సిలువ మ్రానుమీద నున్నప్పుడు "తండ్రీ! వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించుము అని ప్రార్థించిన విధముగా మేముకూడ ప్రార్థించునట్లు మమ్మును క్షమాపణ స్థితికి నడిపింపుము. మరియు తండ్రీ వారినికాదు, వారియొక్క దుష్ట ప్రయత్నములను దుంపనాశనము చేయుము. ఈ సమయమందే చైనాలో జరిగినట్లు, మా దేశస్థులుకూడ బైబిలుకొరకు బైబిలు సొసైటీ వారికి వ్రాసికొనునట్లు ప్రేరేపించుము. ప్రజలందరు మాకు క్రైస్తవ బోధలు, క్రైస్తవ పత్రికలు, పుస్తకములు కావలెనని కేకవేయగల ఆర్భాటశక్తి ప్రజలలో కల్గించుము.
-
7. ఓ దేవా! అంతములేని కృపగల దేవా! నీకు స్తోత్రములు. సాతాను తనకు ఎక్కువ సమయములేదని చెలరేగి విశ్వాసులమీద పడుచున్నాడు.
అతని
ఆలోచనలు సాగనీయకుము. అతని ప్రయత్నములు నెరవేరనీయకుము. అతని పన్నాగములను చెడగొట్టుము. అలాగుననే ఇప్పుడును లోకమంతట
తిరిగే
భూతములను వాటియొక్క పనులను నీవు బంధించుము. ఆమేన్.
షరా:-- 1) మన దృష్టిలో ఎవరైనా బంధింపబడిన వారున్నయెడల వారిని తలంచుకొని ఈ పైన వ్రాసిన విధముగా ప్రార్ధించవలెను.
- 2) సాతాను ఎదిరింపుల పుస్తకము 6వ పేజిలో 11వ ఎదిరింపును చూడండి.