సమర్పణ ప్రార్ధనలు స్తుతులు
Index
6. మిశ్రమ ప్రార్ధనాంశము
-
1. ప్రార్థన:- ఓ దయగల తండ్రీ! నీవు ప్రార్ధనలు వినువాడవగుటవలన, నీ సన్నిధికి వచ్చి ఏదైన చెప్పుకొనవచ్చుననియు,
అడుగుకొనవచ్చుననియు తెలిసి నిన్ను స్తుతించుచున్నాను. నాకు కావలసినవి నీకు ముందుగానే తెలిసినను, అడుగుడి మీకియ్యబడునని
చెప్పినావు గాన నా మనవులన్నియు నీ యెదుట సమర్పించుకొనుచున్నాము.
ఓ తండ్రీ! నాకు ఏమియ్యవలెనని నీకు ఉన్నదో అదే దయచేయుము. నేను ఎల్లప్పుడు నీ సన్నిధిలో స్వేచ్చగా సంచరింపగల బిడ్డనుగా
నన్ను
స్థిరపరచుచుండుము. కష్టకాలములోను, సంగతులు అర్థముకాని కాలములోను నేను నీ పక్షముగా నిలువబడగల ధైర్యము దయచేయుము.
నిన్నుగూర్చి
నాకుగల మంచి అభిప్రాయమును మారనీయకుము. పాపమునుండియు, పాపఫలితము నుండియు నన్ను కాపాడుచుండుము. ప్రతి పర్యాయము నీ
వాక్యమును
నాకు బోధపరచుచుండుము. నా ఆత్మతో సదా మాట్లాడుచుండుము. మరియు నీ విషయమై కృతజ్ఞతతో, కష్టపడి పనిచేయగల సేవకునిగా నన్ను
స్థిరపరచుచుండుము.
నన్ను పెండ్లికుమార్తె వంశమునుండి విడిపోనీయకుము. నీకిష్టములేనివి నేను అడుగతలచినప్పుడు అవి
ప్రార్ధనా
వాలులోనికి రాకుండా తప్పించుము. మరియు ఒక అంశమును గురించి ప్రార్ధింపవలసిన గడియ దాటిపోనీయకుము. నాకు ప్రార్ధన వాలు
దయచేయుము.
సర్వజనులకు నీవాక్యవార్త అందింపగల బోధకులను పంపుము. వాక్యముపదేశించు ఏర్పాటులన్నిటిని వృద్ధిచేయుము. పాపులకు,
బాధితులకు,
బీదలకు అన్యాయము పొందుచున్నవారికి తోడైయుండి, వారి పక్షమున జరుగవలసిన సర్వకార్యములను వృద్ధిచేయుము. ఈ ప్రార్ధన నీ
కుమారుని
ముఖముచూచి ఆలకించుము. ఆమేన్.
-
2. సమర్పణ:- ఓ దేవా! నీవు నాకు ఇచ్చినవన్నియు నీకు సమర్పించుచున్నాను. నా శరీరమును, నా ఆత్మను, నాకు కలిగియున్న
సమస్తమును,
నా జీవితకాలములోని గతకాలమును, నేటి కాలమును, రాబోవుచున్న కాలమును నీకు అర్పించుచున్నాను. నీ చిత్తము ఏదో అదే నా
చిత్తమైయున్నది. నీ చిత్తము అనేకమారులు నాకు ఇష్టముగా నుండకపోయినను, నేనది ఇష్టపడునట్లు సహాయపడగోరుచున్నాను. ఏది నేను
చేయలేకపోవుచున్నానో దానిని, నా బంధువులను, స్నేహితులను, అధికారులను నేనంటే ఇష్టములేని వారిని మరియు శత్రువులను,
నీకప్పగించుచున్నాను. మమ్మును బాధపెట్టు పురుగులు, జంతువులు, పక్షులు మొదలైన వాటిని నీకు సమర్పించుచున్నాను.
అలాగే
మాకు
బాధాకరముగా నున్న దయ్యములను, సాతానును, తత్ సంబంధమైన వాటినన్నిటిని నీవశము చేసికొనుము. మాకు హానికరముగానున్న
పంచభూతములను
నీకు అర్పించుచున్నాను. ఈ అర్పణ నీ కుమారుని పరిముఖముగా చూచి అంగీకరించుము. ఆమేన్.
-
3. రాకడ ప్రార్ధన:- ఒక గ్రామములో అందరు కలహములతో నుండిరి. ఒక దినమున తన జ్వరముగానున్న కుమార్తెను చూడవచ్చిన
తండ్రి,
భయంకరమైన కలహముల సంగతి విని, తన కుమార్తెను తన ఇంటికి తీసికొనిపోయెను. ఈ లోకము గత్తరలోకము, వ్యాధుల లోకము, విషపురుగుల
లోకము,
మరణలోకము, దయ్యాల లోకము, దయ్యాలకు లోబడిన మనుష్యులున్న లోకము కాబట్టి మన తండ్రియైన దేవుడు మనలను ఇచ్చటనుండకుండ
మోక్షమందిరమునకు తీసికొనివెళ్ళును. ఆయన శీఘ్రముగా వచ్చును. ఇదే రెండవరాకడ.
తండ్రి తన కుమార్తెను తీసికొని
వెళ్ళునప్పుడు
"రాను" అని చెప్పదు. మనముకూడ మేఘములోనికి "రాము" అని చెప్పకూడదు. ప్రభువా! తండ్రి! సిద్ధముగానున్నాను అని చెప్పవలెను.
ఓ
ప్రభువా! మేమట్లు చెప్పగల కృప దయచేయుము. ఆమేన్.