క్రమకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు
7. మీ శరీరములను సమర్పించుకొనుడి
అన్యులు శరీరమునకు ప్రాముఖ్యమిత్తురు. ఆత్మకు శరీరము పంజరము వంటిది. క్రైస్తవులు శరీరమునకు ప్రాముఖ్యమీయరు. ఈ శరీరమును ఎవరిచ్చారు? (రోమా 11:36). ఇది ప్రభువు మూలమున ప్రభువు నిమిత్తము కల్గినది. హెబ్రీ. 10:5లో నాకొక శరీరము అమర్చితివి. ఆది 1:27లో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. 1కొరింథీ 6:19-20. మీ దేహము దేవుని వలన మీకనుగ్రహింపబడి పరిశుద్దాత్మకు ఆలయమైయున్నది గనుక ఇష్టము వచ్చినట్లు చేయవచ్చా? దయతో ఇచ్చిన దేవుని ఆలయమును ఎవడైన పాడుచేసిన యెడల దేవుడు వానిని పాడుచేయును.
1కొరింధీ. 3:17. దేహము దేవుడిచ్చినదానము. అది పరిశుద్ధమైనది. దేహములో పరిశుద్దాత్మ ఉన్నాడు. మీరు విలువబెట్టి కొనబడినవారు 1కొరింధీ 7:23. వెండి బంగారములతో కొనబడలేదు గాని అమూల్యమైన రక్తముచేత కొనబడినారు. నిష్కళంకమైన గొర్రెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత కొనబడినారు. 1పేతురు 1:18-20. గనుక తరతరముల వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టుడి.
60సం॥ల నాటి కధ. రాజమండ్రిలో ఊలు దొరగారు ఉండెడివారు. ఆయనకు బుషి అని పేరు పెట్టినారు. ఆయన హాస్టల్లో ఒక కుర్రాడు, దొంగతనము చేస్తే ఆ కుర్రవాడ్ని దొరగారి దగ్గరకు తీసికొనివస్తే "మీ నాయన దొంగ, గనుక నీవు దొంగవైనావు" అని అన్నారు. నీ తాతల దగ్గరనుండి దొంగతనము నీకు వచ్చినది. పెండ్లిండ్లు కావాలంటే పురోహితుని దగ్గరకు వెళ్ళుదురు. నీవెంత చదివిన లాభమేమి? తల్లిదండ్రుల దగ్గరనుండి వచ్చిన దురలవాటు పోలేదు. వేషము మారినదా? భాష మారినదా? మూల్యము అంటే ధర. అమూల్యము అంటే ధర కట్టలేనంత విలువపెట్టి నీ దేహము కొనబడినది.
ఒక కుర్రవాడు గలడు. అతని తండ్రికి అతను ఒక్కడే అని బాగా పెంచుచున్నారు. ఆ పిల్లవాడు తోటలోకివెళ్ళి చెట్టు నరికి చిన్న పడవ చేసినాడు. దానిని వాగులో పడవేసినాడు. రెండు క్షణములలో కొట్టుకొని పోయినది. ఎంతో దుఃఖపడ్డాడు. ఆరు రోజులకు సంతలోనికి వెళ్ళినాడు. బజారులో ఒకని దగ్గర ఆ పడవ యున్నది. అపుడు అతడు దానిని చూచి నాది అంటే ఇస్తాడా? ఇవ్వడు గనుక అప్పుడు అతడు తన తండ్రి దగ్గరకు వెళ్ళి డబ్బు తెచ్చి కొనుక్కొన్నాడు. యేసుప్రభువు నీ కొరకు నాకొరకు చేసిన పని ఏమిటి? దేవుని స్వరూపమందు మనుష్యుని చేసినాడు. కాని మానవుడు చెడిపోయినాడు. ప్రభువు తన రక్తము కార్చి సిలువవేయబడి, మనల్ని కొనుక్కొన్నాడు. చనిపోయి, లేచినాడు. అట్లు బ్రతికిన మీరు బలి అవండి. పౌలు - నేను ప్రభువుతో సిలువవేయబడ్డాను, ప్రభువే నాయందు జీవించుచున్నాడు. నేనుకాదు. ఇది క్రైస్తవ రహస్యము, ఆనందము. కొరింథీ. 9:2.
మాసిదోనియ సంఘముయొక్క ఆసక్తిని గుర్తించండి. కాడి, బలిపీఠము, ఎద్దువలె కాడిమోయాలి. అవసరమైతే బలికావాలి. అదే క్రైస్తవ జీవితము. నేను ఏ కార్యము చేసిన క్రీస్తు కొరకే చేస్తాను అనాలి. అర్పణ అంటే కష్టము. చిన్న నాణెము వేస్తాము. కాని దశమ భాగము ఇవ్వాలి. వారికి ఉద్యోగముండదని బావమరిదికో, బంధువులకో ఇస్తారు. ఇస్తున్నామంటే ఇస్తున్నాము. దేవునికి నీ అర్పణ చాలా అవసరము. ఒక ప్రయాణికుడు వెళ్తున్నాడు. ఒక ఊరు వెళ్ళునప్పుడు చీకటి పడి సత్రములోకి వెళ్ళినాడు. మీసాలు పెట్టుకొని ఒక వ్యక్తి సామాను పట్టుకొని కనపడ్డాడు. గుండె జల్లుమంది. వీడేమి చేయునని కీర్తనపాడాడు. వాడే రైటు పాడాడు. ఇతగాడు తప్పు పాడాడు. ప్రార్ధన చేస్తానని మోకాళ్ళమీద ప్రార్థన చేస్తున్నాడు. వాడును చేస్తున్నాడు మరునాడు ఇతడు గుడిలో కానుక తీసి చందా వేస్తున్నాడు, వాడు కానుక దగ్గరకు రాగా పారిపోయాడు.
- 1) పరిశుద్ధముగా ఉండాలి,
- 2) అనుకూలముగా ఉండాలి,
- 3) సజీవయాగము చేయాలి.
సువార్త అను యాగము, హెబ్రీ. 10:23. వాగ్ధానము చేసినవాడు నమ్మదగినవాడు. గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది నిశ్చయముగా పట్టుకొందాము. 2కొరింధీ. 12:15. చందా ఇస్తున్నాను. అది ఇస్తున్నాను. ఇది ఇస్తున్నాను. స్పర్జను అను భక్తుడు "నీవు బాప్తిస్మము పొందినప్పుడే నీ ధనముకూడ బాప్తిస్మము పొందినది అనెను".
2కొరింధీ. 8:4-5. మక్కువ కలిగినవారు సామర్ధ్యము కొలదియేకాక సామర్ధ్యముకంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరి. దేవుని చిత్తము వలన మాకును, తమ్మును తామే అప్పగించుకొనిరి. ఆమేన్.