క్రమకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు
4. స్విచ్ ప్రార్ధన
(బంధింపు ప్రార్ధన)
యేసుప్రభువా! ఈ వేళ లేచిన వెంటనే స్విచ్ ప్రార్ధన చేయుచున్నాము (మత్తయి 18:18). మనము చేయవలసిన ప్రార్ధనలు అన్నియు చేసి ముగింపవలెను. స్విచ్ మనము వేయగానే వెలుగురాదు. అయినప్పటికిని మరియొక మారు నొక్కముగాని, వెలుగు వచ్చువరకు కనిపెట్టుదుము.
రెండవరాకడ సమీపమందున్న మనము మరొక మారు నొక్కుట అవసరములేదు. గనుక చేయవలసిన ప్రార్ధనలు త్వరగా కాలానుసారముగా చేసి కనిపెట్టవలెను. అప్పుడు ఇశ్రాయేలీయులు, ఎర్ర సముద్రమువద్ద తమ శత్రువులవలన కలుగవలసిన బాధనుండి విమోచితులైన రీతిగానే, మనమును విమోచితులమగుదుము.
భూమిమీద మనము బంధించువాటిని పరలోకమందు ప్రభువు బంధించును. మనము వేటిని విప్పుదుమో వాటిని ప్రభువు పరలోకమందును విప్పును. మన ఇష్టము ఈ రెండు వాక్యములలో (పంక్తులలో) కనబడుచున్నది. మన స్వాతంత్ర్యమునుబట్టి మన చిత్తమే కనబడుచున్నది. ఇది ఎంత ధన్యత! అనేకమంది భక్తులే ఈ ధన్యతను పోగొట్టుకొనుచున్నారు. పరలోకమందు వెలుగు ఉన్నట్లు భూలోకమందు స్విచ్ అనగా మన ప్రార్ధన ఉండును. అనగా మన ప్రార్ధనగదిలో ప్రార్ధన వెలుగువలె నుండును.