1. జాదలనాస
గ్రంథకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు
2రాజులు 13:23.
“యెహోవా వారిమీద జాలిపడి వారియందు దయయుంచి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసియున్న నిబంధననుబట్టి వారియందు లక్ష్యము నిలిపి వారిని నాశనము చేయనొల్లక ఇప్పటికిని తమ సముఖములోనుండి వారిని వెళ్ళగొట్టక యుండెను.”
నేటిదిన వాక్యాహారము కొరకు వచ్చిన వాక్యాసక్తిపరులారా! వాక్యములోని ఆయన జాలి, దయారసములు మీకు అందునుగాక. ఆమేన్.
ఈ వచనములోని కొన్ని ముఖ్యమైన పదములను వివరించుదును. ముందుగా ఆ ముఖ్య పదముల మొదటి అక్షరములతో రూపొందించబడిన ఒక మాటను మీకు పరిచయము చేయుదును. జాగ్రత్తగా వినండి:
జా,ద,ల,నా,స :- అబ్రాహాము, యాకోబు, ఇస్సాకులను బట్టి దేవుడు ఇశ్రాయేలీయులను కాపాడెను. దేవదాసు అయ్యగార్నిబట్టి క్రీస్తుప్రభువు బైబిలుమిషను వారిని కాపాడుచున్నాడు. అరామీయుల రాజు అయిన హజాయేలు దమస్కులో నుండి ఇశ్రాయేలీయుల ముఖ్యపట్టణమైన షోమ్రోను పై దండెత్తుచున్నప్పుడు
- 1) జన నాశనము
- 2) పంట నాశనము చేసెడివాడు.
ఈ విధములైన శ్రమలు వచ్చుచునే ఉండును. యెహోయాహాజు ఇశ్రాయేలీయులకు రాజుగానుండిన కాలమంతయు హజాయేలు ఈ రీతిగా బాధించుచుండెను. ఇశ్రాయేలు సంఘమున జరిగిన విషయములను గురించి ఈ వాక్యము వ్రాయబడెను.
1. జాలి:- యెహోయాహాజు కాలములో ఇశ్రాయేలీయులు అరామీయుల వలన శ్రమనొందిరి. యెహోయాహాజుకు పూర్వము కూడ వారు శ్రమనొందిరి. ఈ శ్రమ అరామీయుల వలన కలిగినది. అలాగే క్రైస్తవులమైన మనకును శ్రమలు కలుగుచున్నవి. మన పూర్వికులైన క్రైస్తవులకుకూడ శ్రమలు కలిగినవి. ఈ వాక్యమునుబట్టి మనకు ఆదరణ. ఏలాగనగా, శ్రమలు మాకేకాదు మా పూర్వికులకుకూడా కలిగినవి అని తలంచవలెను. అపోస్తలుల కాలములో నీరో చక్రవర్తి కాలములోను, ఆ తరువాతకూడా ఆది సంఘ క్రైస్తవులు బహు శ్రమలుపొందిరి. శ్రమలయందు చూపు ప్రేమను “జాలి” అందురు. మన పూర్వికులకు దేవుడు 5 విధములుగా వారి శ్రమలలో ఆదరణ కలుగజేసెను. కాబట్టి మనకుకూడా అట్టి ఆదరణలను అనుగ్రహించెను.
- 1) జాలి అనగా నేమి
- 2) దయ అనగానేమి?
ఒకరు బాధపడుచున్నప్పుడు చూపించు ప్రేమను “జాలి” అందురు. ఇశ్రాయేలీయులు బాధపడుచున్నప్పుడెల్లా దేవుడు వారికి జాలి చూపించెను. ఆ విధముగానే మనకు శరీర బాధ వచ్చినను, ఇబ్బంది కలిగినను క్రీస్తు ప్రభువు మన మీద జాలి పడుచున్నాడని జ్ఞాపకముంచుకొనవలెను. ఆదరణ పొందవలెను. ఇది దేవునియొక్క ప్రేమ లక్షణము జాలి, దేవుని ప్రేమ లక్షణములలో ఒక భాగము.
2. దయ:- దేవునిప్రేమ రెండు భాగములు అనగా రెండు రకములు.
- (1) ప్రత్యేకమైన ప్రేమ,
- (2) సామాన్య ప్రేమ.
పాపులకు, భక్తులకు, మానవులందరికి దేవుడు చూపించునది సామాన్యప్రేమ. ఇదియే దయ. భక్తుల పొలములలోను, పాపాత్ముల పొలములలోను, వర్షము కురియుట సూర్యుని వేడిమి కలుగుట; పాపాత్ములకు భక్తులకు ఒకే రీతిగా ఉన్నది. ఇది సామాన్యప్రేమ. అయితే దేవుని ప్రత్యేక ప్రేమకు రెండు కారణములున్నవి.
1) భక్తులు శ్రమ పడుచున్నారు. అయితే ఇశ్రాయేలీయులు భక్తులు కాకపోయినను, వారు భక్తుల పిల్లలు. గనుక వారు దేవుని ఎదిరించేవారైనను, వారి తండ్రులు ఆయన ఏర్పాటు భక్తులు కాబట్టి వారికి దేవునియొక్క ప్రత్యేకమైన ప్రేమ దొరుకుచున్నది.
ఉదా:- ఒక బడిలో పిల్లవాడు చదువుచున్నాడు. వాడు ఉపాధ్యాయునియొక్క స్నేహితుని కుమారుడు. ఈ పిల్లవాని తండ్రి చనిపోయెను.
పిల్లవాడు విద్యయందు శ్రద్ద చూపనప్పటికిని వాని తండ్రి మీది గౌరవముచేత, ఉపాధ్యాయుడు పిల్లవానియందు బహుశ్రద్ధ
వహించును.
అలాగుననే దేవుడు అబ్రాహాముతో, ఇస్సాకుతో యాకోబుతో నిబంధన చేసెను. అందువలననే ఇశ్రాయేలీయులు ఎదిరించువారైనను దేవుడు
వారియెడల
ప్రత్యేకమైన ప్రేమ కనపర్చెను. ఆ ముగ్గురితోను దేవుడు చేసిన నిబంధనలు, కృప తోడైయున్నది. గనుక ఈ నిబంధనలు తరతరముల వరకు
నిలిచిపోయినవి. ఇశ్రాయేలీయులు ఎంత తప్పిపోయినను, ఈ నిబంధన అనగా దేవునికృప అబ్రాహాము మొదలుకొని బాప్తిస్మమిచ్చు
యోహానువరకు
ఇశ్రాయేలీయుల యెడల ఉన్నది. అలాగుననే దేవుడు యం. దేవదాసు అయ్యగారికి గాలిలో నిబంధన చేసెను. ఒక యువరాజువలె,
సైన్యాధిపతివలె
బయటికి రావలసినది అనిచెప్పిరి. నేను వృద్ధుడను, అనారోగ్యుడను, విద్యలేనివాడను ధనము లేనివాడను అన్నప్పటికిని
అబ్రాహాముద్వారా
యూదులకు ఏర్పాటు చేసినట్లుగా, అయ్యగారి ద్వారా ప్రభువు బైబిలుమిషనును ఏర్పాటు చేసుకొన్నాడు. అయ్యగారినిబట్టి మనందరకు
జాలి
చూపును. పాతనిబంధన కాలమునకును, క్రొత్త నిబంధనకును జాలి, అలాగే ఇతర
క్రైస్తవులకును, బైబిలుమిషను వారికిని దయ. దయకును, జాలికిని బేధము చూపించు కథ ఒకటి బైబిలు ఉన్నది.
యోసేపు ఐగుప్తులో
ఉన్నప్పుడు అన్నదమ్ములు ధాన్యమునకు వచ్చిరి. అందరికి ఇచ్చిన దానికంటె బెన్యామానుకెక్కువ ఇచ్చెను. బెన్యామీను యెడల
యోసేపు
ఎక్కువ, ప్రత్యేకమైన ప్రేమ చూపించెను. ఈ దృష్టాంతము అవిశ్వాసుల యెడల దేవుడు చూపించు సామాన్య, ప్రత్యేక ప్రేమలకు
గుర్తుగా
ఉన్నది. దీనినిబట్టి దేవుడు ఇశ్రాయేలీయులను లక్ష్యపెట్టెను, గౌరవించెను. ఇశ్రాయేలీయులు నిబంధననుబట్టి నడిచినారా?
లేదు.
అయిననూ ఆయన ప్రత్యేక ప్రేమనువారు అందుకొనిరి.
ఉదా:- ఒక పిల్లవాడు తల్లిచెప్పిన మాట వినకపోయిన యెడల తల్లికి వానియందు
లక్ష్యముండదు. అయితే చేయను అనిచెప్పిన పిల్లవాడా తల్లిమాట విని మనసు మార్చుకొనివెళ్ళి, త్రోవలో వర్షముచేత ఆటంకపర్చబడి
తిరిగివచ్చివేయగా, తల్లిచెప్పిన పనిచేయక పోయినను నెరవేర్చుటకు ప్రయత్నించినవాడాయెను. కాబట్టి తల్లికి పిల్లవానియందు
గౌరవముండును. అలాగుననే ఇశ్రాయేలీయుల నిబంధన ప్రకారము నడువకపోయినను నిబంధన తీసికొనిరి. గనుక దేవుడు వారిని
లక్ష్యపెట్టెను.
ఇశ్రాయేలీయులు మోషేద్వారా ఇవ్వబడిన నిబంధనను అందుకొనిరి. ఇట్లు అందుకొనినందుననే దేవునికి గొప్ప ఆనందము. అలాగుననే
బైబిలు
మిషను వారు యం. దేవదాసు అయ్యగారిద్వారా ఇవ్వబడిన నిబంధన నమ్మివచ్చిరి. గనుక క్రీస్తుకు గొప్ప ఆనందము. క్రైస్తవ సంఘములో
అనగా
క్రీస్తుప్రభువును నమ్మివచ్చిన వారిలో చాలామంది నామక క్రైస్తవులున్నారు. వారు ఒప్పుదల క్రైస్తవులు. అయితే, విశ్వాస
క్రైస్తవులు
నిబంధన ప్రకారము చేయుదురు. ఈ రెండు తరగతుల యెడల ప్రభువు జాలి చూపించును. దేవునియొక్క ప్రత్యేక జాలి కొంతమందికి
చూపించును.
పరిశుద్దాత్మ బాప్తిస్మముపొంది, రెండవరాకడ నమ్మువారు మాత్రమే
ప్రత్యేక ప్రేమ పొందుదురు. పెండ్లికుమార్తె సంఘములోనున్న వారికి మాత్రమే ప్రత్యేక నిబంధన. తక్కినవారికి వేరే
నిబంధనలున్నవి.
అబ్రాహాము నిబంధన: ఆది. 17:19, ఇస్సాకు నిబంధన: ఆది. 17:21
యాకోబు నిబంధన: ఆది. 28:13-14
ఇశ్రాయేలీయులు ఈ నిబంధన తోసివేసిరి.
1రాజు. 18:18.
దేవుడు తన నిబంధనను ఎప్పుడు కొట్టివేయడు. అయితే మనుష్యుడు కొట్టివేయును ఈ దినములందు విశ్వాసులు ఎక్కువగా
వచ్చుచున్నారు. అయితే కడవరకు జరుపువారే నిబంధన జరుపుదురు.
- 1) జాలి అనగా విమోచన ప్రేమ,
- 2) దయ, అనగా సృష్టికర్తయొక్క ప్రేమ
- 3) లక్ష్యముంచెను అనగా నిబంధన ప్రేమ
- 4) నాశనముచేయలేదు అనగా జనాంగ ప్రేమ
- 5) సన్నిధినుండి త్రోసివేయలేదు = రక్షణ ప్రేమ.
నాశనము చేయలేదు. ఎందుకనగా ఈ జనాంగము నుండి క్రీస్తు ప్రభువు పుట్టవలసియుండెను. ఈ దినములయందు సంఘములో నుండి పెండ్లికుమార్తె రావలసి ఉన్నది. కాబట్టి నాశనము చేయలేదు. ఇది జనాంగము మీది ప్రేమ. ఇన్ని ప్రేమలు ఆయన తన ఏర్పాటు జనులయెడల చూపించెను. నేడు మనకును ఆ ప్రేమలన్నిటిని చూపించుచున్నాడు. గనుక అది ఆయన సంకల్పన ప్రేమ. ఇట్టి ప్రేమలతో దేవుడు మిమ్మును దీవించును గాక! ఆమేన్.