9. కానుకల పండుగలోని ఆనందము

గ్రంథకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు



ఆది. 4:3-5; ఆది. 14:22-24 2దిన. 31:10; మలాకీ 3:10; మార్కు 12:41-44; లూకా. 21:1-4; 1కొరింథి. 16:1-6; 2కొరింథి. 8:1.

నిండిన చేతులతో వచ్చిన కానుకలపండుగ ఆరాధన పరులైన వారలారా! మీకు శుభము కలుగునుగాక! నిండి నిండని చేతులతో వచ్చిన వారు ఉంటే, వారికికూడా వారికి తగిన శుభవచనము అందునుగాక! మిక్కిలి ఇష్టముతో, కృతజ్ఞతతో కానుక ఇచ్చే వారికి హేబెలుయొక్కకానుక అంగీకారమువంటి అంగీకారము కలుగునుగాక!


ఇప్పుడు పాతనిబంధనలో ఉన్న కానుకలనుగూర్చి, క్రొత్త నింబంధనలో ఉన్న కానుకలనుగూర్చి మరీ పరీక్షించితే కొన్ని విషయములు తేలుచున్నవి. మొదటి విషయము;

బైబిలులో ఈ 7 రకములైన కానుకలు చెల్లించుట కనబడుచున్నది. కానుకలను గురించి బైబిలులో ఉన్న విషయములన్నింటిని చేర్చితే, చాలా పెద్ద పుస్తకమగుచున్నది. ఈ కానుకలను గురించి విడిచిపెట్టి గడిచిన రెండువేల సం॥ములలో క్రైస్తవ సంఘమునందు

నాకు ఒక ఆలోచన తోచినది. సంవత్సరమునకు ఒకమారు సంఘము అంతయు గుడిలో కూడుకొని ఐదు, ఆరు దినములవరకు ఈ కోతపండుగ చేయవలెను. ఆ పండుగ చేసేటప్పుడు ఈ 7రకముల అంశములు గురించి ఒక్కొక్కదినమున ధ్యానించుచు, వివరించుకొంటూ, దానికి సంబంధించిన పాటలు పాడుకొంటే ఏమి జరుగుననగా సంఘములోనున్న పేదలు భాగ్యవంతులౌదురు. దేవునికి ఇచ్చినందున పేదలు లేరుగాని, ఇచ్చి భాగ్యవంతులైనవారు చాలామంది ఉన్నారు. దేవునికి ఇచ్చిన తరువాత తృప్తిగా భోజనంచేసినవారున్నారు. మాకు కొదువ వచ్చినది అనువారు లేరు. అప్పుడు బుణబాధ ఉండదుగాని ఆస్థి ఉంటున్నది. తినగా వారికి ఇంకా మిగిలి యున్నది. ఈ సంగతులు తిరిగి తిరిగి వివరించినందున ఆత్మకు శాంతి కలుగును. మీకు మొదట చెప్పిన ఈ ఏడు అంశములను వివరించను. చెప్పిన ఈ ఏడుకాక రెండు అంశములు ఉన్నవి. దానిలో మొదటిది ప్రాముఖ్యమైనది. నేను క్రొత్తగా చెప్పేది, మీరు ఇచ్చేది ఏదనగా, మీ స్వంత ఇష్టాను సారముగా ఇవ్వండి. బైబిలులో స్వంత ఇష్టముతో ఇచ్చినవారు ఇద్దరున్నారు. అనగా చందా ఇవ్వాలని దైవాజ్ఞ పుట్టకముందే సొంతముగా ఇచ్చినవారు ఇద్దరున్నారు. వారిరువురిని చూచి మీరు ఏలాగు కానుకలిచ్చారు? అని అడిగితే, వారు ఏమని చెపుతారంటే, "దేవుడు మాకు కానుకలియ్యండి అని చెప్పలేదు, దేవునికి ఇయ్యవలెనని మా ఆత్మలో మాకే ప్రేరేపణ పుట్టినది” అని అంటారు. దేవునికి ఇవ్వవలెనని వారికే తోచినది. ఈ కాలంలో బోధకులు "పండుగకు కానుకలు ఇయ్యండి" అని అనేకమార్లు బోధించినప్పటికిని, మనఃస్ఫూర్తిగా ఇచ్చే వారు తక్కువమంది చేతులతో నిండైన కానుకలు ఇచ్చేవారు బహు తక్కువ. ఆ హేబేలు తన స్వంత ఇష్టంతో ఇచ్చినాడు. తన స్వంత మందలోని గొర్రెపిల్లను ఇచ్చినాడు. ఇతరులు తనకు ఇచ్చినది కాదు. తాను సంపాదించిన దానిలోనిది ఇచ్చెను తనది ఇచ్చినాడు.

అదే అసలైన కానుక. ఈ దినమందు ఈ మూడును కల్గి, ఇష్టంతో శ్రేష్టమైనది ఎవ్వరు తెచ్చినారో, అది హేబెలు కానుక వంటిదని సంతోషించగలరు అదే అంగీకారపు కానుక.


రెండవ ఆయన ఎవరనగా ఆదికాండము 4వ అధ్యాయములో ఉన్న హేబేలు దగ్గరనుంచి ప్రయాణమైవస్తే ఈ రెండవ ఆయన ఉన్నాడు. ఆయనే అబ్రాహాము. అబ్రాహాముగారు తన రాబడిలో దశమభాగము దేవునికి ఇచ్చెను. 10వ భాగము దేవునికి ఇచ్చెను ఈ 10వ భాగము ఇవ్వాలని దేవుడు అబ్రాహాముకు చెప్పలేదు. వారికి తోచినందువల్ల వారంతట వారే ఇచ్చిరి. ఈ 10వ భాగము అనే మొదటి ఆ కానుక ఆదికాండము 14వ అధ్యాయము చివరి భాగములో కనిపించుచున్నది. 14వ అ॥ మొదలుపెట్టి ఈ దశమ భాగము పాతనిబంధన చివరి పుస్తకమైన మలాకీ గ్రంథమువరకు వెళ్లినది. అయితే మలాకీ తర్వాత వచ్చిన క్రొత్తనిబంధనలో దశమభాగము అనేమాటలేదు. ఆదికాండములో హేబెలు దగ్గర మనసులో ఉన్న స్వంత ఇష్టము, అబ్రాహాము మనస్సులో ఉన్న స్వంత ఇష్టము; ఈ రెండు స్వంత ఇష్టములకు సంబంధించిన అర్పణలు కొత్త నిబంధనలో ఉన్నవి.


ఎంత ఇచ్చిననూ స్వంత ఇష్టముతో ఇవ్వకపోతే పేరులేదు.

అటువంటి కానుక హేబేలు యొక్క గొప్ప కానుక వంటిదైనప్పటికిని అది దేవునికి అంగీకారం కాదు. అబ్రాహాము దశమ భాగము ఇచ్చినంతటి గొప్ప కానుక అయినప్పటికిని, అది మెచ్చుకొనదగిన కానుక కాదు. పాతనిబంధనలో యూదులకు దేవుడు కానుకలను గూర్చిన ఆజ్ఞ ఇచ్చినాడు. దేవుడు ఎందుకు అట్టి ఆజ్ఞ ఇచ్చినాడంటే, యూదులు అప్పటికి చిన్నపిల్లలవంటివారు, అనగా జనాంగములన్నిటిలో యూదులు చిన్న జనాంగము. వారిని చిన్నపిల్లలను తల్లిదండ్రులు ఏలాగు చూస్తారో, దేవుడు వారిని ఆలాగే చూచినాడు. ఏలాగంటే, "నాకు ఇంత చందా వేయండి అని నేర్పెను”. తల్లిదండ్రులు తమపిల్లలను తీనికొనివెళ్లేటప్పుడు “ఇంత చందావేయండి" అని పిల్లల చేతిలో కానుకపెట్టి నేర్పించుచున్నారు. అలాగే యూదులకు చందానుగూర్చి నేర్పుటకు దేవుడు దశమ భాగమును చూపించెను. ఈ చిన్నపిల్లలు పెద్దవారై ఉద్యోగం వచ్చిన తర్వాత తల్లిదండ్రులు వారిచేతిలో ఇక చందాపెట్టరు. అణా॥ చందావేయి, లేదా రూ॥యి చందావేయి అని చెప్పరు. వారు ఇష్టానికి వారిని విడిచిపెట్టెదరు. అలాగుననే క్రొత్తనిబంధనలో దేవుడు తన సంఘమును తన ఇష్టమునకు విడిచిపెట్టెను. వారు ఎంతవేస్తే అంత మాత్రమే; నీవు దశమ భాగము ఎందుకు ఇవ్వలేదని అడుగడు.


కానుకల పండుగ

కానుకలు వేయువిధానము:-

దీవెన:- దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.


ప్రార్ధన:- పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యత అని వ్రాయించిన ప్రభువా! నేటిదిన వాక్యాహార కానుకనుబట్టి నీకు స్తోత్రములు. నీవే మాకు ఆహారమైపోవుకానుకగా వచ్చినావు, అందునుబట్టి నీకు స్తోత్రములు. ఈ దిన వాక్య వెలుగులో మా అంతరంగములను సరిచేసికొని ఇకముందుకు హృదయపూర్వకమైన కానుక అర్పించువారిగా మమ్ములను చేయుమని క్రీస్తుయేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రీ ఆమేన్.



10.3.1957వ సం॥లో దేవదాసు అయ్యగారు గుంటూరు క్రీస్తు సంఘములో చేసిన ప్రసంగము.