7. ఈకాబోదు

గ్రంథకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు



1సమూ. 4:21; మత్త. 26:14-25; ప్రక. 19:1-4.

దైవారాధన పరులైన విశ్వాసులారా! రాకడ వరకు ప్రతి ఆదివారము ఈలాగు కూడుకొనగలిగితే మహిమకు సిద్ధపడగలము. గనుక అట్టి సిద్ధబాటును ప్రభువు మీకు నేటిదిన వర్తమానము ద్వారా దయచేయును గాక. ఆమేన్.


ఈ అధ్యాయములో ఇశ్రాయేలీయుల శత్రువులైన ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధముచేసిరి. ఇశ్రాయేలీయులు ఓడిపోయిరి. అనేకులు హతులై పోయిరి. ఇందువలన అపజయమునకు కారణము తెలిసికొని, షిలోహులోనున్న మందసము పెట్టె తెచ్చిరి. ఇది తీసికొని రాగానే గొప్ప స్తుతిగానము చేసిరి. ఈ గానము శత్రువులు విని భయపడిరి. కారణము ఇశ్రాయేలీయుల దేవుడు శూరుడు అనియు, అన్ని విధముల వారికి (ఇశ్రాయేలీయులకు) జయము అని తలంచిరి. ఈలాగు ఇశ్రాయేలీయులు ధైర్యపడి, మరలా రెండవసారి యుద్ధమునకు వచ్చినపుడు ఫిలిష్తీయులే జయము పొందిరి. దేవుని మందసము పెట్టె పట్టబడెను, అనేకులు హతులైరి. ఈ వార్త యాజకుడైన ఏలీకు వినబడెను. ఇతడు చాలా వృద్ధుడు. ఆయన అధైెర్యముతో ఉండగా, ఈ వార్త అంతయు అనగా ఆయన కుమారులు యుద్ధములో చనిపోవుటయు, మందసము పట్టబడెననుమాట వినగానే, ఆయన ఊరి గవినిద్వారపు పీఠమునుండి వెనుకకుపడి చనిపోయెను. గర్భవతియైన ఆయన కోడలుకూడా ఆ వార్త విని చనిపోవు సమయములో 'ఈకాబోదు” అను కుమారుని కని చనిపోయెను. దీని అర్ధము ఇశ్రాయేలీయులలోనుండి ప్రభావము వెళ్లిపోయెను. దీనిలోని అనుభవము ఏదనగా, ఈ అధ్యాయమంతా తీర్పుభాగములు, శిక్షభాగములు కలవు.

ఇవన్నియు మంచి కార్యములే, వీటిని ఇశ్రాయేలీయులు చేయగలిగిరి. ఈ చరిత్ర మంచిదే కాని వారు వెంటనే త్వరపడి ఓడిపోయిరి. మొదట 4వేలమంది, తరువాత 30వేలు హతులైరి. వీరు ఫిలిష్తీయుల యెదుట తమ దేవుని తెలిసికొనేటట్లు చేసిరి. తమ దేవుడు శూరుడని వారు మెచ్చుకొనేటట్లు చేసిరి. మరి ఫలితము ఈలాగున ఎందుకు కలిగెను? ఇశ్రాయేలీయులు యుద్ధమునకు వెళ్లిరి. పాలస్తీనా దేశమును ఆక్రమించు సమయములో “మిరు ధైర్యముతో మోషే - యుద్ధము చేయండి, లేకపోతే మాకు జయముండదని చెప్పిన దైవాజ్ఞ ప్రకారము చేసిరి. అయితే వారనుకున్నారు - మందసము పెట్టిలో ఉన్నది

ఇది, విశ్వాసులైనవారికి శ్రమలో ఆదరణకు ముంగుర్తు అయియున్నది. ఇట్టి ముంగుర్తుగల పెట్టెనేకాక ఇశ్రాయేలీయుల దేవుడు మన దండులోనికి వచ్చెనని గ్రహించిరి. చెప్పుకున్నారుకూడా! చిగిర్చిన కర్ర అనగా తండ్రి విశ్వాసులను వాక్యముద్వారా అనేక విధములుగా ఆదరించెను. అయితే, ఇంకొక అర్ధము ఏదనగా, విశ్వాసులు శ్రమలలో నిరుత్సాహపడి ఎండిపోయిన సమయములలో శోధనద్వారా వారిని బలపర్చి చిగురింపజేసెను.


ఇశ్రాయేలీయులు మందసమును రప్పించుకొనిరి: - వారు ఈ మందసముయొక్క మహత్యము ఎరుగుదురు గనుకనే కోరుకొనుట మాత్రమేగాక తెప్పించుకొనిరి. తేగానే సంతోషించిరి. ఈ విధముగానే దైవ గ్రంథమును మనము కోరుకొనుట మాత్రము చాలదు, పఠించవలెను. జయము రాకముందే జయమని గానముచేసిరి. మంచి విశ్వాస లక్షణముగల క్రియలను చేసిరి. చైనా దేశములో క్రైస్తవులకు శ్రమలుగల సమయములో క్రైస్తవులందరు మాట్లాడుకొని ప్రార్ధన చేయుటకు గుడికి వెళ్లిరి. ఈ సంగతులన్నియు శత్రువులు చూచి. విరోధంగా చేయవలసిన పనులు ఎన్ని చేసినను వారు ఓడిపోయిరి. అయితే ఈ కథలో ఇశ్రాయేలీయులు అనేకులు చనిపోయిరి. దేవుని మందసము పట్టబడెను. ఈకాబోదు అనగా ఇశ్రాయేలీయులనుండి ప్రభావము వెళ్ళిపోయెను. దీనినిబట్టిచూస్తే ఇశ్రాయేలీయులు ఈ మంచి పనులు చేసినను కీడు వచ్చెను. క్రైస్తవ విశ్వాసులకుకూడా ఈ విధంగా జరుగవచ్చును గనుక జాగ్రత్తపడవలెను. జయము రాకముందే జయము అన్నారు కాని అపజయము కలిగెను. దీనినిబట్టి చూస్తే మనము ఎన్ని పనులు చేసినను ఏదోయొక లోపముంటే అపజయము కలుగుతుందని గ్రహించవలెను. ఈకాబోదు అనుమాట బైబిలు చరిత అంతటిలోను విచారకరమైన సంగతి. ఇక్కడ ప్రభావము వెళ్లిపోయెను. అలాగే గెరాసేనీయులు ప్రభువును తమ ప్రాంతము నుండి వెళ్లిపొమ్మనిరి. కాని ప్రభువు వారియొద్దకు వెళ్ళి కృపచూపెను. బాగైనవానిని వారికే మిషనెరీగా పంపెను. ఇశ్రాయేలీయులలోనుండి మహిమ పోయెను. అనగా దేవుడే వెళ్లిపోయెను. దీనినిబట్టి విశ్వాసులు, తండ్రి ఇచ్చిన ఆత్మీయ ఆశీర్వాదములు పరీక్షించుకొనవలెను.

ఏర్పాటు జనాంగమైన ఇశ్రాయేలీయులలో దేవునిని ఎరిగినవారు, దేవునిని ఎరుగనివారును ఉన్నారు. దీనినిబట్టి చూస్తే క్రీస్తు జనాంగములలోకూడా అట్టివారు ఉన్నారు. ఈలాగుంటే వారికి కీడు కలుగును.


ఈ అధ్యాయముయొక్క స్వరము :- ఏ చిన్న లోపమున్నను అపజయము కలుగును. ఈ అధ్యాయమంతా విచార చరిత్రయేగాని “కుమారుడు నూతనముగా జన్మించెను” అను సంతోషవార్త ఉన్నది. చనిపోయినవారు చనిపోగా నూతనముగా వచ్చేవారు ఉంటారు. ప్రయాణ నమయములో ఇశ్రాయేలీయులు అరణ్యములో రాలిపోయిరి. విధేయులు వాగ్దాన దేశము చేరగలిగిరి. ఇశ్రాయేలీయులలో నుండి ప్రభావము పోయెను అనగా వారిని పాడుచేయడానికి వెళ్ళిపోయెను (ఒకరిని పాడుచేయుటకు, మరొకరిని బాగుచేయుటకు). కాని ప్రభువులోనుండి మహిమ పోయినదనగా ఎవరినో బాగుచేయుటకు వెళ్లెను. దీనినిబట్టిచూస్తే విశ్వసించితే, నమ్మితే, ప్రార్ధిస్తే ప్రభువు ప్రభావము విశ్వాసులలోనికి వచ్చును. అనగా వారిని బాగు చేయుటకు వచ్చును.


ఏదేనుతోటలోని మహిమను ఆదాము, హవ్వలు పాపముచేసి పోగొట్టుకొనిరి. ఆది మహిమను పోగొట్టుకొనిరి. తరువాత మరలావచ్చు మహిమ వేరుగా నుండును. ఈ సంగతులు మేము మహిమకు సిద్ధపడవలెనని నీ గ్రంథములో వ్రాయించినావు స్తోత్రములు ఆమేన్.


ఆలాగు నీ మహిమ రాకడకు, మహిమను నిలుపుకొన్న వధువుగా సిద్ధపడగల ధన్యత నేటిదిన వర్తమానముద్వారా పెండ్లికుమారుడు మీకు దయచేయునుగాక. ఆమేన్.



26.1.1947వ సం॥లో దేవదాసు అయ్యగారు రాజమండ్రిలో చేసిన ప్రసంగము.