12. పరలోకరాజ్య మర్మములు
గ్రంథకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు
మత్తయి 13:11.
దైవాశక్త ప్రియులారా! నేటిదిన వాక్యధ్యానముద్వారా పరలోకరాజ్య మర్మమైన విషయములు ఆ ప్రభువు మీ జ్ఞానమునకు అందించునుగాక! ఆమేన్.
పరలోక రాజ్య విషయములు, సంఘ విషయములు, బైబిలులోని అనేక విషయములు మరియు క్రీస్తు ప్రభువు విషయములు, లోకమనస్సు గ్రహింపనేరదు. వారు
- 1) గ్రహించరు,
- 2) అంగీకరించరు.
ఎందుకు గ్రహించరు? లౌకికము అనేది మనుష్యులలో ఉన్నందున గ్రహింపరు.
దైవిక విషయాలు
ఎందుకు
గ్రహించాలని ఆలోచించినందు వలన, వారు అంగీకరించరు. దేవుడిచ్చిన జ్ఞానమును వాడనందువలన గ్రహించరు. ఈ
పాఠములోను, యెషయా 6వ
అధ్యాయము 10వ వచనములోను ఏమి ఉన్నది? దేవుడే వారి గ్రహింపుశక్తిని ఆపుచేసినట్లు కనబడుచున్నది. అందుచేత
వారికి అంగీకరించు
మనస్సులేదు. గనుకనే దేవుడు హృదయమును చూచును అని మనము తెల్సుకొనవలెను. నీవు చేయవలసినది చేయుమని ఆయన, యూదా
ఇస్కరియోతుతో
చెప్పెను. ఎందుకనగా అతని హృదయమట్టిది. గనుకనే దేవుడు మనుష్యుని అపవిత్రతకు అప్పగించెనని రోమా
1:24లోయున్నది.
జ్ఞానమువల్ల
గ్రహించలేని సంగతులుగలవు. అట్టి వాటిని మనము దేవునియందలి విశ్వాసమువలన గ్రహింపగలము. హెబ్రీ. 11:1లో
ఏమున్నది?
విశ్వాసమువలన
గ్రహించుకొనుచున్నామనియున్నది. జ్ఞానశక్తికంటె విశ్వాస శక్తి గొప్పది. క్రీస్తుప్రభువు చరిత్ర చదివి,
క్రీస్తుప్రభువు
చరిత్ర చూచిన ఆకాలమునాటి వారు - "ఈయన మరియమ్మ కుమారుడుకాదా? ఈయన యోసేపు కుమారుడు కాడా? నజరేతులో
ప్రవక్తలేచునా! ఈయన
ప్రవక్తయైతే పాపాత్మురాలని ఈ స్త్రీని గురించి తెలుసుకొనును” అని చెప్పుచు యూదులు అభ్యంతరపడిరి. ఈయన
మెస్సియా అయితే
యూదులకు
ఎందుకు రాజ్యమియ్యకూడదు! ఇట్టి ప్రశ్నలు వారి మనస్సును చెడగొట్టినవి. మెస్సీయా వచ్చుటకు గురుతుపట్టేటందుకై
కొన్ని గురుతులు
పాతనిబంధనలో వ్రాయబడినవి. అందులో ఒకటి ప్రభువు గార్థభాసీనుడై వెళ్లుట; ఇదివారు గ్రహించలేకపోయినారు.
ఎందుకంటే ప్రభువును
వారు
రోమియుల రాజ్యమును పడగొట్టి, తమకు ఉద్యోగమునిచ్చి రాజ్యమేలుమని కోరినారు, కాని అట్లు జరుగలేదు గనుక
అభ్యంతరపడినారు. నా
విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడు అని ప్రభువు చెప్పలేదా? యోహాను చెరసాలలో నుండి రాబోవువాడవు నీవేనా! అను
ప్రశ్నవేసి, తన
శిష్యులను ప్రభువునొద్దకు పంపెను. గనుక ఆయనవలన నిశ్చయము తెలుసుకొనెను. గనుక యూదులుకూడా ఈ ప్రకారముగా
తెలిసికొనినయెడల
నిశ్చయము తెలిసియుండును. మర్మములు అందరికీ తెలియబడవు. అందరికి అవసరములేవు. క్రీస్తుమత మర్మములు ఒకరికి
పూర్తిగా
చెప్పివేయండి
అతడు అంగీకరించని యెడల చెప్పడము మానివేయవలెను. అట్టివానితో వాగ్వాదము పెట్టుకొనవద్దు.
1తిమో. 4:13-14 విశ్వాసులకు మర్మములు తెలిసే వరమున్నదనియు, ఇతరులకు అవి తెలిసికొనేశక్తిలేదనియు పౌలు
సెలవిచ్చెను. ఇతరులకు
ప్రభువు కొన్ని సంగతులు అర్ధముకాని సంగతులు చెప్పినారు. తృణీకరించినవారెట్లు గ్రహించినామని చెప్పుదురు!
పూర్వకాలమునందు
మర్మములని చెప్పబడినవి ఇప్పుడు మర్మములు కావుగాని పరమగీతమును, ప్రకటనయును, కొన్ని ప్రవచనములును మర్మములే.
అయినను మనము
ప్రభువు సన్నిధిలో గడిపినయెడల ప్రభువు ఎక్కువ సంగతులు వినిపించును. నేడు అట్లు ఎవరు చేయుదురో వారికి
మర్మములు బయలుపర్చును.
శిష్యులు ప్రభువుతో నిత్యము ఉండిరి గనుక అనేక సంగతులు గ్రహించిరి.
మనమును అట్లే చేయగలిగిన యెడల ఎంత బాగుండును! "కలిగినవానికి ఇవ్వబడును” అని ప్రభువు చెప్పుచున్నది
గ్రహించవలెను.
నేర్చుకొనగల
ఆసక్తిపరులైన విద్యార్ధులకు నేర్పవలెనని ఉపాధ్యాయులకు ఇష్టముండును. అలాగే ప్రభువు కొందరికి ఎక్కువ సంగతులు
చెప్పును.
ఇష్టములేని వారికి ఎట్లు చెప్పును? లేనివానికి కలిగినదియు వానియొద్ద నుండి తీసివేయబడునని ప్రభువు
చెప్పుచున్నాడు.
వరమువాడని
వారియొద్దనుండి వరము తీసివేయబడుట అనేదియున్నది. అలాగే ఇది తీసివేయబడును. ఒకరిలో దురాత్మ ప్రవేశించుటకు
దేవుడు సెలవిచ్చెను.
1రాజు. 22:21. చదవండి. ఒకదరినుండి మనము లోబడుచుంటే ఒకదరినుండి ప్రభువు జ్ఞానమును, మరియు
కావలసినవాటినన్నిటిని దయచేయును.
పూర్వకాలపు ప్రవక్తలకు దేవుడు కొన్ని మర్మములు బయలుపర్చలేదు. ఎందుచేత? వారి అవిశ్వాసమునుబట్టి కాదు. ఆ
కాలమందు అవి
వారికవసరములేదు గనుక మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధ్యనములైనవి... అనేక ప్రవక్తలు చూడగోరియు చూడలేదని
ప్రభువు చెప్పిరి
(మత్తయి 13:16,17వచ). బైబిలునుగూర్చియు, క్రీస్తును గూర్చియు, ఆయన సంఘమును గూర్చియు అనేకులు
అభ్యంతరపడుచున్నారు. ఒకటి
క్రీస్తును గురించి శరీరధారియనియు, ఆయన దైవత్వము నిజముకాదనియు, ఆయన శక్తిగలవాడైతే సిలువ మీదనుండి ఎందుకు
దిగలేదు అని
అభ్యంతరపడుచున్నారు.
- (1) బైబిలును గురించి సర్పము మాట్లాడునా?
- (2) గార్థభము మాట్లాడునా?
- (3) ఏలీయా ప్రవక్త ప్రార్ధనకు అగ్నికురిసెనా?
ఈ మొదలైనవి బైబిలులోని సందర్భములను ఎత్తి అభ్యంతరపడుచు ఇది దేవుని గ్రంథముకాదని
చెప్పుచున్నారు.
సంఘమునుగూర్చి - క్రీస్తు శిష్యులు జాలరులు, చదువులేనివారనియు,
నేటి క్రైస్తవులు సామాన్య ప్రజలనియు అభ్యంతరపడుచున్నారు. గనుక ఈ మూడు విషయములవలన కలిగే భాగ్యములు వారు
పోగొట్టుకొను
చున్నారు.
అనేకులు - 'దేవుడు, సైతానును అప్పుడే నాశనము చేయలేకపోయినాడా? మానవులు ఇప్పుడు అనేక కష్టములు
పడుతుంటే ఎందుకు చూచి
ఊరకుంటున్నాడు? ఈ మొదలైన ప్రశ్నలు వేయుటవల్ల “దైవ విషయభాగ్యమును పోగొట్టుకొనుచున్నారు” అని దేవుని
వాక్యములోనివి విని,
తొలగిపోయేవారినిగురించి మనము అనవలెను. వినేవారికి అవసరములేదు కాని, విననివారికి దైవ ప్రాప్తిలేదు అని
గ్రహించుకొనవలెను.
అటువంటి వారి విషయములో మన విలువైన సమయమును వృధాగా గడుపకూడదు. ఒక పర్యాయము విననివారు మరియొక పర్యాయము
వినుటకు వచ్చిన యెడల
వారి ఆసక్తినిబట్టి బోధించవచ్చును. యోహాను 3:20 హెబ్రీ. 6:1,8.
యూదా ఇస్కరియోతు తప్పిపోయినాడు. అలాగే
కొందరు క్రైస్తవులుకూడా
తప్పిపోవుదురు. అంతమాత్రమున క్రైస్తవమతమును దైవమతము కాదని చెప్పవచ్చునా? తక్కిన 11మంది బాగుపడలేదా? ఏశావు
మారుమనస్సు
పొందలేదు. ఎందుచేత? అది అతని నైజము. దీవెనకొరకు సిద్ధపడలేదు. ఎందుచేత? అతనిని దీవించుట దేవునికి
ఇష్టములేకకాదు. దేవుడు
ఇచ్చు
దీవెన మనిషి అంగీకరించకపోవుటవల్ల దీవెన దొరకదు. దీవెన అందరికి ఇవ్వడము. దేవునికి ఇష్టమేగాని అందరు దానికి
సిద్ధముగాలేకపోతే
ఎట్లు ఇవ్వగలడు? కయీను దేవుని నెదిరించెను గనుక ఆయన సన్నిధిలోనుండి వెళ్లిపోయెను. దేవుడు వెళ్ళగొట్టలేదు.
దేవుడు ఎవరిని
వెళ్లగొట్టడు. కయీనుకు దేవుడు ఎందుకు మారు మనస్సు ఇయ్యలేదని అడుగుచున్నారు. యూదా ఇస్కరియోతు పుట్టకపోతే
క్రీస్తు ఎట్లు
చనిపోవును? అతడు మంచిపనే చేసినాడు. క్రీస్తుప్రభువు అతనిని ఎందుకు క్షమించకూడదు!
అని ఇట్టి ప్రశ్నలు అడుగుచున్నారు. ఇవి అన్ని అవిశ్వాసులకు మర్మములుగాని విశ్వాసులు సుళువుగా గ్రహింతురు.
మన వార్త అందరికి
ప్రకటింపవలెనుగాని కొందరు వినరు. వినకపోతే చెప్పడము మానివేయవలెను. మారుమనస్సు లేని వారినే సాతానుకు
అప్పగింపవలెనని పౌలు
అనుచున్నాడు. “కొందరిని" అని పౌలు అననందువలన మనమెందుకు విచారపడవలెను. హేడెస్సులో బోధ ఉన్నది గనుక ఆదరణ
పొందుదము. విత్తనముల
గురించి చెప్పిన పిమ్మట ప్రభువు పరలోక మర్మములను గురించి చెప్పెను.
విత్తనముల ఉపమానము:-
మొదటి విత్తనము పక్షులు తినివేసెను గనుక అది ఫలింపులోనికి రాలేదు. పక్షులు - ఇవి పిశాచికి గుర్తు. రెండవ విత్తనము మొలిచెను కాని రాతినేల అగుటవలన ఫలములోనికి రాలేదు. రాయి మనిషిలోని చెడు నైజమునకు గుర్తు. మూడవ విత్తనము మొలిచెనుగాని ఫలములేదు, ముండ్లపొదలు అడ్డము వచ్చెను. ఇవి లోకమునకు గుర్తు. మనకు శత్రువులు ముగ్గురు.
- 1) సైతాను
- 2) శరీరము
- 3) లోకము.
శరీరనైజమే గొప్ప శత్రువు. అది మన ఒంటిలోని శత్రువు. మొదటిమూడు ఉపమానములు ప్రభువు జనసమూహముండగా చెప్పెను. తరువాత మూడు ఉపమానములు శిష్యులకు ఇంటిలో చెప్పెను. నాలుగును బైటవారికి మూడును, ఇంటిలోని శిష్యులైనవారికి 4 ఉపమానములు ప్రభువు చెప్పెను. రాతినేల ఉపమానమును జన సమూహము సంతోషముతో విన్నారు. తరువాత ఎండిపోయినారు. అలాగే నేడు క్రైస్తవులలో అనేకమంది ఆరంభమందు మహా ఉద్రేకముతో ఉంటారు. తరువాత తగ్గిపోవుదురు. కనుక ఎవరిది తప్పు? వాక్యము చెప్పుటలో తప్పున్నదా! వాక్యము వినుటలో తప్పా? లేక మనిషి నైజము తప్పా? విత్తనములో తప్పులేదు గనుక ఒక క్రైస్తవునికి ఉద్రేకము తగ్గినపుడు సంఘపాస్టరుగారిని గాని, సంఘమునుగాని, దేవునినిగాని నిందింవరాదు. కొందరు 30దంతలైనా, 60దంతలైనా, ఫలించరుగదా! 100అంతలు ఫలించరు గదా! రాతినేల వారు ముందు తమ నైజమును తొలగించుకొనవలెను. పొదనేలవారు లోకమువల్ల శోధనలువచ్చునని ముందుగా తెలుసుకొని, అవి వచ్చినపుడు జయించవలెను. వాక్యము బోధించేవారు ఈ మూడు రకములైన శత్రువులును గురించి బోధించకుండా ఉండరాదు. ప్రతి సంఘములోను నాలుగు తరగతులకు సంబంధించిన క్రైస్తవులున్నారు. విన్ననూ వినకపోయినను; అంగీకరించిననూ, అంగీకరించక పోయినను, “ప్రకటించుట మన పని” అని దారిని పడిపోయిన గింజవల్ల తెలుసుకొనుచున్నాము. ప్రకటించుట మన పని. గుణము మార్చుకొనుట వినేవారి పని. ఈ ఉపమాన భావము ప్రభువే స్వయముగా చెప్పెను. మంచినేలగల వారందరు మంచి ఫలితములోకి వత్తురు, గాని ఫలములలో భేదములుండును. అయినను పర్వాలేదు ఫలము వచ్చును అంతేచాలును. ముప్పదంతలువారు భూలోక మోక్షమును, 60దంతలువారు రక్షితుల మోక్షమును, 100దంతలు వారు నూతన యెరూషలేము అను మోక్షమును, జ్ఞాపకము చేయుచున్నారు.
విత్తబడిన గింజలలో - మొదటి గింజలోని ఫలింపు నిష్పలమే, రెండవ గింజలోని ఫలింపు కొంచెము ఫలము, కాని నిష్ఫలమే. మూడవ గింజలోని ఫలింపులో కొంచెము ఫలము కాని నిష్ఫలమే. నాల్గవ గింజలోని ఫలింపులో అంతా ఫలమే.
ఈ నాల్గవ గింజలోని ఫలింపులో మూడంతస్తులున్నట్టు(30,60,100), రక్షింపబడిన వారిలోకూడా మూడు అంతస్థులున్నవని గ్రహించుకొనవలెను. గ్రహించనివారు, మార్గోపమానములోనివారు. ఉపమానము గ్రహించుట ఎంత ముఖ్యమైన పని. అయితే వారు గ్రహించనందు వలననే బొత్తిగా ఫలములేకపోయెను. గనుక దేవుడు మానవునికిచ్చిన జ్ఞానమును ప్రతివాడు ఉపయోగించుకొనవలెను.
గురుగులను గూర్చిన ఉపమానము:- మత్త. 13:24-30. దేవుని రాజ్యముయొక్క మర్మములను గురించి వివరించుటకై, యేసుప్రభువు 7 ఉపమానములు చెప్పెను. ఒక్కొక్క ఉపమానము క్రమముగా వ్రకటనలోని 7సంఘములకు, క్రమముగా అన్వయించును. విత్తనముల ఉపమానములో విత్తనములు చల్లిన రైతు యేసుప్రభువే. గింజ దేవునివాక్యము. అయితే మంచిగింజలు సజ్జనులైయున్నారు. గురుగులను చల్లినవాడు సైతాను. గురుగులు మనుష్యులే, అనగా దుర్జనులు. వీరు దేవుని రాజ్యముయొక్క పనులు ఆటంకపరుచువారు, దుర్నీతిగలవారు. వీరు గోధుమలయొద్దనే అనగా సజ్జనులయొద్దనే ఉందురు. సంఘమంతటిలో సాతాను అక్కడక్కడ ఇట్టివాటిని చల్లియున్నాడు. వారు పైకి ఆచారములనుబట్టి, నామములనుబట్టి విశ్వాసులవలె ఉందురు, కాని హానిపరులు. వీరినిగూర్చి మనము జాగ్రత్తపడవలెను. ఎందుకు వీరిని తీసివేయవు? అని విశ్వానులు అడుగుచున్నారు. దీనికి జవాబులేదు. కాలాంతమందు వీరిని ప్రభువు కట్టలు కట్టలుగా కట్టివేయుదురు.
- 1) కట్టగా కట్టబడుట,
- 2) గోధుమలు కొట్టులో వేయబడుట
- 3) కట్టలు కాల్చివేయబడుట ఈ క్రమము జ్ఞాపకము ఉంచుకొనండి.
కట్టలు కట్టబడుట అనగా విశ్వానులలో నుండి అవిశ్వాసులను విడదీయుట. కొట్టులో చేర్చబడుట అనేపని పెండ్లి కుమార్తె ఎత్తబడినప్పుడు జరుగును. కాల్చబడేపని అంత్యతీర్పప్పుడు జరుగును. నిద్రపోయినవారు సేవకులు అనగా పనివారు అశ్రద్ధగా ఉన్నప్పుడు వారి శత్రువు “పని” చేయును. మనుష్యులు అజాగ్రత్తగా ఉన్నప్పుడు శత్రువులు గురుగులను నాటిరి. ఒకవేళ గురుగులను తీసివేయవలెనంటే వాటిని పెరికివేయునప్పుడు, మంచిమొక్కలుకూడా తీసివేయబడును. అందుకు యజమానుడు ఒప్పుకొనలేదు. గురుగులు ముందు కూర్చబడును. అటుతరువాత అవి కాల్చబడును. దానికి ముందుగా గోధుమలు కొట్టులో చేర్చబడవలెను. గురుగులు అనగా మారుమనస్సులేనివారు, గోధుమలు అనగా రక్షణను అంగీకరించువారు. భావికాల చరిత్రను చదవగా ముందుగానే పెండ్లికుమార్తె వరుసలోని వారు వెళ్లిపోవుదురు. ఆ తరువాత అంత్యతీర్పు దినమందు ఆ దుష్టులు నరకములోనికి వెళ్ళిపోవుదురు. ఈ ఉపమానము స్ముర్న సంఘమునకు నంబంధించినది. తాము యూదులమని చెప్పుకొనుచు, యూదులుకానివారు ఈ సంఘములో ఉన్నారు. క్రైస్తవులు రాకడలో వెళ్లిపోయిన తరువాత క్రైస్తవులు కానివారు అనగా నామక క్రైస్తవులు మన సంఘములలో ఉన్నారు. ఈ ఉపమానమువలన ఒక పాఠము నేర్చుకొనుచున్నాము. సేవకులు అనేక మర్మములు ఎరుగరు. మర్మములు ఎరిగినవారు, దేవదూతలవలె ఎవరి హృదయము ఎట్టిదో తెలిసికొనుట కష్టముకాదుగదా! అందుకనే వెంటనే ఎవరికి తీర్పుతీర్చకూడదు. యుగసమాప్తి అనియున్నది, గనుక ఆ యుగసమాప్తి సువార్త ప్రకటన అనంతరము వచ్చును. కడవరి ఆజ్ఞ నెరవేరుట రాకడ కాలములో కాదు. వెయ్యేండ్ల పరిపాలనలో జరుగును. ఆ తరువాత అంత్యతీర్పు. ఆవగింజ క్రొత్త నిబంధన. ఇద్దరితో ఆరంభమాయెను. తరువాత 12మంది ఆయెను. పైగా 70మంది శిష్యులు మత ప్రచారము చేసినవారు కలరు. పెంతెకొస్తు నాడు ప్రార్ధనా కూటములో 120మంది కనబడుచున్నారు. అప్పుడు మూడువేలమంది చేర్చబడిరి. ఈ ప్రకారముగా దేవుని రాజ్యములో ప్రజలు చేరుచున్నారు.
పులిసిన పిండినిగూర్చి ఉపమానము:-
మత్తయి 13వ అధ్యాయము. పులిసిన పిండి అనగా తప్పుడు బోధ అని అర్ధము.
- 1) పరిసయ్యుల పులిసిన పిండి అనగా జీవము, శక్తిలేని మతాచారములు.
- 2) సద్దూకయ్యుల పులిసిన పిండి అనగా పునరుత్ధానముగాని, దేవదూతలుగాని, ఉన్నట్టు నమ్మని బోధ.
- 3) హేరోదీయుల పులిసినపిండి అనగా లోకమును, మనమును కలిసియుండవలెను అను మిశ్రమబోధ.
ఈ మూడు రకములైన బోధలు సంఘముల మతోద్ధారణ కాలములో ప్రవేశించినవి. అంతకుముందునుండి ఇవి ఉన్నప్పటికిని, ఇప్పుడు సంఘాభివృద్ధినిబట్టి బైలుపడినవి. మతోద్ధారణ కాలమందు బైబిలు వెల్లడిలోనికి వచ్చినందున సంఘమంతయు పూర్తిగా, దిద్దుబాటులోనికి రావలసినదేగాని శాఖలైపోయినది. ముఖ్యమైన శాఖలు
- (1) రోమన్ కేథలిక్ సంఘము
- (2) గ్రీకు కేథలిక్ సంఘము
- (3) ప్రొటస్టంట్ సంఘము.
మూడు కుంచముల
మంచిపిండి అనగా
ఇదే.
అసలు పిండి మంచిదేగాని ప్రవేశించినది పులిసిన పిండి. ఈ మూడు శాఖలు ఎప్పటికైనను ఒక సంఘముగా కాగలవు?
నూతన సంవత్సరము
వచ్చుచున్న కొలది నూతనమైన శాఖలు కూడా వచ్చుచున్నవి. భిన్నమైన బోధలనుబట్టి సంఘము ఇప్పటికి ఎన్నో
మిషనులైనది. మంచిపిండిలో
పులిసిన పిండి కలిసిపోగా విడదీయవీలుండునా? వీలుండదు. పిండి తెచ్చినది ఒక
స్త్రీయైయున్నది. నిజమైన విశ్వానులయొక్క గుంపునకు పెండ్లికుమార్తె అని పేరు. దుర్భోధకుల గుంపునకుకూడ
స్త్రీ అని పేరు,
అనగా
చెడ్డ స్త్రీ పులిసిన పిండి అనగా దాచి పెట్టబడినది అనగా ఏమి? "ఇది తప్పు బోధ” అని తెలియకుండా మంచి పిండిలో
దాగియుండునదే
పులిసిన పిండి. ఎవరిమట్టుకు వారే మీది మంచిబోధ అందురు. ఫలానివారిది దుర్భోధ అనికూడా అందురు. ఇట్టివారే
తీర్పరులు గనుక ఈ
గురుగులు అంతమువరకు ఉండును. అట్లే పులిసిన పిండి అంతమువరకు ఉండును. ప్రభువుయొక్క ప్రత్యక్షతలవల్లనే,
మంచిచెడ్డలు
బైలుపడును.
ఇపుడే అన్ని మిషనులవారు ప్రభువును అడిగినయెడల ఆయన సత్యమును వినిపించును గాని అట్లు సంఘములు అడుగునా?
అడగవు. బైబిలులో
ఉన్నది
గనుక అడుగుట ఎందుకని కొందరు అనుచున్నారు. బైబిలు వాక్యముల అర్ధమును మనము బోధకులను అడుగుటలేదా? అట్లే
ప్రభువునెందుకు
అడుగకూడదు!!!
దాచబడిన ధనము:- అనగానేమి? ఆదాము మొదలు అబ్రాహాము వరకు అనేక వందల సంవత్సరములు గడిచిపోయెను.
అప్పటివరకు దాచబడిన
యూదుల జనాంగము బైలుపడినది. వారినుండి లోకరక్షకుడు జన్మించెను. ఇశ్రాయేలీయులయొక్క 10గోత్రములు చెరలోకి
వెళ్ళి నేటివరకు
తిరిగిరాలేదు. వారందరు దాచబడిన వారే. వారు ఎప్పుడు బడితే అప్పుడే వస్తారు. యూదుల జనాంగము దేవునికి
మిక్కిలి ప్రియమైనవారు.
వారాయనయొక్క ధనము. మరియు క్రీస్తు ప్రభువు వచ్చినపుడు ఆయనను వారు అంగీకరించలేదు. అందుచేతవారు ఆయా
జనాంగములలోకి వారు
చెదరగొట్టబడియున్నారు. గనుక భిన్న దేశములలో దాచబడి యుందురు. తుదకు యూదుల
జనాంగము 7ఏండ్ల పరిపాలనలో ఆయన తట్టు తిరుగుదురు. అప్పుడు దాచబడిన ధనము దొరికినట్టుగా ఉండునుగదా! ఉపమానములో
ధనమును
కనుగొన్నట్టు ఉన్నది.
దీని అర్థమేమి? యూదుల జనాంగమునకు మూల పురుషుడు అబ్రాహాము అన్య జనాంగము
వృద్ధిపొందుచుండగా, ఒక జనములో
అబ్రాహాము దేవునికి కనబడెను. గనుక ఆయనలోనుంచి యూదుల జనాంగము పూర్తిగా వచ్చువరకు దేవుడు కనిపెట్టెను.
అబ్రాహాము కొరకు
దేవుడు
ప్రత్యేకముగా పనికట్టుకొని వెతుకలేదు. రాష్ట్రములు పెరుగుచుండగా తుదకు అబ్రాహాము దేవునికి దొరికెను.
దేవుడు తక్కినవారిని
విడిచిపెట్టి అబ్రాహామును పట్టుకొనెను. అబ్రాహాములోనుంచి యూదులు బైలుదేరిరి. ఉపమానములోనున్నట్లు ధనము
దొరకగా కలిగే
సంతోషము,
దేవునికి కలిగెను. యూదులలోనే పితామహులు, బోధకులు, రాజులు, ప్రవక్తలు లేచినారు. తుదకు అపోస్తలులుకూడా
లేచినారు.
యూదులయొక్క రాష్ట్రము నిమిత్తమై తుదకు యేసు ప్రభువు మరణము పొందెను. “తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమునుకొనెను”
అని
వ్రాయబడినమాటలో ఈ సంగతి ఉన్నది. తనకు కలిగినది అనగా ప్రభువుయొక్క స్వకీయరక్తము; అమ్మెను అనగా ధారపోసెను
గనుక కొనెను. అనగా
ఇశ్రాయేలు జనులు ఎంత దేవుని వల్ల సృజింపబడిన వారైననూ తమయొక్క పాపజీవితమువల్ల సాతానుకు అమ్ముడైపోయినారు.
కాబట్టి దేవుని
ప్రజలు సాతాను చేతిలోకి వెళ్లిపోయినారు. మన సరుకు ఒకరిచేతిలో ఉన్నపుడు ఎట్లు విడిపించు కొందుము! కొంత
సొమ్ము ఇచ్చి
విడిపించుకొందుముగదా! దానికొరకు నష్టమైనను సరే, సరుకుపోగొట్టుకొనము. మనము దేవుని సరుకై యున్నాము, గాని
పాపమునుబట్టి సైతాను
సరుకైపోయినాము. మనలను విడిపించుటకు భూలోకములో ఏ వస్తువైనను, ఎంత సొమ్ముయైనను
చాలదు. క్రీస్తు రక్తము చాలును. 'ఆ రక్తముతో సర్వలోకమును ఆయన కొన్నాడు' అనుమాట ఎంత నిజమో, యూదులనుకూడా
కొన్నాడు అనేది అంత
నిజము.
ఒకనాడు యూదులలో ప్రముఖనికి దేవుడు ఏమి చెప్పినాడని శ్రమచరిత్రలో యున్నది? ఈ రాష్ట్రముకొరకు ఒకడు
చనిపోవుట మేలేఅని
చెప్పినాడు. ఉపమానములో పొలమునుకొనెను అని వ్రాయబడియున్నది. పొలము అనగా లోకము. ఆయన లోకమునుకొనెను. ఒకరైతు
ఒక పొలమును
కొన్నప్పుడు ఆ పొలములోని చెట్లుకూడా రైతువేకదా? అలాగే లోకమును కొన్న యేసుప్రభువునకు లోకములోని జనులందరు
ఆయనయొక్క జనముకదా?
లోకనివాసులైన ఆయన ప్రజలను క్రీస్తుప్రభువు రక్తక్రయధనమిచ్చి కొన్న చరిత్ర విషయము, మొదట యూదుల చరిత్రలో
కనబడుచున్నది.
తరువాత
బైబిలు చరిత్రలో చదివిచూడగా లోకమంతటిని కొన్నట్టున్నది. దేవుని పనులు, కాలక్రమేణ ప్రత్యక్షమగును. యూదులు
దేవునియొక్క
ప్రత్యేకజనముగా ఏర్చరచబడియున్నారు అని ఈ ఉపమానములో కనబడుచున్నది. అది మనుష్యులకు అర్థముకాదు. అందుచేతనే
యేసుప్రభువు ఈ
ఉపమానమును ఇంటిలో ఉన్నప్పుడు శిష్యులకు మాత్రమే వినిపించెను.
ఆయన అంతరంగములోని ప్రత్యేక మర్మములు అందుకొనునట్లుగా, పెండ్లికుమారుడైన క్రీస్తుప్రభువు నేటి దినమున మిమ్మును తీర్చి దిద్దునుగాక. ఆమేన్.