10. రూపాంతర దర్శన వివరము
గ్రంథకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు
మత్తయి 17:1-8.
క్రీస్తుప్రభువు రూపాంతరమును ధ్యానించుటకు వచ్చిన ప్రియులారా! యేసు పొందిన రూపాంతరమును మీరును పొందుదురుగాక.
నేటి వర్తమానమునకు ముందుగా రూపాంతర కొండను, సీనాయి కొండను మీ ముందు ఉంచుచున్నాను. సీనాయి కొండపై కనబడిన సూచనలు రూపాంతర కొండపై కనబడకపోయినను, ఇక్కడ కేవలము ప్రభువు ఒక్కరే మిగిలిపోయిరి. అదే రూపాంతర సన్నిధి. ఈ రూపాంతర కొండపై -
- 1. కమ్మిన మేఘము లేదు,
- 2. పలికిన తండ్రి లేడు,
- 3. కనబడ్డ మోషే ఏలియా లేరు,
- 4. అలుముకొన్న కాంతి లేదు.
ఇవన్నీ పోయినను యేసుప్రభువు ఒక్కడే ఉండిపోయారు.
- 1. సీనాయి పర్వతము,
- 2. రూపాంతర పర్వతము.
ఈ రెండు పర్వతములకూ దగ్గరి సంబంధమున్నది. ఇక్కడ రూపాంతర కొండపై ఆ ఒకొక్కనినే, అనగా ఆ యేసు ప్రభువే, ఆ ముగ్గురు శిష్యులు చూచిరి.
షరా:- ఆ కొండ మీద రెండు నిబంధనలున్నవి.
- 1) పాత నిబంధన,
- 2) క్రొత్త నిబంధన.
- 1 మోషే ఏలియాలు పాతనిబంధనలోనివారు.
- 2. పేతురు, యాకోబు, యోహానులు క్రొత్త నిబంధనలోనివారు పాతనిబంధన వెళ్ళిపోయినది. క్రొత్తనిబంధన ఉన్నది (అనగా ముగ్గురున్నారు. పేతురు, యాకోబు, యోహానులు).
వెళ్ళిపోయిన పాత నిబంధనకును, ఉండిపోయిన క్రొత్త నిబంధనకును మధ్యవర్తిగా యేసుప్రభువు ఉన్నారు. రేపుకూడా మనమధ్యనున్న వారందరుకూడా వెళ్లిపోతే ప్రభువు ఒక్కరే ఉంటారు.
1పాట:- ఎవరుపోయిన-ఏమిపోయిన = యేసునకు యేసెయుండు ఏమి కావలె ..
రూపాంతర కొండకును ఈ కీర్తనకును సంబంధమున్నది.
అయ్యగారు నిన్న
ప్రభువుయొక్క 33న్నర సం॥ల జీవితములో ఉన్న దేవుని సన్నిధిని గురించి చెప్పినారు. అప్పుడొక కీర్తన పాడించిరి.
2 పాట:- రారే మనయేసు స్వామి ..
అనుపాటలో నది తట మఠ జన పదవనముల స-మ్మద శుభవార్తను - బలికినవాడట అనుభాగము
పాడించి ఎఫ్రాయీము
మన్యము సంగతి చెప్పిరి. అక్కడి సన్నిధి అన్నిటికంటె గొప్పది. ఎందుకంటే పేతురు, యాకోబు, యోహానులు అనే సంఘము
క్రొత్త
నిబంధనలో
అక్కడ ఉన్నది. అదే క్రొత్త నిబంధన.
ఎఫ్రాయిములో, గలిలయ సముద్రపు దోనెలో, బజారులో, జనపదములో నదిలో, గుడిలో సువార్త ప్రకటించుచున్నపుడు ఈ రెండులేవు. అనగా పాత నిబంధన, క్రొత్త నిబంధనలు లేవు. ఆ సమయములో అంత ప్రకాశతలేదు, మేఘములేదు, తండ్రి స్వరంలేదు, అలుముకున్న కాంతిలేదు. అవన్నీ ఈ కొండపైనే ఉన్నవి. బైబిలు అంతటిలో రూపాంతర కొండపై ఎక్కువ నోట్సు దొరుకును. బైబిలులో ఇది ఒకటే, అన్నిటికి అన్ని ఉన్న పాఠము.
షరా:- ఇంకా బైలుపర్చబడేవి ఇకను బైలుపడినవి, అన్నీ ఇక్కడే ఉన్నవి. ఎవరైతే ఈ భూమిమీద సన్నిధిలో ఉంటారో, వారు
బైటకు
వచ్చేటప్పుడు కళతో వస్తారు. కళ అనే పాఠము ఇక్కడ రూపాంతర కొండమీద నేర్చుకొంటున్నారు.
పాట:- విలాపములకు
చెవినిచ్చెను - శ్రమ
కలాపములకు సెలవిచ్చెను.
- 1. మీరు సన్నిధి కూటమునకు వెళ్ళకముందు విలాపముండును అనగా ఏడ్పుండును.
- 2. సన్నిధిలోనుండి బైటకు వచ్చునపుడు కళావళులుండును.
అనగా కళతో వత్తురు = సంతోషముతో వత్తురు.
రూపాంతర కొండ వివరము:-
- (1) యేసుప్రభువు దేవుని సన్నిధిలో ఉన్నారు. గాని ముగ్గురి సన్నిధిలోలేదు. ఒంటరిగా ఉన్నట్టు ఉన్నారు. తక్కిన సమయములలో ఆయన అందరితో కలిసి ఉన్నారు. ఇక్కడ ప్రభువు ఒక్కరే తండ్రి సన్నిధిలో ఉన్నారు.
- (2) ఎఫ్రాయీము అరణ్యములో 12మంది శిష్యులు ప్రభువుయొక్క సన్నిధిలో ఉన్నారు.
- (3) ఈ పాఠములో అదికాదు. ఇక్కడ ప్రభువు మరియు ముగ్గురు దేవుని సన్నిధిలో ఉన్నారు. (దైవసన్నిధిలో ఉండు సమయములో నిద్రపనికిరాదు) పేతురు మనమిక్కడుందాము బాగున్నది. పర్ణశాలలు మూడు కట్టుకొందాము అన్నారు. అలాగే మీరు సన్నిధిలో ఉంటే మానివేయుటకు ఇష్టముండదు. ఇంకా ఉంటే మంచిది అనిపించును. కొండమీద కథే మనకును సన్నిధిలో ఉంటుంది, జరుగుతుంది. ఆ కొండమీదకి మహిమ మేఘము వచ్చునట్లు మనకు సన్నిధిలోకి వస్తుంది. రూపాంతర కథ ఇపుడును మనము సన్నిధిలో ఉంటే జరుగుతుంది. ఆ రూపాంతర కొండ మీద దర్శనము లేక ప్రత్యక్షత ఉండి ఉండి టక్కున ఆగిపోయింది. ప్రభువు “ఇకలెండి” అని అన్నారు. మనము సన్నిధికూటము చేస్తే రూపాంతర కొండమీదికి వచ్చినవి అన్నియు మనగదిలో ఉండును.
యేసుప్రభువు ప్రార్థన చేసేకొలది ప్రభువునుంచి వెలుగువచ్చింది. మీరు టార్చిలైటు నొక్కితే వెలుగు వచ్చినట్లు ప్రభువులోనుండి వెలుగువచ్చినది (మత్తయి. 17). యేసుప్రభువు రూపాంతరము పొందెను. ఆ తర్వాత వారికి యేసుప్రభువు తప్ప మరొకరు కనబడలేదు. ఆ కొండ మీదికి దిగి వచ్చినవన్ని ఆగిపోయినవి.
మోషే ఎందుకు రావాలి?
జ : 'నేను వ్రాసిన ధర్మశాస్త్ర ప్రకారము లోకములో నీవు ఒక్కడవే నెరవేర్చినావు గనుక నీకు నమస్కారములు అని నమస్కరించుటకే మోషే కొండమీదికి వచ్చినాడు.
ఏలియా ఎందుకు రావాలి?
జ : రాబోయే సంగతులన్నియు ప్రవక్తలు వ్రాసిపెట్టి యుంచినారు. వాటిపేరు ప్రవచనములు. ఆ ప్రవక్తలందరికి బదులుగా ఏలియావచ్చారు. ఎందుకంటే మత్త, 5:17లో ఈ రెండునూ ఉన్నవి.
- (1)మోషే చేతిలోని ధర్మశాస్త్రమునూ,
- (2) ఏలియా చేతిలోని ప్రవచనమును
- 1. అవి నెరవేర్చినారు.
- 2. ఇవి నెరవేర్చినారు గనుక నమస్కారములు, అని చెప్పుటకే మోషే, ఏలియాలు రూపాంతర కొండమిాదికి వచ్చిరి.
- 1. అవి అనగా ధర్మశాస్త్రము
- 2. ఇవి అనగా ప్రవచనములు.
ప్రశ్న - ప్రవక్తల తరుపునా ఏలియా ఎందుకు రావలెను? ఇంకెవరైన రాకూడదా? (లూకా 1:17) ఈ లోకములోనికి 'నేను వస్తాను' అని అనడానికిని, “ఇదిగో వచ్చాను" అని అనడానికిని తేడా ఉన్నదా? లేదా? ఉన్నది. (వచ్చెను అనునది గొప్పది) అప్పుడు పలికిన ప్రవచనము “వచ్చెదను" వాక్యములోనికి ఏలీయా వచ్చినాడు. ఏలీయా ఏలియాయే ఆ ప్రవచనముయొక్క నెరవేర్పుగా వచ్చినాడు. (మలాకీ. 4:5). గనుక ప్రవక్తల ప్రతినిధిగా ఏలియావచ్చెను. దేవునియొక్క కృపవల్ల ఈ వాక్యముయొక్క వివరము దేవదాసు అయ్యగారికి చిన్నతనములో అనగా 4వ తరగతిలోనే తెలియబడినది. అయ్యగారికి అది అందుకొనుట కష్టముకాదు. మత్తయి 11:25లో ఈ వివరము ఉన్నది.
ఏలియాలోని ఆత్మ, శక్తి బాప్తిస్మమిచ్చు యోహానులోనికి వచ్చినది. గనుక ఈయన ఏలియా అని ప్రజలు యోహానును అనిరి. ఆత్మశక్తి యోహానులోకి వచ్చినది గనుక ఏలియా వచ్చినట్టే. (తక్కిన ప్రవక్తలు రాలేదు). వారు వచ్చివెళ్లిపోయారు. ఏలియాకూడా ప్రవక్తగా వచ్చి వెళ్లిపోయాడుగాని యోహానులోకి మరలా వచ్చాడు. పిదప ఇక్కడ కొండమీదకు వచ్చాడు. గనుక ప్రవచనము పలుకుటకంటె తానే యోహానులోనికి వచ్చుట గొప్పతనము. తక్కిన ప్రవక్తలు పలికి వెళ్లిపోయారు. ఈ ఏలియా పలికి వెళ్లిపోయాడు గానీ మరలా యోహానులోనికి వచ్చినాడు. నెరవేర్పుగా వచ్చినాడు. ప్రవచన రూపముగా కొండమీదికి రాలేదు గనుక ఏలియా ప్రవక్తలందరికంటె గొప్పవాడు. ఏలియా ఏ విషయములో గొప్పవాడు? నెరవేర్పు విషయములో గొప్ప వాడు అనగా యోహానులోనికి వచ్చాడు గనుక గొప్పవాడు.
అది మాత్రమేగాక తక్కిన ప్రవక్తలందరికి బదులుగా రూపాంతర కొండమీదికి వచ్చాడు గనుక గొప్పవాడు. తక్కిన వారందరి బదులుగా వచ్చుటకు తగినవాడు గనుక వచ్చాడు గనుక గొప్పవాడు. ఇది క్రమముగా సన్నిధిలో ఉంటే అర్ధమగును. పరలోక పరిశుద్ధులలోనుండి తరచుగా సన్నిధి కూటములలోనికి వచ్చువాడు ఈ ఏలీయాయే గనుక ఈయన గొప్పవాడు. ఇది అయ్యగారి అనుభవము. మార్కు 9: 11,13; ఎప్పుడైనా, ఏలియాగారు సన్నిధిలోకి వచ్చినపుడు, త్వరగా త్వరగా చెప్పివెళ్ళిపోతారు.
- 1. యేసుప్రభువు మొదటి రాకకు ముందు ఏలియా వస్తారు అని మలాకీ 4:5,6లో ఉన్నది.
- 2. అలాగే రెండవ రాకడకుముందు 7 ఏండ్ల శ్రమకాలము రాకముందే ఏలియా వస్తారు. అది ఈ కాలమే. ఏడేండ్ల శ్రమకాలములోనికి మనము వెళ్లకుండ జేయుటకు ఏలియా వస్తారు.
మలాకీ 4:5,6లో ప్రభువుయొక్క మొదటి రాకకుముందు 1) యోహాను అనే ఏలియా వచ్చి క్రీస్తును గురించి ప్రవచించెను. ఈ ప్రవచన ప్రకారముగా అదివరకే సిద్ధపడినవారిని సిద్ధపరచుటకు యోహాను వచ్చి సిద్ధపరచినాడు. తీరా సిద్ధపడిన తరువాత ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. చెప్పుటయేగాదు తనశిష్యులైన ఆంద్రెయాను, పేతురును ఆయన దగ్గరకు పంపెను. అప్పుడు సిద్ధపడిన వేలకొలది ప్రజలకు బాప్తిస్మము ఇచ్చెను. ఈ యోహాను గొప్ప ప్రసంగము చేసినట్లు మత్తయి. 3వ అధ్యా॥లో ఉన్నది అయ్యగారు ఈ యోహాను ప్రసంగమును పద్యములో వ్రాసిరి.
- 1. ఏలియా వస్తాడని శాస్త్రులు చెప్పుచున్నారు (మలాకీ 4:5)అని శిష్యులు ప్రభువును అడిగిరి. ప్రభువు వారికి జవాబు ఏమి చెప్పిరి. లూకా 11:17 ఏలియా వచ్చాడు, సిద్ధపడినవారిని సిద్ధపర్చినాడు (క్రీస్తు ప్రభువు మొదటి రాకకు) మీరాయనను మీ ఇష్టము వచ్చినట్లు చేసినారు అని చెప్పినారు. ఇందులో చాలా అర్ధమున్నది. యోహాను ప్రభువును గూర్చి మెస్సియా వచ్చెను. ఆయన మీమధ్య ఉన్నాడు అని సాక్ష్యమిచ్చెను.
-
2. రెండవ రాకడకుముందు ఏలియా రావలెను. ప్రజలను సిద్ధపరచవలెను. సంఘము ఏడేండ్ల శ్రమలలోకి వెళ్లకుండ
ఆపుచేయవలెను. “ఆ పని మీద
ఇపుడు ఏలియా ఉన్నాడు” అని దర్శనము లేకపోయిననూ వాక్యమునుబట్టి సిద్ధపర్చుటకు వచ్చినాడని, వచ్చుచున్నాడని
నమ్మవచ్చును. ఏలియా
పని ఏదనగా: అనేకమంది తమ హృదయములలో రాకడ రాకడ, ఎపుడు రాకడ అని అంటున్నారు.
ఇది ఏలియాయొక్క పనియే. ఆ పని మాత్రముగాదు "రాబోయే ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధిచెప్పినవాడు ఎవడు?”
అటువంటి మాట
ఇపుడును
చెప్పుచు మన తలంపులో రాకడను పెట్టినాడు.
- (1) రాకడ తలంపు తలలో పెట్టెను.
- (2) రాకడ భయము మన తలలో పెట్టెను.
షరా:- ఆ
ఏలియాయొక్క
ఆత్మయును, శక్తియును స్నానికుడైన యోహానులోనికి వచ్చింది. ఏలియాలో ఉన్న చరిత్ర అంశములు కొన్ని యోహానులోనికి
వచ్చెను. అన్నీ
రావు. అయితే, యోహానులోకి ఎక్కువ వచ్చినది ఏమిటి అంటే హత్య. హతసాక్షియగుట. యేసుప్రభువు హతసాక్షియగుటకు
పూర్వము మచ్చుకు
తనకొరకు ఒకరు హతసాక్షి కావలెను. అందుకు తగినవాడు యోహాను. క్రీస్తుప్రభువు మొదటి రాకకు సిద్ధపడిన ప్రజలను ఈ
యోహానే
సిద్ధపర్చవలెను. క్రీస్తుప్రభువు రెండవ రాకకు ఇపుడు పరలోక పరిశుద్దులను సిద్ధపరచవలెను. ఆ పని మీద యోహాను
తప్ప మరొకరు
పనికిరారు. సిద్దపరచుటలో అదొక వరము. ఇదొకవరము. యోహానుకు దేవుడు మరణము రానిచ్చినాడు. అది ఆయన చిత్తము నేడు
ప్రతివారి
మనస్సులోనే ఏడేండ్ల శ్రమ గురించి ఏలియాగారు జ్ఞాపకం చేస్తున్నారు. అందుచేతనే మేము రాకడకు సిద్ధపడుదుము.
ఏడేండ్ల వరకు ఉండము
అని కొందరు అంటున్నారు. వారికి మహాశ్రమల భీతి కలిగినది గనుకనే ఆలాగు అనుచున్నారు.
ప్రార్ధన:- ఓ ప్రభువా!
ఏలియా గురించి
మేము
నేర్చుకొన్న పాఠములో మమ్ములను సిద్ధపరచిన, సిద్ధపరచేటటువంటి పాఠములు చూపించుము ఆమేన్.