3. గురిపెట్టి ప్రార్థించుట
గ్రంథకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు
లూకా. 18:1-8.
దైవ ప్రార్ధనాసక్తికలిగినవారలారా! నేటి వాక్య ధ్యానముద్వారా గురిగల ప్రార్ధనావాలు క్రీస్తుప్రభువు మనకు అందించునుగాక. ఆమేన్
డాక్టరు మార్టిను లూథరు. ఇట్లు చెప్పినాడు నేను వ్యక్తిని గురించి ప్రార్ధించినపుడు అతనిని నా మనోదృష్టి యెదుటికి తెచ్చుకొందును. గనుక మనమును ప్రార్ధనలో ప్రభువును జ్ఞాపకము తెచ్చుకొన్న మొదట మనము ఎవవరిని గురించి ప్రార్థింపనై యున్నామో, ఆ వ్యక్తిని మనో దృష్టికి తెచ్చుకొని అతడు మన యెదుట ఉన్నట్టు భావించుకొని అతనిని గురించి చెప్పవలసిన మాటలన్నియు ప్రభువునకు వరుసగా చెప్పివేయవలయును. అనగా
- 1) అతని గుణములను గురించియు దుష్ట క్రియలను గురించియు,
- 2) అతడు వేయు ప్రశ్నలను గురించియు
- 3) అతనికి గల శోధనలను గురించియు ప్రభువునకు ఒక దరినుంచి రిపోర్టుచేస్తూ, మీరు చేయవలసిన మనవి ప్రభువునకు వినిపించవలయును. ఆ తర్వాత దేవా! నా ప్రార్ధన ఆలకించినావని నమ్ముచున్నాను, నీకు స్తోత్రము అని చెప్పవలయును.
ఒక మిషనెరీ ఇట్లు చెప్పుచున్నాడు:- ఒక పక్షిని కొట్టగోరు వేటగాడు కొమ్మను గాని ఆకునుగాని కొట్టితే పిట్టపడునా? పడదుగదా! అట్లే మనము ఎవరి గురించి ప్రార్ధించనైయున్నామో, ఆ వ్యక్తి బలహీనతకు తగలకుండా ప్రార్ధించిన యెడల, అతడు ఆ బలహీనత మానడు. వెన్న ముద్ద పక్షిని ఉండేలు బద్దగలవారు కొట్టనారంభించగా, ఉండేలు ఖర్చు అగునేగాని పిట్టబడదు. ఎందుచేత? ఒకసారి పొదకును, ఇంకొకసారి కాలికిని, మరియొక సారి రెక్కకును వేరొకసారి వేరొకచోటను తగిలినయెడల కుంటుకొనుచు ఎగిరిపోవును. ఉండ గొంతుకకు తగిలితే వెంటనే పడిపోవునని వేటగాళ్లు చెప్పుచున్నారు. పక్షుల దృష్టాంతములు అంతమంచివి కాకపోయినను ఇక్కడ మనకు అక్కరకు వచ్చుచున్నవి. మన ప్రార్ధన పట్టు ఏమనగా, ఆ మనుష్యుని బలహీనతవైపు గురిపెట్టి చేసినయెడల తప్పక నెరవేరునని ఈ దృష్టాంతము వలన గ్రహించుకొనుచున్నాము. గురిలేకుండా ప్రార్థించిన యెడల సమయము వృధా, ప్రార్ధనా మాటలు వృధా, కీర్తనలు వృధా, వాక్య పారాయణము వృధా, మోకాళ్లు కొట్టుకొనిపోవుట వృధా? అంతయును వృధా? అతనియొక్క ఆత్మ మీకు దొరకనే దొరకదు. గురిలేని ప్రార్ధనలు గుణమునకు రావు.
ఒకవేటగాడు ఇట్లనుచున్నాడు. ఉండకు ఒకపక్షి పడవలెను అవును. ఆయన మూడు ఉండలు తీసికొని వెళ్లితే, మూడు పక్షులు తెచ్చేవాడు. అట్లేనొక ప్రార్ధనకు ఒక మనిషి ఆత్మ దొరుకవలెను. అనగా ఈ వేళ ఒక మనిషిని గురించి మీరు గురిపెట్టి ప్రార్థించితే ఆ మనిషి మీకు దక్కవలయును.
ప్రార్థన ఫలితములు:-
- 1. ప్రార్ధనవలన మహిమ, రక్షణ, సహవాసము కలుగును. అనగా మన ప్రార్ధనవలన తండ్రికి మహిమ, కీర్తి రావలయును రక్షణ లేనివారికి రక్షణ రావలయును. రక్షణ ఉన్నవారికి మన ప్రార్ధన వలన దేవునితో సహవాసము కలుగవలెను.
- 2. మన ప్రార్ధనవలన ఎదుటి మనిషికి రక్షణ రావలయును. ఒకరి స్వస్థత నిమిత్తము ప్రార్థిస్తే వారికి స్వస్థత రావలయును. ఇబ్బంది ఎత్తి ప్రార్థించితే సమృద్ధి రావలయును. ఒక కలహము ఎత్తి ప్రార్థిస్తే, సమాధానము రావలయును.
-
3. మన ప్రార్ధనవలన దేవునికిని, మనకుగల సహవాసము వృద్ధిపొందవలయును. ప్రార్ధన చేయగా అనగా తరచుగా ప్రభువు దగ్గరకు
ప్రార్ధనకై
వెళ్లినయెడల ప్రభువుతో చనువు కలుగును. ఆ చనువు సహవాసాభివృద్ధికై దారితీయును.
షరా:- దేవునిరాజ్యము భూమి మీద వ్యాపించుటకు అనేక పనులు జరుగుచున్నవి. ఆ పనులు రాజ్యాభివృద్ధి విషయమైన సాధనమైయున్నవి. మన ప్రార్థనకూడ ఒక పని సాధనము. ఇది గ్రహించి,- (1) "దేవా! నా ప్రార్ధన నీ రాజ్యాభివృద్ధి సాధనముగా వాడుకొందువని నమ్ముచున్నాను, నీకు స్తోత్రము" అని చెప్పుటవల్ల ఆయనకు మహిమ కలుగును.
- (2) దేవా! నా ప్రార్ధన ఆలకించెదవని నమ్ముచున్నాను నీకు స్తోత్రము అని చెప్పుటవల్ల తండ్రికి కీర్తి కలుగును.
- (3) నీ చిత్త ప్రకారము నా ప్రార్ధన నెరవేర్చియున్నావని నమ్ముచున్నాను, నీకు స్తోత్రము అని చెప్పుటవలన ఆయనకు కీర్తి కలుగును.
షరా:- మనమెవరినిగూర్చి ప్రార్ధించినామో అతనిని ప్రభువు రక్షించుట వలన ఆయనకు కీర్తిగాని, మనకుకాదు. తరచుగా ప్రార్ధన చేయుటవల్ల తండ్రియొద్ద నాకు చనువు కలిగింది. తండ్రి నన్ను దగ్గరకు రానీయని యెడల నాకు ఆ చనువు కలుగునా! ఆయనే అట్టి ప్రార్ధనావాలు, వీలు కలిగించినందువలన ఆయనకు స్తోత్రములు అని దేవుని స్తుతించవలెను.
యేసు ప్రభువు తన శిష్యులతో ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క విషయమును గూర్చి బోధించుచుండెను.
ఉదా:- ప్రార్ధన, ఉపవాసము, పరలోక
రాజ్యము, మొ॥వి బహు క్లుప్తముగా చెప్పెను. ఆయన
బోధించినది కొన్ని నిమిషములైనను, ప్రజల హృదయములలో అవి గొప్ప పనిచేసెను. మనము ఆయన ఒక చిన్న మాటను వివరించుటకే సమయము
చాలదు.
ఆయననుగూర్చి అనేక గ్రంథములు వ్రాయబడినవి కాని వాటిలో ముఖ్యమైనవియే ప్రసంగికులు చదువుచున్నారు.
“విసుగక నిత్యము ప్రార్ధన చేయవలయును”. మానవుని జీవితములో కష్టమును బట్టి చూడగా కష్టకాలములో ఎంత దైవజనునికైనను విసుగుదల రాకమానదు. విసుగుదల” -
- 1) ప్రార్ధన చేయ తలంచగా, ప్రార్ధనకు స్థలము దొరకనప్పుడు,
- 2) స్థలము దొరికినా సమయము దొరకనప్పుడు,
- ౩) సమయము ఉన్నా, వీలు చిక్కనపుడు,
- 4) వీలున్ననూ అనారోగ్యము కలిగినపుడు విసుగుదల వచ్చును. ఎండ ఎక్కువ, వాన యెక్కువ అని విసుగుకొందుము; ఆ విధముగానే బైబిలు చదువనపుడు మరియు ప్రార్ధనలోనూ మనము విసుగుచున్నాము.
యేసుప్రభువు చెప్పిన మాటలో రెండు భాగములున్నవి:-
- 1) విసుగకుండ ప్రార్ధన చేయవలెను. ఇది ఒక వంతు.
- 2) నిత్యము ప్రార్ధన చేయవలయును. ఇది రెండవ వంతు.
రెండునూ ప్రార్ధనను గూర్చిన అంశములే. గనుక దైవప్రార్ధన పై రెండు విధములుగా చేయవలయును. విసుగుదల ఎప్పుడు కలుగును?
- 1) స్థలము
- 2) సమయము,
- 3) వీలు లేనప్పుడు.
విసుగుకొంటే, అది ప్రార్ధన కాదు. విసుగుకుంటున్నారు, ప్రార్ధన చేయుచున్నారు. కాన విసుగుదల లేకుండా చేయునదే ప్రార్ధనగాని విసుగుదలతో కూడినది ప్రార్ధన కానటువంటి ప్రార్ధన.
లూకా సువార్త 18వ అధ్యా॥లో ప్రభువు ఒక ఉపమానము చెప్పినారు:-
ఒక స్త్రీ అనేకమారులు మనవి చేసికొన్నది. మన అనుభవమునుబట్టి ఆమె విసుగుకొనలేదు. విసుగుదలకు పైన చెప్పిన మూడు కారణములున్నవి.
(2) స్త్రీయొక్క ఉపమానమునుబట్టి చూచితే, అధికారి పరిష్కారము చేయలేదు. ఈ కారణముచేత ఆమె విసుగుకొనవలెను, అయిననూ ఆమె విసుగుకొనలేదు. మనము దేవునికి ప్రార్ధన చేయుచున్నాము. దేవుడు మన విషయము పరిష్కరింపవలయును. ఒకవేళ పరిష్కరింపపోయినను, విసుకకొనకూడదు. ఈ భావము చూపించుకొనుటకై క్రీస్తుప్రభువు ఈ ఉపమానము నిచ్చెను. దేవుడు మన ప్రార్ధనలు ఆలకించుచున్నాడా? ఒక్కొక్కప్పుడు నెరవేర్పు కనబడదు. అనేక దినములు చేసినను నెరవేర్పుకాదు. అప్పుడును విసుగుదలను రానీయకూడదు. ఇన్నిమారులు చేసినను నెరవేర్పు రాలేదనియైనను విసుగుకొనకూడదు. మనపని విసుగుదల లేకుండా ప్రార్ధన చేయుట.
రెండు న్యాయములున్నవి :-
- 1. మనకు ఒక న్యాయమున్నది. అది మనము నెరవేర్చవలసిన న్యాయము.
- 2. దేవునికి మరియొక న్యాయమున్నది.
మన ప్రార్ధన ప్రకారము చేసి నెరవేర్చుటయే దేవుని న్యాయము.
దేవునిది ఒకటి, మనది ఒకటి. విసుకకుండా ప్రార్ధించుట మన న్యాయము. మన మనవి ఆలకించి పరిష్కరించుట ఆయన పని. మనము నేర్చుకొనవలసిన న్యాయమునుబట్టి ఆయన న్యాయము ఉంటున్నది. గనుక మనము మన న్యాయము నెరవేర్చవలసిన ప్రార్ధన ఉన్నది గాని మన న్యాయము తప్పిపోయినది గనుక నెరవేర్పులేదు. అనగా న్యాయప్రకారము చేయవలసిన ప్రార్ధన చేయలేదు గనుక నెరవేర్పు లేదు. ఆ న్యాయాధిపతి ఆరంభంలో విచారించకపోయినను చివరకు ఆమెను పిలిచి న్యాయ విచారణ చేసినారు. అలాగే దేవుడుకూడ తప్పక ఎప్పటికైన ఆలకిస్తాడు ఆలన్యమైనను ఆయనవని ఆలస్యముచేయుట అవసరమైతే ఆలస్యము చేస్తాడు. ఆయన విశ్వాసులయొక్క ప్రార్ధన ఆలకించి న్యాయము తీర్చును గనుక తప్పక ఆలకిస్తాడు విసుకక ప్రార్థించండి. చిన్నప్పటినుండి దేవుడు ప్రార్ధన ఆలకిస్తున్నాడని చదువుకున్నా మనము విసుకుకుంటున్నాము ఎందుచేత? నిండైన నమ్మకము లేనందువలన కొంచెము ఆలస్యమైనప్పటికి దేవుడు ప్రార్ధన ఆలకిస్తాడు గనుక విసుకకూడదు.
పై నాలుగు కారణములనుబట్టి విసుగుకుంటారు. దేవుని దగ్గరనుంచి నెరవేర్పు రాలేదని విసుకుతాము కాని ఆయన తప్పక ఆలకిస్తాడని, విసుగక దయచేయునని నమ్మవలెను. విసుకుకొనవలసిన కారణములు తట్టు చూడక, ఆయన తప్పక ఆలకిస్తాడు న్యాయము తీర్చుననే విషయము తట్టుచూచి ప్రార్థించవలెను. దేవుడాలకిస్తాడనే విషయము ప్రార్థించుటకు మనలను ప్రేరేపిస్తుంది.
రెండు కారణములు:-
- 1. సమయము
- 2. వీలు.
ఇక్కడ దేవుడు ఆలకిస్తాడని ఉన్నది గనుక ఆ సంగతి ప్రార్ధనకు ప్రేరేపిస్తుంది. విసుగుదల లేకుండా నిత్యము ప్రార్ధించవలెను. ఈ కారణమువల్ల ధైర్యము పుట్టుచున్నది. విసుగుదల కొట్టివేయుటవల్ల నిత్య ప్రార్ధన చేయగలము. విసుగుదల కొట్టివేయకపోతే ప్రార్ధన ఆగిపోతుంది. గనుక ఎన్నడూ విసుగుదలలోనికి పోకూడదు. మన మనవి నెరవేరకపోయిన విసుగుదలపడకూడదు. నెరవేర్పు ఈ ఉపమానములో లేదు. తప్పకుండా వింటాడని, నెరవేర్పు ఇస్తాడని ఈ ఉపమానములోను ఉన్నది. నిత్యము ప్రార్ధన చేయవలెను. 4 రోజులు చేసి ఆగిపోతే నిత్యమనేది రాదుకదా! ఆ ప్రార్థన ఏమైనది? ఆ ప్రార్ధన, ప్రార్ధన స్వరూపము ధరించలేదు. అది విసుగుదల స్వభావమును, విసుగుదల నైజమును కలిగియున్నది. విసుగుదల లేకుంటే నెరవేర్పు కలిగియున్నది. "ఆ స్త్రీ వెళ్లి మనవి చేసినప్పుడు ఆయన ఆలకించలేదు” అని ఆమె తెలుసుకొన్ననూ, అయిననూ ఆయన అనగా ఆ లోకాధికారి 4రోజులు వెళ్లింది, ఆలకించలేదు. ఇది మన ఎదుట కనబడే వృత్తాంతము. గాని ఆయన ఆలకిస్తాడని ఉన్నది గనుక అనేక పర్యాయములు వచ్చినది. మన యెదుట కనిపిస్తున్న వృత్తాంతము ఆమె హృదయములో ఉన్నది గనుక అనేకసార్లు వచ్చినది. ఆమె ఎదుట ఆయన ఆలకించలేదని ఉన్నను, ఆయన ఎప్పటికైనా ఆలకిస్తారని తన హృదయములో ఉండవలెను. ఇది విచిత్రమైన వృత్తాంతము. దేవుడు మన ప్రార్ధన ఆలకిస్తాడని ఉన్నను 4 రోజులు చేసినా, విసుగక కొనసాగించిన దేవుడు ఆలకించలేదు. "ఆయన ఆలకించపోయిన పర్వాలేదు, ఆయన గడియ వచ్చినపుడు ఆలకిస్తాడని” నమ్మవలెను. విశ్వాసి దేవుడు ఆలకిస్తాడని పట్టుకుంటాడు. అవిశ్వాని దేవుడు ఆలకించలేదను మాట పట్టుకుంటాడు. విశ్వాసియైతే , దేవుడు ఆలకిస్తాడని ప్రార్ధన చేస్తునే ఉండును. అదే నిత్య ప్రార్ధన. విశ్వాసికి నిత్యము ప్రార్ధించే సమయముండును. ఇక్కడ రెండు సంగుతులు గుర్తించవలెను.
- (1) అంతరంగములో దైవప్రార్ధన చేసే సమయమందు తన హృదయములో విసుగుదల వచ్చునేమో అని జాగ్రత్తగా పరిశీలించుకొనవలెను.
- (2) (i). ప్రార్థన గురిగా జరుగుతుందా లేదా? (ii). విసుగుదల వస్తున్నదా?
తప్పకుండా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు అని నమ్మవలెను.
ఆలకించలేదు అనే విషయము ఎత్తుకొనకూడదు. కాబట్టి మా స్వంత
విషయములు
ఎత్తి ప్రార్ధించునపుడు విచారపడకూడదు (పడవద్దు). ఇంకా మీ ప్రార్ధన హెచ్చుగా చేయవలెను. విసుగుదల వస్తే హెచ్చిపోయిన
ప్రార్ధన
తగ్గిపోతుంది. నెరవేర్పు ఆలస్యముగా వస్తుంది. దైవ ప్రార్ధన చేసేటందుకు
మనమందరము పూనుకున్నాము. చేసిన వాటిలో కొన్నిటికి నెరవేర్పు వచ్చినది. ఇంకా క్రొత్త ప్రార్థనాంశాలు వస్తున్నవి. ప్రభువు
ఈ మాట
ఉపమానములో సెలవిచ్చినపుడు ఈ రెండు విషయములతో పాటు దివారాత్రులు ప్రార్ధించవలెను అని సెలవిచ్చెను, అంటే ఈ నిత్య
ప్రార్ధన
జ్ఞాపకము చేసెను. పగలు రాత్రులు చేయవలెను. ఇది చూచి దేవుడు ఆలకించకుండా ఉంటాడా! ఈ వేళ పగలు రాత్రి, రేపు పగలు రాత్రి
ఈలాగు
క్రమముగా చేసికుంటూ వెళ్లవలెను. అందుకే ఆయన తాను ఏర్పరచుకొన్న వారియొక్క పార్థన అన్నారు.
ఉదా:- ఏ విషయమైనా 10మంది
ప్రార్థిస్తుంటే వారిని బోధకుడు పరీక్షిస్తున్నాడు. ఎవరు కునుకుచున్నారో, ఎవరు విసుగుచున్నారో, ఎవరు మాటమాటికి బయటికి
వెల్లివచ్చుచున్నారో అది ఆయన చూచుచున్నారు గనుక; అట్టివారిని బోధకుడు గమనించినాడు గనుక ఎవరు విసుగకుండా
ప్రార్థించినారో వారి
ముగ్గురను ఏర్పరచుకొన్నట్లు, విసుగకుండా ప్రార్థించే వారినే మాలో ఏర్పర్చుకొన్నారు. విసుగుదలలేకుండా నిలకడగా
ప్రార్ధించుచున్నావని ఆ బోధకుడు అట్టివారిలో ఒకని ఏర్పర్చుకొనెను. ఆలాగే దేవుడు విసుగకుండా ప్రార్థించేవారినే
ఏర్పర్చుకొనును. విసుగుదలలేనందున, వారు నిత్యము ప్రార్థనచేయువారు గనుక వారిని ఏర్పర్చుకొనును గనుక తానేర్పరచుకొను
వారిని అని
ప్రభువు చెప్పెను. వీరు ప్రార్ధనాపరులే. మంచి మార్కులు గలవారిని టీచరు ఏర్పరచుకొన్నట్లు దేవుడు వారిని
ఏర్పరచుకొన్నాడు.
ఎందుకు? వారి ప్రార్థనలు నెరవేర్చే పని మీద వారిని ఏర్పరచుకొన్నారు. మీరు నామకార్ధముగానైన విసుగుదల
లేకుండా ఉండవలెను. చేయవలసిన ప్రార్ధన నెరవేర్చే పనిమీద వారిని ఏర్పరచుకొన్నాను. ఎన్ని అంశముల మీద మనము
ప్రార్ధిస్తున్నామో,
అన్నిటి మీద నెరవేర్పు అవసరమై ఉన్నది. ఆయన మనసులో నెరవేర్చవలెనని ఉన్నది కాబట్టి; ఆ నెరవేర్పు నిమిత్తము ప్రార్ధించే
ప్రార్ధనాపరులు కావలెను. అనగా ఆ నెరవేర్పులు బయలుపర్చేటందుకు దేవుని మనుష్యులు కావలెను. అటువంటి వారిని
ప్రార్థనాపరులనుగా
ఆయన ఏర్పరుచుకొనుచున్నారు. బయటకు వెళ్లి సువార్త బోధించుటకు సువార్తికులు కావలెను. ఆదరించే ఉద్యోగము చేసేవారుకూడ
కావలెను
అనగా రోగులను ఆదరించేవారు. ఆలాగే చిక్కులలో ఉన్నవారి చిక్కులు విడదీయుటకు పరిచారకులు కావలెను. వీరు ఎక్కడనుండి
వస్తారు?
మనుష్యులలో నుండి వస్తారు. మూడు పాఠశాలలోని విధ్యార్థులు స్కూలు ఫైనల్ లో కృతార్థులైన పిమ్మట వెళ్లి, ఆయా
డిపార్టుమెంటులలో పనిచేయుదురు. ఈ ప్రకారముగా నేర్చుకొన్నందున ఆయా ఉద్యోగములలోకి వెళ్లి, పనిచేయుదురు. అట్లే
ప్రార్ధనోద్యోగము
మీద ప్రార్థనాపరులు కావలెను.
- 1) దేవుని నెరవేర్పులు అందుకొని,
- 2) నెరవేర్చే ప్రార్థనలు జరిగించే,
- 3) ప్రార్ధనా మనుష్యులు దేవునికి కావలెను.
అప్పుడు దేవుడు ఎంత గొప్ప పనియైన చేయగలరు. ప్రభువు 12మంది ఏర్పరచుకొన్నారు. 1900 ఏండ్ల క్రిందట భూదిగంతముల వరకువారు సువార్త ప్రకటించిరి. ఒక విద్యకాదు అన్ని విద్యలు క్రీస్తు ప్రభువు సహవాసములో సంపాదించుకొనిరి. వినయము, పవిత్రత, జీవనము ఈలాగు అనేకములు సంపాదించుకొనిరి. అప్పుడులేచి భూమియొక్క సమస్త రాష్ట్రములకు వెళ్లి, వాక్యము ప్రకటించిరి. వారు ఆ పనిని అంగీకరించినందున నూతన బలముపొంది. పనిచేసిరి. ప్రభువువద్ద వేదవిద్య బాగా నేర్చుకొన్నారు గనుక దేశదేశములకు వెళ్లి లోకధనము లోక విద్య తక్కువ అయినను వెళ్లి, మంచి పనిచేసిరి. నేర్చుకొనేటప్పుడు విసుగుకొనిరి. గాని తరువాత విసుగుకొనలేదు ఆకలి అయినప్పుడు పేతురు విసుకలేదుగాని ప్రార్థనలోకి వెళ్లినాడు గనుక ప్రార్ధన విద్యలో శిష్యులందరూ ఆరిందలైరి(ఆరితేరిన). అంతే కొంచెము సమయము దొరికితే చాలు, ప్రార్ధనలోకి వెళ్లిరి గనుక మనమును ప్రభువు చెప్పిన ప్రకారము చేస్తే గొప్పగొప్ప ఉపకార ఉద్యోగములకు ప్రభువు నిర్ణయించును. దేవుడు తాను ఏర్పరుచుకొన్న వారు దివారాత్రులు ప్రార్ధించుచుంటే ఆయన తప్పకుండా ప్రార్ధన ఆలకించును గనుక కోరుకొనండి. ఎప్పుడో కోరుకొనడముకాదు, ఇప్పుడే. విసుగక నిత్యము ప్రార్థించే వారిని అడిగితే కాదు ఆ ప్రకారము చేస్తే ఏర్పాటులో చేరగలము. ఈ దినములయందు ప్రార్ధన బలము తగ్గిపోవుచున్నది. కష్టము, నింద, అవమానము ఎక్కువగుచున్నది. అయినను మనము మనపని మీద ఉండవలెను. దుర్జనులు తమ పని మీద ఉన్నారు గనుక సజ్జనులును తమ పని మీద ఉండవలెను. గనుక ప్రభువు ఇచ్చిన సలహాలు రెండునూ మీకు ఎంతైనా అవసరమే.
- 1) నిత్యము,
- 2) విసుగకకుండా ప్రార్ధించవలెను.
విసుగుకుండా ప్రార్థిస్తే అది నిత్యప్రార్థనయే. ఒక వ్యక్తి ప్రార్థిస్తూ విసుకుకొన్నాడు. 4రోజులుచేస్తే, అది నిత్య ప్రార్ధనకాదుగాని. అనిత్య ప్రార్థనయైయున్నది. ఇంగ్లీషు బైబిలులో Faint Not అంటే సొమ్మసిల్లవద్దు అని ఉన్నది. ఒకరు ప్రార్ధన నెరవేరనందున సొమ్మసిల్లినారు. అదే విసుగుదల. ప్రభువు చెప్పిన ఉపమానములో కొన్నిమాటలు ఉన్నవి.
- 1) నిత్యము,
- 2) తరచుగా, ప్రార్థించవలెను.
- 3) దివారాత్రులు,
అప్పుడు తండ్రి త్వరగా నెరవేర్పు ఇచ్చును. విసుగుదల లేకపోతే త్వరగా జవాబిచ్చును. ఆలస్యమైననూ జవాబిచ్చును. దేనినిబట్టి మనము చెప్పగలము? త్వరగా అనేమాటనుబట్టి
- 1) వాగ్ధానము ఆలకిస్తాడు.
- 2) వృత్తాంతమును తప్పక ఆలకిస్తాడు.
ఈ సంగతి జరిగిపోయిన, భావికాల వృత్తాంతమునుబట్టి చెప్పుదురు. గతించిన దానినిబట్టి మనము నమ్మినయెడల మన ప్రార్ధన తప్పక జరుగుతుంది. మనుష్యకుమారుడు వచ్చునపుడు, భూమి మీద విశ్వాసముండ కనుగొనునా? ఆ ప్రశ్నతో ముగించెను. ఈ ప్రశ్న మానవుని జీవితకాలమునకు సరిపోయేది. చనిపోయిన వానియొద్దకు వచ్చి ఘనవైద్యులు ఏమి చేస్తున్నారు? ఒక తలవెంట్రుక తెచ్చి ముక్కుయొద్ద పెట్టగా, అది కదిలితే మందులే ఊపిరిపోయుచున్నట్టై. అట్లే ప్రార్థన ఊపిరివంటిది గనుక మనము అన్ని కష్టములు ప్రభువుతో విసుగక చెప్పుచున్నాము అనే ప్రార్ధన ఊపిరి నిత్యము కలిగినవారమై యుండవలెను. అట్టి స్థితిలో పెండ్లికుమారుడైన క్రీస్తు ప్రభువు మనలను స్థిరపర్చును గాక. ఆమేన్