5. పరిశుద్ధాత్మను అందుకొను వాలు
గ్రంథకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు
అపో.కార్య. 2:1-4.
అత్యాసక్తి పరులైన మీకు ఆత్మానందము కలుగునుగాక, ఆత్మాభిషేకము అందునుగాక. ఆమేన్.
ఆత్మ నింపుదల :- దేవుడు తన ఆత్మను మానవులకు నింపుతాడు. హనోకు దేవుని ఆత్మ కలిగినవాడు. అలాగే అబ్రాహాము, యోసేపు, హన్నా, జకర్యా ఎలీసబెత్తు, స్నానికుడైన యోహాను మొదలైన వారందరూ ఆత్మతో నింపబడినారు. ఆ ప్రకారమే మరియ పరిశుద్ధాత్మచేత నింపబడినది. అది దేవుని ఉద్దేశ్యము. పాపం ప్రవేశింపకముందు దేవుని ఉద్దేశ్యము ఏదనగా, స్త్రీలు పరిశుద్దాత్మతో గర్భవతులై పిల్లల్ని కనాలని. అయితే మానవులు పాపము చేసి పాపముతోనే పిల్లల్ని కంటున్నారు. పరిశుద్ధాత్మతో గర్భవతులైతే పుట్టినవారు పరిశుద్దులుగా ఉందురు. అయితే పాపమువల్ల పుట్టినందున మానవులందరూ అపరిశుద్దులైనారు. “నా తల్లి నన్ను పాపంతోనే గర్భందాల్చినది" అని యోబు అన్నాడు. దేవుడు ఆయన జన్మద్వారా నేను సృష్టికర్తను అని రుజువు చేసికొన్నారు.
మరియ పరిశుద్దాత్మ వలన గర్భము కలిగినది. సృష్టి మనిషి పాపము చేయకపోతే పరిశుద్ధాత్మవలన పిల్లలు పుట్టి అందరూ యేసుప్రభువులానే ఉందురు. అప్పుడు మామూలు బట్టలు ఉండక మహిమ బట్టలే ఉండును కాని మానవుడు పోగొట్టుకొనిన మహిమను యేసుప్రభువు సంపాదించారు. ఆదాము పోగొట్టుకున్నాడుగానీ రెండవ ఆదాము అంతా తిరిగి సంపాదించారు. సృష్టి అంతా "కలుగునుగాక" అనగా కలిగినది. అలాగే మరియ గర్భము ధరించినది, పరిశుద్దాత్మ వలన కలిగినది. మత్తయి. 3:11 ఆయన పరిశుద్ధాత్మ కలిగినవాడు గనుక "పరిశుద్దాత్మతోను అగ్నితోను బాప్తిస్మము మిచ్చును" అని యోహాను అన్నాడు. అపో॥కార్య. 1:5 యోహాను నీళ్లతో ఇచ్చెనుగాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్దాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. గనుకనే అగ్నిజ్వాలవంటి నాలుకలు వారిమీద వ్రాలినది. అగ్ని వారి జ్ఞానాన్ని వెలిగించినది. కాబట్టి పరిశుద్దాత్మను పొందినవాడు జ్ఞానముగా ఉండును.
- 1. సందేహము,
- 2. అనుమానము,
- 3. అవిశ్వాసము,
- 4. అపనమ్మిక,
ఈ నాలుగు ఉంటే దయ్యములకు ఆనందము. అగ్నితో బాప్తిస్మమనగా జ్ఞానము వృద్ధిపొందుట. 120మందికి జ్ఞానము కలిగినది, తెలివి కలిగింది కాబట్టి అన్యభాషలు మాట్లాడారు. అనేకులు విభ్రాంతినొందిరి. మన హృదయాలు ఖాళీ అయితేనేగాని దేవుడు ఆత్మతో నింపడు. హృదయం ఖాళీ చేసి, అనగా శుద్దిచేసికొంటేనే పరిశుద్ధాత్మతో నింపుతాడు. బాప్తిస్మము అనగా గ్రీకు భాషలో నీళ్ళలో ముంచుట, తోముట అనే అర్ధములున్నవి. పరిశుద్ధాత్మ పొందాలంటే మూడు ప్రాముఖ్యమైనవి ఉండాలి. మత్త. 12:31
- 1) ప్రార్ధన,
- 2) క్షమాపణ,
- 3) విశ్వాసము.
- 1) ప్రభువా! నాకు పరిశుద్ధాత్మ దయచేయుము.
- 2)నా పాపములు క్షమించుము.
- 3) దేవుడు నా పాపములు క్షమించి, నాకు తప్పక పరిశుద్ధాత్మ దయచేస్తాడని విశ్వాసముతో కనిపెట్టాలి.
ఈ మూడును లేకపోతే పరిశుద్దాత్మను పొందలేరు. ఒక మనిషి దయ్యము ఆకర్షణవల్లనో లేక తెలివి తక్కువవల్లనో పాపములో పడును. శోధనవల్ల ఇంట్లో విచారముంటుంది. కనీసం చోడిగింజ అంత విచారమైన ఉంటుంది. ఆవగింజంత విచారమున్ననూ పరిశుద్ధాత్మ బాప్తిస్మమురాదు. చింతాకంత చిరాకున్నా మోక్షానికి వెళ్ళరు. విసుగున్నచో సిద్ధివెనుకకేపోవును. ఒక మనిషి బాగువడదని తెలిసినా అతన్నికూడ పరిశుద్దాత్మ విడువదు. కాబట్టి సందేహమనునది మీ హృదయములోనుంచి చెరిపివేసికొనండి.
అనుమానంతో పరిశుద్దాత్మను అడుగకూడదు. హెబ్రీ. 4:1-3 అవిశ్వాసమువల్ల వారు విశ్రాంతిలో ప్రవేశింపలేకపోయిరి. ప్రభువు నా ప్రార్ధన విన్నాడు అని నమ్మిక పోవుటకూడ పాపమే. మనిషి జీవితములో అవిశ్వాసము, అపనమ్మిక అనేది రాకూడదు.
- 1) పరలోకములో మొట్టమొదటి పాపము గర్వము
- 2) సృష్టిలో మొట్ట మొదటి పాపము సందేహము. గనుక అనుమానము, గర్వము ఉంటే పరలోకం వెళ్ళలేము.
బైబిలులోనున్న
వాగ్ధానములన్నియు “నావి అని నమ్మితే పరలోకం వెళ్ళగలము.
పాట: అంతయు మనదేగదా యేసునికున్నదంతయు మనదే గదా! ॥బహుగా॥
- 1. ఆవగింజంత విశ్వాసముంటే కొండవెళ్ళి సముద్రంలో పడును.
- 2. ఆవగింజంత పాపముంటే పరలోకం వెళ్ళము.
(పాట: యెహోవా నా మొర లాలించెను).
పరిశుద్దాత్మ అగ్నితో బాప్తిస్మము జరిగినపుడు దడవచ్చి, ఒళ్ళంతా కాలినట్లు ఉండును. ఆత్మను పరమాత్మ సంధించుట. అనగా పరిశుద్ధాత్మ వచ్చినపుడు హాయిగా, చల్లగా ఉంటుంది. కొన్నిసార్లు గందరగోళంగా ఉంటుంది గాని ఆత్మే అన్నిటిని సరిచేస్తుంది.
వెనుక జరిగిపోయిన వాటిని అనగా గతించిన పాపములను జ్ఞాపకం చేసికొంటే పరిశుద్ధాత్మరాదు. సముద్రంలో పేతురు
మునిగిపోతున్నపుడు
ప్రభువు అల్పవిశ్వాసీ ఎందుకు సందేహించావు, అన్నారు. సందేహము చాలా
ప్రమాదకరమైనది. సందేహము = పాపములలోకెల్ల గొప్ప పాపము. దేవుడు నా ప్రార్థన వినలేదేమోననే సందేహము రాకూడదు. మరణ
సమయమందు
సందేహముంటే పరలోకము వెళ్ళరు. లూథరుగారి దగ్గరకు సాతాను పాపముల లిస్టు తెచ్చినదట. లూథరుగారు - “ఇవేనా ఇంకా ఏమైనా
ఉన్నాయా అని
అని అంటే నాకు తెలియకుండా ఇంకేమిలేవు నేనే కదా చేయించాను” అని అన్నదట. అప్పుడు లూథరుగారు "నా పాపములు అన్నీ
దేవుడు
క్షమించాడు” అని సిరాబుడ్డితో సైతాను కొట్టారట. సందేహపడలేదు లూథరుగారు.
పాట: "పాపివని నీకెవడు చెప్పెను పావనుడవై
యుండగను... మనో విచారము కూడదు నీకు
యాకోబు 1:6 సందేహించువాడు గాలిచేత రేపబడి, ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియున్నాడు.
అట్టి
మనుష్యుడు ద్విమనుస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనుక ప్రభువు వలన ఏమైనా తనకు దొరుకునని ఆలోచించరాదు.
సందేహముంటే
పరిశుద్ధాత్మ రాదు. “పరిశుద్దాత్మ ఈరోజు నాకు వస్తుంది" అని ప్రతిరోజు నమ్మాలి. ప్రార్ధన, క్షమాపణ, విశ్వాసము ఈ
మూడును
ఉంటే
తప్పక పరిశుద్ధాత్మను పొందుతాము. పరిశుద్దాత్మ రావడంద్వారా మనము పరిశుద్దులౌదుము.
సూర్యుని ఎండ మంచిచోటున,
చెడ్డచోటున
ఏలాగుపడునో, అలాగే పరిశుద్దాత్మ మంచివారిమీదను, చెడ్డవారిమీదను వ్రాలును. గనుక ప్రార్థించి, నమ్మికతో
అందుకొనండి. అట్టి
స్థితి నేటిదిన వర్తమానము ద్వారా పరిశుద్ధాత్ముడు మీకు కలిగించునుగాక. ఆమేన్.