14. బైబిలుమిషను భావికాల ఉపన్యాసములు
గ్రంథకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు
యెషయా 40:5-10.
సువార్త ప్రకటించుటకు సువిశేషాసక్తిగల సత్-క్రైస్తవులారా! బైలుపరచబడిన మిషనువార్తను సర్వ సువార్త సాధనములద్వారా, సృష్టి అంతటికీ వెల్లడిచేయ సత్కృపాశీర్వాదములు సర్వకృపానిధియగు తండ్రి మీకు దయచేయునుగాక. ఆమేన్.
- 1. విశాల సువార్త ప్రకటన:- అనగా అన్ని కాలములలో, అన్ని భాషలలో, అన్ని దేశములలో, అన్ని మతములలో; అనగా ప్రభువు చెప్పినట్లు సృష్టి అంతటిలో, లోకమంతటిలో భూదిగంతముల వరకు ప్రకటింపబడేది విశాల సువార్త ప్రకటన. ఉదా - అపోస్తలుల కార్యముల గ్రంథము.
- 2. బలవంత సువార్త ప్రకటన:- అనగా క్రైస్తవమతము లోనికి ఎవరిని బలవంతముగా లాగుకొని రాకూడదు. మేము చెప్పినాము ఎవరి ఇష్టము వారిది. అయితే, ప్రభువు చెప్పిన ఉపమానములోని “బలవంతము” అనేమాట మనకు ఆధారము. దాని అంతరార్థమేమనగా క్రైస్తవులనుగా చేయుటకై నీకెన్ని ఉపాయములు, పద్ధతులు, సాధనములుగలవో అవి అన్నీ వాడవలెను. అప్పుడు ప్రపంచములోని జనులందరి చెవులకు సువార్త గింగురుమని వినబడును. చెవులు మూసికొన్నను వినబడేటట్టు గట్టిగా చెప్పవలెను. భయముకలిగే ప్రసంగములుకూడ చేయవలెను. బాబో నాయనో అనే ప్రసంగము చేయవలెను.
- 3. మినహాయింపు సువార్త ప్రకటన:- లూకా. 13:6-9; 2రాజులు 5:18-19; నిర్గమ. 1:20,21; రిమ్మోను గుడిలో విగ్రహారాధన చేసిన మనిషి మోషేకాలములో ఇశ్రాయేలీయులకు మేలుచేసిన మంత్రసానులు, చెట్టుకొట్టి వేయకుండా 1సం॥ వాయిదా వేయించిన తోటమాలి; ఈ దృషాంతములన్నీ మినహాయింపు సువార్త ప్రకటన క్రిందకు వచ్చును. అనగా వారు కోరినట్లు వారికి మినహాయింపు ఇచ్చి, వారిని విశ్వాసమును క్రీస్తునందు స్థిరపర్చుట.
- 4. అభిమాన సంఘమును ఏర్పరచి సువార్త ప్రకటన:- లూకా. 9:49-50. మన పక్షముననున్నవాడు మనవిరోధికాడు అని ప్రభువు పలికినమాట అభిమాన సువార్త ప్రకటనను తెలియజేస్తుంది. ఈలాగున మనమంటే అభిమానముగలవారిని ఏర్పరచి, వారిద్వారా సువార్త ప్రకటించుటకు, సువార్తను వ్యాపింపచేయుటకును ప్రయత్నించవలెను.
-
5. నిశ్శబ్ధ సువార్త ప్రకటన:- ఎవరికి వినబడకుండా, మనము ఆ పని చేయుచున్నామని ఒక్కరికైనా అనగా
తెలియకుండగా చేసేపని,
అనగా కఠినాత్ముల మనస్సు కరిగించేపని, అదే నిశ్శబ్ద సువార్త ప్రకటన.
ఉదా:- కార్డు మీద సువార్త ప్రకటన; అతికించే చిన్ని కాగితముల ద్వారా సువార్త ప్రకటన. మత్తయి 27:11.
మరొక ఉదా:- ప్రార్ధనాద్వారా నిశ్శబ్ద ప్రసంగము. మౌనికమ్మగారు తలుపువేసి ప్రార్ధించగా కుమారునికి పాదిరిగారికి ఏమి తెలియును! ఆ తర్వాత కాలంలో తన తల్లి ప్రార్ధనలే ఆయన గొప్పగా దేవుని పరిచర్య చేయడానికి మూలకారణమని తెల్సుకొన్నాడు. ఈలాగు శపించబడిన ఆఫ్రికానుండి గొప్ప గ్రంథకర్త, పరమభక్తుడైన సెయింట్ అగస్టీన్ ను దేవుడు లేపెను. కనాను శపింపబడునుగాక అని వ్రాయబడినట్లు, వీరంతా, హాము సంతతివారైయున్నారు. - 6. ఉత్తరములద్వారా ప్రకటింపబడే ఉత్తరముల సువార్త:- మనకు తెలిసిన వారికి ఉత్తరములు వ్రాయునపుడు, ప్రభువు నామమును ఉదహరించుట, కొన్ని ఆశీర్వచనములు, శుభములు తెలియజేయుటద్వారా పరోక్షముగా కొన్ని సువార్త సత్యములను తెలియజేసినవారమౌదుము.
- 7. ముందుగా అడిగావు సువార్త ప్రకటన:- “ప్రభువా! ఫలాని వ్యక్తిని మార్చివేసినావు స్తోత్రం. నాకు తెలియదు గాని ఒక దినమునకు అతనిని నీవు బాగుచేసినావు. అతను మారిపోయినాడు. గనుక నాకు ఎందుకులే ప్రభువా, విచారము!” అని ముందుగా విశ్వసించుట. ఇది అందరు చేయలేరు. ఈలాగు ఒకరోజు అంతా ప్రార్థించి, రెండవ రోజు అంతా స్తుతించుట.
-
8. అన్వయ వచన సువార్త ప్రకటన:- యాకోబు అన్నగారిని మోసముచేసి వెళ్లుచున్నాడు. ఆ యాకోబును దేవుడు రాతివద్ద,
నూతివద్ద
దీవించెను. ఏశావు తండ్రి చెప్పినట్లు చేసెను గాని ఆశీర్వాదములు దొంగిలింపబడినందుకు కేకవేసెను, దుఃఖించెను
గాని దేవుడు
యాకోబును దీవించెను. అతడు పాపము చేసినను నీవు దీవించినావు, నేను పాపిని నన్ను దీవించుము. యాకోబు ఒక్కడేనా
నీకు మూల
చుట్టము!
ఇట్లు ఎదిరించి అడుగుచున్నందున మరీ పాపినిగామారినా; అయినను యాకోబును దీవించిన నీవు నన్నును దీవించుము అని
వాక్యమును
అన్వయించుకొని సువార్త ప్రకటనకు దారి చేసికొనవలెను.
ఏశావుకు చిన్న దీవెన:- యాకోబు కాడి నీమీద పడును. నీవు విరగదీయుదువు. ఎదోమియులు ఇశ్రాయేలీయులను కొంతకాలము ఏలిరి. ఎదోమియులే గెలిచిరి (అదే ఏశావుయొక్క దీవెన నెరవేర్పు). - 9.నిద్ర సువార్త ప్రకటన:- ఒకరు ఒక అంశము మీద ఉపవాస ప్రార్ధన చేయునపుడు మూర్చిల్లి, అలసి పడిపోవుదురు. అపుడు నిద్రలో ఉందురు. ఆ నిద్రలో కూడా ప్రార్ధన ఉంటుంది. దేవుడు అది ఆలకించి కఠినాత్ములను మార్చివేయును.
-
10. ప్రవచన సువార్త ప్రకటన:- ఒక క్రొత్త వ్యక్తి మార్పు చెందుటకు అతనిగూర్చి ఆత్మ అందించుటద్వారా ప్రవచనము
చెప్పుట.
జరుగబోవునవి తెలియజేయుటద్వారా కూడ ఇతరులను మనము క్రీస్తు తట్టుకు ఆకర్షించగలము.
ఉదా:- యోహాను 4:49-53; "నీవు వెళ్లుము. నీ కుమారుడు బ్రతికియున్నాడు.” అపో.కార్య. 5:1-9. అననీయ సప్పీరాలతో పేతురు చెప్పిన మాట మత్తయి 15:28 "నీ కుమార్తె దయ్యము వదలినది.” ప్రసంగించిన వాడు, తన్ను నిందించిన వానితో నీకు కీడు, అంటే ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళిపోగా జ్వరము వచ్చును. తుదకు అతను మారిపోవును. - 11. భాషా సువార్త ప్రకటన:- మనము కఠినాత్మునిగూర్చి ప్రార్ధించినప్పుడు భాషవల్ల అతడు మారినది, మారనిది జవాబు వచ్చును. పరిశుద్ధాత్మ తండ్రి అందించే భాషవల్ల దయ్యములు పోవును.
ఈలాగున మన జ్ఞానమునకు అందినన్ని సాధనములు, మనస్సాక్షికి తోచినన్ని విధములుగా కక్షచేతనైనను అందరినీ సువార్తవలలో చేర్చుటకు, ఒడుపుగా, నేర్పుగా సువార్తను ఆత్మ తండ్రి సహాయముతో అందించవలెను.
అట్టి సువార్త ప్రకటన ధన్యత పరిశుద్ధాత్ముడు తన సాక్ష్యశక్తినిచ్చుటద్వారా మనకు దయచేయునుగాక. ఆమేన్.