11. క్రీస్తుప్రభువు రాకడలు

గ్రంథకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు



యెషయా 60:4; మత్త. 25:1-13; 2పేతు. 3:7.

రాకడ, రాకడ, రాకడని కలవరింపగోరే ప్రియులారా! విశ్వాసులారా! మీకు అట్టి శుభము కలుగునుగాక. ఆమేన్.


గత ఆదివారము నా ప్రసంగము సగమే చెప్పినాను. రాకడను గురించి క్రిందటి ఆదివారము అడ్వెంటు కాలమని చెప్పినాను. ఈ అడ్వెంటు కాలము గురించి డిసెంబరు నెలలో లూథరన్
మిషన్
వారు తరచుగా చెప్పుచుందురు అని చెప్పి మూడు గుంపులలోని మొదటి గుంపు, రక్షితులు; రెండవ గుంపు, పెండ్లికుమార్తె సంఘములోని మృతులు; మూడవ గుంపు సజీవుల గుంపు. వీరినిగురించి వివరించినాను. అయితే యేసుప్రభువు రాకడలు ఎన్ని?

ఇవి అన్ని మిషనులవారు ఒప్పుకొంటారు. ఇవేకాదు ఇంకా ఉన్నవి. ఇవి అన్ని రాకడను గూర్చి అడ్వెంటు కాలములో మాట్లాడకపోతే, ఇంకెపుడు మాట్లాడుకొంటాము? సంవత్సరమునకు ఒకసారైన మాట్లాడకపోతే ఆత్మకుబలము నిరీక్షణ ఎట్లు కలుగును? అయితే సమయముంటే అన్ని రాకడలను గూర్చి వినవలసిందే అవిశ్వాసులకు 7సం॥లు శ్రమల విందును, పరలోకములో ఉన్న విశ్వాసులకు ఆనంద పెండ్లివిందును జరుగును. పెండ్లికుమార్తె విందులో పరలోకములో ఉన్నందున, క్రిందున్న శ్రమ వారికి కనబడదు. భూలోకముతట్టు వారు చూడనేచూడరు. ఎందుకనగా 7సం॥ల చరిత్రయే వారికి తెలుసుగాని అనుభవముగాని, ఆ మహా శ్రమ కనుగొనుటగాని యుండదు. భూమి మీద శ్రమలవలన చాలామంది మారుమనస్సు పొందుదురు. వారిని ప్రభువు విందులోనుంచి వచ్చి మోక్షంలోని ఏదో సుఖ స్థలములో పెట్టుదురుగాని విందులోవారికి పాలులేదు. ఇది శ్రమలమధ్యలో వచ్చే రాకడ.

మారుమనస్సు పొందిన వారికొరకు ఈలాగు 7సం॥ లలో రావడముకూడా రాకడే. 7సం॥ల ముగింపులో అంతెక్రీస్తు, అబద్ధప్రవక్తలతో ప్రభువు యుద్ధముచేయును. ఈ యుద్ధస్థలము యెరూషలేములోని ఉత్తరస్థలము. ఈ స్థలములో ఎవ్వరు తిరుగకూడదు. నేడు ప్రత్యేకముగా ఆ స్థలమున్నది. దీనికి ప్రభువు దూతలు వచ్చి యుద్ధము చేయనక్కరలేకుండనే అంతెక్రీస్తు అబద్ధ ప్రవక్త, ౩కప్పలవంటి దురాత్మలను నరకములో పారవేయుటకు, రావడము బైబిలులో ఉన్నది (ప్రక. 9:19-21) ఇదొక రాకడ. హర్మగెద్దోను యుద్ధము కాగానే పరిశుద్ధులు ప్రభువు మరొకసారి భూలోకమునకు వస్తారు. రాగానే అబద్ధప్రవక్త, అంతెక్రీస్తు మూడు దురాత్మలను నరకములో పడవేసిన రీతిగానే సాతానును మట్టులేని గోతిలో పడవేయును. ఆ గోతికి అడుగు లేనందున 1000 సం॥లు సాతాను దిగిపోతునేయుండును. ఇది ఒక రాకడ తర్వాత ప్రభువు వెయ్యేండ్లు భూమిమీద పరిపాలన చేయుటకువచ్చును. సైతానుకు లోబడిన వారిని, సాతాను సేవకులను సాతాను ఎదుట శిక్షించిన తరువాత సాతానును ఆయన గోతిలో వేస్తారు. ఇది సైతాను కండ్లఎదుట వాడి అనుచరులను శిక్షించిన పిమ్మట, సాతానుకు, వాడి అనుచరులకు ఆయన విధించిన శిక్షే 1000సం॥లు ఆరంభమునుండి ముగింపువరకు సువార్త పని ఆటంకములేకుండగా ఎక్కువగా జరుగును అట్టి సేవ ఇంతవరకు జరుగలేదు. మర్మముగా ఉండక మహిమగా ఉండును. అది ప్రభువు పరిపాలన అది ఇంకొక రాకడ. ఈ 1000సం॥ల ముగింపు కాగానే పరలోకమునుండి సింహాసనము భూలోకానికి వచ్చును. ప్రభువు 1000ఏండ్లు వాక్యము విన్నవారిని మా తీర్మానము ఏమి? అని సింహాసనమునుండి అడుగుట మరొక రాకడ. వీరందరు బ్రతికే ఉందురు. వీరినే సజీవులందురు. ఈ తీర్పుకే మత్త. 25 లోని గొర్రె మేకల తీర్పు అందురు. అదియు ఒక రాకడ. సజీవుల తీర్పు అయిన తరువాత ప్రభువు అపోస్తలులతో చెప్పినట్లు, భూదిగంతములవరకు నాకు సాక్షులైయుందురనేది 1000 ఏండ్లలో నెరవేర్పుగా జరుగును. అది ఇపుడు జరుగుటలేదు. ప్రభువు మట్టులేని గొయ్యిలోని సాతానుకు విడుదల కలిగించుటకు మరలా వస్తారు. వాడి మారుమనస్సు లేదు. గనుక ఊరుకొనక ప్రభువుమీదికి యుద్ధమునకు రెండు పటాలమును అనగా రెండు మిలటరీలను సిద్ధపరచును. దేవునితో యుద్ధము చేయును. క్రీస్తు అతనిని ఓడించి నరకములో పడవేయును. ఇది ఒక రాకడ. ఆ తర్వాత గొప్ప వింత కార్యము జరుగనైయున్నది. అది మనము గమనించుట చాలా కష్టము. అనగా గ్రహించుట కష్టము. ఎందుకనగా ఇది చివరి రాకడ. (గ్రహించు) చివరిది ఆదాము, అవ్వలు పాపము చేసినది మొదలు, గోగు మాగోగులను నరకములోవేసే వరకు ఎందరు చనిపోయి హెడెన్సులో (పాతాళములో) ఉన్నారో, వారందరిని ప్రభువు ప్రోగుచేసికొంటు వస్తారు. చివరిలో చనిపోయిన వారందరికి ప్రభువు శబ్దము వినబడి, ప్రభువు పిలువగా వారందరు లేచి వచ్చెదరు. అది అంత్యతీర్పు. నదులలో, బావులలో, సముద్రములో, చెరువులలో, అడవులలో చనిపోయిన వారందరిని ఆయా స్థలములలో నుండి ఆ సమయమున అప్పగించును. అదే లేచు దినము. అపుడు మృతులెల్లనిక లేచుదినము వచ్చును. వారందరు వచ్చివేయుదురు. అపుడెవరైనా మారుమనస్సు పొందితే ప్రభువు వారిని రక్షించును. ఇదొక రాకడ. ప్రభువు “రండి” అని పిలుచును. లాజరును బైటికి రా అన్నాడా లేదా! లాజరును పేరుపెట్టి పిలువకపోతే, “బైటికి రండి” అంటే చనిపోయిన వారందరు లేస్తారు. గాని వారు ఇప్పుడు లేవవలసియున్నారు; అంత్యతీర్పుకు ఇదే అంత్యతీర్పు. ఆ తీర్పులో చాలామంది ఎదురుగావచ్చి మేము ప్రవచింపలేదా! బోధింపలేదా! అద్భుతాలు చేయలేదా! అని అడుగగా వారిని అక్రమము చేయువారలారా! అని ప్రభువు అనును గనుక ఇట్టే వనులు చేయువారు జాగ్రత్తగా చివరివరకు నిలిచి ఉండవలయును. అట్టివారినికూడా రక్షించుటకు మీ జ్ఞానాన్ని బట్టి, శక్తినిబట్టి రక్షించకూడదా! అని అయ్యగారు వారి గురించికూడ నరకాన్ని కొట్టివేసి రక్షించుమని ప్రార్ధించిరి. అది తప్పే అని అయ్యగారు అనుకొనుచున్నారు. అయిననూ ఆయనిచ్చిన చనువు, స్వతంత్రమును బట్టి ఒప్పుకూడా ఉన్నది. ఇదియు రాకడే. ఇదే బైబిలుమిషను వారు బోధించుచున్నారు. ఇది విని కొందరు వారి మిషనులలో బోధించుచున్నారు గాని కొన్ని రాకడల నిశ్చయత వారికే తెలియదు గనుక కొన్ని రాకడలు మాత్రమే అందరూ ఒప్పుకొంటారు. ఈ 7000సం॥లలో అన్ని మిషనులవారు చేయు అనుదిన ప్రార్ధనకు, ప్రభువు వస్తారని ఒప్పుకొంటారు. ఒకప్పుడొకాయన అయ్యగారు మాట్లాడు చుండగా ప్రభువు రాకడకు విశ్వాసులను తీసికొనిపోయిన తర్వాత మిగిలిన వారిని నరకంలో వేస్తారు అని అన్నారు.


మరొక దొరగారు ప్రభువు రాడేమో, రాడేమో, రాడేమో! అని అన్నారు. రాకడ నిశ్చయత తెలియనపుడు అనగా, ఆయన రాకడలు తెలియనపుడు ఇటువంటి నిరాశయే వచ్చును. మన తెలుగు రాష్ట్రములో (అప్పటికి) 27జిల్లాలు ఉన్నవి. వీటిలో 21లక్షల 24వేలమంది క్రైస్తవలున్నారు. వీరందరు ఈ రాకడలన్ని తెలిసికొంటే ప్రభువుయొక్క రెండవ రాకడలో వెళ్లగలరు. వీరు రాకడను గురించి చెప్పగలిగితే ఎంత బాగుండును! ఒకాయన అయ్యగారిని 'మనము రాకడకు ఉండబోయినామా' అని అన్నారు. ఇవి అన్ని తెలిసికొనుటకే, తెల్సికొని రాకడకు ఎదురుచూచుటకే ప్రభువు యోహానుచే ప్రకటనలో వ్రాయించిరి. అనేకులు ప్రకటన గ్రంథము చదువరు. అయ్యగారితో వారి సన్నిధి కూటములో, 41 సం॥ల క్రితమే ప్రభువు ఈ మాట అన్నారట. "ప్రకటనలోనివి అందరికి చెప్పండి” ఎందుకు ప్రభువా? మేము ఎవరికైన చెప్పితే వారు మమ్మల్ని ఆక్షేపిస్తారు అని అయ్యగారు ప్రభువును అడిగిరి. అందుకు ప్రభువు అన్నారట. “నేను మీకును, అది మీరు ఇతరులకును చెప్పుట నేరముకాదని” అన్నారట. అందుచేత 8సం॥ల క్రితము నేను బేతేలు గృహము వరండామీద ప్రకటన 22అధ్యాయములు, ప్రభువు నాకు చెప్పగా నేను 100మందికి చెప్పివేసాను. ఇప్పుడు ఇన్ని రాకడలకు ప్రభువు వచ్చుచున్నారు. మృతులైన భక్తులలో శక్తిగలవారు ప్రభువుతో తిరిగి వస్తారు. పోయినవారము మీరు విన్న ప్రసంగము, ఈ వారములో మీరు విన్న సంగతులు మీ హృదయ విశ్వాసమును పెంపొందించును గాక! ఆమేన్.



21.12.1958వ సం. లో దేవదాసు అయ్యగారు ఆదివారం గుంటూరు క్రీస్తు సంఘములో చేసిన ప్రసంగము.