6. తైలాభిషేకము - అత్నాభిషేకము
గ్రంథకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు
1సమూ. 16:12-13; 1సమూ. 10:1 దా.కీర్త. 45:1-4 కార్య. 2:33.
ఆనందభరితులైన సహకారులారా! మీ వందనములకు వందనములు. ఇప్పటివరకు మీరు విన్నవన్ని కలిపితే ఒక పుస్తకమగునుగాని నేను ఇప్పుడు చెప్పబోయేది తక్కువే. మీరు సౌలుయొక్క తైలాభిషేకము విన్నారు. అయితే దానికి ముందు ఇశ్రాయేలీయులందరు ఒక రాజుకావాలని దేవుని కోరుకొన్నారు. ఆ ప్రజలందరికి ఒక అక్కర ఉన్నది. ఆ అక్కర రాజు కావాలనుటయే. అయితే ఆ అక్కర తర్వాత ఇంకొక అక్కర కావలసివచ్చింది. 12 గోత్రములలో ఆఖరు గోత్రములోనున్న అనగా బెన్యామీను గోత్రములోనున్న కీషుయొక్క గార్థభములు తప్పిపోయినవి. అందుచేత ఆయన తన కుమారుడైన సౌలును వాటిని వెదకుటకై పంపెను. ఇది రెండవ అక్కర.
- 1. ప్రజలకు రాజులేడు గనుక రాజును తీసికొని రావలెను ఇది మొదటి అక్కర.
- 2. గార్థభములు తప్పిపోయినవి గనుక వాటిని తోలుకొని రావాలి. ఇది రెండవ అక్కర.
ఈ రెంటి తర్వాత సౌలు సమూయేలు దగ్గరకు వెళ్లెను. ఈ కథ చాలా పెద్దదైనందున చెప్పుటకు వీలులేదు. అప్పుడు సమూయేలునకు దేవోక్తి ఏమని వచ్చెననగా, “నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఒక రాజు కావలెను గనుక సౌలును తైలముతో అభిషేకించుమని చెప్పెను. అప్పుడాయన ఇతనిని తైలముతో అభిషేకించెను. వీరిద్దరును త్రియేక దేవుడు, ముగ్గురు ఉండిరి. అప్పుడభిషేకించిరి. ఈ అభిషేకానికి ముందు రాజు అక్కర గార్థభములు దొరుకుట గనుక ఆ గార్థభముల అక్కర తీరినది. ఇది అభిషేకమునకు మార్గమును సరాళము చేసినది. ఈ అభిషేకమునకు ముందేమి జరిగినది? చెప్పండి. అయ్యగారు చెప్పిందిగాక మిగిలినది మీరు చెప్పండి. అదేమంటే ఈ అభిషేకమునకు ముందు పరలోకములో ఏర్పాటు జరిగింది. ఏర్పాటు లేనిదే అభిషేకమురాదు. అక్కరలేనిదే అభిషేకమురాదు. పరలోకములో ఏర్పాటు ఉంటేనేగాని భూలోకములో అభిషేకముండదు. ఇది సౌలుకథ.
తర్వాత దావీదు కథ వస్తుంది. సౌలు పరిపాలన అయిపోయింది గనుక క్రొత్తరాజు కావాలి. దావీదుకు ముందు సౌలే క్రొత్తరాజు. సౌలు తర్వాత దావీదు మరింత క్రొత్తరాజు. యేసుప్రభువు ఒక మాట అన్నారు. "శిష్యులారా! మీరిప్పుడు చేపలు పట్టేజాలరులు. అయితే, నేను మిమ్మును మనుష్యులను పట్టే జాలరులనుగా చేస్తాను” అని అన్నారుగదా! ఆ ప్రకారముగానే దావీదును రాజుగాచేస్తాను అని అన్నారుగదా! దావీదు ఇంతకుముందు గొర్రెలను పాలించే పాలకుడుగా ఉన్నాడు. అతడిప్పుడు దేవుని ప్రజలను పాలించువాడుగా మారవలెను ఎందుచేతననగా దేవుని సంఘరాజ్యములో ఖాళీ వచ్చినది గనుక ఆ ఖాళీ పూర్తిచేయుటకు దావీదును అభిషేకించవలెను. దావీదు దేవుని రాజ్యనంఘ అభిషేకమునకు ముందు గొర్రెలకాపరిగా ఉండవలెను. ఈ రెంటికి ముందు దావీదుకు పరలోక ఏర్పాటు ఉండవలెను. అందుచేత దావీదుకు తైలాభిషేకము.
120మంది శిష్యులు యెరూషలేములో కనిపెట్టినప్పుడు, వారికి అభిషేకము కలిగింది గాని అక్కడ తైలము లేదు. అక్కడ దైవాత్మయే తైలము. ఈ తైలమే మొదటి తైలము కంటె గొప్ప తైలము. దేవుని సేవకులందరు తైలాభిషేకము పొందినను దైవాత్మాభిషేకము పొందవలెను.
నాకు పాదిరిపని ఇవ్వాలని లూథరన్ వారు పిలువగా నా వల్లకాదు నాకక్కరలేదన్నారు. ఆ తర్వాత త్రిత్వదేవుడు బరంపుర సన్నిధి కూటములో నాకు పాదిరి పనికి ఆర్డినేషను ఇచ్చెను. ఇది 40 సం॥ల క్రిందట సంగతి. రాజమండ్రి సంఘము మీద పాదిరిగా ఉండాలంటే నీవు ఒప్పుకోలేదు గనుక "అన్ని సంఘములపై పాదిరిగా ఉండడానికి ఆర్డినేషన్ ఇస్తున్నాను" అన్నట్లు ప్రభువు అభిషేకించిరి. ఒక్కసంఘమును పాలించలేనప్పుడు అనేక సంఘాలను పాలించగలనా? తండ్రి ఎట్లు అట్లు అనుకున్నాడో! రాజమండ్రి సంఘమంత చిన్న పెద్దలు అయ్యగారిపేరు చెప్పికోరితే, అప్పటి అధికారులు సిగ్గుపడిరి. ప్రభువా! నీమాట నెరవేర్చుకొన్నావు గనుక నీకు స్తోత్రము.
ఇప్పుడు ఎక్కడైనా పాదిరిగారు లేనప్పుడు నేను బాప్తిస్మము, ప్రభువు భోజనము ఇవ్వవచ్చును. మనిషి నన్ను అభిషేకించలేదుగాని దేవుడే నన్ను అభిషేకించెను. నేను ఆత్మద్వారా అందరికి, అనేకమందికి కనబడుచున్నాను. ఇక్కడ వరండామీద కూర్చున్న వారిలో 52మందికి వారివారి ఊళ్లలో కనబడుచున్నాను. గనుక నేను నిన్ననేక సంఘాలకు అభిషేకించుచున్నాననేది దీనిద్వారా నెరవేరుచున్నది. తక్కిన వారి అభిషేకముకంటె నా అభిషేకము (అయ్యగారిది) విడ్డూరముగా ఉన్నది.
ఈ ఆత్మసంచార స్థితి మొదట విన్నప్పుడు అయ్యగారికి గుండె గుబేలుమన్నది. చెప్పులు, గొడుగు, క్రొత్త బట్టలు, చేతిసంచి లేకుండ, స్నానము చేయకుండనే పరిశుద్ధముగా తండ్రి నన్ను అన్ని స్థలములకు పంపుచున్నారు. ఇందులో నా స్వశక్తి కొంచెమైనను లేదు. నాకట్టె మంచముమీదే ఉన్నదిగాని సర్వదేశాలకువెళ్ళి, నా ఆత్మ సంచారము చేయుచు వస్తున్నది. ఒక్క నిమిషములో ఏడు స్థలాలకు నీ ఆత్మ వెళ్లి వస్తున్నది అని ప్రభువు చెప్పిరి. భూలోకములో, పరలోకములో, పాతాళములోనికి ప్రభువు నన్న తీసికొని వెళ్లుచున్నారు. నేను వెళ్లుటలేదు. ఈ దినము ఈ మీటింగుకు రావడము నాకు ఇష్టములేదు. కారణము ఏమనగా కారు ఎక్కుట దిగుటలో, నా గుండె కదలి, నా కడుపులోనికి దిగిపోవుచున్నట్లున్నది. అందునుబట్టి నా శరీరము వణకుచున్నది. చంటిబిడ్డను ఎత్తుకొన్నట్లు నన్నిద్దరు ఎత్తి కారులో పెడుతున్నారు. ఇది వృద్ధాప్యమువల్ల కలిగిన అసౌకర్యము. ఇట్టివాడనైన నేను దేశసంచారము చేయలేను అని, ప్రభువు నన్ను ఈ రీతిగా అనేక దేశములకు తీసికొని వెళ్లి పనిచేయించుచున్నాడు. నాకు కునికిపాట్లు వన్తున్నవి. దీనిలోనే ఆయన నన్ను తీసికొని వెళ్లుచున్నారు. నేను కుర్చీలో ఉన్నపుడు, భోంచేయునపుడు, ప్రసంగించునపుడు ప్రభువు నన్ను తీసికొని వెళ్లుచున్నారు. ఆయనశక్తికి ఏమి ఆటంకము నేను క్రమముగా అసలు పనిలోనికి, అసలుగదిలోనికి, అసలు జ్ఞానములోకి వస్తున్నాను. అది నా పనికాదు, నావశముకాదు, నా మిషనుకాదుగాని పరలోకములోని దేవుని ఏర్పాటు. అదిలేకపోతే భూలోకములో ఏమియు జరుగదు.
ప్రార్ధన:- అంతములేని కృపగల దేవా! నీకు స్తోత్రము. మేమెందుకును పనికిరానివారమైనను, అన్నిటికి పనికివచ్చే
నిమిత్తమై
మమ్ములను
శ్రమలద్వారా, సౌఖ్యాధారములద్వారా సిద్ధపరచుచు శుద్ధిపరచుచున్నందులకు వందనములు. తనకు ఎక్కువ సమయము లేదని సాతాను
విశ్వాసుల
మీద
పడుచున్నాడు గనుక అతని ఆలోచనలు అతని ప్రయత్నములు నెరవేరనీయకుము. అతని
పన్నాగములు చెడగొట్టుము. యూఫ్రటీస్
నదిదగ్గర నాలుగు భూతములను నీవు బంధించినావు. అలాగే ఇప్పుడును లోకమందంతట
తిరుగుచున్న
భూతముయొక్క పనులు బంధించుము.
ఈ మధ్య గుంటూరులో ఒక విశ్వాసురాలు సన్నిధికి వెళ్లు సమయములో, మైకముకమ్మి, ఏలాగు వెళ్లవలెనో, ఏ ప్రక్కకు
వెళ్ళవెలెనో
తెలియలేదు. అదే పిశాచిపని. ఈ మధ్య చీరాలలో మైకము కలిగి బంధన కలిగినది అది పిశాచిపని.
ప్రభువా! నీవు మా
ప్రార్ధనలు వింటానని
అన్నావుగదా! ఇట్లు పిశాచి మాలో ఎవ్వరికిని మైకము కలుగజేయకుండ వాడి పనికి ఆటంకము కలుగజేయుము. ఈరాత్రి దుష్టులు
వర్షము,
పిడుగులు, ఉరుములు, మెరుపులు, పురుగులు తప్పుడు దర్శనములు, దుష్టస్వప్నాలు, భూతములు, దయ్యములు మా శరీరానికి,
జ్ఞానానికి,
ఆత్మకు, మనస్సాక్షికి, భక్తికిగాని ఏమియు హాని కలుగజేయకుండ నీ దూతను కావలిగా ఉంచి, సుఖ నిద్ర కలుగజేయుమని ఈ
కూటము అంతటిని
దీవించుమని, ప్రయాణికులకు ఇండ్లకు వెళ్లువారికి తోడైయుండి, మమ్మును రాకడకు సిద్ధపర్చుమని ప్రభువుద్వారా
వేడుకొనుచున్నాము.
ఆమేన్.”