13. బైలుపర్చబడిన బైబిలుమిషను
గ్రంథకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు
యెషయా 43:18-19.
బై బై అనగా బైలుపడిన బైబిలుమిషను. బై బై అనగా ఇంగ్లీషులో కాలక్రమేణ అని అర్ధము. బైబై అనగా ఆదాము
మొదలుకొని 1937వరకు
బైలువడలేదు గాని కాలక్రమేణ అంతరంగముగా వస్తూ, అనగా దైవమతము ద్వారా వస్తూ, అనగా యూదా మతముద్వారా వస్తూ,
అనగా క్రైస్తవమత
సంఘముద్వారా వస్తూ, అనగా క్రైస్తవ మిషనుల ద్వారా వస్తూ, తుదకు 1937వరకు వచ్చి 38లో బైలుపడినది.
అపుడు -
"మేము ఉండగా
ఇదెందుకు
వచ్చినది?” అని అందరికి వెర్రిబుట్టింది. బైలుపడే ఈ పని బయలుపడుతున్నది. బైబై అనగా కాలక్రమేణ అపోస్తలుల
కాలములో ఉన్నదిగాని
బైలుపడలేదు. 1937లో ఉన్నదిగాని బైలుపడలేదు. 1938లో బైలుపడినది. ఇది స్థాపించబడిన మిషనుకాదు. బైలుపడిన
మిషను. బైలుపడినది
అనేమాట వినగానే అదివరకు ఉన్నది అని అర్ధము వచ్చునుగదా? అదివరకు ఉన్నవాటికి బేధముగా కనబడినది వస్తే,
అదివరకున్న వాటికి
కష్టముగా ఉండి, అనేక వ్యతిరేక కల్పనలు లేచును కదా! ఇది లోకచరిత్రలో ఉన్నది. అన్నిటిలో తేడా ఉన్నట్టు,
బైబిలు మిషనులో కూడా
తేడా ఉన్నది.
మొదటి తేడా బైబిలు మిషను అనుపేరు.
రెండవ తేడా దేవుడు బయలుపరచినాడు అనే తేడా.
మూడవది గాలిలో
వ్రాసి
చూపించినాడు
అనే తేడా
నాలుగవ తేడా ఇన్ని దేశములు ఉండగా, ఇండియాలోనే దేవుడు ఎందుకు బయలు పరచెను అనే తేడా.
ఐదవ తేడా
ఇన్ని గొప్ప
పట్టణములుండగా ఒక రాజమండ్రిలోనే ఎందుకు బైలుపరచెను అనే తేడా.
ఆరవ తేడా
ఇంతమంది పరమ భక్తులుండగా ఒక వ్యక్తికే ఎందుకు బయలుపరచబడినది!
ఈ ప్రశ్నలవల్ల కలత, కలత, కలత, కలత
కలుగుచున్నది. మా మిషను
దేవుడు వ్రాసి చూపిన మిషను, మా మిషను, మా మతము దేవుడు గాలిలో వ్రాసి చూపినవే అని ఎవరైనా ధైర్యముగా
ప్రమాణము చేయగలరా? మేము
చేయగలము. ఎట్లనగా పరలోక పరిశుద్దులే బుజువుపర్చుచున్నారని ప్రమాణ పూర్వకముగా చెప్పగలము. రాజమండ్రిలో,
భీమవరంలో చాలాకాలము
పనిచేసిన రెవ. డా॥ హెచ్. సి. స్మిత్ దొరగారు ఈ మధ్య మా మీటింగు సమయములో దర్శనములోనికి వచ్చి ఈ
మాటలు చెప్పిరి.
“భూలోకములో దేవదాసు గారు నా జతపనివారు. అయితే ఇపుడు పరలోకములో ఆయన మాకందరికి అధికారి అయినారు. మేము
ఆయనచేతి క్రింద
పనివారముగా ఉన్నాము.
షరా:- ఈ దొరగారు నాయెడల ప్రేమయు, గౌరవమును గలవాడు. నేను 5వ తగరతి చదువుచున్నప్పుడు నాకు ఒక ఇంగ్లీషు ప్రసంగము సభలో చదువుటకు ఇచ్చినాడు (ఇది నిజమోకాదో దేవునిని అడిగి తెలిసికొనండి).
1. ఏ మతములోనికి వెళ్ళిచూచినా, ఏ మిషనులోనికి వెళ్ళిచూచినా, సజ్జనులతోపాటు భక్తిహీనులుకూడా ఉన్నారు. అట్లే మంచి ఆచారములతోపాటు దురాచారములుకూడా ఉన్నవి. తేడా సిద్ధాంతములుకూడా ఉన్నవి. సిద్ధాంత కలహములు కూడా ఉన్నవి. మంచి గ్రంథములతోపాటు చదువకూడని గ్రంథములున్నవి. మంచి కీర్తనలతోపాటు వ్రాసిన పద్యములు, కీర్తనలుకూడా (అనగా అలంకార, ఛందస్సు నియమములు పాటించకుండా వ్రాసినవి) ఉన్నవి. ఎక్కడికి వెళ్ళినా మంచితోపాటు చెడుగుకూడా ఉన్నది. భక్తులలో సహితము బలహీనతలు కనబడుచున్నవి. విమర్శలు ఎక్కువగా ఉన్నవి. అనగా తప్పులు పట్టుట, ఖండనలు. ఇట్టి తేడాలు ఉంటే దేవుడు బైలుపరచినాడు అని చెప్పగలమా! చెప్పలేము. మనుష్యులు తమయొక్క జ్ఞానమును బట్టి కల్పించుకొనియున్నారని నిశ్చయముగా చెప్పగలము. అయినను దేవుడు అన్నిటిని తన మహిమకొరకు వాడుకొనుచున్నారు. ఎందుకనగా స్వాతంత్ర్యము ఇచ్చినాడు.
అందుచేతనే దేవుడు బైబిలు మిషనును బైలుపరచినాడు. అయితే అన్ని సంఘములలో ఉన్న చెడుగు బైబిలు మిషనులో ఉండకూడదు. కాని అన్నిటిలో ఉన్నవి ఇందులోకూడా ఉన్నవి. ఎందుకనగా బైబిలుమిషనులోనికి వచ్చినవారు అటువంటి మిషనులలోనుండి, సంఘములలోనుండి వచ్చినవారే. అయినప్పటికిని నేను ఈ మిషనును విడిచిపెట్టను. ఎన్ని బాధలు, కష్టములు, వ్యాధులు, పేదరికము, అవస్థలు, అవమానములు, బాధలు ఉన్నప్పటికిని నేను ఈ తండ్రి మిషనును విడిచిపెట్టను. ఇతర మిషనుల తట్టు నేను చూడను. తల్లిదండ్రులలో లోపములు ఉన్నప్పటికిని తల్లిదండ్రులను పిల్లలు విడిచిపెట్టుదురా? అలాగే ఈ క్రొత్త తల్లిదండ్రుల సంఘములో, అనగా కుటుంబములో నాకు సరిపడని విషయములు ఉన్నప్పటికిని నేను విడిచిపెట్టను. ఎందుకంటే ఆ చెత్తవైపు నేను చూడక, దేవుడు బైలుపరచినాడు అను ఒక్క విషయము తట్టు చూస్తూ ఇందులో స్థిరముగా నిలువబడియుందును. ఎందులోనికి వెళ్ళినా చిక్కులే. అయితే ఇందులోకూడ చిక్కులు ఉన్నను, దేవుడు బైలు పరచినాడను విషయమును పరలోక వాస్తవ్యులు వర్తమానములు తెచ్చుచున్నారను విషయమును, దేవుడు కనబడి మాటలాడుచు ప్రశ్నలకు జవాబులు చెప్పుచున్నాడను విషయములును ఉన్నవి గనుక నేను బైబిలుమిషనును విడిచిపెట్టను. (ఎవరైనా మా తల్లి మిషనులోనికి వచ్చివేయండి అని అంటే "తండ్రి మిషనులోనికి వచ్చివేసినాము” ఇది తప్పా అని అడగండి. తల్లి మిషను అనునది ఈ లోకమునకే అయితే తండ్రి మిషను అనునది ఉభయ లోకములకు సరిపోవును. తండ్రి అనగా తండ్రి, కుమార, పరిశుద్దాత్మ అనే త్రియేక దేవుడగు తండ్రి. తండ్రివల్లనేకదా తల్లి వచ్చినది!).
అన్నియు, సరిగానుండవచ్చునుగాని మిషను అనేది బైబిలులో ఉన్నదా? అని అడుగుదురు.
జవాబు:- మిషను అనగా పని అని అర్ధము. బైబిలు మిషను “పనిచేయుచున్నది". కాబట్టీ ఈ పేరు తగును.
మమ్మును ఈ ప్రశ్న
అడుగువారు తక్కిన 850 మిషనులను ఎందుకు అడుగరు. మొదట మీరు లేచి, అన్ని మిషనులను ఒక సంఘముగా కలిపివేసి,
పెంతెకొస్తు దినమున
స్థాపితమైన క్రైస్తవమత ఏకసంఘముగా కలిపివేసికొని, అప్పుడు మాయొద్దకు వచ్చి అయ్యాలారా! అమ్మలారా! మీ
మిషనునుకూడా ఇందులో
చేర్చండి! అని అనగలిగితే ఎంతో బాగుండును. ఆ పని చేయకుండా మా మీద ప్రశ్నవేయుట అధర్మశాస్త్రీయము. క్రైస్తవ
మతము 850 శాఖలుగా
చీలిపోక అట్లే ఉన్నయెడల బైబిలు మిషను బైలుపడక, ఆదిసంఘమే, “బైబిలు మిషను" అని అనిపించుకొనును. (ఇది ఒకరి
అభిప్రాయము). అన్ని
మిషనులలోను సన్నిధి కూటములు పెట్టండి అని అయ్యగారు పేపరులలో వేసి పంపగా, అది చదువుకొని బైబిలుమిషను లోనికి
లాగడానికి ఇది
ఒక
ఎత్తు అన్నారు. దానికి అయ్యగారి జవాబు :- అవును బైబిలుమిషనులోనికి అందరిని లాగవలసిన పని మీదే. ఇది మా
వృత్తి. మా వృత్తి
చేయకపోతే బైబిలుమిషనెందుకు! భూదిగంతములవరకు చాటించుటయే మా బైబిలుమిషను
పని, నా పని ఈ పని అప్పుడే అయ్యిందా అని అయ్యగారంటున్నారు.
మీరు ఎన్ని ఎత్తులెత్తకపోతే ఇన్ని మిషనులు
పెడతారు! అని జవాబు
చెప్పవలెను. ఎన్ని ఎత్తులు ఎత్తకపోతే మీరు మీ మిషను స్థాపించుకున్నారు అని జవాబు చెప్పవలెను. అసలు చీలికగా
ఉన్న
మిషనులోనుంచి
కొంతమంది వేరైపోయి, మిషను అనుమాట మాత్రము తీసివేసి, గ్రూప్ గ్రూప్ అనిపేర్లు పెట్టుకొన్నారు.
గ్రూప్
అనుమాట పెట్టుకొనమని బైబిలులో ఎక్కడుంది? అని అడగండి. పేరులేని క్రైస్తవమతములలో ఏ పేరుపెట్టుకొన్నా శాఖ
మతమే. ఇది ప్లీడరు
లాజిక్ (న్యాయవాదుల తర్కము) గనుక. హిందువులుకూడా, బౌద్దులుకూడ ఫెలోషిప్ అనుపేరుపెట్టుకోవచ్చు
గాని క్రైస్తవ
సంఘమంటే అసలు మతమే. కొత్తగా దేవుడు బైలుపరచిన మిషను అని అంటున్నారు గనుక అనేకమైన ప్లీడరు ప్రశ్నలువేసి
పునాదులతోపాటు ఈ
మిషను
పెల్లగించవలెనని కొందరి అభిప్రాయము.
రాజుల మతమంటే రాజులకే. క్రైస్తవ మతమంటే అందరికి అని బోధపడుతుంది
అలాగైతే, అదే నిజమైతే
మన
దేశంలో ఇంకా కులం పోలేదు. క్రైస్తవ మతము కులం వద్దంటే మరలా కులం తెచ్చిపెట్టుకొనుట ఎందుకు?
గవర్నమెంటువారీమధ్య కులం
వద్దన్నారు. ప్రత్యేకముగా ఒక కులమునకు సంబంధించి మిషను స్థాపిస్తేదానివల్ల మనము కులము తెచ్చిపెట్టినట్టు
అగును. ప్రభుత్వము
వారు సహితము కులము తీసివేయవలెను అని అంటున్నారు. క్రైస్తవులమైన మనము అంతకుముందునుంచే అనుచున్నాము. ఇపుడు
మరలా ఎందుకు
తీసికొని రావలెను అని జవాబు చెప్పండి.
“క్రీస్తు విభజింపబడి ఉన్నాడా?” అని క్రైస్తవ మత శాఖలను ఆక్షేపించుచు పౌలు వ్రాసినాడు. ఎందుకనగా కొందరు,
మేము పౌలువారము
అనియు, మరికొందరు "మేము పేతురువారము” అనియు చెప్పుకొనుచున్నందున. గుంటూరు బైబిలుమిషనులోనికి రాకపోయినవారు
తమ స్థలములోనే
ఉండి
గుంటూరు బైబిలు మిషనులో దేవుడు చెప్పుచున్న వార్తలు అన్నింటి ప్రకారము ఒక మిషను స్టాపించి, దానికి 'బైబిలు
మిషను' అని పేరు
పెట్టుకొని, మన సిద్దాంతములు, ఆచారములు, సందేశములు, నన్నిథి కూటములు, అంతరంగ సంస్కార భోజనము ఈ మొ.నవి
అనుసరించిన యెడల,
వారుకూడా మన బైబిలు మిషనువారే. కాబట్టి వారు రాకడలో ఎత్తబడుదురు.
అమెరికా వారు మన మిషను పేరు మీద “బైబిలుమిషను అమెరికా” అని స్థాపించుకొంటే అది మనకు బలము. ఆలాగున అన్ని
దేశములలో
బైబిలుమిషను
స్థాపించవలెను అనేకదా! మన ఉద్దేశ్యము. అందుచేతనే మన పత్రికలలో వ్రాసి పంపుచున్నాము కదా? “ఎన్నివేల" బైబిలు
మిషనులు ఉన్నను
ఫర్వాలేదు. కాని కొంచెమైనా, తేడాగా ఉంటే అదే 'శాఖ'.
ఉదా:- “అమెరికా బైబిలు మిషను” అని గనుక ఉంటే, అది
అసలైన బైబిలు మిషను
కాదు. దానికి మనము పూచీ దారులము కాము. హృదయము చూచువాడు దేవుడే. తీర్పరి తానే. దేవుని - బైబిలుమిషను
అపరిమితమైనది,
విశ్వవ్వాప్తమైనది. అందుకే “ఇండియా బైబిలు మిషను" పోయి అసలైన “బైబిలుమిషను” వచ్చినది. అట్టి బైబిలు
మిషనులో, మీరు
ఎక్కడివారైననూ, ఎట్టివారైనను త్రియేక దేవుడు మిమ్మును చేర్చునుగాక. ఆమేన్.