గ్రంథకర్త: యం. దేవదాసు అయ్యగారు
10. మతములు
క్రీస్తుప్రభువు :- ప్రయాసపడి భారములు మోసికొనుచున్న సమస్తమైన వారలారా! నాయొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును మత్తయి 11:28. సర్వజనులను శిష్యులుగాజేయుడి మత్తయి 28:49.
1. దైవమతము
ఆది. 3:15 | ఆదాము | క్రీపూ. 4004 సం॥లు |
ఆది. 4:26 | షేతు | క్రీ.పూ. 3874 సం॥లు |
ఆది. 6:28 | నోవహు | క్రీ.పూ. 2353 సం॥లు |
ఆది. 9:26 | షేము | క్రీ.పూ. 2348 సం॥లు |
ఆది. 12:13 | అబ్రాహాము | క్రీ.పూ. 2126 సం॥లు |
నోవహు కుమారులు 1) షేము 2) హాము 3) యాపేతు

ఇతర మతములు అనగా 11 మతములు ప్రపంచములో కలవు. ఒక్కొక్క మతమునకు వందలాది శాఖోపశాఖలు గలవు.
2. దైవమతము
ఆది 12:18 | అబ్రాహాము | క్రీ.పూ. 2126 |
ఆది. 26:4 | ఇస్సాకు | క్రీ.పూ. 1806 |
ఆది. 28:14 | యాకోబు | క్రీ.పూ. 1760 |
ఆది. 49:10 | యూదా | క్రీ.పూ. 1689 |
2సమూ 7:16 | దావీదు | క్రీ.పూ. 1042 |
లూకా 2 అధ్యా॥ | యేసుక్రీస్తు | |
అపో! 2 అధ్యా | క్రైస్తవ మతము |
3. ఇతర మతములు
ఇతర మతములు క్రీస్తు ప్రభువును గూర్చి చెప్పు సంగతులు.
- 1) హిందూమతము:- “ప్రజాపతిరేవేభ్య అత్మానం యజ్ఞం, కృత్యా, ప్రాయక్చత్” సామవేదమందలి తాండియ మహాబ్రాహ్మణము. అనగా ప్రజాపతి తనకు తానే యజ్ఞముగ అర్చించుకొని ప్రాయళ్చిత్తము నెరవేర్చుననియు; “తస్య ప్రజాపతేరర్ధమేవమార్త్య మాసీదర్ధమమృతం” (శతపద బ్రాహ్మణమందు) అనగా ప్రజాపతి సగము మర్త్యడుగను సగము అమరుడుగను అయ్యెను. అనగా దేవత్వ మానవత్వములు ఆయనయందు కలిసియుండెననియు పురుష సూత్తమునందు నిరాట్బురుషుని యజ్ఞము చేసినట్లున్ను తెలియపరచబడియుండుటచే లోకాధికారియగు నాపరార్పరుడ మర్త్యా, మర్త్యమును వహించి దైవ మానవుడై యవతరింప జేయుటకై యజ్ఞమగుటయే నిజమైన ముక్తదాయకమగు మహాయజ్ఞమని స్పష్టమగుచున్నది.
- (2) పారశీక మతము:- జొరాష్ట్ర, కీ.పూ. 660-580. కొన్ని దినములలో పరిశుద్ధ కన్యక గర్భవతియై కుమారుని కనగా ప్రకాశమైన చుక్క కనబడును. ప్రవచనమును బట్టియే తూర్పు దేశపు జ్ఞానులు ఆకాశమందు ఆ చుక్కనుచూచి దానిని వెంబడించిరి. ఆ పుణ్య పురుషుని చూచిరి, పూజించిరి. అమూల్య అర్చణలు అర్చించిరి.
- 3) కన్ ప్యూజియస్ మతము;:- చీనా మత స్థాపకుడు క్రీ.పూ. 551-479. పశ్చిమ దేశమున పరిశుద్ధుడు జన్మించును. ఆయన చెప్పిన ప్రకారముగనే చీనాకు పడమరగానున్న పాలెస్తీనాలో ప్రభువు పుట్టెను.
- 4) బౌద్ధ మతము:- బౌద్ధమత స్థాపకుడైన బుద్ధుడు క్రీ.పూ. 457. నేను మరణమైన తరువాత 500 సం॥లకు ఒక మత ప్రవక్త పుట్టి అందరి బుద్ధుల ఊటపై పునాది వేయును. ఆయనను విశ్వసించండి. సకలాశీర్వాదములు మీకు కలుగును.
-
5) మహమ్మదీయ మతము:- అబ్రాహామునకు హాగరు వలన జన్మించిన కుమారుడు ఇష్మాయేలు ఈయనను బట్టియే మహమ్మదీయ
మతము
వచ్చెను.
క్రీస్తు మతమే గొప్పదని స్థిరపరచుటకు వచ్చెను. బైబిలులోని కథలే మహమ్మదీయ మత గ్రంథమగు ఖురాన్ లో ఉన్నవి.