గ్రంథకర్త: యం. దేవదాసు అయ్యగారు
12. నిరుకు చార్టు
1. ప్రశ్న :- రక్షణ విమోచనము, మోక్ష ప్రవేశము, విముక్తి ఈ మాటలు క్రైస్తవులు తరచుగా వాడుదురు. వీటి యర్ధమేమి?
జవాబు:-
పాపములనుండియు, సాతానునుండియ మరణభీతి నుండియు నరకమునుండియు తప్పించుటకు విమోచనయని పేరు. లూకా. 24:2 తప్పించిన
తరువాత
విశ్వాసులయొక్క సహవాసమును, దైవబోధను సత్ ప్రవర్తనయును, బోధనాసారమైన సేవయును, పాప విసర్జన శక్తియును కలిగియుండి,
మోక్ష
ప్రవేశము
కొరకు నిరీక్షించే స్థితి రక్షణ పొందియున్న స్థితియె యున్నది - ఎఫెసీ. 2:8. ఈ స్థితి కడవరకు నిలిచియున్న యెడల
మోక్ష
ప్రవేశము
కలుగును.
2. ప్రశ్న :- విమోచనమును, రక్షణ స్థితియును, మోక్ష ప్రవేశమును ఎట్లు కలుగును?
జవాబు:- ఇవి దేవునివలననే కలుగునవి, విశ్వాస ప్రార్ధనవల్ల మనకు లభించవు. మనుష్యులవల్ల బోధ వినబడునుగాని
ఇవి
కలుగవు.
3. ప్రశ్న :- మోక్షము కలుగునని నిశ్చయత మనకెట్లు తెలియును?
జవాబు:- మనకు మోక్షమనిగాని, నరకమనిగాని నిశ్చయత తెలిసికొనుట ఇప్పుడే.
4 ప్రశ్న :- అదియే ఎట్లు తెలియునని నేనడుగుచున్నాను?
జవాబు:- నీ హృదయములో పాపాలోచన యున్నప్పుడు యోబు 17:13 నరకమనియు, అవి లేకుండ కేవలము దేవునిమీదనే భారము
వేసినప్పుడు
మోక్షమనియు
గ్రహింపవలెను.
5. ప్రశ్న :- దేవుడు విమోచన రక్షణ దయచేసిన తరువాత పాపాలోచనలు కలిగితేనో?
జవాబు:- అప్పుడు ఇట్లు చేయవలెను.
6. ప్రశ్న :- ఎన్నాళ్ళు ఇట్లు చేయవలెను?
జవాబు:- బ్రతికినన్నాళ్ళు ఈ పని కలిగియుండుము.
7. ప్రశ్న :- ఒకరు ఇట్లు అనుచున్నారు: నేననుదినము దైవ వాక్యము చదివి ప్రార్ధన చేసికొనుచు ఇతరులకు బోధించుచు ధర్మ
కార్యములు
చేయుచు తెలిసినంతవరకు సత్ ప్రవర్తన గలవాడనై యున్నాను. ఇట్టి వానికి మోక్షము లేదా?
జవాబు:- అన్ని ప్రశ్నలకు ఒక్కటే జవాబు. అదేదనగా నీలో ఏదైనా పాపపు ఆలోచన యున్నదోలేదో నీకు నీవే
ప్రశ్నవేసికొని
జవాబు
చెప్పుకొనుము. 1యోహా. 3:20 అప్పుడు పాపాలోచనలేదు అని జవాబు వస్తే మోక్షము కలదని గ్రహింపవచ్చును.
8. ప్రశ్న:- ఒక
పర్యాయము
రక్షణ పొందిన తరువాత మరల పాపపు ఆలోచన కలుగునా?
జవాబు:- మనము లోకములోను, శరీరమందును, పాపులున్న స్థలమందును, పిశాచి పనులు జరుగుచున్న స్థలమందును
యున్నాము.
కనుక
పాపపు
ఆలోచనలు కలుగక మానవు.
9. ప్రశ్న:- అప్పుడేమి చేయవలయును?
జవాబు:- ఇదివరకే చెప్పితిని మరల పాపపు లొప్పుకొని క్షమాపణ పొంది సరిగ్గా నడచుకొనుటకు ప్రయత్నింపవలెను.
దేవుడు
తప్పక
సహాయము
చేయును.
10. ప్రశ్న :- అట్లయితే రక్షణ ఎవరికి? మోక్షమెవరికి?
జవాబు:- చివరి వరకు పాపముతో పోరాడుచు దైవప్రార్ధన వల్ల బలము పొందుచుండువారికి మోక్షము. మనము పొంద
యత్నించిన
యెడల
దేవుని
కృపా
సహాయము ప్రతి నిమిషము కలుగును.
11. ప్రశ్న :- ఏ విషయములో కలుగును?
జవాబు:- పాప విసర్జన విషయములోను సత్ ప్రవర్తన విషయములోను కూడ కలుగునని గ్రహింపవలెను.
12. ప్రశ్న :- కొందరిట్లనుచున్నారు మేము ఆత్మను పొందియున్నాము. దేవుడు మా ప్రార్ధనలు అనేకమార్లు ఆలకించి
యున్నాడు.
దేవుని
వాక్యము నాకు బోధపడుచున్నది. సేవలో జయము కలుగుచున్నది. అట్టి వారికి మోక్షము లేదా?
జవాబు:- ఇదివరకే చెప్పితిమి అవన్నియు నిజమేయైయుండి వచ్చును, గాని మరణావస్థయందు దుర్భుద్దులు కలిగినయెడల
మోక్షము
లభింపదు,
మరియు తత్పూర్వము దుర్భుద్ధి కలిగినను మోక్షము లభింపదు. మన అన్ని ఆచారములు మన అన్ని ప్రార్ధన జవాబులు బాగానే
యుండవచ్చును,
గాని ఏదో ఒక విషయములో ఏదోయొక చిన్న పొరపాటులుండవచ్చును. రవ్వంత పొరపాటున్నను మోక్షమునకు వెళ్ళ వీలులేదు.
ఎందుకనగా
ఎంత
చిన్న
కళంకమైనను మోక్షములో ప్రవేశింపనివ్వదు.
13. ప్రశ్న :- మోక్షములో ప్రవేశింపగల ఒక సలహా ఇవ్వండి?
జవాబు:- పైన వ్రాసినదంతయు మేమిచ్చు సలహాయైయున్నది. క్రమము తప్పవద్దు ఎన్ని ఆటంకములు వచ్చినను
ప్రార్ధనాది
కార్యములు
మానవద్దు
స్వంత ప్రయత్నమునకు తోడు దేవుని సహాయము మిక్కిలి అవసరమైయున్నది. అది కోరుటకు మానద్దు.
14 ప్రశ్న :- నిశ్చయము తెలిసికొనుట ఏదైనా సాధనమున్నదా?
జవాబు:- విశ్వాసమే సాధనము.
15. ప్రశ్న :- విశ్వాసమనగా నేమి?
జవాబు:- నాకు ఎప్పటికైనా సంపూర్ణముగా పాప విసర్జన శక్తియు, సత్ ప్రవర్తన శక్తియు, దేవుడనుగ్రహించి
మోక్షములోనికి
చేర్చుకొనును అను నమ్మికకే విశ్వాసమని పేరు. నాకు విశ్వాసము కలదని చెప్పి ఇష్టము వచ్చిన పాపము చేయుచుండినయెడల
విశ్వాసము
శిధిలమైపోవును. ఆశాభంగము కలుగును. ఒక దైవజనుడు చిరకాలము భక్తిగాయుండి మరణావస్థ గడియలో దేవుడు లేదని
చెప్పసాగెను.
ఎంత
భయంకరమైన స్థితి. అప్పుడొక సామాన్య బోధకుడు వచ్చి ఆయన నేరమును చూపించెను. అప్పుడాయన ప్రార్ధన చేసికొని
మరణించెను.
గనుక
చదువరులారా! విశ్వాసులారా! కడవరి వరకు ఎంత జాగ్రత్తగా నుండవలెనో చూడండి. తుదకు ఆయన నాస్తికత్వమును
పోగొట్టుకొనేటందుకు
దేవుని
సహాయము కలిగినది కదా!
16. ప్రశ్న :- మరణ సమయమందు ప్రార్ధన చేసికొనవచ్చును అని చెప్పి అప్పటివరకు ఇష్టము వచ్చినట్లు నడుచుకొనుట అపాయమా?
జవాబు:- అపాయమే, ఒక పర్యాయము చేసిన పాపము మరియొక పర్యాయము చేసినప్పుడు పాపము మరింత స్థిరమగును. అపాయము
మరింత
ఎక్కువగును.
విశ్వాసమునకు చోటుండదు. దేవుని కృపను నిరాకరించుట పాపమైయుండును. తుదకు మార్పు కలుగుటకు వీలుండునో, వీలుండదో
ఎవరు
చెప్పగలరు?
గనుక ఎప్పటికప్పుడు మారుచుండుట మంచిది క్షేమము.
17. ప్రశ్న :- మనకు తెలియని తప్పిదములు యుంటేనో?
జవాబు:- అవి దేవుడే మనసునకు తెలియపర్చును. భయపడ నక్కరలేదు.
18. ప్రశ్న :- అనేకమంది సద్భోద వినబడుటలేదు. వారి సంగతి ఏమి?
జవాబు:- మీకు నరకము మీకు మోక్షము అని నిర్ణయించే కడవరి తీర్పు దినము రాకముందు ఎక్కడో ఒకచోట ఎప్పుడో
ఒకప్పుడు
ఏదో ఒక
విధముగా దేవుడు బోధపరపక మానడు, గాని నీకు తెలిసినంతవరకు జాగ్రత్తగా నడువుము. అప్పుడు దేవుడు నిన్ను దీవించును.
మోక్షమును
గురించియు, నరకమును గురించియు నిరుకు తెలిసికొనుటకే ఈ పత్రిక వ్రాయబడినది. అందుచేత దీనికి
నిరుకు చార్టు అని పేరు
పెట్టియున్నాము. మరియొక విధముగా నిరుకు తెలిసికొనవలెను.
19. ప్రశ్న :- అది ఏది?
జవాబు:- క్రైస్తవ బోధ యంతటిలో కనబడుచున్నది. అది ఎట్లనగా అనుదినము బైబిలు చదువుట, దైవప్రార్ధన చేయుటయు.
ఇతరులకు
బోధ
చేయుటయు
మానవద్దు. ఈ గ్రంథము చదువగా ఏది పాపమో, ఏది మంచిదో నిరుకు తెలియగలదు. దేవుడు దేవుడుగానే యున్నయెడల మానవులకు
సంతుష్టి
కలుగదు, గాన మనుష్యుడుగా లోకమునకు వచ్చి మనుష్యులకు కనబడి మానవులు మోక్షమును పొందే బోధలు క్రియలు చేసినాడనియు,
అప్పుడాయన
యేసుక్రీస్తు నామమున ప్రసిద్ధిలోకి వచ్చినాడనియు ఆయనను నమ్ముకొంటేనే మోక్షమనియు బైబిలు గ్రంథములో నిరుకు
వ్రాయబడి
యున్నది.
20. ప్రశ్న :- వ్రాయబడిన గ్రంథములోనిది నిజమో, కాదో అది ఏలాగు తెలిసికొనగలము?
జవాబు:- గ్రంథములో వ్రాయించిన దేవునినే అడుగుము. అప్పుడు నిరుకు తెలియగలదు.
21. ప్రశ్న :- ఇక వేరే సాధనము లేదా?
జవాబు:- లేకేమి, నీ జ్ఞానమువల్లను గురువుల ఉపదేశము వల్లను దీర్ఘకాల పరీక్షలవల్లను సత్యము
తెలిసికొనవచ్చును.
ఇట్లు
తెలిసికొన
శక్తిని దేవుడు నీ మనస్సాక్షిలోనే పుట్టించియున్నాడు. గాని అవి పాపమువల్ల కళంకపడినవి. ఆలోచనలవల్ల కొంతవరకు
సత్యము
తెలిసికొనగలము గాని దైవప్రార్థనవల్ల పూర్తిగా తెలిసికొనగలము.
22. ప్రశ్న :- నాకు నిరుకు తెలిసికొనుట కష్టముగానే తోచుచున్నది.
జవాబు;:- నీ జ్ఞానము ద్వారాను, స్వప్నముద్వారాను, దర్శనము ద్వారాను, ఇంకా ఏమైనా యుంటే వాని ద్వారాను,
దేవుడు
నీకు
సత్యము
తెలియజేయక మానడు, గాని నీవు ప్రయత్నించుట ఆపు చేయవద్దు.
23. ప్రశ్న :- నేను ప్రయత్నము చేస్తాను. దేవుడు
తెలియజేయడేమో
నా
గతి
ఏమి?
జవాబు:- నీవు ప్రయత్నము చేయకపోవుట యుండవచ్చును, గాని దేవుడు తెలియజేయకపోవుట యుండదు.
24. ప్రశ్న :- అలాగైతే దేవుడు తెలియజేసేవరకు నేను మౌనముగా యుంటే బాగుండదా?
జవాబు:- బాగుండదు. నీ జ్ఞానము నుపయోగించక ప్రయత్నమును మానినయెడల దేవుని సహాయము ఎట్లు నిరీక్షింపగలవు?
నీ
రక్షణ
కొరకు
నీవు
పుట్టకముందే దేవుడు ప్రయత్నము చేసెను అది ప్రార్ధన ద్వారా వెదకి కనుగొని నమ్ముట నీ గొప్ప ప్రయత్నమై యుండవలెను.
25. ప్రశ్న :- నేనెంత ప్రయత్నించినను సత్యము తెలియకపోతే అప్పుడేమి చెప్పవలెను?
జవాబు:- నీలో ఒక తప్పు ఉన్నదనియు ప్రయత్నములో కూడ ఏదో తప్పు ఉన్నదనియు గ్రహించుకొనవలెను.
26. ప్రశ్న :- గ్రహించుటకు నా జ్ఞానమునకు శక్తి చాలదు. భక్తిగా నడుచుకొనుటకు శక్తి చాలదు. గనుక ఏమి చేయవలెను?
జవాబు:- చెప్పినదే చెప్పవలసి వచ్చుచున్నది. సర్వజ్ఞానియైన దేవుడు నీ జ్ఞానమునకు జ్ఞానము దయచేయును.
సర్వశక్తిమంతుడైన
దేవుడు
నీ భక్తికి శక్తి దయచేయును. ప్రార్థించేవారి విషయములో ఆయన కనికరము చూపడా? అన్యాయము చేయగలడా? మీకెందుకిట్టి
అనుమానము.
27.
ప్రశ్న :- ఒక. బోధకుడిట్లనుచున్నాడు. భూమిమీద భక్తులుగా ఎంచబడినవారిలో అనేకులు నరకములోనున్నారు. భూమి మీద గొప్ప
పాపి
అని
ఎంచబడినవారు మోక్షములో ఉన్నారు. ఇది వినగా నాకు భయము కలుగుచున్నది. మీరేమందురు?.
జవాబు:- భయపడుటకిందులో ఏమున్నది. పాపులు మరణ సమయమందు దైవప్రార్ధనవల్ల బాగుపడి యుండవచ్చును. భక్తులు మరణ
సమయమందు
మరణము
వచ్చానని దేవునిమీద విసిగికొని యుండవచ్చును. గనుక కడవరి వరకు జాగ్రత్తగా నుండువాడే ధన్యుడు.
28. ప్రశ్న :- నేను ఎన్నిసార్లు ప్రార్థించినను నాలో ఒక దుర్భుద్ధి మాటిమాటికి కలుగుచున్నది. నేనేమి చేయవలెను?
జవాబు:- నిరాశపడక దైవప్రార్థన చేయుచుండిన యెడల అది హరించిపోవును. లోకములో అనేక మతములు కలవు. అనేక మత
గ్రంథములు
కలవు.
అనేక
మతశాఖలు గలవు. అనేక మత బోధకులు గలరు. అందరు అన్ని విధములుగా బోధించుచున్నారు. దైవ ప్రార్ధన వల్లనే
తెలిసికొనగలవు.
29. ప్రశ్న :- హృదయపరీక్ష ఎట్లు తెలిసికొనగలను?
జవాబు:- నీ తలంపు, నీ చూపు, నీ వినుట, నీమాట, నీ ప్రయత్నము, నీ క్రియ ఎక్కడ తప్పున్నదో పరీక్షించి,
ఎక్కడ
తప్పున్నదో
కనుగొని
దైవ ప్రార్ధనవల్ల పరిహారము చేసికొనుము.
30. ప్రశ్న :- లోకములో లౌకికజ్ఞానులు, ధనికులు, ఆరోగ్య వంతులు, చదువరులు, గొప్ప పనివారు గలరు, వారికి రక్షణలేదా!
జవాబు:- అవి మంచివేగాని వాటివల్ల రక్షణరాదు. దేవుని పట్ల ప్రార్ధన విశ్వాసమూలముగా రక్షణ కలుగును.