గ్రంథకర్త: యం. దేవదాసు అయ్యగారు

1. రక్షణ మహాసంకల్పన చార్టు



1. దేవలోకము:-


ఇది అన్ని లోకములకు పైన ఉన్నది: దిన. 2:6, యోబు 37:23, కీర్తన. 11:4, 57:5, 90:1,2; యెషయా 66:1, హెబ్రీ. 1:4, ప్రకటన 1వ అధ్యాయము.


దేవుడు ఆది అంతము లేనివాడు: కీర్తన. 90:1,2


దేవుడు ఒక్కడే నిర్గమ. 20:3, యెష. 10:23, 42:8, 44:6-24, 45:5,


త్రిత్వము: ఆది. 1:1-3,1:26,సంఖ్యా. 6:24-26, యెష. 6:3, మత్తయి. 3:13-15, 28:19, 2కొరింథి. 13:14, ప్రకటన 1:4,5.


నరునిలో కూడ త్రిత్వమున్నది: 1థెస్స. 5:23.


దైవ లక్షణములు :-


2. దేవదూతల లోకము:-


దేవుడు దేవదూతలను మొదట కలుగజేసెను. నెహెమ్యా: 9:6.


సృష్టికి ముందటివారు యోబు. 38:4,7.


వీరు కోట్లకొలది ఉన్నారు. యోబు. 25:3, ప్రక. 5:11.


ప్రధానదూతలు - 1థెస్స. 4:16,


కెరూబులు - ఆది. 3:24,


సెరాపులు - యెషయా 6:2,6.


నాలుగు జీవులు - ప్రకటన 4:6.


సన్నిధి దూతలు యోబు. 2:1, లూకా. 1:19.


దూతలు చేయు పనులు, లక్షణములు:-


3. మోక్షలోకము:-


సామె. 8:31, 15:24, 1పేతు. 1:5 భూమిమీద భక్తిగా జీవించినవారు చనిపోయిన తర్వాత ఇక్కడకు వత్తురు. భక్తిలో ఎక్కువ తక్కువలు కలవు. గనుక ఇక్కడివారు తమతమ తరగతిలోనే ఉందురు. కీర్తన. 8:4-6, యోహా. 14:1-3, 1కొరింథి. 13:12, 15:23, ఫిలిప్పీ. 3:20-21, 1యోహా. 3:2, ప్రక. 2,3 అధ్యాయములు.


1. నూతన యెరూషలేము:- గలతీ. 4:26, ప్రక 21:2, 21:10. (మత్తయి 13:8) (1) - 100 అంతల పంట.

7.    లవొదికయ సహవాసము సింహాసనముపై నాతో కూడ కూర్చుండ నిచ్చెదను
6.    ఫిలదెల్ఫియ సువార్త నా దేవుని పేరు. నూతన యెరూషలేము పేరు. నా క్రొత్త పేరును, వానిమీద వ్రాసెదను.
5.    సార్టీస్ సంపూర్ణము తెల్లని వస్త్రధారణ, జీవ గ్రంథమందు పేరు, తండ్రి యెదుట ఒప్పుకొనుట.
4.    తుయతైర సత్యప్రకటన జనులను యేలుటకై ఇనుప దండమును వేకువచుక్క నిచ్చెదను.
3.    పెర్గెము సిద్ధాంతనిశ్చయత మరుగైన మన్నాను భుజింప నిత్తును. రాయి, చెక్కబడిన క్రొత్తపేరు.
2.    స్ముర్ణ సహవాసము జీవకిరీటమిచ్చెదను. రెండవ మరణములేదు.
1.    ఎఫెసు ఆది ప్రేమ జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును.

2. రక్షితుల మోక్షము:- (60) అంతల పంట.


ప్రకటన 6:2, 6:9-11, 7:9-14, 14:3-5; 20:4 ఏడేండ్ల శ్రమకాలములో రక్షింపబడినవారిక్కడ ఉందురు.


3.పరదైసు (30) అంతల పంట.


క్రీస్తుపభువు రెండవసారి వచ్చి తన సంఘమును కొనిపోవు వరకు రక్షింపబడిన పరిశుద్ధుల ఆత్మలు ఇచ్చట ఉండును. లూకా. 23:43, 2కొరింథి. 12:4, ప్రక. 2:7.


4. భూలోక మోక్షము:-


యెషయా. 66:22, 2పేతురు. 3:13, ప్రక. 21:1-2. వెయ్యేండ్ల పరిపాలన కాలములో రక్షింపబడిన వారిక్కడ ఉందురు. అప్పుడు ఈ భూమి నూతనముగా మార్చబడి మోక్షలోకములో ఒక భాగముగ ఉండును. ఈ మూడు లోకములలో క్రీస్తుప్రభువు వారి వారి కాంతినిబట్టి వారియొద్ద నుండును. ప్రక. 21:11.


5. వాయుమండల లోకము:- ఎఫెసీ. 2:2, దేవునికి భిన్నముగా నుండిన దూత సైతానుగా మారినందున తన జట్టుతోపాటు ఇక్కడికి వచ్చివేయవలసి వచ్చెను. యెష. 14:12, యెహెజ్కేలు 28:14-19; ఎఫెసీ. 6:12, యూదా. 1:6, 2పేతురు. 2:4, 1దిన. 21:11, యోబు 1:6, మత్తయి. 4:10, లూకా. 10:19, రోమా. 16:20, యాకోబు 4:7, 1యోహాను 3:8.


6. భూలోకము:-


యోబు 37:13, ఆది. 1:1 హెబ్రీ. 11:3

7. పాతాళలోకము:- కీర్తన. 9:17


(1) హేడెస్సు:-


1పేతురు 4:19 భూలోకములో మారకుండ చనిపోయినవారు ఇక్కడ కడవరి తీర్పువరకు ఉందురు. ఆ తీర్పు రాకముందు ఎవరును నరకములోనికి వెళ్ళరు. మారుటకై ప్రతివారికిని ఎక్కడో ఒకచోట, ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒకవిధముగ దేవుడు సమయమిచ్చును. తృణీకరించువారు ఎక్కడను మారరు. 2పేతురు. 4:6, 1సమూ. 2:6, ఫిలిప్పీ. 2:9-11, మత్తయి. 8:12, ఆమోసు. 9:2, హోషెయా. 13:14, కీర్తన. 139:8, ప్రక. 1:18, లూకా. 4:18, ఎఫెసు. 4:8,9.


చెర:- ఇక్కడ సైతాను వెయ్యేండ్లుండును. ప్రక. 20:1-3.


నరకము:- ప్రక. 20:14, 15 ఇది కడవరి తీర్పుకాలమున కనబడును. తీర్పు జరుగునప్పుడు తీర్పు చేయుటకు క్రీస్తుకాక మరెవరును వెళ్ళరు. యోహాను. 5:27, మత్తయి. 13:50; 25:41, మార్కు 9:48, యెషయా. 34:10, ప్రక. 21:8.