గ్రంథకర్త: యం. దేవదాసు అయ్యగారు

ప్రారంభ వాణి



ప్రియులారా! 'మహిమ వార్తావళి' అను ఈ గ్రంథములో ప్రభువు, దేవదాసు అయ్యగారికి బైలుపరచిన అనేక అంశములు కలవు.


మానవుని సామాన్య ఆత్మీయ, మహిమ జీవితమునకు అవసరమైనవి ఇందులో పొందుపరచిరి.


అన్ని లోకముల, అన్ని కాలముల సర్వాంశములిందు కలవు. దేవునికి మానవునికిగల సహవాసము, మహిమ, లోకానుభవమును తెలుపు దైవసన్నిధి, ప్రభువుయొక్క బైబిలుయొక్క సంఘముయొక్క మహిమ ఇందులో కలదు. వధువు సంఘము యొక్క రూపమును కలదు. సంఘముయొక్క వివిధ అంతస్థులు, ప్రభువు శరీర, ఆత్మీయ రక్షకుడను సంగతి వినియు, మారని మనుష్యులయొక్క స్థితియూ, దేవుడు బైలుపరచిన బైబిలు మిషను యొక్క ఉన్నతస్థితియూ, ప్రభువు మన ప్రార్ధనలన్నియు వినుననెడి దివ్యాంశములునూ, మరియు లోకములో యుండగానే మోక్షముయొక్కనిరుకు ఇక్కడనే కలదని తెలుపు అంశములు ఈ గ్రంథములో గలవు.


ఈ గ్రంథములోని దివ్య సందేశములు వ్రాయుటకు ఎవరి వశముకాదు. దైవాత్మ ప్రేరేపణ వలనననే ఇవి వ్రాయబడినవి.


Maranatha