గ్రంథకర్త: యం. దేవదాసు అయ్యగారు

8. ఏడు సంఘముల చార్టు



ప్రకటన 2, 3 అధ్యాయములు

(I) ఎఫెసి:


(1) సంఘపు దూతకు:


ప్రభువు ప్రత్యక్షత:- ఏడు నక్షత్రములు కుడిచేతగలవాడు. ఏడు దీపస్తంభముల మధ్య సంచరించువాడు. నక్షత్రములు సంఘపు దూతలు. స్తంభములు- సంఘములు.


2. మెప్పు:- నీ క్రియలు, నీకష్టము, నీ సహనము నేను ఎరుగుదును, మరియు దుష్టులను సహింపలేవు. అబద్ధికులను తెలిసికొంటివి. అపోస్తలులు కానివారు అపోస్తలులని చెప్పుకొనిరి. వానిని నీవు పరీక్షించినావు.


ఎరుగుదును:- సహనము గలిగినావు. నా నామము నిమిత్తము భారము మోనితివి అలయలేదని నేనెరుగుదును.

నికొలాయితుల క్రియలు ద్వేషించుచున్నావు. నేనును ద్వేషించు చున్నాను.


3. తప్పు:- నీ మొదటి ప్రేమను వదిలితివి.


4. మందలింపు:- నీవు పడిన స్థితిని జ్ఞాపకము చేసికొనుము. మారుమనస్సు పొందుము. ఆ మొదటి క్రియలను చేయుము.


5. శిక్ష:- లేనియెడల నీయొద్దకు వచ్చి దీపస్తంభమును తీసివేతును.


6. కోరిక:- చెవి గలవాడు వినునుగాక. సంఘములతో ఆత్మ చెప్పుచున్నది.


7. బహుమతి:- దేవపరదైసులోని వృక్ష ఫలములు తిననిత్తురు.


8. చరిత్ర, 9. స్థితి 10. ఉపమానము 11. పరలోక స్థానము.


II. స్ముర్ణ:- సంఘపు దూతకు:


1. ప్రత్యక్షత:- మొదటివాడు, కడపటివాడు మృతుడై బ్రతికినవాడు


2. మెప్పు:- నీ శ్రమను, దరిద్రతను నేనెరుగుదును. నీవుధనవంతుడవే


3. దూషణ:- ఎరుగుదును.


4. యూదులమనే వారు యూదులుకారు. సాతాను సమాజపువారు.


5. మందలింపు:- పొందు శ్రమలకు భయపడకుము. అపవాది కొందరిని చెరలో వేయును (శోధింపబడుదుము) పది దినములు శ్రమ ప్రాణాపాయము వచ్చినను నమ్మకముగా నుండుము.


6. తప్పు:- లేదు.


7 బహుమానములు = జీవ కిరీటము ఇచ్చెదను.


8. కోరిక:- చెవి గలవాడు వినునుగాక. సంఘములతో ఆత్మ చెప్పుమాట.


III. "పెర్గెము":- సంఘము దూతకు


1. ప్రత్యక్షత:- ప్రభువు వాడిగల రెండంచులుగల ఖడ్గము గలవాడు.


2. మెప్పు:- సాతాను గద్దెచోట కాపురమున్నావు. అచ్చట నాయందు విశ్వాసివి. సాక్షివి. అంతిపయ మరణము వీటన్నిటిని నేను ఎరుగుదును. నా నామమును గట్టిగా చేపట్టినావు. నాయందలి విశ్వాసమును విసర్జింపలేదు.


3. తప్పు:- నీలో ఉన్నారు. విగ్రహములకు బలి ఇచ్చిన వాటని తినువారు జారత్వము చేయువారు. ఇశ్రాయేలీయులకు ఉరి ఒడ్డువారు అవి............ బాలాకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. నికొలాయితుల బోధ ననుసరించువారు.


4. మందలింపు:- మారుమనసు పొందుము.


5. శిక్ష :- లేనిచో నీయొద్దకు త్వరగా వచ్చి పాడుచేతును (నా నోట ఖడ్గముతో)


6. కోరిక:- చెవి గలవాడు వినునుగాక. సంఘములతో ఆత్మ చెప్పుచున్నమాట.


7. బహుమతి:- మరుగైన మన్నా భుజింపనిత్తును. తెల్లరాతి నిత్తును. ఆ రాతిపై చెక్కబడిన క్రొత్తపేరు. (పొందినవానికే తెలియును).


IV. “తుయతైర”:- సంఘపు దూతకు


ప్రత్యక్షత:- అగ్నిజ్వాలల నేత్రములు, అపరంజి పాదములు.


2. మెప్పు:- నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసము, నీ పరిచర్య, నీ సహనము నేనెరుగుదును. నీ మొదటి క్రియలకన్న నీ కడపటి క్రియలు ఎక్కువ అని నేను ఎరుగుదును.


3. తప్పు:- యెజెబెలును ఉండనిచ్చుచున్నావు, జారత్వము చేయుటను, విగ్రహములకు బలి ఇచ్చినవాటిని తినిపించుటను, బోధించును. మోసపుచ్చును. మారుమనస్సుకు సమయమిచ్చితినిగాని వారు పొందరు.


4. శిక్ష: యెజెబెలును, మంచము పట్టింతురు. ఆమె వారిని శ్రమల పాల్చేతును. ఆమె పిల్లలను చంపెదను, అంతరింద్రియములను, హృదయములను పరీక్షించువాడనని సంఘములన్ని తెలిసికొనును. ప్రతివానికి క్రియాఫలమిత్తును.


5. మందలింపు:- ఏ భారమును పెట్టను. కలిగిన దానిని పట్టుకొనుడి.


6. బహుమతి:- జనులపై అధికారమిత్తును. అతడు ఇనుప దండముతో ఏలును, కుమ్మరి పాత్రవలె వారు పగులగొట్టబడుదురు.


V. "సార్దీస్":- సంఘపు దూతకు


1. ప్రత్యక్షత:- ఏడు నక్షత్రములు కలవాడు. దేవుని ఏడు ఆత్మలు కలిగినవాడు.


2. తప్పు:- నీ క్రియలు నేనెరుగుదును. నీది నామక జీవనము. మృతుడవే. నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమైనవికావు.


3. మందలింపు:- జాగరూకుడవుకమ్ము. చావగా మిగిలిన వాటిని బలపరచుము. ఎట్లు ఉపదేశము పొందితివో జ్ఞప్తికితెచ్చుకో ఎట్లు వింటివో, దానిని గైకొనుము, మారుమనస్సు పొందుము.


4. శిక్ష - దొంగవలె వచ్చెదను. ఏ గడియలో వత్తునో తెలియదు.


5. మెప్పు:- వస్త్రములను అపవిత్రపరచుకొనని వారు ఉన్నారు. కొందరు తెల్లని వస్త్రములతో సంచరింతురు.


6.బహుమతి:- జయశాలి తెల్లని వస్త్రధారి, జీవగ్రంథములో నుండి అతనిపేరు పోదు. అతనిపేరు ఒప్పుకొందును. నా తండ్రి ఎదుట దూతల ఎదుట.


7. కోరిక:- చెవికలవాడు వినునుగాక! ఆత్మ సంఘములతో చెప్పునది.


VI. ఫిలదెల్ఫియా:- సంఘపు దూతకు


1. ప్రత్యక్షత:- దావీదుతాళపు చెవి కలవాడు. ఎవడును వేయలేకుండ తీయువాడు, సత్యస్వరూపి, పరిశుద్ధుడు.


2. మెప్పు:- నీక్రియలను నేనెరుగుదును. నీశక్తి కొంచెమె........ అయినను నా నామమును ఎరుగననలేదు.?


3. బహుమతి:- తలుపు తీసినాను. ఎవడును వేయలేడు. సాతాను సమాజపువారిని రప్పింతును. యూదులు కారు, యూదులమని చెప్పుకొందురు. వారు నీ పాదములపైబడుదురు. నమస్కారము చేతురు. నేను నిన్ను ప్రేమించితినని తెలిసికొనజేతురు.


4. మెప్పు:- నీవు నా ఓర్పు విషయమై వాక్యము గైకొంటివి.


5. బహుమతి:- నిన్ను కాపాడెదను (భూనివాసులను శోధించుటకు లోకమంతటికి వచ్చు శోధనకాలము నుండి)


6. సలహా లేక మందలింపు:- నేను త్వరగా వచ్చుచున్నాను. గట్టిగా పట్టుకొనుము, నీకు కలిగినది నీకిరీటమెవడు అపహరింపడు.


7. బహుమతి:- జయించువానిని నా దేవుని ఆలయ స్తంభముగా చేతును. ఎన్నటికిని వెలుపలికిపోడు. వానిపై వ్రాతలు దేవుని నుండి వచ్చును. నా దేవుని పేరు నూతన యెరూషలేము, నాక్రొత్త పేరు.


8. కోరిక: ఆత్మ సంఘములతో చెప్పునది చెవి గలవాడు వినునుగాక.


VII. "లవొదికయ":- సంఘపు దూతకు


1. ప్రత్యక్షత - ఆమెన్ అనువాడు, నమ్మకమైన సత్యసాక్షి దేవుని సృష్టికి ఆదియైనవాడు.


2. తప్పు:- నీ క్రియలను ఎరుగుదును, చల్లగానైనను, వెచ్చగానైనను లేవు. చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నులివెచ్చగా నున్నావు.


3. శిక్ష - ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను.


తప్పు:- దౌర్భాగ్యుడవు. దిక్కుమాలినవాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడవు నేను ధనవంతుడను, ధనము వృద్ధిజేసి కొనుచున్నాను. కొదువలేదు అని చెప్పుకొనుచున్నావు.


5. మందలింపు:- నా సలహా గైకొనుము. అగ్నిలో పుటము వేయబడిన బంగారము, తెల్లని వస్త్రము, కాటుక, ధనవృద్ధి, దిగంబరత్వము, దృష్టి.


6. నా సలహా:- మారుమనస్సు పొందుము. నన్ను ప్రేమించు వారని గద్దించి శిక్షింతును.


7. బహుమతి:- నేను తలుపు తట్టుచున్నాను. భోజనము చేతును. నా సింహాసనముపై కూర్చుండనిచ్చెదను.


8. కోరిక:- ఆత్మ సంఘములతో చెప్పునది చెవిగలవాడు వినవలెను.